మీరు ఎలా నడుచుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి
1 1990వ సేవా సంవత్సరపు మన క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమము జనవరి 1, తరువాత ప్రారంభమౌతుంది. సమాధానకరమైన వాటిని వెంటాడుతూ, సాతాను మరియు దాని యొక్క మానవపరమైన, ఆత్మీయమైన సేవలు మన మార్గములో వేయు నాశనకరమగు గంటలను తొలగించుకుంటూ మనము ఎలా నడుచుచున్నామో జాగ్రత్తగా చూచుకొను ప్రాముఖ్యతను అది నొక్కి తెల్పును.
2 నీతియుక్తమైన మార్గములో నడుచుచుండుట ఈ అంత్యదినములలో అంతకంతకు సులభమవటం లేదు. కాబట్టి, రెండు దినముల ప్రాంతీయ సమావేశ కార్యక్రమము యెహోవా ప్రజలు ఆత్మీయ సమతూకమును కాపాడుకుంటూ యథార్థతను నిలువబెట్టు కొనువారిగా రుజువు పర్చుకొనులాగున తగిన ప్రోత్సాహమును మరియు ఆచరణాత్మకమగు సలహాను అందించును.
3 ఎఫెసీయులు 5:15-16 పై ఆధారపడి “మీరు ఎలా నడుచుకొనుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి” అను సమావేశపు తాము, సిద్ధపరచబడిన సమాచారపు విస్తరణ మరియు దాని అందింపునకు ఎంతో తగినదై యున్నది. ఉపదేశమును ప్రసంగముల ద్వారా, ప్రదర్శనల ద్వారా, అనుభవములు, ఇంటర్వ్యూలు, మరియు హాస్యముతో నిండిన నటనల ద్వారా అందించబడును. శనివారము క్రొత్తగా సమర్పించుకొన్నవారు బాప్తిస్మము తీసుకొను అవకాశము కలదు. కావున ప్రాంతీయ సమావేశంలో బాప్తిస్మము తీసుకొనగోరువారు, ప్రిసైడింగ్ ఓవర్సీర్ ముందుగా పరిశీలించు ప్రశ్నల నిమిత్తమై ఏర్పాట్లు చేసుకొనులాగున ఆయనను చాలా ముందుగా విషయమును తెలుసుకొని యుండునట్లు చేయవలెను.
4 ప్రాంతీయ సమావేశంలోని ఒక ఉన్నతమైన భాగమేమనగా జిల్లా కాపారిచే యివ్వబడు బహిరంగ ప్రసంగము. “అంధకారలోకములో జ్యోతులను పట్టుకున్నవారు” అనునది ఆ ప్రసంగపు అంశమై యుండును. క్రొత్తగా ఆసక్తి చూపువారికి ఆ బైబిలు చర్చమూల్యమైన సమాచారమును కలిగియుండి, ఇప్పటికే సువార్తయొక్క పరిచారకులుగా వున్నవారికి ఎంతో ప్రోత్సాహకరమైనదిగా యుండును.
5 మీ ప్రాంతీయ కాపరి ఎప్పుడు, ఎక్కడ ఈ సమావేశము జరుగుతుందో తెలియజేయును. ఈ రెండు దినముల అన్ని భాగములకు హాజరగులాగున ఖచ్చితమైన పథకములను వేసుకొనండి. ఈ కార్యక్రమములోని ఏ భాగమునైనను పోగొట్టుకొనుటకు మనము త్యజించము. ఎలా నడుచు కొనుచున్నారో జాగ్రత్తగా చూచుకొనులాగున సహాయము చేయుట ద్వారా మన ప్రయత్నములను యెహోవా ప్రతిఫలమిచ్చును.