కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 5/15 పేజీలు 10-15
  • క్రైస్తవ విశ్వాసం పరీక్షించబడుతుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రైస్తవ విశ్వాసం పరీక్షించబడుతుంది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • విశ్వాసం పరీక్షించబడింది—ఎందుకు?
  • 1914కు సంబంధించి విశ్వాసం పరీక్షించబడింది
  • అప్పుడు ఎదురైన పరీక్షలకు ప్రతిస్పందన
  • మీ విశ్వాస నాణ్యత—ఇప్పుడు పరీక్షించబడుతోంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • రాజ్యం పరలోకంలో స్థాపించబడింది
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • “అద్భుతమైన కళాఖండం”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • ప్రకటించడానికి ఉపయోగించిన పద్ధతులు—ప్రజల్ని చేరుకోవడానికి వీలైన ప్రతీ పద్ధతిని ఉపయోగించడం
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 5/15 పేజీలు 10-15

క్రైస్తవ విశ్వాసం పరీక్షించబడుతుంది

“విశ్వాసము అందరికి లేదు.”—2 థెస్సలొనీకయులు 3:2.

1. అందరికీ యథార్థమైన విశ్వాసం లేదని చరిత్ర ఎలా చూపించింది?

చరిత్రంతటిలోనూ యథార్థమైన విశ్వాసంగల స్త్రీలూ పురుషులూ పిల్లలూ ఉన్నారు. “యథార్థమైన” అనే విశేషణం యుక్తమైనది ఎందుకంటే కోట్లాదిమంది ఇతరులు మాన్యమైన ఆధారము లేక కారణము లేకుండానే విశ్వసించేందుకు సుముఖత కలిగివుండటం అంటే సులభంగా నమ్మడం వంటి విధమైన విశ్వాసాన్ని ప్రదర్శించారు. అటువంటి విశ్వాసంలో తరచూ, సర్వశక్తిమంతుడైన యెహోవా చిత్తానికీ బయల్పర్చబడిన ఆయన వాక్యానికీ అనుగుణ్యంగా లేని అబద్ధ దేవతలూ లేక ఆరాధనావిధానాలు ఇమిడివున్నాయి. అందుకే అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “విశ్వాసము అందరికి లేదు.”—2 థెస్సలొనీకయులు 3:2.

2. మనం మన స్వంత విశ్వాసాన్ని పరీక్షించుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

2 పౌలు చేసిన వ్యాఖ్యానం, అప్పట్లో కొందరికి యథార్థమైన విశ్వాసం ఉండినదనీ మరి అన్వయింపు ద్వారా నేడు కూడా కొందరికి ఉందనీ సూచిస్తుంది. అటువంటి యథార్థమైన విశ్వాసాన్ని అంటే దైవిక సత్యపు కచ్చితమైన జ్ఞానానికి అనుగుణ్యమైన విశ్వాసాన్ని కలిగివుండి దానిని వృద్ధి చేసుకోవాలని ఈ పత్రిక యొక్క పాఠకులు అనేకులు కోరుకుంటారు. (యోహాను 18:37; హెబ్రీయులు 11:6) మీరు కూడా అలాగే కోరుకుంటున్నారా? మీ విశ్వాసం పరీక్షించబడుతుందనే వాస్తవాన్ని మీరు గుర్తించి దాని కొరకు సిద్ధపడి ఉండాలన్నది తప్పనిసరి. అలాగని ఎందుకు చెప్పవచ్చు?

3, 4. విశ్వాస పరీక్షల విషయంలో మనం యేసు వైపు ఎందుకు చూడాలి?

3 మన విశ్వాసానికి యేసుక్రీస్తు కేంద్రమని మనం అంగీకరించాల్సిందే. వాస్తవానికి, ఆయన మన విశ్వాసానికి కర్తయని బైబిలు ఆయనను గురించి చెబుతోంది. అది యేసు చెప్పిన, చేసిన విషయాలను బట్టి, ప్రాముఖ్యంగా ఆయన ప్రవచనాలను నెరవేర్చిన విధానాన్నిబట్టి అది అలా అయివుంది. మానవులు నిజమైన విశ్వాసాన్ని స్థాపించేందుకు అవసరమయ్యే ఆధారాన్ని ఆయన బలపర్చాడు. (హెబ్రీయులు 12:2; ప్రకటన 1:1, 2) అయినప్పటికీ, యేసు “సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను” అని మనం చదువుతాం. (హెబ్రీయులు 4:15) అవును, యేసు విశ్వాసం పరీక్షించబడింది. అది మనల్ని నిరుత్సాహపర్చడానికి బదులు లేక మనకు దిగులు కలిగించడానికి బదులు, అది మనకు ఓదార్పునివ్వాలి.

4 తీవ్ర శ్రమలను అనుభవించినప్పుడు చివరికి హింసా కొయ్యపై మరణాన్ని అనుభవించే పరిస్థితి వచ్చినప్పుడు కూడా యేసు “విధేయతను నేర్చుకొనెను.” (హెబ్రీయులు 5:8) మానవులపై ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ వారు యథార్థమైన విశ్వాసానికి అనుగుణ్యంగా జీవించగలరని ఆయన నిరూపించాడు. “దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి” అని యేసు తన అనుచరులను గురించి చెప్పిన విషయాలను మనం ఆలోచించినప్పుడు ఇది ప్రత్యేకంగా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. (యోహాను 15:20) వాస్తవానికి, మన కాలంలో ఉండబోయే తన అనుచరులను గురించి, యేసు ఇలా ప్రవచించాడు: “మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.”—మత్తయి 24:9.

5. మనం పరీక్షలను ఎదుర్కుంటామని లేఖనాలు ఎలా సూచిస్తున్నాయి?

5 ఈ శతాబ్దం తొలి భాగంలో, దేవుని గృహంతో తీర్పు ప్రారంభమైంది. లేఖనాలు ఇలా ప్రవచించాయి: “తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు?”—1 పేతురు 4:17, 18.

విశ్వాసం పరీక్షించబడింది—ఎందుకు?

6. పరీక్షించబడిన విశ్వాసం ఎందుకు విలువైనది?

6 ఒక భావంలో, పరీక్షించబడని విశ్వాసానికి ఎలాంటి నిరూపిత విలువా లేదు, దాని నాణ్యత ఎలాంటిదో తెలియకుండా ఉండిపోతుంది. ఇంకా డ్రా చేయని చెక్కుతో మీరు దాన్ని పోల్చవచ్చు. మీరు చేసిన పనికో, మీరు అందించిన వస్తువులకో లేక ఒక కానుకగానో మీరు ఒక చెక్కును అందుకుని ఉండవచ్చు. ఆ చెక్కు విలువైన దానిగా కనిపించవచ్చు, అయితే అది నిజంగా విలువైనదేనా? దానిపై కనిపించే మొత్తానికున్న విలువను అది నిజంగా కలిగి ఉంటుందా? అదే విధంగా, మన విశ్వాసం కేవలం పైపై ఆకారం లేక ఒప్పుకోలు మాత్రమే అయివుండకూడదు. దానికి సత్తా ఉందనీ, అది నిజమైన నాణ్యతను కలిగివుందనీ మనం నిరూపించాలనుకుంటే అది పరీక్షించబడాలి. మన విశ్వాసం పరీక్షించబడినప్పుడు, అది దృఢంగానూ విలువైనదానిగానూ ఉందని మనం కనుగొనవచ్చు. మన విశ్వాసం ఏదైనా రంగాల్లో శుద్ధి చేయబడవలసి ఉంటే లేక బలపర్చబడవలసి ఉంటే ఆ విషయాలను కూడా ఒక పరీక్ష బయల్పర్చవచ్చు.

7, 8. మన విశ్వాసం యొక్క పరీక్షలు ఏ మూలంనుండి వస్తాయి?

7 మనం హింసకు గురయ్యేందుకూ, మన విశ్వాసానికి ఇతర పరీక్షలూ వచ్చేందుకూ దేవుడు అనుమతిస్తాడు. మనమిలా చదువుతాము: “దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు—నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు.” (యాకోబు 1:13) అలాంటి పరీక్షలకు ఎవరు లేక ఏది కారణం? అది సాతాను, ఈ ప్రపంచం మరియు మన స్వంత అపరిపూర్ణ శరీరం.

8 సాతాను ఈ లోకంపైనా, దాని ఆలోచనావిధానంపైనా దాని మార్గాలపైనా శక్తివంతమైన ప్రభావాన్ని చూపిస్తాడని మనం అంగీకరిస్తుండవచ్చు. (1 యోహాను 5:19) క్రైస్తవులకు విరుద్ధంగా హింసను పురికొల్పుతాడని మనకు బహుశ తెలిసే ఉండవచ్చు. (ప్రకటన 12:17) అయితే, మనం గాలానికి చిక్కుకుపోతామనీ దేవునికి అవిధేయులమౌతామనీ చివరకు యెహోవా యొక్క అనంగీకారానికి గురౌతామనీ నిరీక్షిస్తూ, ప్రాపంచిక ఆకర్షణలను మన కళ్ళ ముందు ఆడిస్తూ, మన అపరిపూర్ణ శరీరాన్ని మభ్యపెట్టడం ద్వారా మనలను తప్పుదోవపట్టించేందుకు సాతాను ప్రయత్నిస్తాడని కూడా మనం పూర్తిగా ఒప్పించబడి ఉన్నామా? యేసును శోధించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు కూడా సాతాను అదే కుతంత్రాలను ఉపయోగించాడు గనుక అతడి పద్ధతులు మనకు ఆశ్చర్యాన్ని కలిగించకూడదు.—మత్తయి 4:1-11.

9. విశ్వాస మాదిరుల నుండి మనమెలా ప్రయోజనం పొందగలము?

9 తన వాక్యం ద్వారా, క్రైస్తవ సంఘం ద్వారా, మనం అనుకరించగల విశ్వాసపు అనుకూల మాదిరులను యెహోవా మన కళ్ళెదుట ఉంచుతాడు. పౌలు ఇలా సలహా ఇచ్చాడు: “సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి; మేము మీకు మాదిరియైయున్న ప్రకారము నడుచుకొనువారిని గురిపెట్టి చూడుడి.” (ఫిలిప్పీయులు 3:17) పౌలు అనేక తీవ్రమైన పరీక్షలను అనుభవించినప్పటికీ, దేవుని మొదటి శతాబ్దపు అభిషిక్త సేవకుల్లో ఒకడిగా ఆయన విశ్వాస క్రియలను చేయడంలో నాయకత్వం వహించాడు. 20వ శతాబ్దపు అంతంలో, అదే విధమైన మాదిరుల విషయంలో మనకు కొరతేమీ లేదు. హెబ్రీయులు 13:7 నందలి మాటలు, పౌలు వాటిని వ్రాసినప్పుడు ఎంత శక్తివంతంగా అన్వయించబడ్డాయో నేడు కూడా అంతే శక్తివంతంగా అన్వయించబడుతున్నాయి: “మీకు దేవుని వాక్యము బోధించి, మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి.”

10. ఇటీవలి సమయాల్లో విశ్వాసం యొక్క ఏ ప్రాముఖ్యమైన మాదిరులను మనం కలిగివున్నాము?

10 అభిషిక్త శేషం యొక్క ప్రవర్తన ఎలాంటి ఫలితాలను కలిగివుందో మనం పరిశీలించినప్పుడు, ఆ సలహా మరింత శక్తివంతంగా ఉంటుంది. మనం వారి మాదిరిని శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసాన్ని అనుకరించగలం. వారిది పరీక్షల ద్వారా మెరుగుపర్చబడిన యథార్థమైన విశ్వాసం. వెనుకటికి 1870లలో చిన్న ప్రారంభాలతో మొదలై, ఒక ప్రపంచవ్యాప్త క్రైస్తవ సహోదరత్వం వృద్ధి చెందింది. అప్పటినుండీ అభిషిక్తులు చూపిన విశ్వాసమూ సహనముల ప్రతిఫలంగా, ఏభై ఐదు లక్షలకంటే ఎక్కువమంది యెహోవా యొక్క సాక్షులు దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించి బోధిస్తున్నారు. ఆసక్తిగల సత్యారాధకుల ప్రస్తుత భూగోళవ్యాప్త సంఘం, పరీక్షించబడిన విశ్వాసానికి ఒక సాక్ష్యాధారం.—తీతు 2:14.

1914కు సంబంధించి విశ్వాసం పరీక్షించబడింది

11. సి. టి. రస్సెల్‌కూ ఆయన సహవాసులకూ 1914 ఎలా ప్రాముఖ్యమైనదిగా ఉంది?

11 మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యేందుకు చాలా సంవత్సరాల ముందే, బైబిలు ప్రవచనంలో 1914 ఎంతో ప్రాముఖ్యమైన తేదీ అవుతుందని అభిషిక్త శేషం ప్రకటిస్తూ వచ్చింది. అయితే, వారి అపేక్షల్లో కొన్ని సమయానికి తగినవి కాకుండినవి, మరి ఏమి సంభవించబోతుందనే దాని గురించి వారు అనుకున్నవి పూర్తిగా సరైనవి కాదు. ఉదాహరణకు, వాచ్‌టవర్‌ సొసైటీ యొక్క మొదటి అధ్యక్షుడైన సి. టి. రస్సెల్‌ మరియు ఆయన సహవాసులు ఎంతో గొప్ప ప్రకటనాపని అవసరమని గ్రహించగలిగారు. వారిలా చదివారు: “మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:14) చూస్తే ఎంతో చిన్నదిగా కనిపించే వారి గుంపు ఎప్పటికైనా ఆ పనిని ఎలా చేయగలదు?

12. రస్సెల్‌ యొక్క ఒక సహవాసి బైబిలు సత్యం ఎడల ఎలా ప్రతిస్పందించాడు?

12 రస్సెల్‌ యొక్క ఒక సహవాసియైన ఎ. హెచ్‌. మాక్‌మిలన్‌ను ఇది ఎలా ప్రభావితం చేసిందో గమనించండి. కెనడాలో జన్మించిన మాక్‌మిలన్‌ ది ప్లాన్‌ ఆఫ్‌ ది ఏజెస్‌ (1886) పుస్తకాన్ని రస్సెల్‌నుండి తీసుకున్నప్పుడు ఆయనకు ఇంకా ఇరవై ఏళ్ళు కూడా నిండలేదు. (ది డివైన్‌ ప్లాన్‌ ఆఫ్‌ ది ఏజెస్‌ అని కూడా పిలువబడిన ఈ పుస్తకం, స్టడీస్‌ ఇన్‌ ది స్క్రిప్చర్స్‌ అనే విరివిగా పంచిపెట్టబడిన సెట్‌లోని మొదటి సంపుటి అయ్యింది. ది టైమ్‌ ఈజ్‌ ఎట్‌ హ్యాండ్‌ [1889] అనే రెండవ సంపుటి, 1914ను “అన్యజనముల కాలములు” ముగిసే సంవత్సరం అని సూచించింది. [లూకా 21:24]) మాక్‌మిలన్‌ దాన్ని చదవడం ప్రారంభించిన రాత్రే, “చూస్తుంటే, ఇదే సత్యం అనిపిస్తుంది” అని ఆయన అనుకున్నాడు! మరి 1900 వేసవిలో, బైబిలు విద్యార్థుల—యెహోవాసాక్షులు అప్పట్లో అలా పిలువబడేవారు—ఒక సమావేశంలో ఆయన రస్సెల్‌ను కలిశాడు. త్వరలోనే మాక్‌మిలన్‌ బాప్తిస్మం పొందాడు, మరి న్యూయార్క్‌ నందలి సొసైటీ ముఖ్య కార్యాలయంలో బ్రదర్‌ రస్సెల్‌తోపాటూ పని చేయడం ప్రారంభించాడు.

13. మత్తయి 24:14 యొక్క నెరవేర్పు విషయంలో మాక్‌మిలన్‌ మరియు ఇతరులు ఏ సమస్యను చూశారు?

13 బైబిలునుండి వారు చదివిన వాటి ఆధారంగా, ఆ అభిషిక్త క్రైస్తవులు 1914ను దేవుని సంకల్పంలో ఒక నిర్ణయాత్మకమైన సమయమని సూచించారు. అయితే, మత్తయి 24:14నందు ప్రవచించబడిన విధంగా జనాంగాలకు ప్రకటించే పనిని మిగిలివున్న అంత తక్కువ సమయంలో ఎలా సాధించవచ్చని మాక్‌మిలన్‌ మరియు ఇతరులు ఆలోచించారు. ఆయన తర్వాత ఇలా చెబుతున్నాడు: “ఈ విషయాన్ని గురించి బ్రదర్‌ రస్సెల్‌తో నేను తరచుగా మాట్లాడటం నాకు జ్ఞాపకముంది, అయితే ‘చూడండి, బ్రదర్‌, జెరూసలేమ్‌లోకంటే ఇక్కడ న్యూయార్క్‌లోనే ఎక్కువమంది యూదులున్నారు. డబ్లిన్‌లోకంటే ఇక్కడ ఎక్కువమంది ఐరిష్‌వాళ్ళున్నారు. మరి రోమ్‌లోకంటే ఇక్కడే ఎక్కువమంది ఇటలీవారున్నారు. మనం ఇక్కడున్న వాళ్లను అందరినీ చేరుకోగలిగితే, మనం వర్తమానంతో ప్రపంచాన్ని అంతటినీ చేరుకున్నట్లే’ అని ఆయన చెప్పేవాడు. అయితే అది మా మనస్సులను సంతృప్తిపర్చినట్లు అనిపించలేదు. తర్వాత ‘ఫోటో-డ్రామా’ను గురించి ఆలోచించడం జరిగింది.”

14. 1914కు ముందు ఏ గణనీయమైన ప్రాజెక్టు చేపట్టబడింది?

