కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • T-30 పేజీలు 1-4
  • బైబిలు గురించి మీ అభిప్రాయం ఏంటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిలు గురించి మీ అభిప్రాయం ఏంటి?
  • బైబిలు గురించి మీ అభిప్రాయం ఏంటి?
  • ఇలాంటి మరితర సమాచారం
  • రాబోయే రోజులు ఎలా ఉంటాయని మీరనుకుంటున్నారు?
    రాబోయే రోజులు ఎలా ఉంటాయని మీరనుకుంటున్నారు?
  • చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారా?
    చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారా?
  • దేవుని రాజ్యం అంటే ఏంటి?
    దేవుని రాజ్యం అంటే ఏమిటి?
  • బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా?
    బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా?
మరిన్ని
బైబిలు గురించి మీ అభిప్రాయం ఏంటి?
T-30 పేజీలు 1-4

బైబిలు గురించి మీ అభిప్రాయం ఏంటి?

అది . . .

  • మనుషులు సొంతగా రాసిన పుస్తకం.

  • కట్టుకథలు ఉన్న పుస్తకం.

  • దేవుడు ఇచ్చిన పుస్తకం.

బైబిలు ఏం చెప్తుందంటే . . .

“లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు.”—2 తిమోతి 3:16, కొత్త లోక అనువాదం.

దాన్ని నమ్మడం వల్ల మీరు పొందేవి . . .

జీవితంలో ముఖ్యమైన ప్రశ్నలకు సరైన జవాబులు.—సామెతలు 2:1-5.

రోజువారీ జీవితంలో ఉపయోగపడే సలహాలు.—కీర్తన 119:105.

మంచి రోజులు వస్తాయనే ఆశ.—రోమీయులు 15:4.

ఒకతను, ఒకామె బైబిలు చదువుతున్నారు; ఒక కుటుంబం బయటికెళ్లి సంతోషంగా సమయం గడుపుతోంది

బైబిలు చెప్పేది ఎందుకు నమ్మవచ్చు?

మూడు కారణాలు పరిశీలించండి.

  • చక్కని పొందిక. బైబిల్ని 1,600 కన్నా ఎక్కువ సంవత్సరాల కాలంలో దాదాపు 40 మంది వేర్వేరు వ్యక్తులు రాశారు. వాళ్లలో చాలామంది ఒకరినొకరు ఎప్పుడూ కలుసుకోలేదు. అయినా బైబిలంతా పొందికగా ఉంది, అందులో ఒకే ముఖ్యాంశం ఉంది!

  • నిజాయితీ. సాధారణంగా చరిత్రకారులు తమ దేశం ఓడిపోవడం గురించి రాయరు. కానీ బైబిలు రచయితలు తమ తప్పుల్ని, తమ దేశ ప్రజల తప్పుల్ని నిజాయితీగా రాశారు.—2 దినవృత్తాంతాలు 36:15, 16; కీర్తన 51:1-4.

  • నెరవేరిన మాటలు. బబులోను అనే ప్రాచీన నగరం నాశనమౌతుందని దాదాపు 200 సంవత్సరాల ముందే బైబిలు ప్రవచించింది. (యెషయా 13:17-22) బబులోను ఎలా పతనం అవుతుందో చెప్పడమే కాదు, దాన్ని జయించే రాజు పేరు కూడా బైబిలు ముందే చెప్పింది!—యెషయా 45:1-3.

    బైబిల్లో ఉన్న ఎన్నో ప్రవచనాలు అచ్చు గుద్దినట్టు నెరవేరాయి. దేవుడు ఇచ్చిన పుస్తకం అంటే ఇలాగే ఉండాలి కదా!—2 పేతురు 1:21.

ఈ ప్రశ్న గురించి ఆలోచించండి . . .

నాన్న, అమ్మ, కొడుకు, కూతురు

దేవుని వాక్యం వల్ల మీ జీవితం ఎలా మెరుగౌతుంది?

యెషయా 48:17, 18; 2 తిమోతి 3:16, 17లో దానికి జవాబు ఉంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి