కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp19 No. 2 పేజీలు 10-11
  • తీవ్రమైన అనారోగ్యం ఉన్నప్పుడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తీవ్రమైన అనారోగ్యం ఉన్నప్పుడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2019
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కొంతమంది ఎలా తట్టుకున్నారు?
  • నేను ఇంత అనారోగ్యంగా ఎందుకు ఉండవలసి వస్తోంది?
    తేజరిల్లు!—1997
  • ఒక కుటుంబ సభ్యుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విలువైనవాళ్లుగా ఎంచుతున్నాడు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • ప్రార్థించడం వల్ల మీరెలా ప్రయోజనం పొందవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2019
wp19 No. 2 పేజీలు 10-11

తీవ్రమైన అనారోగ్యం ఉన్నప్పుడు

“నాకు ఊపిరితిత్తిలో, పెద్ద పేగులో క్యాన్సర్‌ ఉందని తెలియగానే ఉరిశిక్ష పడిన ఖైదీలా అనిపించింది. కానీ డాక్టర్‌ని కలిసి ఇంటికి రాగానే ఇలా అనుకున్నాను, ‘నిజమే, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు, అయితే ఈ పరిస్థితిని తట్టుకోవడానికి ఒక మార్గం వెతకాలి.’”—లిండా, వయసు 71.

“ముఖంలోని ఎడమ వైపున్న నరాల్ని ప్రభావితం చేసే ఒక తీవ్రమైన జబ్బు నాకుంది. దానివల్ల ఎంతో నొప్పి వచ్చేది, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయేదాన్ని. చాలాసార్లు, నాకు ఎవ్వరూ లేరనిపించేది, చివరికి ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాను.”—అలీస్‌, వయసు 49.

జబ్బు వల్ల చక్రాల కుర్చీలో ఉన్న వ్యక్తి, అతని చుట్టూ ఉన్న ప్రియమైనవాళ్లు

మీకు గానీ, మీకు ఇష్టమైనవాళ్లకు గానీ ప్రాణాంతకమైన జబ్బు ఉందని తెలిసినప్పుడు ఎంతో బాధగా ఉంటుంది. మీరు ఆ జబ్బునే కాకుండా దాంతోపాటు వచ్చే భావోద్వేగ సమస్యల్ని, కోపాన్ని, ఆందోళనను కూడా తట్టుకోవాలి. భయాన్ని, ఒత్తిడిని కలిగించే వైద్య పరీక్షలు, సరైన చికిత్స దొరకడం కష్టమవ్వడం, దొరికినా ఎక్కువ ఖర్చు అవ్వడం, మందులు తీసుకొచ్చే చెడు ప్రభావాల వంటివాటి వల్ల అలాంటి భావోద్వేగ సమస్యలు ఇంకా పెరగవచ్చు. తీవ్రమైన జబ్బు వల్ల వచ్చే మానసిక ఆందోళన తట్టుకోవడం చాలా కష్టం.

మరి సహాయం ఎక్కడ దొరుకుతుంది? దేవునికి ప్రార్థించడం వల్ల, ఓదార్పునిచ్చే బైబిలు వృత్తాంతాలను చదవడం వల్ల తాము ఊరటను పొందినట్టు చాలామంది గ్రహించారు. కుటుంబ సభ్యుల, స్నేహితుల ప్రేమ, మద్దతు కూడా సహాయం చేస్తాయి.

కొంతమంది ఎలా తట్టుకున్నారు?

58 ఏళ్ల రాబర్ట్‌ ఇలా చెప్తున్నాడు: “దేవుని మీద నమ్మకం ఉంచండి, మీ జబ్బును తట్టుకోవడానికి ఆయనే మీకు సహాయం చేస్తాడు. యెహోవాకు ప్రార్థించండి, మీకెలా అనిపిస్తుందో ఆయనకు చెప్పండి, పవిత్రశక్తి ఇవ్వమని అడగండి. కుటుంబ సభ్యుల్ని ప్రోత్సహించగలిగేలా సానుకూలంగా ఉండడానికి, అలాగే ప్రశాంతంగా జబ్బును తట్టుకోవడానికి మీకు సహాయం చేయమని వేడుకోండి.”

అతను ఇంకా ఇలా అంటున్నాడు: “భావోద్వేగపరంగా మీ కుటుంబం ఇచ్చే మద్దతు చాలా సహాయకరంగా ఉంటుంది. నాకు ప్రతీరోజు, ఒకరు లేదా ఇద్దరు ఫోన్‌ చేసి ‘ఎలా ఉన్నావ్‌?’ అని అడుగుతుంటారు. వేర్వేరు చోట్ల ఉన్న నా స్నేహితులందరూ నన్ను ప్రోత్సహిస్తుంటారు. దానివల్ల కాస్త ఊరటగా అనిపిస్తుంది, జీవితం మీద ఆశ కోల్పోకుండా ఉండగలుగుతున్నాను.”

మీరు అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితుణ్ణి కలవడానికి వెళ్తుంటే, లిండా చెప్పే ఈ మాటల్ని గుర్తుపెట్టుకోండి: “అనారోగ్యంతో ఉన్నవాళ్లు అందరూ జీవించినట్టే జీవించాలని కోరుకుంటారు, ఎప్పుడూ తమ అనారోగ్య సమస్య గురించే మాట్లాడడానికి వాళ్లు ఇష్టపడకపోవచ్చు. కాబట్టి మామూలు విషయాల గురించి మాట్లాడండి.”

దేవుడిచ్చే బలం వల్ల, లేఖనాలు ఇచ్చే ఊరట వల్ల, అలాగే కుటుంబ సభ్యుల, స్నేహితుల ప్రేమ, మద్దతు వల్ల తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నా జీవితం మీద ఆశ కోల్పోకుండా ఉండవచ్చు.

సహాయం చేసే బైబిలు వచనాలు

దేవుని మీద ఆధారపడండి.

“నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను. ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను.”—కీర్తన 34:4, 6.

ముందు ప్రస్తావించిన లిండా ఇలా చెప్తోంది: “నేనెప్పుడూ ‘నా జబ్బును తగ్గించు’ అని ప్రార్థించను. బదులుగా ‘ధైర్యంగా ఉంటూ, నా జబ్బును తట్టుకునేలా సహాయం చేయి’ అని ప్రార్థిస్తాను.”

దేవుని వాక్యం నుండి బలం పొందండి.

“నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.”—యెషయా 33:24.

భవిష్యత్తు గురించి దేవుడు చేసిన వాగ్దానాల్ని ధ్యానించండి. అది మీలో ఆశను నింపి, సహించడానికి కావల్సిన శక్తినిస్తుంది.

కుటుంబ సభ్యుల, స్నేహితుల మద్దతు అడగండి.

“నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.”—సామెతలు 17:17.

ముందు ప్రస్తావించిన అలీస్‌ ఈ సలహా ఇస్తోంది: “ఎప్పుడూ ఒంటరిగా ఉండకండి, మీ స్నేహితుల సహాయం తీసుకోండి. అప్పుడప్పుడు మీకు ఒంటరిగా ఉన్నట్లు అనిపించవచ్చు, చివరికి దేవుడు కూడా మీ మొర వినట్లేదని అనిపించవచ్చు. అయినా సరే ఒంటరిగా ఉండకండి.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి