దైవ పరిపాలనా సహవాసముననుభవించుట
1 యెహోవా సాక్షులు, ఒకరినొకరు “సహోదరుడు,” మరియు “సహోదరి,” అని పిలుచుకొందురు. యెహోవా దేవుని సేవకులందరి మధ్య ఉండవలసిన సన్నిహితమును ఇది సూచించుచున్నది.
2 “సహోదరుడు” అను పదము “ఒకే తల్లిదండ్రుల కుమారుడు,” అని అర్థము. యెహోవాకు సమర్పించుకొనిన వారందరితో అట్టి ఆత్మీయ సంబంధముతో కూడిన సన్నిహిత బంధముగా నీవు భావించుచున్నావా? మన క్రైస్తవ సహవాసులకు మనము ఒక సహోదరునిగా లేక ఒక సహోదరిగా రుజువు చేయునట్టి ప్రేమను ఎట్లు పెంపొందించగలము?
కూటములవద్ద
3 కూటముగా కూడుకొను ప్రాముఖ్యతను యేసు శిష్యులు మెచ్చుకొనిరి. (అ. కా. 2:42, 46; 20:7, 8) ఉత్తేజకరమైన క్రైస్తవ సహవాసమును కూడ మనము సంపాదించుకొందుము. (రోమా. 16:3, 5) అయినను, కూటములవద్ద మనము వ్యక్తపరచునది, మన సహోదర సహోదరీల ఆత్మీయ క్షేమమును గూర్చి నిజమైన శ్రద్ధకలిగియున్నామని తెలియజేయుచున్నదా? మన వ్యాఖ్యానము ద్వారా, ఇతరుల క్షేమము యెడల ప్రేమను మరియు నిస్వార్థ ఆసక్తిని పెంపొందించవచ్చు. సువార్తను ప్రకటించుటలో ఉత్సాహముగా నుండుటకు మరియు దైనందిక జీవితములో అన్ని విషయములలో మాదిరిగా నుండుటకు మన సహోదరులను ప్రోత్సహించగోరుదుము.—హెబ్రీ. 10:24, 25.
4 కూటములకు ముందు మరియు తరువాత, దైవపరిపాలనా సహవాసమునకు అనేక అవకాశములున్నవి. మన సహవాసమును విస్తృతపరుచుకొనుటకై క్రొత్త వారిని ఆహ్వానించుటకు మరియు సాధ్యమైనంత మందిని పరిచయము చేయుటకు ఈ సమయమును ఉపయోగించవచ్చు. ప్రాంతీయసేవలోని అనుభవములను మరియు ఇతర ప్రోత్సాహకరమైన సంభాషణ ఇతరులను ప్రోత్సాహపరచును.—1 థెస్స. 5:11, 15.
ఆరోగ్యకరమైన సహవాసము
5 దేవుడు ద్వేషించు ప్రతీదానిని అంగీకరించు వ్యాధిగ్రస్తమైన సమాజము మరియు దుష్టుల సహవాసము కలిగియుండి అదే సమయములో మనము దేవునితో నడవలేము. “దుష్టసహవాసము మంచి నడవడిని చెరచును” అని బైబిలు హెచ్చరించుచున్నది. (1 కొరిం. 15:33) సత్యమందు ఆసక్తి లేని లోకసంబంధమైన పరిచయస్తులను మరియు అవిశ్వాస బంధువులను, సత్యమునంగీకరించుటకు ప్రోత్సహించునని తలంచి కొందరు వారిని కూటములకు ఆహ్వానించవచ్చు. అయితే ఇది వివేకమా మరియు లేఖనాధారమైనదా?
6 అన్యులతోను, అవిశ్వాసులతోను మరియు సామాన్య వ్యక్తులతోను వ్యవహరించునపుడు జాగ్రత్తగా నుండవలెనని ఉపదేశించబడితిమి. (నవం. 15, 1988 వాచ్. పేజి 15-16 చూడుము.) ఈ లోక మార్గములను ఇంకను అనుసరించుచు యెహోవా ఆరాధికులు కానివారితో ఎందుకు అనవసరముగా సహవాసము చేయవలెను? (2 కొరిం. 6:14, 15) ఆత్మీయముగా నిర్లక్ష్యముగా నుండు కొందరు విశ్వాసములో తమను బలపరచు పరిపక్వమైన క్రైస్తవుల సహవాసమునకు బదులు ఈ లోక తలంపులతో నుండు వారినే అంటిపెట్టుకొని యుండుటకు చూతురు. ఈ లోక సంబంధమైన, మరియు సూత్రములు ఏమీ లేని వారి కూటము వారి విశ్వాసమును బలహీనపరచి పాడైపోవుటకు దారితీయునని గ్రహింపరు.—2 థెస్స. 3:14, 15 పోల్చి చూడుము.
7 సత్యమును అభ్యసించగోరు వారందరు, యెహోవాకు సమర్పించుకొనినవారు సత్యముతో నడుచుటలో మరియు దేవుని సేవించుటలో అభివృద్ధి చెందుట యందు సహాయపడువారి సహవాసము కొరకై చూడవలెను. మన స్నేహితులు మరియు సహవాసుల ప్రభావము మనపై యున్నది. కనుక, యెహోవాతో దగ్గరి సంబంధమును అనుభవించుచున్న దైవభక్తి గలవారి సహవాసమును కలిగియుండుట ఎంత వివేకము!