కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 6/15 పేజీ 31
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఇలాంటి మరితర సమాచారం
  • మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు, నేటి క్రైస్తవులకు పరిశుద్ధాత్మ నడిపింపు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • “పవిత్రశక్తే మన మనసుకు సాక్ష్యమిస్తుంది”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • ఆత్మానుసారంగా నడుచుకుంటూ మీ సమర్పణకు తగ్గట్టు జీవించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • మీరు “సత్యస్వరూపియగు ఆత్మను” పొందారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 6/15 పేజీ 31

పాఠకుల ప్రశ్నలు

ఆత్మచే అభిషిక్తులైన క్రైస్తవులు కల్గివున్నంత దేవుని ఆత్మ భూ నిరీక్షణగల నేటి దేవుని సేవకులు కల్గివున్నారని మనం చెప్పవచ్చా?

ఈ ప్రశ్న క్రొత్తది కాదు. ఇదే విషయం ఏప్రిల్‌ 15, 1952 కావలికోట (ఆంగ్లం) నందున్న “పాఠకుల ప్రశ్నలు” అన్న శీర్షికలో ప్రస్తావించబడింది. అప్పటినుండి అనేకులు సాక్షులయ్యారు కనుక ఈ ప్రశ్నను పరిశీలించవచ్చు అలా పరిశీలిస్తూ ముందు చెప్పబడిన సమాచారాన్ని పునఃపరిశీలించవచ్చు.

అవును, వేరే గొఱ్ఱెల తరగతిలోని నమ్మకమైన సహోదర సహోదరీలు అభిషేకించబడిన వారితో సమానంగా దేవుని పరిశుద్ధాత్మను పొందారన్నది మౌలిక జవాబు.—యోహాను 10:16.

నిస్సందేహంగా దాని భావం, వ్యక్తులందరిలో ఆత్మ ఒకే విధంగా పని చేస్తుందనికాదు. కచ్చితంగా దేవుని ఆత్మను పొందిన క్రైస్తవులకు ముందున్న కాలంలోని నమ్మకమైన సేవకులను జ్ఞాపకం చేసుకోండి. ఆత్మ బలంతో వారిలో కొందరు భయంకరమైన జంతువులను సంహరించగలిగారు, అస్వస్థులను స్వస్థపర్చగలిగారు మరి మరణించినవారిని సహితం లేపగలిగారు. మరియు బైబిలులోని ప్రేరేపిత పుస్తకాలను వ్రాసేందుకు వారికి ఆత్మ అవసరమైంది. (న్యాయాధిపతులు 13:24, 25; 14:5, 6; 1 రాజులు 17:17-24; 2 రాజులు 4:17-37; 5:1-14) ఆ కావలికోట ఇలా చెప్పింది: “వీరు అభిషిక్త తరగతివారు కాకపోయినప్పటికీ, వారు పరిశుద్ధాత్మచేత నింపబడ్డారు.”

మరోవైపునుండి, పరలోక నిరీక్షణతో దేవుని ఆత్మీయ కుమారులయ్యే పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన మొదటి శతాబ్దపు స్త్రీపురుషులను పరిగణలోకి తీసుకోండి. అందరూ అభిషిక్తులే, అయితే ఆ తర్వాత ఆత్మ వారందరిమీదా ఒకేలాగ పనిచేసిందని దాని భావం కాదు. అది 1 కొరింథీయులు 12వ అధ్యాయంలో స్పష్టమౌతోంది. అక్కడ అపొస్తలుడైన పౌలు ఆత్మ అనుగ్రహించిన ఈవులను గూర్చి చర్చించాడు. 1 కొరింథీయులు 8, 9, 11 వచనాల్లో మనం ఇలా చదువుతాం: “ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఆత్మవలననే స్వస్థపరచు వరములను . . . అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.”

ప్రాముఖ్యమైన విషయమేమిటంటే, అప్పట్లోని అభిషిక్తులందరికీ అద్భుతకరమైన ఆత్మ వరం లేకపోయింది. 1 కొరింథీయులు 14వ అధ్యాయంలో, భాషల వరం ఉన్నప్పటికీ అనువాదం చేసే వరం లేని ఓ సంఘ కూటాన్ని గూర్చి పౌలు ప్రస్తావించాడు. అయినప్పటికీ, అంతకు ముందు ఏదోక సందర్భంలో ప్రతి ఒక్కరూ ఆత్మచేత అభిషేకించబడ్డారు. భాషలను మాట్లాడే వరం ఉన్న సహోదరునికి అక్కడ ఉన్నవారందరికంటే ఎక్కువ ఆత్మ ఉందని చెప్పడం సహేతుకమైనదేనా? కాదు. ఏదో, బైబిలును ఆయన అర్థంచేసుకున్నంతగా అర్థంచేసుకునే సామర్థ్యంలేనట్లు లేక శ్రమలను ఆయన ఎదుర్కొన్నంతగా ఎదుర్కోలేరన్నట్లుగా ఆ మిగిలిన అభిషిక్తులకు లోపమేమీలేదు. భాషల్లో మాట్లాడగల్గిన సహోదరునిపై ఆత్మ ఓ ప్రత్యేకమైన విధంగా పనిచేసింది. అయినప్పటికీ, అతనూ మిగిలినవారు యెహోవాకు సన్నిహితంగా ఉండాలి మరియు పౌలు వ్రాసినట్లుగా ‘ఆత్మ పూర్ణులైయుండాలి.’—ఎఫెసీయులు 5:18.

నేటి శేషించబడిన వారిని గూర్చి చెప్పాలంటే వారు దేవుని ఆత్మను నిశ్చయంగా పొందారు. ఒక సందర్భంలో అది వారిపై ప్రత్యేకమైన విధంగా పనిచేసింది అంటే వారు అభిషేకించబడి ఆత్మీయ కుమారులుగా స్వీకరించబడినప్పుడు అది ప్రత్యేకమైన విధంగా పనిచేసింది. ఆ తర్వాత వారు ‘ఆత్మ పూర్ణులైయుంటూ’ బైబిలును మరింత స్పష్టంగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, ప్రచార పనిలో నాయకత్వాన్ని తీసుకుంటున్నప్పుడు లేక పరీక్షలను అంటే అవి వ్యక్తిగతమైనది లేక సంస్థాగతమైనది ఎదుర్కున్నప్పుడూ దాని సహాయాన్ని కల్గివుండేవారు.

“వేరే గొఱ్ఱెల”లోని సభ్యులు అభిషిక్తులయ్యే అనుభవాన్ని కల్గిలేనప్పటికీ, ఇతర విధానాల్లో పరిశుద్ధాత్మను పొందుతారు. ఏప్రిల్‌ 15, 1952 కావలికోట (ఆంగ్లం) ఇలా చెప్పింది:

“శేషించబడినవారు అనుభవించిన అవే కష్టతరమైన పరిస్థితులలో ఉన్నారు, వారు చేసిన అదే ప్రచారపనిని ‘వేరే గొఱ్ఱెలు’ నేడు చేస్తున్నారు మరియు అదే విశ్వసనీయత మరియు యథార్థతలను వారు ప్రదర్శిస్తున్నారు. అదే ఆహారాన్ని తింటూ అవే సత్యాలను గ్రహిస్తూ వారు అదే ఆత్మీయ బల్లవద్ద భుజిస్తున్నారు. భూతరగతికి చెందినవారై, భూ నిరీక్షణను గలవారై మరియు భూమ్మీది విషయాల్లో లోతైన ఆసక్తిగలవారై వారు నూతన లోకంలోని భూ పరిస్థితులకు సంబంధించిన లేఖనాల్లో అధిక ఆసక్తిని కనుపర్చవచ్చు; అయితే పరలోక నిరీక్షణతో మరియు ఆత్మ విషయంలో బలమైన వ్యక్తిగతాసక్తితో అభిషిక్త శేషం, దేవుని వాక్యంలో ఆ విషయాలకు సంబంధించిన వాటిని శ్రద్ధగా పఠించవచ్చు. . . . అయినప్పటికీ రెండు తరగతులకూ అదే సత్యం అదే అవగాహనలూ ఉన్నాయనే వాస్తవం నిలుస్తుంది, మరి వారు పరలోక మరియు భూ సంబంధమైన విషయాలను అర్థంచేసుకునేందుకు వారు ఎంతగా పఠిస్తారన్న దానిపై మాత్రమే అది ఆధారపడివుంటుంది. రెండు తరగతులపైన ప్రభువు ఆత్మ సమానంగా ఉంది మరియు జ్ఞానాన్ని అవగాహనను సంపాదించేందుకు సమానమైన అవకాశాలనిస్తూ అది ఇరువురికీ సమానంగా అందించబడుతోంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి