మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?
మీరు ఇటీవలి కావలికోట సంచికలు మీ విషయంలో ఆచరణాత్మకమైన విలువగలవిగా ఉన్నట్లు కనుగొన్నారా? అయితే, ఈ క్రింద ఇవ్వబడిన ప్రశ్నలతో మీ జ్ఞాపకశక్తిని ఎందుకు పరీక్షించుకోకూడదు?
◻ ‘ప్రభువు దినము,’ ‘యెహోవా దినము’ ల మధ్య గల వ్యత్యాస మేమిటి? (ప్రకటన 1:10; యోవేలు 2:11)
“ప్రభువు దినం”లో, ప్రకటన 1 నుండి 22 అధ్యాయాలలో వర్ణింపబడిన 16 దర్శనాల నెరవేర్పూ, తన శిష్యులు వేసిన ప్రశ్నకు సమాధానంగా యేసు ప్రవచించిన ప్రాథమిక సంఘటనలన్నిటి నెరవేర్పూ ఇమిడి ఉంటాయి. ప్రభువు దినం యొక్క చరమాంకంగా, సాతాను యొక్క కలుషిత ప్రపంచంపై యెహోవా తీర్పుతీర్చినప్పుడు యెహోవా భయంకరమైన దినం ప్రారంభమౌతుంది. (మత్తయి 24:3-14; లూకా 21:11)—12/15, పేజీ 11.
◻ మాకార్‌యాస్ బైబిల్ యొక్క కొన్ని విశిష్ట లక్షణాలేమిటి?
యెహోవా అనే నామం మాకార్‌యాస్ బైబిలులో 3,500 కంటే ఎక్కువసార్లు కనిపిస్తుంది. రష్యన్ మత సాహిత్యంలోని ఒక పండితుడు ఇలా అన్నాడు: “అనువాదం హెబ్రీ ప్రతి అనుసారంగా నమ్మకంగా ఉంది, అనువాదం కొరకు ఉపయోగించబడిన భాష స్వచ్ఛంగా ఉంది, అంశానికి అనుగుణంగా ఉంది.”—12/15, పేజీ 27.
◻ యేసు చెప్పిన మనలను స్వతంత్రులను చేసే “సత్యము” ఏది? (యోహాను 8:32)
“సత్యము” అంటే బైబిల్లో మన కొరకు భద్రపర్చబడిన దైవ ప్రేరేపిత సమాచారమనీ, మరి విశేషంగా దేవుని చిత్తాన్ని గూర్చిన సమాచారమనీ యేసు భావం.—1/1, పేజీ 3.
◻ ఆధునిక దిన యెహూ మరియు యెహోనాదాబులు ఎవరు?
యెహూ యేసుక్రీస్తుకు చిత్రీకరణ అయివున్నాడు. భూమిపై అభిషిక్త క్రైస్తవులైన “దేవుని ఇశ్రాయేలు” ఆయనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. (గలతీయులు 6:16; ప్రకటన 12:17) యెహూను కలుసుకోవడానికి యెహోనాదాబు వచ్చినట్లుగానే, యేసు యొక్క భూసంబంధ ప్రతినిధులకు మద్దతునిచ్చేందుకు అన్యజనులలో నుండి గొప్పసమూహం వచ్చింది. (ప్రకటన 7:9, 10; 2 రాజులు 10:15)—1/1, పేజీ 13.
◻ ‘దేవునితో కూడా నడవడమంటే’ అర్థమేమిటి? (ఆదికాండము 5:24; 6:9)
అంటే అలాచేస్తున్నవారు హనోకు నోవహు వంటి వారిలా తమకు దేవునిలో దృఢవిశ్వాసం ఉందన్నదానికి నిదర్శనంగా తమను తాము ప్రవర్తింపజేసుకుంటున్నారని అర్థం. వారు తమకు యెహోవా ఆజ్ఞాపించినదానిని చేశారు. మానవజాతితో ఆయన వ్యవహారాలనుబట్టి ఆయన గురించి తమకు తెలిసినదానికి అనుగుణ్యంగా వారు తమ జీవితాలను క్రమబద్ధం చేసుకున్నారు.—1/15, పేజీ 13.
◻ ఒక వ్యక్తి తను మరణించే సాధ్యత విషయంలో ముందుగా ఎందుకు పథకం వేసుకోవాలి?
ఒక అర్థంలో చెబితే, అలాంటి ఏర్పాట్లు చేయడం మీ కుటుంబానికి మీరిచ్చే కానుకే. అది మీ ప్రేమను తెలియజేస్తుంది. మీరు వాళ్ళతోపాటు ఇక ఉండని సమయంలో కూడా ‘మీ యింటివారు సంరక్షించబడాలని’ మీరు కోరుకుంటున్నారని అది నిరూపిస్తుంది. (1 తిమోతి 5:8)—1/15, పేజీ 22.
◻ “పాత నిబంధన” ఏమి నెరవేర్చింది? (2 కొరింథీయులు 3:14)
అది క్రొత్త నిబంధన ముంగుర్తుల్ని కల్గివుంది. దాని క్రింద ఎడతెగకుండా అర్పించబడిన బలులు, మానవులు పాప మరణాలనుండి విముక్తి పొందాల్సిన ఆవశ్యకతను చూపించాయి. ధర్మశాస్త్రం ‘క్రీస్తు నొద్దకు నడిపించడంలో బాలశిక్షకుడయ్యింది.’ (గలతీయులు 3:24)—2/1, పేజీ 14.
◻ ఏయే రీతుల్లో క్రొత్త నిబంధన నిత్యమైన నిబంధనయైవుంది? (హెబ్రీయులకు 13:20)
మొదటిగా, ధర్మ శాస్త్ర నిబంధనవలే ఇది ఎన్నటికీ మార్చబడదు. రెండవదిగా, దాని నిర్వహణా ఫలితాలు శాశ్వతమైనవి. మూడవదిగా, క్రొత్త నిబంధన ఏర్పాటు నుండి వేరే గొఱ్ఱెలు వెయ్యేండ్లూ ప్రయోజనాన్ని పొందుతూనే ఉంటారు.—2/1, పేజీ 22.
◻ కృతజ్ఞులై ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి?
హృదయంలో కృతజ్ఞత కల్గివుండడాన్ని బట్టి ఒక వ్యక్తికి కలిగే మంచి భావన, అతని ఆనందానికి శాంతికి దోహదపడుతుంది. (పోల్చండి సామెతలు 15:13, 15.) కృతజ్ఞత అనుకూల లక్షణం గనుక అది కోపం, అసూయ, ఆగ్రహం వంటి ప్రతికూల భావాల నుండి అతడిని కాపాడుతుంది.—2/15, పేజీ 4.
◻ ఆత్మజనితులు ఏ నిబంధనలలోనికి తీసుకోబడ్డారు?
ఒకటి యెహోవా ఆధ్యాత్మిక ఇశ్రాయేలు సభ్యులతో చేసిన క్రొత్త నిబంధన, మరొకటి యేసు తన అడుగుజాడల్లో నడుస్తున్న అభిషిక్త అనుచరులతో చేసిన రాజ్యనిబంధన. (లూకా 22:20, 28-30)—2/15, పేజీ 16.
◻ ఇశ్రాయేలీయులు హాజరు కావాలని ఆజ్ఞాపించబడ్డ మూడు గొప్ప పండుగలు ఏవి?
నీసాను 14న వచ్చే పస్కా జరిగిన తదనంతరం వెంటనే వచ్చే పులియనిరొట్టెల పండుగ; నీసాను 16 తర్వాత యాభయ్యవ దినాన వచ్చే వారాల పండుగ; ఏడవ నెలలో జరుపుకొనే ఫలసంగ్రహపు పండుగ, లేక పర్ణశాలల పండుగ. (ద్వితీయోపదేశకాండము 16:1-15)—3/1, పేజీలు 8, 9.
◻ క్రైస్తవ సమావేశాలకు హాజరుకావడం ఎందుకు ఒక ఆధిక్యత?
యేసు ఇలా అన్నాడు: “ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందు[ను].” (మత్తయి 18:20; 28:20) అటువంటి ఆధ్యాత్మిక ఆహారపంపిణీ కార్యక్రమం ప్రాముఖ్యంగా సంఘ కూటాల ద్వారా, అలాగే పెద్ద సమావేశాలద్వారా జరుగుతుంది. (మత్తయి 24:45)—3/1, పేజీ 14.
◻ నిమ్రోదు పేరుకున్న మూలమేమిటి?
నిమ్రోదు అనే పేరు అతడు పుట్టినప్పుడు పెట్టినపేరు కాదనే అభిప్రాయాన్ని అనేకమంది పండితులు కలిగి ఉన్నారు. బదులుగా, అతడి తిరుగుబాటుపూరిత స్వభావం అవగతమైనప్పుడు దానికి సరిపోయే విధంగా పెట్టినపేరు అని వాళ్లు అభిప్రాయ పడుతున్నారు.—3/15, పేజీ 25.
◻ మానవ సమాజానికి కుటుంబం ఎంత ప్రాముఖ్యమైనది?
కుటుంబం మానవుని అవసరత. కుటుంబ ఏర్పాటు ఎప్పుడు బలహీనమౌతుందో అప్పుడే సమాజాల బలమూ, జాతి బలమూ క్షీణిస్తుందని చరిత్ర చూపుతుంది. సమాజపు స్థిరత్వంపైనా, పిల్లల సంక్షేమంపైనా, భావి తరాల సంక్షేమంపైనా కుటుంబం ప్రత్యక్ష ప్రభావం కలిగివుంది.—4/1, పేజీ 6.
◻ బైబిలు దేవుని వాక్యమని నిరూపించడానికి గల మూడు విషయాలేమిటి?
(1) ఇది విజ్ఞానశాస్త్ర పరంగా కచ్చితమైనది; (2) ఇది ఆధునిక జీవనానికి ఆచరణాత్మకమైనటువంటి కాల పరిమితిలేని సూత్రాలను కల్గివుంది; (3) ఇది నెరవేరిన, చారిత్రక వాస్తవాలచే రుజువు పర్చబడిన నిర్దిష్టమైన ప్రవచనాల్ని కల్గివుంది.—4/1, పేజీ 15.