వర్షాకాల నెలలను తెలివిగా ఉపయోగించుము
1 పాఠశాల విద్యార్థులు తరచు తమ సెలవులలో ఏమి చేయ పథకము చేసుకొనుచున్నారనియు, తిరిగి పాఠశాలకొచ్చినప్పుడు తాము చేసినదానిని గూర్చి రిపోర్టును ఇమ్మని అడుగబడుటయు జరుగవచ్చును. అలాగే, మనలో ప్రతి ఒక్కరము యౌవనులమైనను వృద్ధులమైనను ఈ విధముగా అడుగుకొనవలసియున్నాము: ‘వర్షాకాలములో ఏమి చేయుటకు మేము పథకము వేసికొనియున్నాము? ఆ తరువాత ఫలవంతముగా సమయమును గడిపినట్లు, యోగ్యమైన రిపోర్టునివ్వగలమా?’ ‘సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుము’ అను సలహాను పాటించిన అట్లివ్వగలము.—ఎఫెసి. 5:15, 16.
సమావేశములనుండి ప్రయోజనము పొందుము
2 అందరము మన పథకములలో చేర్చుకొనియుండవలసిన ఒక విషయమేమనగా “స్వచ్ఛమైన భాష” జిల్లా సమావేశములకు హాజరగుట. ఆ తరువాత, ఏ అంశములను అక్కడ నేర్చుకొనియున్నాము. యెహోవాను స్తుతించువారముగా మన జీవితములలో వాటినెట్లు అన్వయించుకోవాలి అని మన నోట్స్‌ను పునర్విమర్శించవలసియున్నాము. ఎఫెసీయులు 4:25నందు “మీలో . . . ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెన”ని మనము ప్రోత్సహించబడియున్నాము. మనకు అతి సమీపముగానున్న పొరుగువారు మన స్వంత కుటుంబసభ్యులే. వారితోను లేక మన ఆత్మీయకుటుంబ సభ్యులతోను సమావేశ కార్యక్రమమందు అందించబడిన కొంత ఆత్మీయ ఆహారమును చర్చించవచ్చును. ఆ విధముగా చేయుటద్వారా “భుజములు కలిపి ఆయనను సేవించునట్లు యెహోవా నామమునుబట్టి పిలుచులాగున” మనము ఒకరికొకరము సహాయము చేసుకొందుము.—జెఫ. 3:9, NW.
ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనుము
3 ఆగస్టు మరియు సెప్టెంబరు మాసములలో స్కూల్ బ్రొషూరు తప్ప ఏ యితర బ్రొషూరునైనను అందించుటకు సూచింపబడినది. ఈ రెండు మాసములలో ప్రతి అవకాశమందును బ్రొషూర్లను అందజేయుచు సాధ్యమైనంత ఎక్కువగా పరిచర్యలో పాల్గొనుటకు పథకము వేసికొనియున్నామా? మనము మన స్వంత సంఘముతోనే ఉంటున్నట్లయిన క్రమముగా జరుగు ప్రాంతీయసేవా ఏర్పాట్లకు మద్దతునివ్వగోరుదుము. సంవత్సరములోని ఈ కాలమందు పగటివెలుతురు ఎక్కువగా యుండునుగాన సాయంకాల సాక్ష్యమందును పాల్గొనవచ్చును. సాయంకాలమందు అనేకులు ఇంటివద్దయుండి ప్రశాంతమైన మనస్సుతోయుండు అవకాశమున్నది గనుక, మనము బోధించబడిన రాజ్యసువార్తను మాట్లాడుటకు అది మనకు సులభతరము చేయును.—యెష. 50:4.
4 సమావేశమునకేగాని లేక సెలవులకేగాని మనము ప్రయాణించు పథకములను వేసుకొన్నప్పుడు మనతోపాటు కొన్ని బ్రొషూర్లను తీసుకెళ్లు ఏర్పాటును చేసుకొనవలెను. అవకాశములు వాటంతటవే తటస్థ సాక్ష్యమిచ్చుటకు అనుకూలపరచినప్పుడు ఈ బ్రొషూర్లలో ఒకదానివైపు మనము అవధానమును మళ్లించివచ్చును. యింటిని విడిచి వేరే ప్రాంతమునకు వెళ్లినప్పుడు రాజ్యమందిరమును కనుగొని, కూటములకు హాజరగుతూ, అక్కడయున్న ఆ ప్రాంతపు సహోదర, సహోదరీలతోపాటు ప్రాంతీయసేవలో పాల్గొనవచ్చును. ఇది మనకును, మనము సహవసించు సహోదరులకును ప్రోత్సాహమునకు మంచిమూలముగా నుండవలెను.—రోమా. 1:12.
5 నెలాఖరులో మనము మన సంఘమునకు దూరముగా వెళ్లుచున్నట్లయిన, ఆ తదుపరి మాసము ఆరవ తారీఖున పంపు రిపోర్టుతో కలుపునట్లు తగినంత ముందుగా మన ప్రాంతీయ సేవారిపోర్టును సెక్రటరీకి పంపవలెను.
పఠనములను చేయుటకు కృషిచేయుము
6 సాధారణముగా వర్షాకాల నెలలలో బైబిలు విద్యార్థులు సెలవుపై వెళ్లుదురు గనుక, ఆ మాసములో చాలా తక్కువ పఠనములు చేయబడుచున్నవి. ఆ తరువాత ఇంకొక సమయములో పఠనము చేయు వ్యక్తియు దూరముగా వెళ్లవచ్చును. అనేకవారములు పఠనము చేయబడకుండా వదలివేయుటకు బదులు మనము లేని కాలమున సంఘములోని మరొకరు పఠనము చేయులాగున మనము ఏర్పాటు చేయగలమా? సాధ్యమైనంతవరకు, క్రమమైన ఆత్మీయపోషణ అవసరమను భావమును విద్యార్థి మనస్సునందు కలుగజేయుటకు పఠనమును క్రమముగా చేయుట మంచిది.
7 మనము ప్రాంతములో ఆసక్తిని కనుగొన్నప్పుడు సాధ్యమైనంత త్వరగా ఆ ఆసక్తిని మనము వెంబడించవలెను. గృహస్థులు బ్రొషూరును తీసుకొన్నట్లయిన, కొన్ని పేరాగ్రాఫ్‌లను ఇద్దరు కలిసి పరిశీలించుట వలన దానినెట్లు ఉపయోగించవచ్చునో ప్రదర్శించవచ్చును. పఠనము కొనసాగులాగున, మరలా పునర్దర్శనమును చేయుటకు ఒక నిర్దిష్టమైన సమయమును ఏర్పరచుకొనుటకు ఆ తదుపరి ప్రయత్నించవలెను.
8 మనలో ప్రతి ఒక్కరము 1990వ సం.పు వర్షాకాల నెలలను వెనుకకు తిలకించి “హితవాక్య ప్రమాణమును గైకొను”టలోను, యెహోవా వాక్యమునుండి సత్యముయొక్క ఆరోగ్యదాయకమైన మాటలను నేర్చుకొనునట్లు ఇతరులకు సహాయపడుటలోను, యెహోవాకు సమర్పించుకొనిన సేవకులముగా సమయమును నిజముగా తెలివిగా ఉపయోగించామని భావించుదుముగాక.—2 తిమో. 1:13.