14 “ఫోటో-డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌” అనేది ఎంత వినూత్నమైన పని! అది కదిలే చిత్రాలనూ (మోషన్‌ పిక్చర్‌) రంగులు వేసిన గాజు స్లైడ్‌లనూ కలిగి ఉండేది, దానికి అనురూపంగా ఫోనోగ్రాఫ్‌పై బైబిలు ప్రసంగాలూ సంగీతమూ రికార్డు చేయబడ్డాయి. మరి అమెరికా నందలి అర్కాన్‌సాస్‌లో జరిగిన ఒక సమావేశాన్ని గురించి 1913లో కావలికోట (ఆంగ్లం) ఇలా చెప్పింది: “బైబిలు సత్యాలను బోధించేందుకు మోషన్‌ పిక్చర్‌లను ఉపయోగించేందుకు సమయం ఆసన్నమైందని ఏకగ్రీవంగా అంగీకరించడం జరిగింది. . . . తాను ఈ పథకాన్ని గురించే మూడు సంవత్సరాలుగా పని చేస్తున్నాననీ మరియు నిస్సందేహంగా గొప్ప సమూహాలను ఆకర్షించే, సువార్తను ప్రకటించే మరియు ప్రజలు తిరిగి దేవునియందు విశ్వాసాన్ని ఉంచేందుకు సహాయం చేసే వందలాది చక్కని చిత్రాలు ఇప్పుడు దాదాపు సిద్ధంగా ఉన్నాయనీ [రస్సెల్‌] వివరించాడు.”

15. “ఫోటో-డ్రామా” ఏ విధమైన ఫలితాలను తీసుకువచ్చింది?

15 జనవరి 1914లో “ఫోటో-డ్రామా” యొక్క మొదటి ప్రదర్శన తర్వాత అది సాధించిన సంగతి అదే. ఈ క్రింద ఉన్నవి 1914 కావలికోట నుండి తీసుకోబడిన నివేదికలు:

ఏప్రిల్‌ 1: “రెండు భాగాలను చూసిన తర్వాత ఒక పరిచారకుడు ఇలా చెప్పాడు: ‘నేను ఫోటో-డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌ సగ భాగాన్ని మాత్రమే చూశాను, అయితే నా మూడు సంవత్సరాల థియలాజికల్‌ సెమినరీ కోర్సులో బైబిలు గురించి నేను నేర్చుకున్న వాటికంటే దానినుండి ఇప్పటికే నేను చాలా ఎక్కువ నేర్చుకున్నాను.’ ఒక యూదుడు దాన్ని చూసిన తర్వాత ఇలా వ్యాఖ్యానించాడు, ‘నేను వచ్చినప్పటికంటే ఇప్పుడు మెరుగైన యూదునిగా తిరిగి వెళ్తున్నాను.’ అనేకమంది క్యాథలిక్‌ ప్రీస్టులూ నన్‌లూ డ్రామా చూసి ఎంతో మెప్పుదలను వ్యక్తం చేశారు. . . . ఇప్పటికి డ్రామా యొక్క కేవలం పన్నెండు సెట్‌లు మాత్రమే సిద్ధమయ్యాయి . . . అయినప్పటికీ మేము ఇప్పటికే ముఫ్పై ఒక్క పట్టణాలను చేరుకుని సేవ చేస్తున్నాము . . . ఒక రోజుకు ముఫ్పై ఐదు వేలకంటే ఎక్కువమంది దాన్ని చూస్తున్నారు, వింటున్నారు, మెచ్చుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు మరియు దీవించబడుతున్నారు.”

జూన్‌ 15: “ఈ చిత్రాలు నేను సత్యాన్ని బోధించేందుకు నాలో మరింత ఆసక్తిని నింపాయి, మరియు మన పరలోక తండ్రి ఎడలా, మన ప్రియమైన పెద్ద అన్నయ్య యేసు ఎడలా నాకుగల ప్రేమను వృద్ధి చేశాయి. ఫోటో-డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌ పైనా దాన్ని అందించడంలో ఇమిడివున్న వారందరిపైనా నేను దేవుని ప్రగాఢమైన దీవెనలు ఉండాలని అనుదినమూ వేడుకుంటున్నాను . . . నేను ఆయనయందు మీ సేవకుణ్ని, ఎఫ్‌. డబ్యూ. నాక్‌.—అయోవా.”

జూలై 15: “ఈ నగరంలో ఆ చిత్రాలు ఎంత చక్కని, అద్భుతమైన అభిప్రాయాన్ని కలిగించాయో చూడటం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది, ప్రపంచానికి ఇవ్వబడుతున్న ఈ సాక్ష్యం తాము ప్రభువు స్వయంగా ఎంచుకున్న రత్నాలమని రుజువుపర్చుకుంటున్న అనేకులను సమకూర్చేందుకు కూడా ఉపయోగించబడుతుందన్న నిశ్చయత మాకు ఉంది. ఫోటో-డ్రామా పని ఫలితంగా ఇప్పుడు తరగతిలో సమకూడుతున్న శ్రద్ధగల అనేకమంది బైబిలు విద్యార్థులను గురించి మాకు తెలుసు. . . . ప్రభువునందు మీ సహోదరి ఎమ్మా ఎల్‌. బ్రిక్కర్‌.”

నవంబరు 15: “కింగ్స్‌వేలోని, లండన్‌ ఒపేరా హౌస్‌ నందు ఫోటో-డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌ ద్వారా ఇవ్వబడుతున్న మహత్తరమైన సాక్ష్యాన్ని గురించి వినేందుకు మీరెంతో సంతోషిస్తారని మేము నమ్ముతున్నాము. ఈ ప్రదర్శన యొక్క ప్రతి వివరణలోనూ ప్రభువు నడిపింపు హస్తం ఎంత అద్భుతమైన రీతిలో స్పష్టంగా కనిపించిందంటే సహోదరులు ఆ విషయాన్ని బట్టి అత్యంత ఆనందిస్తున్నారు . . . ప్రేక్షకుల్లో అన్ని తరగతులకు చెందిన, అన్ని రకాల ప్రజలు ఉన్నారు; ప్రేక్షకుల్లో పాదిరీలు అనేకమందిని మేము గమనించాం. తానూ తన భార్యా మళ్లీ వచ్చి దీన్ని చూడగలిగేందుకు టిక్కెట్లు కావాలని . . . ఒక వికార్‌ అడిగాడు. చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ రెక్టర్‌ డ్రామాకు అనేకసార్లు హాజరయ్యాడు, మరి . . . దాన్ని చూసేందుకు తన స్నేహితులను అనేకులను తీసుకువచ్చాడు. ఇద్దరు బిషప్‌లు కూడా వచ్చారు, అనేకమంది ప్రముఖులు కూడా వచ్చారు.”

డిసెంబరు 1: “మీ ద్వారా మాకు లభించిన ఈ గొప్ప, అమూల్యమైన దీవెన విషయమై నేనూ నా భార్యా మన పరలోక తండ్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మేము సత్యాన్ని చూసి దాన్ని అంగీకరించేలా చేసినది చక్కని మీ ఫోటో-డ్రామాయే . . . మా వద్ద మీ స్టడీస్‌ ఇన్‌ ది స్క్రిప్చర్స్‌ యొక్క ఆరు సంపుటులు ఉన్నాయి. అవెంతో గొప్ప సహాయమై ఉన్నాయి.”

అప్పుడు ఎదురైన పరీక్షలకు ప్రతిస్పందన

16. 1914 విశ్వాస పరీక్షను ఎందుకు తెచ్చింది?

16 మరి 1914లో ప్రభువును కలుసుకుంటామనే తమ అపేక్షలు నెరవేరలేదని ఈ యథార్థపరులైన, భక్తిగల క్రైస్తవులు కనుగొన్నప్పుడు ఏమి జరిగింది? ఆ అభిషిక్తులు ఎంతో కష్టతరమైన సమయాన్ని ఎదుర్కొన్నారు. “మనం పరీక్షాకాలంలో ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం” అని నవంబరు 1, 1914 కావలికోట (ఆంగ్లం) ప్రకటించింది. దీని గురించి, యెహోవాసాక్షులు—దేవుని రాజ్యప్రచారకులు [ఆంగ్లం] (1993) ఇలా పేర్కొంటుంది: “1914 నుండి 1918 సంవత్సరాలు వాస్తవంగానే బైబిలు విద్యార్థులకు ‘పరీక్షా కాలంగా’నే ఉన్నాయి.” ముందున్న గొప్ప పనిని చేపట్టేందుకు గానూ తమ విశ్వాసం శుద్ధీకరించబడేందుకూ, తమ ఆలోచనావిధానం సవరించబడేందుకూ వారు అనుమతించి ఉంటారా?

17. 1914 తర్వాత కూడా భూమిపైనే ఉండడం విషయమై నమ్మకమైన అభిషిక్తులు ఎలా ప్రతిస్పందించారు?

17 సెప్టెంబరు 1, 1916 కావలికోట (ఆంగ్లం) ఇలా చెప్పింది: “అన్యజనుల కాలములు అంతం కాకముందే [అభిషిక్తుల] చర్చిని సమకూర్చే కోతపని ముగుస్తుందని మేము ఊహించాము; అయితే బైబిలులో అది స్పష్టంగా చెప్పబడలేదు. . . . కోతపని కొనసాగుతున్నందుకు మనం చింతిస్తున్నామా? . . . ప్రియమైన సహోదరులారా, దేవుని ఎడల విస్తారమైన కృతజ్ఞతా, ఏ అందమైన సత్యాన్ని చూడగలిగి, దానితో సహవసించగలిగే ఆధిక్యతను మనకు ఇచ్చాడో దాని ఎడల పెరిగిపోతున్న మెప్పుదలనూ మరియు ఆ సత్యాన్ని ఇతరులకు తెలియజేయడంలో సహాయపడేందుకు మరింత ఎక్కువ ఆసక్తినీ కలిగి ఉండటమే మన ప్రస్తుత దృక్పథమై ఉండాలి.” వారి విశ్వాసం పరీక్షించబడింది, అయినప్పటికీ వారు ఆ పరీక్షను ఎదుర్కుని దాన్ని విజయవంతంగా అధిగమించారు. అయితే మన విశ్వాసానికి ఎన్నో పరీక్షలు వస్తాయనీ, విభిన్నమైన పరీక్షలు వస్తాయనీ క్రైస్తవులమైన మనం తెలుసుకుని ఉండాలి.

18, 19. బ్రదర్‌ రస్సెల్‌ మరణించిన వెంటనే, దేవుని ప్రజలకు ఏ ఇతర విశ్వాస పరీక్షలు ఎదురయ్యాయి?

18 ఉదాహరణకు, బ్రదర్‌ చార్ల్‌స్‌ టి. రస్సెల్‌ మరణించిన కొంతకాలానికి శేషంపై మరొక విధమైన పరీక్ష వచ్చిపడింది. అది వారి యథార్థతా మరియు విశ్వాసం యొక్క పరీక్ష. మత్తయి 24:45 నందలి ‘నమ్మకమైన దాసుడు’ ఎవరు? ఆ దాసుడు బ్రదర్‌ రస్సెల్‌ అని కొందరు భావించారు, మరి వారు క్రొత్త సంస్థీకరణ ఏర్పాట్లతో సహకరించేందుకు నిరాకరించారు. ఒకవేళ ఆయనే దాసుడైతే, ఇప్పుడు ఆయన మరణించినందున సహోదరులు ఏమి చేయాలి? వారు క్రొత్తగా నియమించబడిన వ్యక్తిని ఎవరినైనా అనుసరించాలా, లేక ఒక పరికరంగా లేక దాసుని తరగతిగా యెహోవా ఒక వ్యక్తిని కాక క్రైస్తవుల ఒక పూర్తి గుంపును ఉపయోగిస్తున్నాడని గుర్తించేందుకు ఇప్పుడు సమయం వచ్చిందా?

19 క్రైస్తవమత సామ్రాజ్య మత నాయకుల ద్వారా ప్రేరేపించబడిన ప్రాపంచిక అధికారులు యెహోవా సంస్థకు విరుద్ధంగా ‘కట్టడవలన కీడు కల్పించినప్పుడు’ 1918లో నిజ క్రైస్తవులపై మరొక పరీక్ష వచ్చిపడింది. (కీర్తన 94:20) బైబిలు విద్యార్థులకు విరుద్ధంగా ఉత్తర అమెరికాలోనూ యూరప్‌లోనూ దౌర్జన్యపూరితమైన హింస ఉవ్వెత్తున ఎగిసిపడింది. జే. ఎఫ్‌. రూథర్‌ఫోర్డ్‌ మరియు ఆయన సన్నిహిత సహవాసులు మరియు ఏ. హెచ్‌. మాక్‌మిలన్‌లకు విరుద్ధంగా అమెరికా ఫెడరల్‌ వారెంట్‌లు ఇవ్వబడినప్పుడు మతనాయకులు ప్రేరేపించిన వ్యతిరేకత 1918 మే 7న తారాస్థాయికి చేరుకుంది. దేశద్రోహం చేశారని వారు అబద్ధంగా నిందించబడ్డారు, మరి వారి నిరపరాధవాదాన్ని అధికారులు చెవినిబెట్టలేదు.

20, 21. మలాకీ 3:1-3నందు ప్రవచించబడిన విధంగా, అభిషిక్తుల మధ్య ఏ పని జరిగింది?

20 “ఆయన వచ్చుదినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? [నిబంధన దూత] కంసాలి అగ్నివంటివాడు, చాకలివాని సబ్బువంటి వాడు; వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయురీతిని ఆయన వారిని నిర్మలులను చేయును” అని మలాకీ 3:1-3 నందు వర్ణించబడిన విధంగా శుద్ధి చేసే పని జరుగుతోంది, అయితే అలాగని అప్పుడు గుర్తించబడలేదు.

21 మొదటి ప్రపంచ యుద్ధం అంతానికి సమీపిస్తుండగా, ప్రపంచ సైనిక కార్యకలాపాల విషయంలో తాము కచ్చితమైన తటస్థ దృక్పథాన్ని కలిగివుంటామా లేదా అనే మరొక విశ్వాస పరీక్షను బైబిలు విద్యార్థుల్లో కొందరు ఎదుర్కున్నారు. (యోహాను 17:16; 18:36) కొందరు కచ్చితమైన తటస్థతను చూపించలేదు. కాబట్టి, 1918లో తన ఆరాధకుల చిన్న గుంపును ప్రాపంచిక కల్మషాలనుండి పరిశుభ్రపర్చేందుకు యెహోవా తన ఆధ్యాత్మిక ఆలయ ఏర్పాటుకు తన “నిబంధన సేవకు”డైన యేసుక్రీస్తును పంపించాడు. నిజమైన విశ్వాసాన్ని ప్రదర్శించేందుకు కట్టుబడివున్న వారు అనుభవం నుండి నేర్చుకున్నారు, మరి ముందుకు కొనసాగి, ప్రకటించడంలో ఆసక్తితో కొనసాగారు.

22. విశ్వాస పరీక్షల విషయంలో, ఇంకా ఏమి పరిశీలించవలసి ఉంది?

22 మనం ఇప్పుడు పరిశీలించిన సంగతులు ఆసక్తికరమైన చారిత్రక విషయాలు మాత్రమే కాదు. యెహోవా యొక్క ప్రపంచవ్యాప్త సంఘపు ప్రస్తుత ఆధ్యాత్మిక పరిస్థితికి ఇది సూటిగా సంబంధించి ఉంది. అయితే తదుపరి శీర్షికలో, నేడు దేవుని ప్రజలు అనుభవిస్తున్న విశ్వాస పరీక్షల్లో కొన్నింటిని పరిశీలించి, మనం వాటిని ఎలా విజయవంతంగా అధిగమించగలమో చూద్దాం.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

◻ తమ విశ్వాసం పరీక్షించబడుతుందని యెహోవా ప్రజలు ఎందుకు అపేక్షించాలి?

◻ 1914కు ముందు దేవుని వర్తమానాన్ని విస్తరింపజేయడానికి ఏ విధమైన ప్రయత్నాలు జరిగాయి?

◻ “ఫోటో-డ్రామా” ఏమిటి, మరి అది ఏ విధమైన ఫలితాలను ఉత్పత్తి చేసింది?

◻ 1914-18 మధ్య కాలంలో జరిగిన సంఘటనలు అభిషిక్తులను పరీక్షించేందుకు ఎలా ఉపయోగపడ్డాయి?

[12వ పేజీలోని చిత్రం]

శతాబ్దం మలుపు తిరుగుతుండగా, అనేక దేశాల్లోని ప్రజలు “స్టడీస్‌ ఇన్‌ ది స్క్రిప్చర్స్‌” అని తర్వాత పిలువబడిన “మిల్లేనియల్‌ డాన్‌” సహాయంతో బైబిలు పఠిస్తూ ఉన్నారు

[13వ పేజీలోని చిత్రం]

సి. టి. రస్సెల్‌ నుండి వచ్చిన ఒక లేఖ, అందులో రికార్డింగు కొరకు ఆయన పలికిన ప్రారంభ మాటలు ఇలా ఉన్నాయి: “‘ఫోటో-డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌’ ఐబిఎస్‌ఎ—ఇంటర్నేషనల్‌ బైబిల్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (అంతర్జాతీయ బైబిలు విద్యార్థుల సమాఖ్య)—ద్వారా అందించబడుతోంది. మతపర వైజ్ఞానిక మార్గంలోనూ బైబిలు పక్షంగానూ ప్రజలకు ఉపదేశించడమే దాని లక్ష్యం”

[15వ పేజీలోని చిత్రం]

డెమెట్రిస్‌ పాపజార్జ్‌ “ఫోటో-డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌” చూపిస్తూ ప్రయాణించాడు. తర్వాత, క్రైస్తవ తటస్థత మూలంగా ఆయన చెరసాలలో వేయబడ్డాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి