కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/89 పేజీ 3
  • సంభాషణా అంశము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సంభాషణా అంశము
  • మన రాజ్య పరిచర్య—1989
  • ఉపశీర్షికలు
  • సంభాషణా అంశమును మార్చుచుండుట
  • ప్రసంగ సమాచారమునకు మూలము
మన రాజ్య పరిచర్య—1989
km 10/89 పేజీ 3

సంభాషణా అంశము

1 1977వ సంవత్సరము మేనెల “మన రాజ్య సేవ” “సంభాషణా అంశము” అను భాగమును ప్రవేశపెట్టి దానిని ఫలవంతముగా ఎట్లు ఉపయోగించవలెనను సలహాలను అందించినది. గత 12 సంవత్సరములనుండి మనమందరము ఈ భాగమునుండి ప్రయోజనము పొందాము. సువార్తను ఫలభరితంగా అందించుటలో వృద్ధిచెందుటకు అది అనేకులకు సహాయపడినది.

2 గత కొద్ది సంవత్సరములలో ప్రతి మూడు లేక నాలుగు నెలలకు ఒక క్రొత్త సంభాషణా అంశము ప్రవేశపెట్టబడినది. భవిష్యత్తులో మన రాజ్య పరిచర్య ఎక్కువ తరచుగా సంభాషణా అంశము మార్చుచుండును. సాధారణంగా, సాహిత్యపు అందింపు మారినపుడెల్లా ఒక భిన్నమైన అంశముండును. అప్పుడు లేఖన ప్రసంగమునుండి చాలా సులభంగా సాహిత్యపు అందింపులోకి వెళ్లుటకు యిది సహాయపడును. మరియు అది మన పరిచర్య అనేక భిన్నమైన రీతులలో యుండులాగునను చేయును.

సంభాషణా అంశమును మార్చుచుండుట

3 సహజంగా, సిఫారసు చేయబడిన ముఖ్యమైన సంభాషణా అంశము ప్రతి తలుపునొద్ద అందించుబడులాగున నీవు చూడవచ్చును. ఏమైనను, ఒకవేళ మంచిగా తోచినట్లైన దాని స్థానంలో ఇంకొక దానిని చేర్చుటకు, లేక వేరొక దానిని ఉపయోగించుటకు ఎవరును వెనుకాడరాదు. బహుశా, క్రొత్తవారిని, లేక చిన్నవారిని తర్ఫీదు చేయునప్పుడు సూచింపబడిన సంభాషణా అంశమునకే హత్తుకొని యుండుట ముందు సలహా.

4 నిస్సందేహముగా పయినీర్లు, లేక తమ ప్రాంతములో బహు తరచుగా పనిచేయువారు, వారి ప్రసంగము ఒకే వృత్తములో పదేపదే తిరుగునదిగా చేయకుండుటకు సూచింపబడిన సంభాషణలో మార్పులు చేయుట చాలా సహాయకరమైనదిగా కనుగొందురు. విభిన్నమైన పరిస్థితులు మన రాజ్య రిచర్యలో సూచింపబడిన దానికన్న వేరొక అంశమును ఉపయోగించుట శ్రేయస్కరమైన దానిగా చేయవచ్చును.

ప్రసంగ సమాచారమునకు మూలము

5 సంభాషణా అంశమును మార్చవలసిన అవసరత మనకు తోచినట్లయిన, ఉపయోగించుటకు కావలసిన ఇతర ఆలోచనలను ఎక్కడ నుండి పొందగలము? నీవు అందించు సాహిత్యమునే నీ సంభాషణా అంశమునకు ఒక మూలంగా నీవు ఉపయోగించవచ్చును. ఒక చిత్రమునో, ఒక లేఖనమునో లేక ఒక అధ్యాయపు తీమునో తీసుకొని ఆసక్తిని రేకెత్తించునట్లు ఒక క్లుప్తమైన ప్రసంగమును తయారుచేయుము. ముందు చదువబోయే వ్యక్తి చేతిలోనికి పుస్తకమును పంపి తనకై తానే దానిని చూచు లాగున ప్రయత్నించుము. ఈ విధంగా సాహిత్యంను అందించుట ఎంత సులభమో చూచి నీవే ఆశ్చర్యపడవచ్చును. ఆ తరువాత పునర్దర్శనమును చేయునప్పుడు నీవు ఎక్కువ వివరణలలోకి వెళ్లవచ్చును. కాబట్టి మొదటి ప్రసంగము చాలా మట్టుకు చిన్నదిగా యుండునట్లు చూడుము.

6 మనము ప్రాంతములలో మనము కలియువారికి ఎలా బోధించవలెనో తెలుసుకొనునట్లు మనమందరము “శిష్యునికి తగిన నోరును” దయచేయుమని యెహోవాను ప్రార్థిస్తూనే యుండాలి. (యెషయా 50:⁠4) సంభాషణా అంశమును ఫలభరితంగా ఉపయోగించుట మన యథార్థమైన కోరికయై ఉన్నది. ఎందుకనగా ప్రాణములు అపాయములో వున్నవి.​—1 తిమోతి 4:16.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి