కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • brwp1604 పేజీ 8
  • బైబిలు ఎలా నిలిచింది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిలు ఎలా నిలిచింది?
  • కావలికోట: బైబిలు దాడుల్ని తట్టుకొని నిలిచింది
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిల్లో దేవుని మాటలు ఉన్నాయి
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • కొన్ని ముఖ్యమైన వాస్తవాలు
    కావలికోట: బైబిలు దాడుల్ని తట్టుకొని నిలిచింది
  • కుటుంబాలకు సహాయం
    తేజరిల్లు!—2018
  • బైబిలు గురించి మీ అభిప్రాయం ఏంటి?
    బైబిలు గురించి మీ అభిప్రాయం ఏంటి?
మరిన్ని
కావలికోట: బైబిలు దాడుల్ని తట్టుకొని నిలిచింది
brwp1604 పేజీ 8
ఒకవ్యక్తి బైబిలు చదువుతున్నాడు

పత్రిక ముఖ్యాంశం | బైబిలు దాడుల్ని తట్టుకొని నిలిచింది

బైబిలు ఎలా నిలిచింది?

బైబిలు ఎన్నో వ్యతిరేకతలను తట్టుకుని ఇప్పటిదాకా నిలిచింది. మీరు దాన్ని చదువుతున్నప్పుడు, అందులోని సందేశం ఏమాత్రం మారలేదనే నమ్మకంతో ఉండవచ్చు. బైబిలు సందేశం పాడైపోయే పదార్థాల మీద రాయబడినా, దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు జరిగినా, బైబిలు సందేశాన్ని మార్చాలని చూసినా అది ఇప్పటివరకు ఎలా నిలిచింది? ఈ గ్రంథం ప్రత్యేకత ఏంటి?

“నాదగ్గర ఉన్న బైబిలు దేవుడిచ్చిన బహుమతి అని నేను ఇప్పుడు నమ్ముతున్నాను”

ఈ ప్రశ్నలకు చాలామంది బైబిలు విద్యార్థులు అపొస్తలుడైన పౌలు లాంటి అభిప్రాయాన్నే కలిగివున్నారు. పౌలు ఇలా రాశాడు: “లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు.” (2 తిమోతి 3:16) బైబిలు దేవుని వాక్యం, పైగా దేవుడే దాన్ని భద్రంగా కాపాడాడు కాబట్టి అది ఈరోజు వరకు నిలిచివుందని వాళ్లు నమ్ముతున్నారు. ముందు ఆర్టికల్‌లో ప్రస్తావించబడిన ఫైజల్‌ బైబిలు నమ్మదగినదో లేదో తానే స్వయంగా పరిశీలించి తెలుసుకోవాలనుకున్నాడు. నేడు చర్చీల్లో బోధించే చాలా విషయాలు బైబిల్లో లేవని తెలుసుకుని అతను ఆశ్చర్యపోయాడు. అయితే, భూమి పట్ల దేవునికున్న సంకల్పం గురించి బైబిల్లో చదివినప్పుడు అతను చాలా సంతోషించాడు.

ఫైజల్‌ ఇలా చెప్పాడు: “నాదగ్గర ఉన్న బైబిలు దేవుడిచ్చిన బహుమతి అని నేను ఇప్పుడు నమ్ముతున్నాను. విశ్వాన్ని సృష్టించిన దేవుడు, మనకు తన వాక్యాన్ని ఇచ్చి దాన్ని కాపాడలేడా? ఒకవేళ ఆయన అలా చేయలేడని మనం అనుకుంటే, ఆయన శక్తిపై మనకు నమ్మకం లేనట్టే. దేవుని శక్తిని సందేహించడానికి నేను ఎంతటి వాడిని?”—యెషయా 40:8.

బైబిలు సందేశం మారలేదని మనమెలా నమ్మవచ్చు?

ఎన్నో వ్యతిరేకతలు ఎదురైనా బైబిలు మనకాలం వరకు ఎలా భద్రంగా నిలిచివుందో ఈ ఆర్టికల్స్‌ వివరించాయి. అయితే బైబిలు కల్పితాలు, కట్టుకథలు ఉన్న పుస్తకం కాదుగానీ, నిజంగా ‘దేవుని వాక్యమని’ మీరు ఎలా నమ్మవచ్చు? (1 థెస్సలొనీకయులు 2:13) www.jw.org/te వెబ్‌సైట్‌లోని, బైబిల్లో ఉన్న విషయాలను నిజమని మీరు ఎందుకు నమ్మవచ్చు? అనే చిన్న వీడియో చూడండి. (వెతుకు ట్యాబ్‌లో వీడియో పేరు టైప్‌ చేసి ఎంటర్‌ నొక్కండి)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి