కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 8/1 పేజీలు 6-8
  • అసమానతామహామారిని రూపుమాపటం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అసమానతామహామారిని రూపుమాపటం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీకున్నదాన్ని సద్వినియోగం చేసుకోండి !
  • సహోదరుల్లో సమానత్వం
  • అసమానత్వం—దేవుడు దాన్ని ఉద్దేశించాడా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • నేటి అసమానతామహామారి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • జాతి భేదాలు లేని ప్రపంచం పగటి కలేనా?—బైబిలు ఏం చెప్తుంది?
    అదనపు అంశాలు
  • ఆర్థిక సమస్యలు—దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
    అదనపు అంశాలు
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 8/1 పేజీలు 6-8

అసమానతామహామారిని రూపుమాపటం

మానవులు ఆకాంక్షిస్తున్న సమానత్వాన్ని సృష్టికర్త త్వరలోనే తీసుకువస్తాడు. అప్పటి వరకు, మనల్నీ మన కుటుంబాల్నీ ప్రభావితం చేసే అసమానతా మహామారిని రూపుమాపటానికి మనం కనీసం చర్యలు తీసుకోవచ్చు. దక్షిణమెరికా మాజీ అధ్యక్షుడైన నెల్సన్‌ మండేలా పేర్కొన్నట్లుగా, “ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తిని ప్రత్యేకపరిచేది, మనకివ్వబడినది కాదుగాని మనకున్న దాని నుండి మనం చేసుకునేదే.”

ఆయన మాటలు నిజమని చరిత్ర ధృవీకరిస్తోంది. జన్మతః ఏమీ పొందకపోయినప్పటికీ, అనేకమంది స్త్రీ పురుషులు తమకున్న దాన్ని ఉపయోగించుకోవడం ద్వారా, ఎంతో ప్రతిభావంతులైన తమ తోటివారి నుండి తమను ప్రత్యేకపరిచే విజయాలను సాధించారు. దానికి భిన్నంగా, జన్మతః ఎంతో ప్రతిభతో ఆశీర్వదించబడిన ఇతరులు తమకున్న దాన్ని చేజార్చుకుని తమ సామర్థ్యాన్ని తగిన విధంగా ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు.

మీకున్నదాన్ని సద్వినియోగం చేసుకోండి !

బైబిలు పఠనం ద్వారా దేవుని సంకల్పాలను గురించిన జ్ఞానాన్ని పొందడానికి ప్రజలకు సహాయం చేయడం విషయంలో యెహోవాసాక్షులు అత్యంతాసక్తి కలిగివున్నారు. అయితే బైబిలు సమాచారం నుండి పూర్తి ప్రయోజనం పొందడానికి ప్రజలు అక్షరాస్యులై ఉండాలని వారు గుర్తిస్తారు. ఆ కారణాన్నిబట్టి, యెహోవాసాక్షులు వేలాదిమందికి చదవడం వ్రాయడం నేర్పించారు, పశ్చిమాఫ్రికాలోని ఒక్క దేశంలోనే (1990ల మధ్య కాలంకల్లా) 23,000 మందికి అలా నేర్పించారు. యెహోవాసాక్షులు చేసే విశేషమైన సంఘ సేవ గురించి చెప్తూ, శాన్‌ ఫ్రాన్సిస్కో ఎగ్సామినర్‌ ఇలా పేర్కొంది: “వారిని ఆదర్శ పౌరులుగా పరిగణించవచ్చు. వాళ్లు నమ్మకంగా పన్నులు చెల్లిస్తారు, రోగుల పట్ల శ్రద్ధ వహిస్తారు, నిరక్షరాస్యతతో పోరాడతారు.”

అంతేగాక, తమ ఉద్దేశాలను బహిరంగంగా చక్కగా వ్యక్తపర్చగల అర్హులైన ప్రసంగీకులుగా తయారవ్వడానికి బహిరంగంగా ప్రసంగించడంలో క్రమమైన కోర్సును ఇవ్వడం ద్వారా యెహోవాసాక్షులు లక్షలాదిమంది ప్రజలకు తర్ఫీదునిచ్చారు. వీరిలో వేలాదిమంది ప్రసంగించే విషయంలో మునుపు గంభీరమైన సమస్యలుగల వాళ్లే. దక్షిణాఫ్రికాకు చెందిన ఒక వ్యక్తిని పరిశీలించండి, ఆయనిలా వ్రాస్తున్నాడు, “నాకు నత్తి ఎంతగా ఉండేదంటే నేను అంతర్ముఖునిగా తయారయ్యాను, నాకు బదులుగా మాట్లాడేందుకు సాధారణంగా ఇతరులపై ఆధారపడేవాటిని. . . . నేను దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో చేరినప్పుడు, కొంతమంది ప్రేక్షకుల ఎదుట నేను బైబిలు చదివే ప్రసంగాన్ని ఇవ్వవలసి వచ్చింది . . . , నేను ఎంత నత్తిగా మాట్లాడానంటే నాకు కేటాయించబడిన సమయంలో నేను నా ప్రసంగాన్ని ముగించలేకపోయాను. కూటం అయిపోయిన తర్వాత [ఉపదేశకుడు] నాకు దయాపూర్వకంగా చక్కని సలహా ఇచ్చాడు. నాకు నేను బిగ్గరగా చదువుకోవడం అభ్యాసం చేయమని ఆయన సూచించాడు. నేనలాగే చేశాను, నేను బైబిలు, కావలికోట పత్రిక రోజుల తరబడి బిగ్గరగా చదివాను.” ఈ వ్యక్తి ఎంతగా అభివృద్ధి సాధించాడంటే ఇప్పుడు ఆయన వందలాదిమంది, చివరికి వేలాదిమంది ప్రేక్షకుల ఎదుట బహిరంగ ప్రసంగాలిస్తున్నాడు.

సహోదరుల్లో సమానత్వం

యెహోవాసాక్షుల్లో విద్య, ఆరోగ్యం, ఆర్థిక సామాజిక హోదా వంటి విషయాలకు సంబంధించి ఎంతో వ్యత్యాసం ఉంది. ఈ తేడాలు కేవలం వారు జీవిస్తున్న లోకసంబంధమైన అపరిపూర్ణ పరిస్థితులను ప్రతిబింబిస్తాయంతే. కాని ఇతర మతగుంపులకు భిన్నంగా, వారి మధ్య నుండి జాతి, సమాజ, ఆర్థిక భేదభావాలు నిజంగా నిర్మూలించబడ్డాయి.

తాము బైబిలు నుండి నేర్చుకున్నదాన్ని అనుసరించడానికి తమకు సాధ్యమైనదంతా చేయడం ద్వారా వారు దీన్ని సాధించారు. వాళ్లు ఈ క్రింది విధమైన బైబిలు సూత్రాలను హృదయపూర్వకంగా అనుసరిస్తారు: “మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు . . . మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.” (1 సమూయేలు 16:7) “దేవుడు పక్షపాతికా[డు] . . . ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపొస్తలుల కార్యములు 10:34, 35) “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగియుండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.”—రోమీయులు 12:17, 18; 1 తిమోతి 6:17-19; యాకోబు 2:5, 9 కూడా చూడండి.

ఐక్యతను పెంపొందింపజేసే ఈ బైబిలు సూత్రాలను సన్నిహితంగా అనుసరించడం ద్వారా, యెహోవాసాక్షులు తమ మధ్య జాతి, సమాజ, లేక ఆర్థిక తేడాల మూలంగా ఏర్పడే అసమానతలు ఉండటానికి అనుమతించరు. ఉదాహరణకు, క్రైస్తవ సంఘంలో సేవాధిక్యతలను ఎవరికివ్వాలనే విషయాన్ని నిర్ణయించడంలో ఈ అంశాలు ఏవిధమైన పాత్రనూ వహించవు. బోధన, పైవిచారణ వంటి బాధ్యతాయుతమైన స్థానాలు కేవలం ఆధ్యాత్మిక అర్హతల ఆధారంగా మాత్రమే ఇవ్వబడతాయి.—1 తిమోతి 3:1-13; తీతు 1:5-9.

పక్షపాత వైఖరిగల లోకంలో అసమానతలను అనుభవించిన వ్యక్తులకు, తమ సృష్టికర్త ఎదుట తమతోపాటు సమాన స్థానం ఉన్న సహోదర సహోదరీలుగా తమతో వ్యవహరించటం ఎంత ఉపశమనాన్నిస్తుందో కదా! మార్టీనా దీన్ని ధృవీకరించగలదు. వాళ్ల నాన్న వాళ్లను వదిలి వెళ్లిపోయిన తర్వాత, ఆమె తల్లి మాత్రమే ఉన్న పేద గృహంలో పెరిగింది. ఆమె తరచు సమాజం నుండి వెలివేయబడినదానిగా వ్యవహరించబడేది, ఆమెకు ఆత్మ విశ్వాసం ఉండేదికాదు, ఇతరులతో మెలగడం ఆమెకు కష్టంగా ఉండేది. ఆమె ఉదాసీనమైన దృక్పథాన్ని అలవర్చుకుంది. అయితే, ఆమె బైబిలు పఠించనారంభించి, యెహోవాసాక్షిగా మారిన తర్వాత పరిస్థితులు మారాయి. ఆమె ఇలా చెప్తోంది: “నేను ఇప్పటికీ ప్రతికూల దృక్పథంతో పోరాడాల్సిందే, కాని ఇప్పుడు నేను సమస్యను బాగా ఎదుర్కోగల్గుతున్నాను. నా ఆత్మగౌరవం పెరిగింది, నేను ఇప్పుడు గొప్ప నమ్మకంతో మాట్లాడతాను. సత్యం నాకు బాధ్యతాయుతమైన భావాన్నిచ్చింది. యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడని, జీవితం నిజంగా జీవించదగినదని నాకిప్పుడు తెలుసు.”

ఒక అంతర్జాతీయ క్రైస్తవ గుంపుగా, 230 దేశాల్లో వున్న యెహోవాసాక్షులు, నేడు ప్రపంచంలో నిజంగా విశేషమైనదైన ఐక్యతను కొంతమేరకు అనుభవిస్తున్నారు. ఏ ఇతర మత సంస్థయైనా అలాగే చెప్పుకుని, వాస్తవాలను చూపించి దాన్ని సమర్థించుకోగలదా?

యెహోవాసాక్షులు వాస్తవ దృక్పథం గలవారే. అపరిపూర్ణ పర్యావరణ ఉత్పాదకాలుగా తాము, మానవ అసమానతను అంతరింపజేయడానికి శతాబ్దాలుగా కృషి చేసి విఫలమైపోయిన ఇతరుల్లాగే ఆ విషయంలో తామూ ఏమీ చేయలేమని వారు వెంటనే అంగీకరిస్తారు. అయినప్పటికీ, ఈ భయంకరమైన మహామారిని రూపుమాపటానికి తమ శక్తి మేరకు తాము ఎంతో చేశామని వాళ్లు ఆనందిస్తారు. దేవుని వాగ్దానమందు దృఢ విశ్వాసంతో, అసమానత ఇక గతించిన విషయమై ఉండే ఒక నీతియుక్తమైన నూతన లోకం కోసం వాళ్లు ఎదురు చూస్తారు.

అవును, విధేయులైన మానవులందరూ, తమ సృష్టికర్త తాము మొదట ఆనందించడానికి తమ కోసం సంకల్పించిన “గౌరవం విషయంలోనూ, హక్కుల విషయంలోనూ” సమానత్వాన్ని తిరిగి పొందుతారు. ఎంత చక్కని తలంపు! ఈసారి అది వాస్తవమౌతుంది!

[8వ పేజీలోని చిత్రం]

వేలాదిమందికి చదవడం వ్రాయడం నేర్పించడం ద్వారా యెహోవాసాక్షులు నిరక్షరాస్యతతో పోరాడతారు

[8వ పేజీలోని చిత్రం]

జాతి, సమాజ, ఆర్థిక దురభిమానాలను నిర్మూలించడానికి బైబిలు సత్యం సహాయం చేస్తుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి