కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 6/15 పేజీ 32
  • ఆయన వినయంతో యెహోవాను సేవించాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆయన వినయంతో యెహోవాను సేవించాడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 6/15 పేజీ 32

ఆయన వినయంతో యెహోవాను సేవించాడు

“మీరు ఎక్కడ సేవ చేస్తున్నారన్నది కాదుకానీ మీరు ఎవరిని సేవిస్తున్నారన్నదే నిజంగా ప్రాముఖ్యమైన విషయం.” జాన్‌ బూత్‌ ఆ మాటలను చెప్పేందుకు ఎంతో ఇష్టపడేవాడు మరి ఆయన దానికి అనుగుణ్యంగా జీవించాడు. 1996 జనవరి 8, సోమవారం నాడు చాలించిన తన భూజీవితం, ఎవరిని సేవించేందుకు ఆయన ఎన్నుకున్నాడన్న విషయంలో ఏ సందేహాన్ని విడిచిపెట్టలేదు.

1921లో ఓ యువకునిగా జాన్‌ బూత్‌ జీవిత సంకల్పం కొరకు వెదుకుతుండేవాడు. డచ్‌ రిఫార్మడ్‌ చర్చి వద్ద ఆయన సండే స్కూలును నిర్వహించేవాడు, కానీ ఓ ప్రచారకునిగా తయారుచేసే శిక్షణనిచ్చే ఆలోచనను ఆయన వద్దనుకున్నాడు, ఎందుకంటే మతనాయకులు స్వార్థపూరితమైన జీవితాన్ని జీవిస్తారని ఆయన భావించాడు. “నేడు జీవిస్తున్న అనేకులు ఇక ఎన్నడూ మరణించరు” అన్న శీర్షికాంశం ఉన్న ఓ ప్రకటనను చూసినప్పుడు ఆయన వెంటనే అందులో ఇవ్వబడిన సాహిత్యం కావాలని ఉత్తరం పంపించాడు. తాను చదివిన దానివల్ల ముగ్ధుడై ఆ వెంటనే అప్పట్లో బైబిలు విద్యార్థులని పిలువబడే యెహోవాసాక్షుల కూటాలకు 24 కిలోమీటర్లు సైకిలు తొక్కుకుంటూ వెళ్లడం ప్రారంభించాడు. ఆయన 1923 నందు బాప్తిస్మం తీసుకున్నాడు మరియు తన కుటుంబానికి పాల సరఫరా కేంద్రం ఉన్న న్యూయార్క్‌ వాల్కిల్‌ ప్రాంతంలో ఇంటింటి పరిచర్యలో పాల్గొనడం ఆరంభించాడు.

సహోదరుడైన బూత్‌ 1928 నందు పూర్తికాల పరిచర్యలో చేరాడు. ఆయన తన స్వగ్రామంలోనూ మరియు దక్షిణ అమెరికాలోనూ ప్రకటించేవాడు మరి ఆహారానికి మరియు వసతికీ బదులుగా బైబిలు ప్రచురణలను విక్రయించేవాడు. తుపాకీలుగల దొంగ సారా తయారుచేసే యజమానులు తెచ్చే అపాయాల కారణంగా ఆయన ధైర్యంగా ఉండాల్సి వచ్చింది. వారిలో ఒకడు జాన్‌ బూత్‌ పయినీరు భాగస్వామిని కాల్చి గాయపర్చాడు. 1935లో సహోదరుడైన జాన్‌ బూత్‌ ప్రయాణ కాపరిగా నియమించబడి, ఆ దేశంలోని సంఘాలనూ మరియు చిన్న గుంపులనూ సందర్శించడం ప్రారంభించాడు. ఆయన సమావేశాలను ఏర్పాటు చేశాడు మరియు వ్యతిరేకత ఉన్నప్పటికీ సహోదర సహోదరీలు నిలకడ కల్గివుండేందుకు సహాయపడ్డాడు. కోపచిత్తులైన మూకలను ఎదుర్కోవడం, కోర్టుల్లో తన విశ్వాసాన్ని కాపాడుకోవడం మరియు కారాగారవాసాన్ని అనుభవించడం వంటివన్నీ సహోదరుడైన బూత్‌కు సాధారణ సంఘటనలైపోయాయి. “ఆ ఉత్తేజకరమైన రోజులను గూర్చి వివరాలివ్వాలంటే ఒక పుస్తకం నిండుతుంది” అని ఆయన ఒకసారి వ్రాశాడు.

1941లో అప్పటి వాచ్‌టవర్‌ అధ్యక్షుడైన జోసఫ్‌. ఎఫ్‌. రూథర్‌ ఫోర్డ్‌, న్యూయార్క్‌లోని ఇతైక సమీపంలోని కింగ్డమ్‌ ఫార్మ వద్ద సహోదరుడు బూత్‌ను నియమించాడు. అక్కడ ఆయన నమ్మకంగా 28 సంవత్సరాలు పనిచేశాడు. పరిచర్య ఎడల ఆయన ప్రేమ సన్నగిల్లిపోలేదు, మిషనరీలకు శిక్షణనిచ్చే వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌కు చెందిన వేలకొలది మంది విద్యార్థులతో సహవసించడంలో ఆయన ఎంతో ఆనందించాడు. అది 1961 వరకు కింగ్డమ్‌ ఫార్మవద్ద ఉండేది. 1970లో, న్యూయార్క్‌ వాల్కిల్‌ నందు వాచ్‌టవర్‌ ఫార్మ్స్‌ వద్ద ఆయన్ను పనిచేయమని కోరడం జరిగింది, అలా 45 సంవత్సరాల క్రితం తాను పయినీరింగును ప్రారంభించిన చోటే మరలా ఆయన ఉన్నాడు.

1974 నందు సహోదరుడైన బూత్‌ న్యూయార్క్‌ నందలి బ్రూక్లిన్‌లోని యెహోవాసాక్షుల పరిపాలక సభలోని సభ్యునిగా నియమితుడయ్యాడు. తనకు 93 ఏళ్ళు వచ్చేవరకు ఆయన ఆ స్థానంలో నమ్మకంగా సేవచేశాడు. తన సాత్వికాన్ని దయార్థ క్రైస్తవ వ్యక్తిత్వాన్నిబట్టి జాన్‌ బూత్‌ ఎంతో ప్రియమైనవానిగా ఉండేవాడు. ఆయన ఆరోగ్యమూ మరియు బలము క్షీణించేంతవరకు, ఆయన నమ్మకంగా ఇంటింటి పరిచర్యలోనూ మరియు పట్టణ వీధుల్లోనూ ప్రకటించేవాడు.

ఆయనతో సేవచేసినవారు ఆయన చనిపోయినందుకు దుఃఖించినప్పటికీ, అభిషిక్తులు పరలోక జీవానికి పునరుత్థానం చేయబడతారని మరియు “వారి క్రియలు వారివెంట పోవునని” చెప్పిన బైబిలు వాగ్దానం ద్వారా వారు ఓదార్పు పొందుతారు. (ప్రకటన 14:13; 1 కొరింథీయులు 15:51-54) అది ఓ క్రొత్త వాతావరణమే, అయితే జాన్‌ బూత్‌ యెహోవాను నిత్యం సేవించగలడు!

[32వ పేజీలోని చిత్రం]

జాన్‌ బూత్‌ 1903-1996

[32వ పేజీలోని చిత్రం]

HERALD-AMERICAN, ANDOVER 1234

76 Jehovites Jailed in Joliet

[క్రెడిట్‌ లైను]

Chicago Herald-American

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి