శిష్యులను చేయుటకు మనకు సహాయపడు కూటములు
ఆగస్టు 6తో ఆరంభమగు వారము
పాట 174 (13)
10 ని: స్థానిక ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండు తగిన ప్రకటనలు. ఈ శనివారము పత్రికా పనిలో ఉపయోగించగల శీర్షికలను ఉన్నతపరచుము. ఒకే పత్రికనుండి రెండు విభిన్న శీర్షికలను ఉన్నతపరచు రెండు ప్రదర్శనలను చూపుము.
25 ని: “వర్షకాల నెలలను తెలివిగా ఉపయోగించుము.” ప్రశ్నా సమాధానముల పరిశీలన. ప్రస్తుత సంభాషణా అంశముతో లుక్ బ్రొషూరును అందించుచు 7వ పేరాగ్రాఫ్‌లో తెలిపినట్లుగా దానినెట్లు ఉపయోగించవచ్చునో చూపు 10 ని. ల ప్రదర్శనను చేర్చుము. పునర్దర్శనమునకై ఖచ్చితమైన ఏర్పాటు చేయుటను కూడా అందు చేర్చుము.
10 ని: బ్రొషూరులోని మాట్లాడదగు అంశములు. సంఘములోయున్న అనేక బ్రొషూర్లలోని కొన్ని ఉన్నతాంశములను ఎత్తి చూపుటలో ప్రేక్షకులను కూడా భాగము వహించనిమ్ము. సమర్థులైన కొంతమంది ప్రచారకులను ముందుగానే ఇందుకు నియమించుకొనవచ్చును.
పాట 20 (103) మరియు ముగింపు ప్రార్థన.
ఆగస్టు 13తో ఆరంభమగు వారము
పాట 156 (10)
10 ని: స్థానిక ప్రకటనలు మరియు అకౌంట్స్ రిపోర్టు. చందాలు ముట్టినట్లు తెలిపినవాటిని తెలియజేయుము. స్థానిక అవసరములకు మరియు ప్రపంచవ్యాప్త రాజ్యపనికి యిస్తున్న ఆర్థిక మద్దతుకై సంఘమును ప్రశంసించుము.
20 ని: బైబిలు విద్యార్థులను అభివృద్ధి చెందుటకై ప్రోత్సహించుము.” ప్రశ్నా సమాధానముల చర్చ. 4వ పేరాగ్రాఫ్‌ను పరిశీలించునప్పుడు, ఒక అనుభవముగల ప్రచారకుడు డూయింగ్ గాడ్స్విల్ బ్రొషూరులోని 14వ పేజి 3వ పేరాగ్రాఫ్‌ను చర్చించు సమయములో విద్యార్థిని అభివృద్ధి చెందుటకై ఎట్లు ప్రోత్సహించునో ఒక బాగుగా సిద్ధపరచబడిన ప్రదర్శనను చూపుము.
15 ని: బహిరంగ పరిచర్యలో ఎప్పుడు ఒక బైబిలు విద్యార్థి పాల్గొనవచ్చును? వాచ్‌టవర్ డిశంబరు 1989 యొక్క “కొశ్చన్స్ ఫ్రం రీడర్స్” పేజీ 31పై ఆధారపడి పెద్దచే ప్రసంగము. మన స్వంతపిల్లలు కాక క్రొత్తవారు ఇద్దరు పెద్దలు కలిసి మాట్లాడి వారికి అర్హతయున్నదని నిర్ణయించేంతవరకు మనతో వచ్చుటకు వారిని ఆహ్వానింపకూడదను దానిని ఉన్నతపరచుము.
పాట 217 (24) మరియు ముగింపు ప్రార్థన.
ఆగస్టు 20తో ఆరంభమగు వారము
పాట 220 (19)
10 ని: స్థానిక ప్రకటనలు. ఏప్రిల్ రిపోర్టుయొక్క ఉన్నతాంశములను పునఃసమీక్షించి స్థానికముగా నెరవేర్చిన పనులకు సంఘమును ప్రశంసించుము. రానైయున్న వారాంతములో ప్రాంతీయసేవలో పాల్గొనుటను ప్రోత్సహించుము.
20 ని: “కూటములను ప్రయోజనకరముగా చేయుటలో మీ భాగము.” ప్రశ్నా సమాధానముల చర్చతో పెద్ద నిర్వహించును. స్థానికముగా దేనికి అవధానము అవసరమో నొక్కి తెల్పుము. తగిన విషయమందు అభినందించము.
15 ని: పయినీరగుటకు నీకుగల అవకాశములను తూచి చూచుకొనుట. ఇంటర్వ్యూలతో ప్రోత్సాహకర ప్రసంగము. విభిన్న పరిస్థితులు అన్నిరకముల జీవితవిధానములుగల 400 మంది రెగ్యులర్ పయినీర్లను ప్రస్తుతము మనము ఇండియాలో కలిగియున్నాము. పయినీరు సేవచేయుటకు వారిని ఏమి నడిపించినది? యెహోవా మరియు పొరుగువారియెడలగల ప్రేమ (మత్త. 22:37-39); ప్రజలయెడల మిక్కుటమైన శ్రద్ధ, మరియు రక్షింపబడునట్లు వారికి సహాయము చేయవలెనను కోరిక (1 తిమో. 2:4); రాజ్య ఆసక్తులనిమిత్తమై స్వయం త్యాగపూరితమైన ఆత్మ. (1 కొరిం. 9:23) కోరికను సాగుచేసుకొనవలెను. నీవు దానిని చేయుచున్నావా? నీవు పయినీరు చేయు కోరికతో యున్నట్లయిన నీవు చేపట్టవలసిన మెట్లు ఏమనగా: (1) ప్రార్థనలో యెహోవాకు విషయమును తెలియజేయుము (మత్త. 7:7, 8; ఫిలి. 4:6); (2) పయినీర్లతోను పెద్దలతోను విషయమును చర్చించుము (సామె. 15:22); (3) పరిస్థితిని బట్టి మార్చుకోగల ఒక కార్యక్రమ పట్టిని వ్రాసుకొని నీ ఇతర క్రైస్తవ బాధ్యతల సంబంధముగా అది ఎట్లు ప్రభావము చూపునో తూచి చూడుము (లూకా 14:28); (4) బాగా అనుకూలించే పరిస్థితులకొరకు వేచియుండక ప్రారంభించు తారీఖును పెట్టుకొనుము. (ప్రసం. 11:4) ప్రారంభించుటకు సెప్టెంబరు మంచి సమయము: ఆ తదుపరి సంవత్సరములో పయినీరు సేవా పాఠశాలకు అర్హులు కావచ్చును. పయినీరు సేవను చేయుటకు ఆటంకములను వారెట్లు ఎదుర్కొన్నారో తెలుపునట్లు ఒకరు లేక ఇద్దరు పయినీర్లను ఇంటర్వ్యూ చేయుము. అనుకూలముగా యుండును.
పాట 128 (10) మరియు ముగింపు ప్రార్థన.
ఆగస్టు 27తో ఆరంభమగు వారము
పాట 39 (16)
10 ని: స్థానిక ప్రకటనలు.
20 ని: “సువార్తనందించుట—టెలిఫోను ద్వారా.” సేవా కాపరి వలన ప్రశ్నాసమాధానముల పరిశీలన. టెలిఫోను సాక్ష్యము నెట్లు యివ్వవచ్చునో, సాధారణముగా ఉత్పన్నమగు అభ్యంతరములను ఎట్లు అధికమించవచ్చునో చూపు రెండు ప్రదర్శనలను చేర్చుము. ఇది సేవాకాపరి అధ్వర్యమున జరుగు క్రమబద్ధమైన పని మరియు సరైన రికార్డులను భద్రపరచి ఉంచవలెనను దానిని నొక్కి తెల్పుము.
15 ని: స్థానిక అవసరతలు. లేక ఫిబ్రవరి 15, 1990 వాచ్‌టవర్ 21-3 పేజీలలోని “విల్ యు బెనిఫిట్ ఫ్రం అన్డిజర్వుడ్ కైండ్‌నెస్?” అను శీర్షికపై ఆధారపడిన ప్రసంగము. (స్వభాషలో: “దేవుని ఆరాధించుటకు ఇతరులకు సహాయము చేయుట” ఆగస్టు 1989 కావలికోట.)
పాట 8 (84) మరియు ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 3తో ఆరంభమగు వారము
పాట 10 (88)
10 ని: స్థానిక ప్రకటనలు. శనివారపు పత్రికా పనికొరకై ఒకే పత్రిక నుండి వేరువేరు శీర్షికలను ఉన్నతపరచు రెండు ప్రదర్శనలు.
15 ని: “పయినీరు సేవద్వారా యెహోవాయందు నమ్మకము చూపించుట.” పెద్ద మరియు పరిచారకుడు మార్చి 1990 మన రాజ్య పరిచర్య యందలి శీర్షికను చర్చించుట. స్థానిక సంఘమునకు సహాయకరముగా యుండు ఆచరణాత్మక సలహాలను చేర్చుము.
15 ని: “రెఫ్రెష్ యువర్ రిలేటివ్స్ విత్ వాటర్స్ ఆప్ ట్రూత్.” ఫిబ్రవరి 15, 1990, వాచ్‌టవర్ 25-7లోగల శీర్షిక ఆధారముగా ప్రసంగము. (స్వభాషలో: “ఎవరు యెహోవా అంగీకరించిన వారగుదురు?” ఆగస్టు 1989 కావలికోట.)
5 ని: బ్రొషూర్లతో పఠనములను ప్రారంభించిన అనుభవములు. (స్థానికముగా ఏమిలేనట్లయిన, బ్రొషూర్లను అందించుటలోని అనుభవములను ఎన్నుకొనుము.)
పాట 169 (32) మరియు ముగింపు ప్రార్థన.