కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 4/1 పేజీలు 20-22
  • మీ ఆలోచనాసరళిని ఎవరు మలుస్తారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ ఆలోచనాసరళిని ఎవరు మలుస్తారు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సాతాను అచ్చులోనికి దించబడుతున్నామా?
  • ఏమి జరుగుతుందో తెలుసుకోండి
  • యెహోవా మిమ్మల్ని మలుస్తున్నప్పుడు ప్రతిస్పందించండి
  • యెహోవాను మన కుమ్మరిగా గుర్తిస్తూ కృతజ్ఞత చూపిద్దాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • యెహోవా ఇచ్చే క్రమశిక్షణ మిమ్మల్ని మలచనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • “మీ ఆలోచనలను, మీ ప్రవర్తనను మలిచేలా యెహోవాకు అవకాశం ఇవ్వండి”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • మీ మనసు చేసే పోరాటంలో గెలవండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 4/1 పేజీలు 20-22

మీ ఆలోచనాసరళిని ఎవరు మలుస్తారు?

“ఏమి ఆలోచిస్తాను ఏమి చేస్తాను అన్నది నా ఇష్టం, ఒకరు నాకు చెప్పనవసరం లేదు!” అంత గట్టిగా ఎవరైనా చెప్పారంటే దానర్థం తనమీదా, తన నిర్ణయాలమీదా తనకు పూర్తి నమ్మకం ఉందీ అని. మీరు కూడా అలాగే భావిస్తారా? ఒకటి మాత్రం నిజం, మీకు సంబంధించిన నిర్ణయాలను మీరే చేయాలి అవి ఇతరులు చేయకూడదు. కానీ మంచి సలహా అని తర్వాత రుజువయ్యే సలహాల్ని నిర్ద్వందంగా తృణీకరించడం జ్ఞానవంతమేనా? మీరు జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఎవరూ ఎన్నడూ సహాయం చేయలేరా? ఏదేమైనా, మీకు అసలు ఏమాత్రం తెలియకుండానే మీ ఆలోచనల్ని ఎవరూ మలచడంలేదని మీరు పూర్తి నిశ్చయంతో ఉండగలరా?

ఉదాహరణకు రెండవ ప్రపంచ యుద్ధానికి పూర్వం, హిట్లర్‌ ప్రభుత్వంలో ప్రచారాల మంత్రి అయిన యోసఫ్‌ గోబెల్స్‌ జర్మనీలోని చిత్ర పరిశ్రమను అదుపులోనికి తీసుకున్నాడు. ఎందుకని? ఎందుకంటే, “ప్రజల నమ్మకాల్నీ తద్వారా వారి ప్రవర్తననూ ప్రభావితం” చేయగల మహా గొప్ప ఆయుధాన్ని చిత్ర పరిశ్రమ తన చేతుల్లో పెడుతుందని ఆయన గ్రహించాడు. (ప్రాపగాండా అండ్‌ ద జర్మన్‌ సినిమా 1933-1945) ఆయన ఈ పద్ధతినీ మరిన్ని ఇతర విధానాలనూ, సామాన్య ప్రజానీకం—సామాన్యులైన ప్రజలూ ఆలోచించే ప్రజలూ—నాజీ ఫిలాసఫీని గ్రుడ్డిగా అనుసరించేలా ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో ఎంత ప్రభావవంతంగా ఉపయోగించాడో బహుశ మీకు తెలిసే ఉంటుంది.

వాస్తవం ఏమిటంటే, మీరు ఎవరు చెప్పేదైతే వింటున్నారో ఆ వ్యక్తుల భావాలూ దృక్పథాలూ మీ ఆలోచనా సరళినీ తద్వారా మీరు ప్రవర్తించే విధానాన్నీ ఏదో ఒక రీతిలో ఎల్లప్పుడూ ప్రభావితం చేస్తాయి. అయితే ఇది అవాంఛనీయమైనదనేమీ కాదు. మీకు చెప్పే వ్యక్తులు—మీ టీచర్లు, స్నేహితులు, లేక తల్లిదండ్రులుమల్లే—మీ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే ప్రజలైతే అప్పుడు వారి సలహాల నుండీ ఉపదేశం నుండీ మీరు చాలా ప్రయోజనం పొందుతారు. కానీ ఒకవేళ వాళ్లు కేవలం తమ స్వప్రయోజనాల్నే దృష్టిలో పెట్టుకుని, తామే వక్రమార్గంలో వెళ్తున్నట్లైతే లేదా తమ ఆలోచనా విధానంలో భ్రష్టుపట్టి ఉన్నట్లైతే, అపొస్తలుడైన పౌలు వర్ణించినట్లుగా వాళ్ళు “మోసపుచ్చువారు” అయినట్లైతే, మరి జాగ్రత్త!—తీతుకు 1:10; ద్వితీయోపదేశకాండము 13:6-8.

కాబట్టి, ఎవ్వరూ మిమ్మల్ని ఎన్నడూ ప్రభావితం చేయలేరని అతినమ్మకంతో ఉండకండి. (పోల్చండి 1 కొరింథీయులు 10:12.) అసలు చెప్పాలంటే ఇప్పటికే మీరు ప్రభావితం అవుతుండవచ్చు—మీరు ఊహించగలదానికన్నా తరచుగా—మీ గ్రహింపుకు అందకుండానే మీరు ప్రభావితులయ్యే అవకాశం చాలా ఉంది. ఒక చిన్న ఉదాహరణగా మీరు షాపింగ్‌కి వెళ్లినప్పుడు ఏ కంపెనీ ఉత్పాదన కొనాలనే విషయమే తీసుకోండి. అది మీరు పూర్తిగా సొంతంగా తీసుకున్న నిర్ణయమేనా, హేతుబద్ధంగా తీసుకున్నదేనా? లేదా ఇతరులు బహుశ మీరు చూడని వ్యక్తులు మీ ప్రమేయం లేకుండానే చాలా శక్తిమంతంగా మీరు తీసుకునే నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నారా? జరుగుతున్నదదేనని పరిశోధనాత్మక విలేఖరి అయిన ఎరిక్‌ క్లార్క్‌ భావిస్తున్నాడు: “మనం ఎంత ఎక్కువగా వ్యాపార ప్రకటనల జోరుకు గురౌతామో అంత తక్కువగా వాటి ప్రభావాన్ని గుర్తిస్తాము, అయినప్పటికీ నిశ్చయంగా అంత ఎక్కువగా మనం ప్రభావితమౌతాము” అని ఆయన అంటున్నాడు. వ్యాపార ప్రకటనలు ఎంత ప్రభావవంతమైనవని మీరనుకుంటున్నారు అని ప్రజల్ని అడిగినప్పుడు, “అవి ప్రజల మనస్సుల మీద బాగానే పనిచేస్తాయి అని చాలామంది ఒప్పుకుంటున్నారు గానీ, తమ దగ్గర పనిచేయవని అంటున్నారు” అని కూడా ఆయన నివేదిస్తున్నాడు. తను తప్ప మిగతా వారందరూ ఆ ప్రభావానికి గురౌతారని భావించడానికే ప్రజలు మొగ్గుచూపుతారు. “తమకు మాత్రమే ప్రభావాన్ని ఆపగల శక్తి ఉన్నట్లు అన్పిస్తుంది.”—ద వాంట్‌ మేకర్స్‌.

సాతాను అచ్చులోనికి దించబడుతున్నామా?

మీరు ప్రతిదినం చూసే వినే వ్యాపార ప్రకటనలకు ప్రభావం చెందినా చెందకపోయినా, అది అంత గంభీరమైన పరిణామాలకు దారితీయకపోవచ్చు. అయితే అంతకన్నా ఎంతో ప్రమాదకరమైన ప్రభావం ఒకటి ఉంది. సాతాను మహా గొప్ప మోసగాడు అని బైబిలు స్పష్టంగా చూపిస్తుంది. (ప్రకటన 12:9) ఆతని తత్త్వమూ, ఒక ప్రకటనా సంస్థ ఏజెంటు ఆలోచనా విధానమూ ప్రాథమికంగా ఒకటే. ఈ ఏజెంటు వినియోగదారుల్ని ప్రభావితం చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి అంటున్నాడు—“వారిని ప్రలోభపెట్టడం లేదా వారిని మన మూసలోనికి లాగడం.” మీ ఆలోచనా సరళిని మలచడానికి ప్రచారకులూ, వ్యాపార ప్రకటనాదారులే అంతటి మోసకరమైన టెక్నిక్కులు ఉపయోగిస్తుంటే అలాంటి కుయుక్తుల్ని ఉపయోగించడంలో సాతాను ఇంకా ఎంత నిపుణుడై ఉండాలి!—యోహాను 8:44.

అపొస్తలుడైన పౌలుకు ఇది తెలుసు. తన తోటి క్రైస్తవుల్లో కొందరు అప్రమత్తంగా ఉండక సాతాను ఎరకు బలి అవుతారేమోనని ఆయన భయపడ్డాడు. “సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళతనుండియు పవిత్రతనుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను” అని ఆయన వ్రాశాడు. (2 కొరింథీయులు 11:3) ఆ హెచ్చరికను గంభీరంగా తీసుకోండి. లేకపోతే మీరు కూడా—ఈ ప్రచారాలూ ఆలోచనా విధానాన్ని మలచడాలూ బాగానే పనిచేస్తాయి గానీ ‘నా దగ్గర పనిచేయవు’ అనుకునే ప్రజల్లా ఉంటారు. సాతాను ప్రచారం నిజంగానే పనిచేస్తుందన్న వాస్తవానికి రుజువును, మన చుట్టూ ఎటు చూసినా ఈ తరానికే మారుపేరుగా ఉన్న క్రూరత్వం, నీచత్వం, వేషధారణ వంటి వాటిలో చూడవచ్చు.

అందుకని పౌలు తన తోటి క్రైస్తవుల్ని “ఈ లోక మర్యాదను అనుసరింపక”యుండమని అర్థించాడు. (రోమీయులు 12:2) ఒక బైబిలు అనువాదకుడు పౌలు చెప్పినదాన్ని మరో మాటలో ఇలా చెప్పాడు: “మిమ్మల్ని దాని స్వంత మూసలోనికి లాగేందుకు మీ చుట్టూ ఉన్న లోకాన్ని అనుమతించకండి.” (రోమీయులు 12:2, ఫిలిప్స్‌) పాతకాలపు కుమ్మరి అచ్చుకు ఉన్న నొక్కులూ చిత్రాలూ జిగటమన్ను మీద పడేలా జిగటమన్నును అచ్చులోనికి నొక్కినట్లు, సాతాను తన అచ్చులోనికి నొక్కడానికి ఏమైనా ప్రయత్నిస్తాడు. అలా చేయడానికి సాతాను దగ్గర ఈ లోకపు రాజకీయ, వాణిజ్య, మత, వినోద వ్యవస్థలన్నీ సిద్ధంగా ఉన్నాయి. వాడి ప్రభావం అసలు ఎంతగా వ్యాప్తిచెంది ఉంది? అది అపొస్తలుడైన యోహాను కాలంలో ఎంత వ్యాపించి ఉందో నేడు కూడా అంతే వ్యాపించి ఉంది. ‘లోకమంతయు దుష్టునియందున్నది’ అని యోహాను అన్నాడు. (1 యోహాను 5:19; 2 కొరింథీయులు 4:4 కూడా చూడండి.) ప్రజల్ని ప్రలోభపర్చి, వారి ఆలోచనా విధానాన్ని భ్రష్టుపరచే విషయంలో సాతానుకున్న సామర్థ్యం గురించి మీకేమైనా సందేహాలున్నట్లైతే, దేవునికి సమర్పించుకున్న పూర్తి ఇశ్రాయేలు జనాంగాన్నే ఆయన ఎంత ప్రభావవంతంగా ప్రలోభంలో పడవేశాడో గుర్తుతెచ్చుకోండి. (1 కొరింథీయులు 10:6-12) మీకు అలాంటిదే జరుగగలదా? ప్రలోభపెట్టే సాతాను ప్రభావానికి మీరు మీ మనస్సును వదిలేస్తే అలానే జరుగగలదు.

ఏమి జరుగుతుందో తెలుసుకోండి

సామాన్యంగా, అటువంటి భ్రష్టుపట్టించే శక్తుల్ని మీరు అనుమతిస్తేనే అవి మీ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తాయి. ద హిడెన్‌ పర్సువేడర్స్‌ అనే తన పుస్తకంలో వాన్స్‌ పాకర్డ్‌ ఈ విషయాన్నే వ్యక్తం చేశాడు: “అటువంటి [తెరవెనుక ఉండి] ఒప్పించేవారిని ఎదిరించే అవకాశం మనకు ఇప్పటికీ ఉంది: మనం ఒప్పించబడకూడదని ఎంపిక చేసుకోవచ్చు. దాదాపు అన్ని పరిస్థితుల్లోనూ మనకు ఇంకా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది, అంతేకాదు అసలు ఏమి జరుగుతుందో మనకు తెలిస్తే మరీ ఘోరంగా మోసపోము.” ప్రచారం విషయంలోను కుయుక్తికి బలయ్యే విషయంలోను ఇది వాస్తవమే.

నిజమే, ‘అసలు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి’ మీరు మంచి ప్రభావాలను అనుమతించడానికి మీ మనస్సుల్ని సంసిద్ధంచేయండి. ఒక ఆరోగ్యకరమైన శరీరంలాగానే ఒక ఆరోగ్యకరమైన మనస్సు కూడా బాగా పనిచేయాలంటే దాన్ని చక్కగా పోషించాలి. (సామెతలు 5:1, 2) తప్పుడు సమాచారం ఎంత ప్రాణాంతకమో, సమాచారం తెలియకపోవడం కూడా అంతే ప్రాణాంతకం. కాబట్టి మీ మనస్సుల్ని తప్పుదారి పట్టించే తలంపులూ, తత్త్వాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నది నిజమే అయినా, మీరు పొందే సలహాలన్నింటినీ, మీకు అందే సమాచారమంతటినీ పచ్చకామెర్లు ఉన్నవాడి దృష్టితో లేదా రంధ్రాన్వేషి దృష్టితో చూడనవసరం లేదు.—1 యోహాను 4:1.

నిజాయితీగా ఒప్పించడానికి చేసే ప్రయత్నం ప్రచారంలాంటిది కాదు. ‘ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోయే దుర్జనులూ వంచకుల’ విషయమై జాగ్రత్తగా ఉండుమని అపొస్తలుడైన పౌలు యౌవనుడైన తిమోతిని హెచ్చరించాడన్నది నిజమే. కానీ ఆయన ఇంకా ఇలా జతచేశాడు: “నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి [“ఒప్పించబడిన విషయాలు,” NW] యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని వాటియందు నిలుకడగా ఉండుము.” (2 తిమోతి 3:13-14) మీ మనస్సులోనికి తీసుకునే ప్రతీదీ మిమ్మల్ని కొంతమేరకు ప్రభావితం చేస్తుంది గనుక, ‘మీరు నేర్చుకొన్న విషయాలు ఎవరివలన నేర్చుకున్నారో తెలుసుకోవడం’ కీలకమైన విషయం. అంటే, మీకు నేర్పిన వ్యక్తులు తమ స్వప్రయోజనాల్ని కాక మీ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే వ్యక్తులేనా అని నిశ్చయపర్చుకోవాలి.

ఎంపిక మీదే. ఈ లోకపు తత్త్వాలూ విలువలూ మీపైనా, మీ ఆలోచనలపైనా ప్రభుత్వం చేసేలా అనుమతించడంద్వారా ‘ఈ లోక మర్యాదను అనుసరించాలని’ మీరు ఎంపిక చేసుకోవచ్చు. (రోమీయులు 12:2) కానీ ఈ లోకం మీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోదు. అందుకనే పౌలు “మనుష్యుల పారంపర్యాచారమును . . . అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి” అని హెచ్చరిస్తున్నాడు. (కొలొస్సయులు 2:8) ఈ విధంగా సాతాను మూసలోనికి లాగబడడం, లేదా ‘చెరపట్టుకొని పోబడడం’ జరగడానికి మన పక్షంగా ఏ ప్రయత్నం అవసరం లేదు. అది ప్రక్కవాడు త్రాగి విడిచిన పొగలాంటిది. మీరు ఆ పొగతో కలుషితమైన గాలిని కేవలం పీల్చడం ద్వారానే ప్రమాదానికి లోనౌతారు.

అయితే, మీరు ఆ “వాయు”వును పీల్చకుండా కూడా ఉండగలరు. (ఎఫెసీయులు 2:2) అందుకు పౌలు సలహాను పాటించండి: “ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.” (రోమీయులు 12:2) దీనికి మన పక్షంగా ప్రయత్నం అవసరం. (సామెతలు 2:1-5) గుర్తుంచుకోండి యెహోవా మోసగించే వ్యక్తికాడు. అవసరమైన సమాచారాన్నంతటినీ ఆయన అందుబాటులో ఉంచుతాడు, కానీ దాన్నుండి ప్రయోజనం పొందాలంటే మీరు దాన్ని విని, అది మీ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేయడానికి అనుమతించాలి. (యెషయా 30:20, 21; 1 థెస్సలొనీకయులు 2:13) దేవుని ప్రేరేపిత వాక్యమైన బైబిలులో, అంటే “పరిశుద్ధలేఖనముల”లో ఉన్న సత్యంతో మీ మనస్సులను నింపుకోవడం తప్పనిసరి.—2 తిమోతి 3:15-17.

యెహోవా మిమ్మల్ని మలుస్తున్నప్పుడు ప్రతిస్పందించండి

యెహోవా యొక్క మలిచే ప్రభావం నుండి ప్రయోజనం పొందాలంటే మీ పక్షంగా ఇష్టపూర్వకమైన, విధేయతాపూర్వకమైన ప్రతిస్పందన అవసరం అన్న విషయం ఒక కుమ్మరి యొక్క పనిస్థలాన్ని సందర్శించమని ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా చెప్పినప్పుడు చాలా శక్తిమంతంగా దృష్టాంతపర్చబడింది. యిర్మీయా కుమ్మరి దగ్గరికి వెళ్లినప్పుడు, ఆ కుమ్మరి తయారు చేయడానికి ప్రయత్నిస్తున్న కుండ “వాని చేతిలో విడిపోగా,” దాన్నేం చేయాలన్న విషయంలో తన మనస్సు మార్చుకోవడాన్ని చూస్తాడు. అప్పుడు యెహోవా ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలువారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? . . . జిగటమన్ను కుమ్మరిచేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలువారలారా, మీరు నా చేతిలో ఉన్నారు.” (యిర్మీయా 18:1-6) దీనర్థం ఇశ్రాయేలు ప్రజలు, యెహోవా చేతిలో ఒకదానిలా కాకపోతే మరోదానిలా ఇష్టంవచ్చినట్లు మలచగల నిర్జీవమైన జిగటమంటి ముద్దవంటివారు మాత్రమే అనా?

ప్రజలు తమ చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించేలా చేయడానికి యెహోవా ఎన్నడూ తన అత్యున్నతమైన శక్తిని ఉపయోగించడు; ఒక మానవ కుమ్మరి లోపమున్న వస్తువులకు బాధ్యుడైనట్లు, ఆయన బాధ్యుడూ కాదు. (ద్వితీయోపదేశకాండము 32:4) యెహోవా తాను ఎవరినైనా ఒక సరైన విధంగా మలచడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఆయన నిర్దేశాన్ని ఎదిరించినప్పుడు లోపాలు ఏర్పడతాయి. మీకూ నిర్జీవమైన జిగటమన్ను ముద్దకూ ఉన్న ఒక పెద్ద తేడా అదే. మీకు స్వేచ్ఛా చిత్తం ఉంది. దాన్ని ఉపయోగిస్తూ, మిమ్మల్ని మలుస్తున్న యెహోవా ప్రభావానికి మీరు ప్రతిస్పందించాలనైనా ఎంపికచేసుకోవచ్చు, ఉద్దేశపూర్వకంగా దాన్ని తృణీకరించాలనైనా ఎంపిక చేసుకోవచ్చు.

ఎంతటి గంభీరమైన పాఠం! ‘ఏమి చెయ్యాలో ఎవ్వరూ చెప్పనవసరం లేదు’ అని అహంభావంతో ఖండితంగా చెప్పడానికి బదులుగా యెహోవా స్వరాన్ని వినడం ఎంత శ్రేష్ఠం! యెహోవా మార్గదర్శక ప్రభావం మనందరికీ అవసరం. (యోహాను 17:3) కీర్తనల గ్రంథకర్త అయిన దావీదులా ఉండండి, “యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచుము” అన్నాడాయన. (కీర్తన 25:4) రాజైన సొలొమోను ఏమన్నాడో గుర్తుతెచ్చుకోండి: “జ్ఞానముగలవాడు విని మరిన్ని నిర్దేశాలను తీసుకుంటాడు.” (సామెతలు 1:5, NW) మరి వింటారా మీరు? సామెతలు 2:11 చెబుతున్నట్లుగా అప్పుడు, ‘బుద్ధి మిమ్మల్ని కాపాడుతుంది వివేచన మీకు కావలికాస్తుంది’—మీరు వింటే.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి