నిజమైన శాంతి మరియు భద్రతను ప్రకటించుము
1 నిజమైన శాంతి మరియు భద్రతకు ఒకే ఒక మూలమున్నది. అదే యెహోవా దేవుడు. యెహోవా “అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలముగల అన్యజనులకు తీర్పు తీర్చును,” దాని ఫలితముగా, “వారు జనము మీదికి జనము ఖడ్గము ఎత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు,” అని మీకా వివరించెను.—మీకా 4:3.
2 యెహోవాయే నిజమైన శాంతికి మూలము గనుక ప్రజలు “యెహోవా పర్వత శిఖరమునకు వెళ్ల”వలసియున్నారు. (మీకా 4:2) యెహోవా దేవుడు తన రాజ్యము ద్వారా ఈ భూమిమీదికి నిజమైన శాంతిని తెచ్చునని వారు నేర్చుకొందురు. అయితే నిజమైన శాంతి మరియు భద్రత యొక్క మూలమును గూర్చి మరి ఎక్కువమంది తెలిసికొనునట్లు ఎట్లు సహాయపడగలము?
‘ట్రూపీస్’ పుస్తకమును పంపిణీచేయుట
3 “యెహోవా పర్వత శిఖరమునకు వెళ్ల”గోరు వారికై ఆ పుస్తకము తగిన సమాచారమును కలిగియున్నది. ఫిన్లాండ్లోని ఒక వైద్యుడు ఆ పుస్తకమును పొందెను. అప్పుడు ఆయన దానిని చదువలేదు, పుస్తకముల షెల్ప్లో పెట్టెను. తరువాత ఆయన భార్యకు ఆ పుస్తకము గుర్తునకు వచ్చి చదివినది. వెంటనే సత్యమును కనుగొనినట్లు ఆమె గ్రహించినది. ఆమె పఠించుటకు ప్రారంభించెను, తరువాత ఆమె భర్తకూడా ఆమెతోబాటు చేరెను. వారు ఇప్పుడు బాప్తిస్మమును తీసికొనిరి, వారి పిల్లలు కూడా ఇప్పుడు సువార్తికులైరి. “ట్రూపీస్” పుస్తకము ఎక్కువమంది చేతులలోకి వెళ్లు అవసరత ఈ అనుభవము తెల్పుచున్నది.
4 ప్రజలకు బాగుగా నచ్చునని మనము తలంచు ఆ పుస్తకము యొక్క విషయసూచిక టేబుల్ మరియు అధ్యాయములను పునఃసమీక్షించుట కూడ, ప్రాంతీయ సేవ కొరకై మనము సిద్ధపడుటలో చేరియుండవలెను. ఇంటివారితో మాట్లాడుటకు ఆ పుస్తకము నుండి ప్రత్యేక అంశములను ఎన్నిక చేయవచ్చు.
5 ఈ క్రింది సలహాలను నీవు ప్రయత్నించుము. సంభాషించు అంశము క్రింది లేఖనములను చదివి తర్కించిన తరువాత, “ట్రూపీస్” పుస్తకములోని 8వ పేజీపై ఇంటివారి దృష్టిని మళ్లించుము. సమయముంటే, దేవుడు ఏమి చేయనైయున్నాడు. మరియు మానవ నాయకులు దేనిని చేయుటకు అసమర్థులు అను మధ్యనున్న తేడాను చూపు లేఖనములను చూడుము. తరువాత 13వ పేరాను చదువుము. అప్పుడు ఆ తరువాతి అధ్యాయమును ధ్యానించుటకు ఇష్టపడునేమో ఇంటివారిని అడుగుము. ఇట్లు అప్పటికప్పుడు బైబిల్ పఠనమును ప్రారంభించవచ్చు. లేనిచో పునర్దర్శించినపుడు పఠనమును ప్రారంభించవచ్చు. పునర్దర్శించినపుడు పఠనమును ప్రారంభించవచ్చు.
6 అపరిపూర్ణమైన మానవుడు నిజమైన శాంతి భద్రతలను తీసికొని రాలేడనునది స్పష్టము. భవిషత్నందు బలమైన నిరీక్షణ కలిగియుండుటకు ప్రజలు దేవుని యందు విశ్వాసముంచవలెను. కాని, “వారు . . . వినని వారు ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించు వాడు లేకుండ వారెట్లు విందురు?” (రోమా. 10:14) నిజమైన శాంతి భద్రతలకు మూలమువైపు తిరుగు అవకాశమునకు సమయము మించిపోతున్నది. సంఘము యొక్క ప్రాంతములోని యథార్థ హృదయులైన ప్రజలకు నిజమైన శాంతి భద్రతల సమాచారమును జూలై నెలలో ప్రకటించెదము.