కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 8/15 పేజీలు 8-11
  • యేసును గూర్చిన సందేహాలు న్యాయోచితమైనవేనా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసును గూర్చిన సందేహాలు న్యాయోచితమైనవేనా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసును గూర్చిన సందేహాలు ఎలా నాటబడ్డాయి
  • సందేహాలను తీసివేసే సాక్ష్యాధారాలు
  • కొందరెందుకు యేసు చేసిన అద్భుతాలను అనుమానిస్తున్నారు
  • యేసు పునరుత్థానాన్ని గూర్చిన సందేహాలు న్యాయోచితమైనవేనా?
  • యేసు ప్రస్తుతం నిర్వహిస్తున్న పాత్రను ఎందుకు సందేహించాలి?
  • యేసు చేసిన అద్భుతాలు—వాటినుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • యేసు పునరుత్థానం—⁠మనకు ఎలా ప్రయోజనకరం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • భూమ్మీద ఉన్నప్పుడు యేసు ఏం చేశాడు?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • యేసు చేసిన—అద్భుతాలు యథార్థాలా కట్టుకథలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 8/15 పేజీలు 8-11

యేసును గూర్చిన సందేహాలు న్యాయోచితమైనవేనా?

నజరేయుడైన యేసు నిజంగానే అద్భుతాలను చేశాడా? ఆయన శిష్యులు ప్రకటించినట్లుగా, మృతులలోనుండి ఆయన పునరుత్థానం చేయబడ్డాడా? ఆయన అసలు జీవించాడా? మన ఆధునిక కాలంలో, అనేకులు అలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నట్లుగా ఉంది. ఎందుకు? ఎందుకంటే, యేసును గూర్చిన సందేహాలను వారు కలిగివుంటారు, మరి ఆ సందేహాలు, ఒక విషయం నిజమేనా కాదా అన్నది తెలియక వచ్చే భావాలే. యేసును గూర్చిన అనిశ్చయ భావాలు న్యాయోచితమైనవేనా? మనం చూద్దాం.

యేసును గూర్చిన సందేహాలు ఎలా నాటబడ్డాయి

పందొమ్మిదవ శతాబ్దపు చివరి భాగంలో మరియు 20వ శతాబ్దపు తొలిభాగంలో కొందరు జర్మన్‌ వేదాంతులు యేసును “పురాతన చర్చి యొక్క ఓ కాల్పనిక వ్యక్తిగా” చిత్రీకరించారు. యేసు ఉన్నాడనే చరిత్రపై వారి సందేహం, ఈ శతాబ్దం తొలిభాగంలో విద్వాంసుల మధ్య వివాదానికి దారితీసింది, అది అప్పటి ప్రజలను చేరింది మరి నేటికి అప్పటి ప్రభావం కలిగివుంది. ఉదాహరణకు, జర్మనీలో ఇటీవల జరిపిన పరిశోధన ఏమని బయల్పర్చిందంటే, ఇంటర్వ్యూ చేసిన వారిలో 3 శాతం మంది యేసు “ఎన్నడూ జీవించలేదు” అని మరియు “అపొస్తలులు ఆయనను కల్పించారని” నమ్మారు. అవును, ఈ శతాబ్దం తొలి భాగంలో నాటబడిన యేసును గూర్చిన అనుమానపు బీజాలు ఇప్పుడు కూడా ప్రజల హృదయాల్లో సారవంతమైన నేలను కనుగొన్నాయి.

యేసు “కల్పించబడ్డాడు” అనే ముగింపు ఎందుకు న్యాయోచితమైన నిర్ధారణకాదు? బైబిలు విద్వాంసుడైన ఉల్ఫ్‌గాంగ్‌ ట్రిల్లింగ్‌ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “యేసు ఎన్నడైనా జీవించాడా, మరోమాటలో చెప్పాలంటే ఆయన చారిత్రాత్మక వ్యక్తేనా లేక కాల్పనికుడా అనే వివాదాంశం తీరిపోయింది. ఈ ప్రశ్న పాండిత్య రీతిలో తీర్చబడింది, కనీసం జ్ఞానం గల ప్రజలు దీన్ని ఇక ఎన్నడూ తత్వాధారమైనదని పరిగణించలేని విధంగా తీర్చబడింది.” అయినప్పటికీ, యేసు అసలు ఎన్నడైనా ఉన్నాడా అనే విషయాన్ని కొందరు ఇంకా సందేహిస్తున్నారు. తత్ఫలితంగా, యేసు చారిత్రాత్మకతను ఒక వ్యక్తి ఎలా స్థాపించగలడో అలాగే ఆయనను గూర్చిన సందేహాలను ఎలా తీసివేయగలడో చూద్దాము.

సందేహాలను తీసివేసే సాక్ష్యాధారాలు

ఓ నీచమైన నేరస్థునిగా యేసు అవమానకరంగా చంపబడడం, “యేసు చారిత్రాత్మకతకు విరోధులైన వారికి వ్యతిరేకంగా ఎంతో ఒప్పింపజేసే తర్కాన్ని” అందిస్తోందని ట్రిల్లింగ్‌ చెబుతున్నాడు. ఎందుకు? ఎందుకంటే, ఆ మరణశిక్ష, “యూదులూ మరియు యూదులు కానివారి మధ్య క్రొత్త విశ్వాసపు వ్యాప్తిని ఆటంకపర్చింది, చివరికి అడ్డగించింది కూడా.” (1 కొరింథీయులు 1:23, 24 పోల్చండి.) మెస్సీయా అయిన యేసు చంపబడడం అటు యూదులకూ ఇటు అన్యులకూ ఎంతో అవమానకరమైతే, అది అపొస్తలుల కల్పన కానేకాదు! అంతేకాకుండ, యేసు మరణం ఒక చారిత్రాత్మక సంఘటనేనని నాలుగు సువార్తలేకాకుండ రోమా రచయితయైన టాసిటస్‌ మరియు యూదా టాల్ముండ్లు కూడా ధ్రువీకరిస్తున్నాయి.a

యేసు జీవితంలో ఇతర సంఘటనలు కూడా సువార్తలను నమ్మదగు అంతర్గత ఆధారాలుగా పరిగణిస్తున్నాయి, అంటే అవి ఆయనను గూర్చి మనకు చెప్పే విషయాలకు రుజువునిస్తున్నాయి. ఉదాహరణకు, యేసు ఎలాంటి ప్రాముఖ్యతా లేని ప్రాంతమైన నజరేతునుండి వచ్చాడని యేసు అనుచరులు కల్పించి ఉంటారా? లేక నమ్మకమైన సహచరుడైన యూదా ఆయనను అప్పగించడాన్ని కల్పించే అవకాశముందా? ఇతర అనుచరులు అంత పిరికిగా యేసును విడిచిపోయారనే కథలను కల్పించి ఉంటారని నమ్మడం వాస్తవమైనదేనా? అంత నష్టకరమైన వివరాలను కల్పించి, ఆ తర్వాత వాటిని నలుమూలలా ప్రకటించి ఉంటారనడం సహేతుకం కానేకాదు సుమా! దానికి తోడు, యేసు బోధనా కళ ఎంతో విశేషలక్షణం కలది. మొదటి శతాబ్దపు యూదా సాహిత్యాల్లో ఆయన ఉపమానాలకు సరితూగేవి ఏవి లేవు. కొండమీది ప్రసంగం వంటి మచ్చుతునకలను ఏ అనామకుడు “కల్పించి” ఉంటాడు. ఈ తర్కాలు, యేసు జీవిత నివేదికలుగా సువార్తల యథార్థతను స్థిరపర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

యేసు చారిత్రాత్మకతకు బాహ్య రుజువు కూడా ఉంది. నాలుగు సువార్తలుకూడా ఒక నిర్దిష్టమైన, సరైన వివరణ గల, చారిత్రాత్మక పూర్వపరంలో ఆయన జీవించినట్లుగా చిత్రీకరిస్తున్నాయి. బేత్లహేము గలిలయవంటి ప్రాంతాలు; పొంతిపిలాతు మరియు పరిసయ్యులు వంటి ప్రముఖమైన వ్యక్తులు మరియు గుంపులు, అలాగే యూదా ఆచారాలు మరితర వివరాలు ఊరకనే కల్పించబడలేదు. మొదటి శతాబ్దంలో అవి జీవన విధానంలో భాగమయ్యాయి, మరి బైబిలుకు వ్యతిరేకమైన ఆధారాల ద్వారానూ పురావస్తు శాస్త్రజ్ఞులు కనిపెట్టిన వాటిద్వారానూ అవి ధ్రువీకరించబడ్డాయి.

కనుక, యేసు ఓ చారిత్రాత్మక వ్యక్తనేందుకు అటు అంతర్గతంగానూ ఇటు బాహ్యంగానూ ఒప్పింపజేసే రుజువులున్నాయి.

అయితే, ఆయనకు సంబంధించిన అద్భుతాలను గూర్చిన సందేహాలను అనేకమంది ప్రజలు కల్గివున్నారు. వాస్తవానికి, పైన సూచించిన సర్వే ప్రకారం, జర్మన్‌నందు చర్చికి వెళ్లే చాలా కొద్ది మంది మాత్రమే యేసు చేసిన అద్భుతాలు మరియు ఆయన పునరుత్థానం “నిజంగా సంభవించాయని” నమ్ముతున్నారు. యేసు చేసిన అద్భుతాలు మరియు ఆయన పునరుత్థానం గూర్చిన సందేహాలు న్యాయోచితమైనవేనా?

కొందరెందుకు యేసు చేసిన అద్భుతాలను అనుమానిస్తున్నారు

మత్తయి 9:18-36 యేసు అద్భుత రీతిలో రోగులను స్వస్థపర్చాడని, మరణించినవారిని పునరుత్థానం చేశాడని, దయ్యాలను వెళ్లగొట్టాడని నివేదిస్తోంది. ఓ చరిత్రకారుడైన ప్రొఫెసర్‌ హ్యుగో స్టౌడిన్‌జర్‌ ఇలా వ్యాఖ్యానిస్తున్నారు: “ఈ అసాధారణమైన నివేదికలు వట్టి ఊహ వల్ల కలగడం అసలు నమ్మరానిది మరి చరిత్ర వైపునుండి చూస్తే అసాధ్యమైనది.” ఎందుకు? ఎందుకంటే అనేకమంది ప్రత్యక్షసాక్షులు జీవించివున్న సమయంలోనే ప్రప్రథమ సువార్తలు వ్రాయబడ్డాయని అనిపిస్తుంది! స్టౌడిన్‌జర్‌ ఇంకా చెబుతున్నట్లుగా, యూదా వ్యతిరేకులు “యేసు అసాధారణమైన పనులను చేశాడని ఎన్నడూ నిరాకరించలేదు.” ఇతర రుజువులన్నింటినీ ప్రక్కన పెట్టి, మన తీర్పును బాహ్య రుజువులపై మాత్రమే ఆధారితం చేస్తే, యేసు చేసిన అద్భుతాలు నిజంగానే మనం విశ్వసించదగినవని మనం కనుగొంటాం.—2 తిమోతి 3:16.

“యేసు రోగులైన ప్రజలను స్వస్థపర్చాడని జర్మనీలోని అధికశాతం మంది విశ్వసించినప్పటికీ” ఈ స్వస్థతల వెనుకనున్న శక్తి మీద అనేకులకు సందేహం ఉంది. ఉదాహరణకు, మానసిక వ్యధతో బాధపడుతున్న ప్రజలను ప్రభావితం చేసే యోగనిద్రా ఫలితం వల్లనే యేసు ఈ స్వస్థతలను చేశాడని ప్రఖ్యాతిగాంచిన ఓ జర్మన్‌ వేదాంతి బహిరంగంగా చెప్పాడు. ఇది సరైన వివరణేనా?

దీన్ని పరిశీలించండి. యేసు, ఊచచెయ్యి గల వ్యక్తిని స్వస్థపర్చాడని మార్కు 3:3-5 నివేదిస్తోంది. అయితే ఊచచెయ్యి మానసిక వ్యధవల్ల కలిగినదా? ఎంతమాత్రం కాదు. తత్ఫలితంగా, ఈ స్వస్థత యోగనిద్రా శక్తికి ఆపాదించే అవకాశంలేదు. కనుక యేసు అద్భుతాలను చేసేందుకు ఏది సహాయపడింది? ప్రొఫెసర్‌ స్టౌడిన్‌జర్‌ ఇలా అంగీకరించారు: “సంపూర్ణంగా సుస్థాపితమైన విధులు లేకపోయినట్లైతే, మరి ఒకరు దేవున్ని పూర్తిగా కాదనకపోతే, అప్పుడు మానవుని శక్తికి మించిన శక్తి గల దేవుడు అసాధారణమైన వాటిని చేయగల సాధ్యతను సరైనరీతిలో ఒకరు త్రోసిపుచ్చలేరు.” అవును, వాస్తవానికి ‘దేవుని శక్తి’ సహాయంతో అస్వస్థతగల ప్రజలను యేసు అక్షరార్థంగా స్వస్థపర్చాడు. ఆయన చేసిన అద్భుతాల యథార్థతను శంకించేందుకు కారణమే లేదు.—లూకా 9:43; మత్తయి 12:28.

అమెరికా ప్రజల విజ్ఞాన సర్వస్వము వివరించిన విధంగా, అన్ని అద్భుతాలకన్నా గొప్ప అద్భుతమైన యేసు పునరుత్థానం జరిగినట్లైతే, సువార్తల్లో నివేదించబడిన అద్భుతాలన్నీ “జరిగే అవకాశం ఉంది.” యేసు నిజంగానే మృతులలోనుండి లేపబడ్డాడా?

యేసు పునరుత్థానాన్ని గూర్చిన సందేహాలు న్యాయోచితమైనవేనా?

యేసు పునరుత్థానపు యథార్థతకు మద్దతునిచ్చే వృత్తాంతానుమేయ ప్రమాణాన్ని పరిశీలించండి—అదే ఆయన సమాధి. యేసు సమాధి ఖాళీ అయ్యిందన్న విషయాన్ని ఆయన సమకాలీనులు, చివరికి ఆయన వ్యతిరేకులు కూడా కాదనలేరు. (మత్తయి 28:11-15) మోసం సులభంగా బహిర్గతపర్చబడగలదు! పైన ప్రస్తావించిన రెఫరెన్సు సరైన విధంగానే ఈ నిర్ణయానికి వచ్చింది: “ఖాళీ సమాధిని గూర్చి, ‘ఆయన ఇక్కడలేడు; . . . ఆయన లేచియున్నాడు,’ అన్న బైబిలు వివరణ తప్ప వేరే సరైన వివరణలేదు (మత్త. 28:6).”

యేసు స్వంత అనుచరులే ఆయన పునరుత్థానమైన మెస్సీయాయని అంతటా ప్రకటించారని చెబుతూ దాన్ని కొందరు నిరాకరిస్తారు. వాళ్లే ప్రకటించారన్నది వాస్తవమే. అయితే, ప్రత్యేకంగా యేసు మరణం మరియు పునరుత్థానం విషయంలో వారి సమాచారపు ప్రామాణికత చారిత్రాత్మక వాస్తవంలో నాటుకుని లేదా? నిస్సందేహంగా నాటుకుని ఉంది. “క్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని, ఆయననుగూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా? మృతులు లేపబడనియెడల దేవుడాయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము” అని అపొస్తలుడైన పౌలు వ్రాసినప్పుడు, ఈ సంబంధాన్ని గూర్చి ఆయనకు ముందే తెలుసు.—1 కొరింథీయులు 15:14, 15; యోహాను 19:35; 21:24; హెబ్రీయులు 2:3 పోల్చండి.

మొదటి శతాబ్దంలో, యేసు మరణించిన తర్వాత కనిపించాడన్న విషయానికి సాక్ష్యమివ్వగలిగే ప్రసిద్ధిగాంచిన అనేకమంది ప్రజలుండేవారు, మరి వారిలో 12 మంది అపొస్తలులు మరియు పౌలు ఉన్నారు, అలాగే 500 కంటే ఎక్కువమంది ప్రత్యక్ష సాక్షులున్నారు.b (1 కొరింథీయులు 15:6) అపనమ్మకస్థుడగు అపొస్తలుడైన యూదా స్థానాన్ని తీసుకునేందుకు గల అర్హతలను మత్తీయ ఎందుకు కల్గివున్నాడో కూడా మనస్సులో ఉంచుకోండి. మత్తీయ యేసు పునరుత్థానానికి మరియు ఆయనకు సంబంధించిన మునుపటి సంఘటనలకు సాక్ష్యమివ్వగలడని అపొస్తలుల కార్యములు 1:21-23 నివేదిస్తోంది. యేసు జీవితమూ పునరుత్థానమూ వాస్తవం కాకుండ ఒక కట్టుకథ అయివుంటే, ఆ నియామకానికి అలాంటి అర్హత ఏమాత్రం అవసరంలేదు.

అనేకమంది మొదటి శతాబ్దపు ప్రత్యక్షసాక్షులు యేసు జీవితం, అద్భుతాలు, మరణం మరియు పునరుత్థానాన్ని సాక్ష్యమివ్వగలిగారు కనుక, పైన పేర్కొన్న అడ్డంకులున్నప్పటికీ రోమా సామ్రాజ్యంలో క్రైస్తవత్వం ఇతర వాటికంటే ఎంతో త్వరగా వ్యాప్తి చెందింది. ఆయన అనుచరులు, పునరుత్థానాన్ని గూర్చి మరియు దానినుండి వచ్చే మూల సత్యాన్ని గూర్చి అంతటా ప్రకటించేందుకు కష్టం, హింస మరియు మృత్యువును కూడా సహించారు. ఆ సత్యం ఏమిటి? ఆయన పునరుత్థానం దేవుని శక్తి వల్లనే సాధ్యపడుతోందన్న సత్యం. మరి యెహోవా దేవుడు యేసును మృతులలోనుండి ఎందుకు పునరుత్థానం చేశాడు? ఆ ప్రశ్నకు జవాబు చారిత్రాత్మక యేసు ఎవరో చూపిస్తోంది.

పెంతెకొస్తు నాడు, యెరూషలేమునందు ఆశ్చర్యచకితులైన యూదులకు అపొస్తలుడైన పేతురు ఇలా స్వేచ్ఛగా ప్రకటించాడు: “ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించి యున్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు; అయితే అతడిట్లనెను—నేను నీ శత్రువులను నీ పాదములక్రింద పాదపీఠముగా ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.” (అపొస్తలుల కార్యములు 2:32-36) అవును, నజరేయుడైన యేసును యెహోవా దేవుడు “ప్రభువుగాను క్రీస్తుగాను” చేశాడు. దేవుని ఉద్దేశంలోని ఈ భాగంలో ఆయన పాత్రను గూర్చిన సందేహాలు న్యాయోచితమైనవేనా?

యేసు ప్రస్తుతం నిర్వహిస్తున్న పాత్రను ఎందుకు సందేహించాలి?

యేసు గుర్తింపు మరియు ఆయన పాత్రను గూర్చిన సందేహాలన్నీ ఎలా తొలగింపబడతాయి? ఆయన నిజమైన ప్రవక్తన్న వాస్తవం ద్వారానే. నేడు మనం చూస్తున్న యుద్ధాలు, కరువులు, భూకంపాలు, నేరాలు, ప్రేమ లేకపోవడం వంటి వాటిని ఆయన ముందే ప్రవచించాడు. అంతేకాకుండ, ఆయన ఇలా ప్రవచించాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:3-14) ఈ ప్రవచనాల నెరవేర్పు, యేసు పునరుత్థానుడైన క్రీస్తని, ‘తన శత్రువుల మధ్య’ అదృశ్యంగా పరిపాలిస్తున్నాడని మరియు త్వరలోనే దేవుని నూతనలోకాన్ని ప్రవేశపెడతాడని నిరూపిస్తోంది.—కీర్తన 110:1, 2; దానియేలు 2:44; ప్రకటన 21:1-5.

మునుపెన్నటికంటే కూడా ఇప్పుడు మానవజాతికి మానవాతీతమైన జ్ఞానముగల ఓ రక్షకుని అవసరత ఉంది. మానవజాతిని రక్షించేందుకు సరిగ్గా ఎంచుకున్న వ్యక్తి యేసే అన్న విషయాన్ని మనం ఎందుకు అనుమానించాలి? ఆకట్టే అద్భుతాలకు యేసు పునరుత్థానానికి ప్రత్యక్షసాక్షియైన యోహాను ఇలా ప్రకటించాడు: “మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చుచున్నాము.” (1 యోహాను 4:14; యోహాను 4:41, 42 పోల్చండి.) యేసు ఉనికి, అద్భుతాలు, మరణం మరియు పునరుత్థానాలను అనుమానించేందుకు సరైన ఆధారాలు మనకు లేవు కనుక, యెహోవా దేవుడు తన కుడిపార్శ్వమున న్యాయయుక్తమైన రాజుగా ఆయనను సింహాసనాసీనున్ని చేశాడన్న విషయాన్ని అనుమానించేందుకు మనకు ఏ కారణమూ లేదు. నిస్సందేహంగా, నజరేయుడైన యేసు దేవుని రాజ్యానికి రాజు మరియు ‘లోకరక్షకుడు.’—మత్తయి 6:10.

[అధస్సూచీలు]

a టాల్ముండ్‌లోని యేసును గూర్చిన వివాదాస్పద సూచనలను కొందరు విద్వాంసులు మాత్రమే యథార్థమైన వాటిగా అంగీకరిస్తున్నారు. మరోవైపు టాసిటస్‌, స్యూటోనియస్‌, ప్లిని ది యంగర్‌ ప్రస్తావనలు, అంతేకాకుండ ఫ్లేవియస్‌ జోసిఫస్‌ చేసిన ఒకే ఒక ప్రస్తావన చారిత్రాత్మకంగా యేసు ఉన్నాడనేందుకు రుజువులని సాధారణంగా అంగీకరించబడుతున్నాయి.

b నేడు కొందరు చెబుతున్నట్లుగా, ఒకానొక సందర్భంలో, పునరుత్థానమైన యేసు తన అనుచరులతో చేపలను తిన్నాడు, అది ఆయన కనిపించడం కేవలమొక దర్శనం కాదని నిరూపిస్తోంది.—లూకా 24:36-43.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి