కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp19 No. 2 పేజీలు 8-9
  • భర్త/భార్య నమ్మకద్రోహం చేసినప్పుడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • భర్త/భార్య నమ్మకద్రోహం చేసినప్పుడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2019
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సహాయం చేసే బైబిలు వచనాలు
  • దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్పు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
  • బైబిలు జీవితాలను మారుస్తుంది
    కావలికోట: బైబిలు జీవితాలను మారుస్తుంది
  • 3 సమస్యలను సహించడానికి సహాయం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2018
  • కుటుంబం గురించి ఆందోళన
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2019
wp19 No. 2 పేజీలు 8-9
ప్రార్థిస్తున్న ఒకమ్మాయి

భర్త/భార్య నమ్మకద్రోహం చేసినప్పుడు

“నా భర్త, వయసులో ఉన్న అమ్మాయి కోసం నన్ను వదిలేస్తున్నానని చెప్పినప్పుడు నాకు చచ్చిపోవాలనిపించింది. అదంతా తలచుకుంటే, ముఖ్యంగా తనకోసం నేను వదులుకున్న వాటిని గుర్తు చేసుకుంటే చాలా అన్యాయమనిపించింది.”—మరియ, స్పెయిన్‌.

“నా భార్య ఉన్నట్టుండి నన్ను వదిలి వెళ్లిపోయినప్పుడు నాలో ఒక భాగం చనిపోయినట్టు అనిపించింది. మా కలలు, ఆశలు, ప్లాన్‌లు అన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఒక్కోసారి నేను ఆందోళన నుండి బయటపడ్డాను అనిపించేది, కానీ ఆ తర్వాత మళ్లీ నిరాశలో కూరుకుపోయేవాణ్ణి.”—బిల్‌, స్పెయిన్‌.

వివాహజత నమ్మకద్రోహం చేసినప్పుడు భర్త/భార్య పూర్తిగా కృంగిపోతారు. నిజమే కొంతమంది తప్పుచేసిన వివాహజతను క్షమించి, తిరిగి తమ బంధాన్ని బలపర్చుకోవడానికి కృషిచేస్తారు.a వాళ్లిద్దరూ కలిసున్నా లేదా విడిపోయినా, నమ్మకద్రోహానికి గురైన వివాహజత తీవ్రమైన మనోవేదన అనుభవించాల్సి వస్తుంది. మరి అలాంటివాళ్లు ఆ వేదనను ఎలా తట్టుకోవచ్చు?

సహాయం చేసే బైబిలు వచనాలు

అలాంటి తీవ్రమైన మనోవేదన అనుభవించిన చాలామంది తప్పుచేయని భర్తలు/భార్యలు లేఖనాల నుండి ఓదార్పు పొందారు. దేవుడు వాళ్ల కన్నీళ్లను చూస్తున్నాడని, వాళ్ల బాధను పట్టించుకుంటున్నాడని వాళ్లు అర్థం చేసుకున్నారు.—మలాకీ 2:13-16.

“నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది.”—కీర్తన 94:19.

“ఆ వచనం చదువుతున్నప్పుడు, యెహోవా ఒక కనికరం గల తండ్రిలా నన్ను ప్రేమతో ఓదారుస్తున్నట్టు ఊహించుకునేవాణ్ణి” అని బిల్‌ గుర్తుచేసుకుంటున్నాడు.

“విశ్వసనీయంగా ఉండేవాళ్లతో నువ్వు విశ్వసనీయంగా ఉంటావు.”—కీర్తన 18:25, NW.

కొన్ని నెలలపాటు నమ్మకద్రోహం చేసిన తన భర్త గురించి కార్మన్‌ ఇలా చెప్తుంది: “నా భర్త నాకు ద్రోహం చేశాడు. కానీ యెహోవా ఎప్పుడూ విశ్వసనీయంగా ఉంటాడని నేను నమ్మవచ్చు, ఆయన నన్ను ఎన్నడూ నిరాశపర్చడు.”

“ఏ విషయంలోనూ ఆందోళన పడకండి. కానీ ప్రతీ విషయంలో . . . ప్రార్థనల ద్వారా, అభ్యర్థనల ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి; అప్పుడు, మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి క్రీస్తుయేసు ద్వారా మీ హృదయాలకు, మీ మనసులకు కాపలా ఉంటుంది.”—ఫిలిప్పీయులు 4:6, 7.

సాషా ఇలా చెప్తుంది: “నేను ఆ వచనాలను మళ్లీ, మళ్లీ చదివాను, పదేపదే ప్రార్థించడం వల్ల దేవుడు నా జీవితంలో మనశ్శాంతిని దయచేశాడు.”

పైన ప్రస్తావించిన వాళ్లంతా ఒక్కోసారి జీవితం మీద ఆశను కోల్పోయారు. కానీ వాళ్లు యెహోవా దేవుని మీద నమ్మకం ఉంచారు, ఆయన వాక్యం నుండి బలం పొందారు. బిల్‌ ఇలా చెప్తున్నాడు: “అంతా కోల్పోయినట్టు అనిపించినా, నా విశ్వాసం జీవితం మీద నాకు ఒక ఆశనిచ్చింది, నేను కొంతకాలం ‘గాఢాంధకారపు లోయలో’ నడిచినా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు.”—కీర్తన 23:4.

a క్షమించాలా, వద్దా అనే దానిగురించి తేజరిల్లు! (ఇంగ్లీషు) ఏప్రిల్‌ 22లోని “వివాహజత నమ్మకద్రోహం చేసినప్పుడు” అనే ఆర్టికల్స్‌ను, అలాగే తేజరిల్లు! సెప్టెంబరు 8, 1995, “జారత్వాన్ని—క్షమించాలా వద్దా?” అనే ఆర్టికల్‌ను చూడండి.

కొంతమంది ఎలా తట్టుకున్నారు?

ఓదార్పునిచ్చే లేఖనాలు చదివి, వాటిగురించి ఆలోచించండి.

బిల్‌ ఇలా అంటున్నాడు: “నేను యోబు పుస్తకాన్ని, ఆ తర్వాత కీర్తనల పుస్తకాన్ని చదివాను. వాటిలో నా పరిస్థితులకు సరిపోయే లేఖనాల్ని అండర్‌లైన్‌ చేసుకున్నాను. ఆ బైబిలు రచయితలు కూడా నాలాంటి వేదనను, బాధను అనుభవించారని అర్థం చేసుకున్నాను.”

సంగీతంతో ఊరట పొందండి.

కార్మన్‌ ఇలా గుర్తుచేసుకుంటుంది: “రాత్రి నిద్ర పట్టనప్పుడు నేను సంగీతం వినేదాన్ని, దానివల్ల చాలా ఊరటగా అనిపించేది.” డానియెల్‌ ఇలా చెప్తున్నాడు: “నేను గిటార్‌ ప్లే చేయడం నేర్చుకున్నాను, అది నేను ప్రశాంతంగా ఉండడానికి సహాయం చేసింది.”

మీ భావాల్ని ఇతరులతో పంచుకోండి

డానియెల్‌ ఇలా అంటున్నాడు: “నేను మామూలుగా నా భావాల్ని ఇతరులకు చెప్పను, కానీ నాకు కొంతమంది మంచి స్నేహితులు ఉన్నారు. ప్రతీరోజు నేను వాళ్లతో మాట్లాడేవాణ్ణి. ఉత్తరాల ద్వారా, మాటల ద్వారా నా భావాల్ని వాళ్లతో పంచుకునేవాణ్ణి. అది నిజంగా నాకు సహాయం చేసింది.” సాషా ఇలా చెప్తోంది: “నా కుటుంబం చేసిన సహాయం మరువలేనిది. అమ్మ ఎప్పుడూ నా పక్కనే ఉండి, నేను చెప్పే ప్రతీ విషయాన్ని వినేది. నాన్న కూడా నాకు అండగా ఉంటూ మెల్లమెల్లగా కోలుకోవడానికి సహాయం చేశాడు.”

పట్టుదలగా ప్రార్థించండి.

కార్మన్‌ ఇలా అంటోంది: “నేను ఎప్పుడూ ప్రార్థించేదాన్ని. దానివల్ల దేవుడు నా పక్కనే ఉన్నట్టు, నేను చెప్పేది వింటూ, నాకు సహాయం చేస్తున్నట్టు అనిపించేది. ఆ కష్ట సమయంలో నేను దేవునికి ఇంకా దగ్గరయ్యాను.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి