కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 6/1 పేజీలు 26-29
  • మతపరంగా విభాగించబడిన కుటుంబంలో దైవిక విధేయత

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మతపరంగా విభాగించబడిన కుటుంబంలో దైవిక విధేయత
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • విధేయులుగా ఉండడానికి ఎందుకంత కష్టంగా ఉంటుంది?
  • దేవుడు మీ నుండి ఏమి అపేక్షిస్తున్నాడు?
  • దైవిక విధేయత చూపించడంలో సఫలులౌతున్న జీవిత భాగస్వాములు
  • దైవిక విధేయతను చూపించే పిల్లలు
  • ఇతరులు ఏమి చేయగలరు
  • దైవిక విధేయత వలన ఆశీర్వాదాలు, ప్రయోజనాలు
  • విధేయత బాల్యంలో నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠమా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • క్రమశిక్షణను అంగీకరించుట ద్వారా విధేయత నేర్చుకొనండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • మీ కుటుంబం కొరకు నిత్య భవిష్యత్తును సంపాదించుకోండి
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • కుటుంబ సభ్యులు సత్యంలో లేకపోయినా సంతోషంగా ఉండడం సాధ్యమే
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 6/1 పేజీలు 26-29

మతపరంగా విభాగించబడిన కుటుంబంలో దైవిక విధేయత

“అది శారీరక హింసకన్నా ఎక్కువగా గాయపరుస్తుంది. . . . శరీరమంతా నలగగొట్టబడినట్లు నేను భావించాను, అయితే ఎవరూ చూడలేరు.” “కొన్నిసార్లు జీవితం నుండి పారిపోవాలనిపిస్తుంది . . . లేదా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలని, మరెన్నడూ తిరిగి రాకూడదని అనిపిస్తుంది.” “కొన్నిసార్లు సరైన విధంగా ఆలోచించడం కష్టంగా ఉంటుంది.”

భావోద్వేగంతో నిండిన ఆ మాటలు నిరాశ, ఒంటరితనం అనే భావాలను వెల్లడి చేస్తాయి. దుర్భాషలకు అంటే నిందలకు, బెదిరింపులకు కించపరచే పేర్లకు, మాట్లాడకపోవడం వంటి వాటికి, భార్య లేదా భర్త మరియు కుటుంబ సభ్యుల నుండి శారీరక హింసకు గురయ్యే వారి నోట ఇలాంటి మాటలు వస్తాయి. ఈ ప్రజలు ఇంత నీచంగా ఎందుకు వ్యవహరించబడుతున్నారు? విభిన్న మత విశ్వాసాల కారణం వల్లే. ఇలాంటి పరిస్థితుల్లో, మతపరంగా విభాగించబడిన కుటుంబంలో జీవించడం యెహోవా దేవుని ఆరాధించడాన్ని నిజమైన సవాలుగా చేస్తుంది. అయితే, పీడించబడిన ఇలాంటి అనేకమంది క్రైస్తవులు దైవిక విధేయతను విజయవంతంగా కనబరచగలిగారు.

ఇటువంటి అమిత బాధ మరియు ఒత్తిడి మతపరంగా విభాగించబడిన అన్ని కుటుంబాల్లో కనిపించనందుకు కృతజ్ఞతలు. అయినప్పటికి, ఆ బాధ ఉంది. మీ గృహం ఈ వర్ణనకు తగినదిగా ఉందా? అయితే, మీ భర్తను లేదా మీ తలిదండ్రులను గౌరవించడం కష్టంగా ఉందని మీరు కనుగొనవచ్చు. మీరు అలాంటి పరిస్థితిలో ఉన్న భార్య అయితే, లేదా అలాంటి పరిసరంలోని పిల్లలైతే, మతపరంగా విభాగించబడిన ఇంట్లో దైవిక విధేయతను చూపించడంలో మీరెలా సఫలీకృతులవ్వగలరు? ఇతరులు ఎలాంటి మద్దతునివ్వగలరు? మరి దేవుడు ఈ విషయాన్ని ఎలా దృష్టిస్తాడు?

విధేయులుగా ఉండడానికి ఎందుకంత కష్టంగా ఉంటుంది?

లోకపు స్వలాభాపేక్ష మరియు కృతఘ్నతా క్రియలతోపాటు, మీ స్వంత అపరిపూర్ణ భావాలు దైవిక విధేయత చూపించడాన్ని ఎడతెగని పోరాటంగా చేస్తాయి. సాతానుకు ఇది తెలుసు, కాబట్టి మీరు క్రైస్తవునిగా ఉండాలనే మీ దృఢ నిశ్చయాన్ని సడలించాలనే ఉద్దేశంతో అతడున్నాడు. దైవిక ప్రమాణాల ఎడల మెప్పుదల, గౌరవం ఏమంత లేని, కుటుంబ సభ్యులను అతడు తరచూ ఉపయోగిస్తాడు. మీ ఉన్నతమైన ఆత్మీయ మరియు నైతిక ప్రమాణాలు అవిశ్వాసులైన మీ కుటుంబీకుల నుండి తరచూ పూర్తి భిన్నంగా ఉండవచ్చు. ప్రవర్తన మరియు పనులను గూర్చిన విరుద్ధమైన భావాలు అని దీని భావం. (1 పేతురు 4:4) “నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారైయుండక వాటిని ఖండించుడి,” అనే ఆజ్ఞకు మీరు విధేయులైనందుకే, క్రైస్తవ ప్రమాణం నుండి మీరు వైదొలగాలన్న ఒత్తిడి తీవ్రంగా ఉండవచ్చు. (ఎఫెసీయులు 5:11) మీరు ఇక ఏది చేసినా వారి దృష్టిలో సరైనది కాకపోవచ్చు. ఇదంతా మీ మతం వల్లే. రోగగ్రస్తులైన తన పిల్లల బాధ్యత మోయలేని ఒక తల్లి, తన భర్త సహాయాన్ని కోరినప్పుడు, ఆయన ఎత్తిపొడుస్తూ, ఈ విధంగా జవాబిచ్చాడు, “నీ మతం కొరకు నీకు సమయముంది; నీకు సహాయమవసరం లేదు.” అలాంటి వ్యాఖ్యానాలు విధేయులవ్వడమనే సవాలును మరింత తీవ్రతరం చేస్తాయి.

లేఖనాలను సూటిగా ఉల్లంఘించని కొన్ని విషయాలతో మీరు ఏకీభవించని సమయాలుంటాయి. అయితే, మీరు కుటుంబంలో భాగమని ఆ మేరకు మీకు కొన్ని బాధ్యతలున్నాయని మీరు గుర్తిస్తారు. “మా నాన్న మమ్మల్నెలా భావిస్తాడని నేను ఆలోచించినప్పుడు బాధపడతాను, ఎందుకంటే ఆయన ఒంటరివానిగా భావిస్తున్నాడని నేను గుర్తిస్తాను. మా నాన్న వ్యతిరేకతకు కోపగించుకోకూడదని నాకు నేను గుర్తు చేసుకోవలసి ఉంది. ఆయన మన స్థానం ఎడల అలా ప్రతిస్పందించడానికి, దాన్ని తృణీకరించడానికి కారణం ఉందని నాకు నేను చెప్పుకోవలసిన అవసరం ఉంది. సాతానే ఈ విధానానికి అధిపతి,” అని కోనీ చెబుతుంది. అవిశ్వాసిని వివాహం చేసుకున్న సూజెన్‌ రహస్యంగా ఇలా చెబుతుంది: “మొదట్లో విడిపోవాలని తరచూ అనుకునే దాన్ని, తర్వాత ఇక అనుకోలేదు. సాతాను ఆయనను ఉపయోగించి నన్ను శోధిస్తున్నాడని నాకు తెలుసు.”

మీరు పనికిరాని వారని తలంచేలా చేయాలన్న సాతాను ప్రయత్నాలు చాలా తీవ్రమైనవి. మీ వివాహజతతో మాట్లాడుకోకుండానే రోజులు గడిచిపోతుండవచ్చు. జీవితం మరింత ఏకాంతంగా మారగలదు. ఇది ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని హరించివేసి, మీ దైవిక విధేయతను పరీక్షిస్తుంది. పిల్లలు కూడా భావోద్రేకంగాను, శారీరకంగాను అలసిపోతారు. ఉదాహరణకు, తమ తలిదండ్రులు వ్యతిరేకించినప్పటికీ, ముగ్గురు యౌవనస్థులైన దేవుని సేవకులు నమ్మకంగా క్రైస్తవ కూటాలకు హాజరయ్యేవారు. వారిలో ఒకరు ఇప్పుడు పూర్తికాల సేవకురాలు, ఆమె ఈ విధంగా తెలియజేస్తుంది: “మేము చైతన్యం లేనివారుగాను, నిస్త్రాణులుగాను భావించేవారం; మేము నిద్రపోలేక పోయాం; అది మాకు ఎంతో దుఃఖాన్ని కలిగించింది.”

దేవుడు మీ నుండి ఏమి అపేక్షిస్తున్నాడు?

దేవునికి విధేయత చూపించడం అనేది ఎల్లప్పుడూ మొదట రావాలి, భర్త శిరస్సత్వానికి చూపించే పరిమిత విధేయత అనేది ఎల్లప్పుడూ యెహోవా నడిపిస్తున్న ప్రకారంగా ఉండాలి. (అపొస్తలుల కార్యములు 5:29) అది కష్టతరం కావచ్చు, అయినా అది సాధ్యమే. సహాయం కొరకు దేవుని వైపు చూస్తూనే ఉండండి. మీరు “ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనని,” ఆయన నడిపింపుకు అవధానమిచ్చి, లోబడాలని ఆయన కోరుకుంటున్నాడు. (యోహాను 4:24) దేవుని వాక్యము నుండి లభించే జ్ఞానం హృదయాన్ని సరైన దానితో నింపుతుంది గనుక అది ఇష్టపూర్వకంగా విధేయత చూపించేందుకు పురికొల్పుతుంది. మీ వ్యక్తిగత పరిస్థితులు మారుతున్నప్పటికీ, యెహోవా మారడు, ఆయన వాక్యము మారదు. (మలాకీ 3:6; యాకోబు 1:17) యెహోవా శిరస్సత్వాన్ని భర్తకు అప్పగించాడు. అతడు క్రీస్తు శిరస్సత్వాన్ని అంగీకరిస్తున్నా లేకపోయినా ఇది నిజం. (1 కొరింథీయులు 11:3) మీరు తరచూ హింసను, అవమానాన్ని ఎదుర్కొనేటట్లయితే, దీనిని పాటించడం కష్టమైనప్పటికీ, శిష్యుడైన యాకోబు ఈ విధంగా చెబుతున్నాడు: “పైనుండివచ్చు జ్ఞానము . . . సులభముగా లోబడునది.” (యాకోబు 3:17) ఈ శిరస్సత్వాన్ని నిస్సందేహంగా గుర్తించడానికి, అంగీకరించడానికి దేవుని ఆత్మ, ముఖ్యంగా ప్రేమయనే ఫలం అవసరం.—గలతీయులు 5:22, 23.

మీరు ఒకరిని ప్రేమించేటప్పుడు, దైవికంగా స్థాపించబడిన అధికారానికి దైవిక విధేయతను చూపించడం సులభతరంగా ఉంటుంది. ఎఫెసీయులు 5:33 (NW)ఈ విధంగా ఉపదేశిస్తుంది: “మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను, భార్యయైతే తన భర్తయందు ప్రగాఢ గౌరవం కలిగి యుండవలెను.”

యేసును గూర్చి ఆలోచించండి. ఆయన మాటలతోను, శారీరకంగాను హింసించబడ్డాడు, అయితే ఎన్నడూ ఎవరినీ దూషించలేదు. ఆయన కళంకం లేని చరిత్రను కాపాడుకున్నాడు. (1 పేతురు 2:22, 23) యేసు అలాంటి అవమానాలు సహించవలసి వచ్చింది, ఆయనకు గొప్ప ధైర్యము, తన తండ్రియైన యెహోవా ఎడల అచంచలమైన ప్రేమ అవసరమై ఉండేది. అయితే, ప్రేమ “అన్నిటికి తాళుకొనును.”—1 కొరింథీయులు 13:4-8.

పౌలు తన జతపనివాడైన తిమోతికి గుర్తు చేశాడు, నేడు మనకు కూడా గుర్తు చేస్తున్నాడు: “దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు.” (2 తిమోతి 1:7) తాళుకోవడానికి అసాధ్యమనిపించే పరిస్థితిలోను యెహోవా ఎడల మరియు యేసుక్రీస్తు ఎడల మీకు గల ప్రగాఢమైన ప్రేమ దైవిక విధేయతను చూపించడానికి మిమ్మల్ని పురికొల్పుతుంది. ఆత్మనిగ్రహమనేది సమతుల్య దృష్టిని కాపాడుకోవడానికి మరియు యెహోవా, యేసుక్రీస్తులతో మీకు గల సంబంధంపై శ్రద్ధ నిలపడానికి సహాయపడతాయి.—ఫిలిప్పీయులు 3:8-11 పోల్చండి.

దైవిక విధేయత చూపించడంలో సఫలులౌతున్న జీవిత భాగస్వాములు

యెహోవా మీ సమస్యలను ఎలా పరిష్కరిస్తాడని చూసేందుకు కొన్నిసార్లు మీరు చాలా కాలం వేచి ఉండవలసిన అవసరం ఉంటుంది. అయితే, ఆయన చెయ్యి ఎన్నడూ కురచ కాదు. దైవిక విధేయతను చూపించడంలో సఫలీకృతులౌతున్న ఒకరు ఈ విధంగా సలహా ఇస్తున్నారు: “కూటాల్లోను, సమావేశాల్లోను యెహోవాను ఆరాధించడానికి, పఠించడానికి, పరిచర్యకు వెళ్ళడానికి, ప్రార్థన చేయడానికి హక్కుగా, ఆధిక్యతలుగా ఆయన ఇస్తున్న పనులను ఎల్లవేళలా చేయండి.” యెహోవా కేవలం మీ విజయాలనే కాక మీ ప్రయత్నాలను కూడా ఆశీర్వదిస్తున్నాడు. అపొస్తలుడైన పౌలు 2 కొరింథీయులు 4:18నందు ఈ విధంగా చెప్పాడు, ‘క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది.’ దీనిని ధ్యానించుకోండి. ఇది మిమ్మల్ని దృఢపరచే కారణం అవుతుంది. ఒక ఇల్లాలు ఈ విధంగా చెబుతుంది: “నా కుటుంబ జీవితం మెరుగుపడడం లేదు, యెహోవాకు నేను ప్రీతికరంగా లేనా అని కొన్నిసార్లు ఆశ్చర్యపోయేదాన్ని. నా భర్తకన్నా నేనే ఈ క్లిష్టమైన పరిస్థితులను చక్కగా అధిగమించగలుగుతున్నానన్నది ఆయన ఆశీర్వాదం వల్లనేనని నేను అనుకుంటున్నాను. మన క్రియలు యెహోవాకు సంతోషం కలిగిస్తున్నాయని తెలుసుకోవడం మన శ్రమ అంతటిని ప్రయోజనకరమైనదిగా చేస్తుంది.”

మీరు సహించగలిగినంతకంటె ఎక్కువగా మీరు సహించడానికి తాను అనుమతించడని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. ఆయనను నమ్మండి. మీకన్నా ఆయనకు ఎక్కువ తెలుసు, మిమ్మల్ని గూర్చి మీకు తెలిసిన దానికన్నా ఎక్కువగా ఆయనకే తెలుసు. (రోమీయులు 8:35-39; 11:33; 1 కొరింథీయులు 10:13) క్లిష్టమైన పరిస్థితుల్లో యెహోవాకు ప్రార్థన చేయడం సహాయపడుతుంది. మరి ముఖ్యంగా మీరు ఏ త్రోవన వెళ్ళాలో, ఆ పరిస్థితిలో ఎలా వ్యవహరించాలో మీకు తెలియనప్పుడు పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించవలెనని ప్రార్థన చేయండి. (సామెతలు 3:5; 1 పేతురు 3:12) మీ జీవితంలో అధికారానికి లోబడేందుకు సహనం, ఆత్మనిగ్రహం, సాత్వికము కావాలని ఎడతెగక ఆయనకు విజ్ఞాపన చేయండి. కీర్తన రచయిత ఈ విధంగా చెప్పాడు: “యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు.” (కీర్తన 18:2) దీనిని గుర్తు చేసుకోవడం మతపరంగా విభాగించబడిన కుటుంబాల్లో నివసిస్తున్న వారికి బలాన్నిచ్చే సహాయంగా ఉండగలదు.

మరి ముఖ్యంగా, మీ వివాహాన్ని సంతోషకరంగా చేసుకునేందుకు మీరు చేయగల ప్రతి ప్రయత్నాన్ని చేయండి. అవును, సువార్త కుటుంబాల్లో విభజనలను సృష్టిస్తుందని యేసుకు ముందే తెలుసు. అయితే, విరోధమనేది మీ దృక్పథం వల్లో లేక ప్రవర్తన వల్లో కాకుండా ఉండేందుకు ప్రార్థన చేయండి. (మత్తయి 10:35, 36) ఈ లక్ష్యంతో సహకరించడం వివాహ సమస్యలను తగ్గిస్తుంది. ఈ సముచితమైన దృక్పథాన్ని మీరు మాత్రమే కనబరుస్తున్నప్పటికీ, సమస్యలు మరింత ఉద్ధృతమైన సంఘర్షణలుగా, తగవులుగా మారకుండా నివారించేందుకు అది చాలా తోడ్పడగలదు. సహనం, ప్రేమ అనేవి చాలా ప్రాముఖ్యము. “సాధువుగాను” ‘కీడును సహించువారుగాను ఉండండి.’—2 తిమోతి 2:24.

అపొస్తలుడైన పౌలు “అందరికి అన్నివిధముల” వాడయ్యాడు. (1 కొరింథీయులు 9:22) అలాగే, క్రైస్తవ కర్తవ్యాలను రాజీపరచకుండా ఉంటూ, కొన్నిసార్లు మీరు మీ వివాహ జతతో, కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు మీ పట్టికను సవరించుకోవలసిన అవసరం ఉండవచ్చు. మీరు జీవితాన్ని పంచుకోవడానికి ఎన్నుకున్న ఆ వ్యక్తితో సాధ్యమైనంత సమయాన్ని గడపండి. క్రైస్తవ పరిగణన చూపించండి. ఇది దైవిక విధేయతను కనబరచడమే.

పరిస్థితులకనుగుణంగా మెలిగే, సానుభూతిగల, దైవ భయంగల, వినయంగల భార్యకు దైవిక విధేయతను చూపించడం సులభంగా ఉంటుంది. (ఎఫెసీయులు 5:22, 23) “ఉప్పువేసిన” ఇంపైన మాటలు పెద్ద తగాదాలు తరచూ రాకుండా నివారించేందుకు సహాయపడతాయి.—కొలస్సయులు 4:6; సామెతలు 15:1.

అభిప్రాయ భేదాలను త్వరగా పరిష్కరించుకుని, “కోపముతో” నిద్రకుపక్రమించకుండా క్షేమాభివృద్ధికరమైన మంచి మాటలతో శాంతిని పునఃస్థాపించుకోవాలని దైవిక జ్ఞానం మీకు బోధిస్తుంది. (ఎఫెసీయులు 4:26, 29, 31) దీనికి వినయము అవసరం. బలం కొరకు యెహోవాపై పూర్తిగా ఆధారపడండి. ఒక క్రైస్తవ ఇల్లాలు ఈ విధంగా వినయంతో ఒప్పుకుంది: “ఎడతెగని ప్రార్థన తర్వాత, నా భర్తతో మరింత ప్రేమపూర్వకంగా ఉండేందుకు యెహోవా పరిశుద్ధాత్మ నన్ను బలపరచినట్లు భావించాను.” దేవుని వాక్యం ఈ విధంగా ఉపదేశిస్తుంది: “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు;. . . మేలు చేత కీడును జయించుము.” (రోమీయులు 12:17-21) ఇది జ్ఞానపూర్వకమైన సలహా, దైవిక విధేయత కూడా.

దైవిక విధేయతను చూపించే పిల్లలు

మతపరంగా విభాగించబడిన కుటుంబాల్లోని పిల్లలైన మీకు యెహోవా ఉపదేశమేమంటే: “అన్నివిషయములలో మీ తలిదండ్రులమాట వినుడి. ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది.” (కొలొస్సయులు 3:20) ఆలోచించేందుకు ప్రభువైన యేసుక్రీస్తును గురించి ప్రస్తావించబడిందని గమనించండి. కావున, అలా తలిదండ్రులకు విధేయత చూపించడం సంపూర్ణంగా కాదు. అపొస్తలుల కార్యములు 5:29నందలి “మనుష్యులకు కాదు దేవునికే లోబడవలెను” అనే ఉపదేశ భావం కొంతమేరకు క్రైస్తవ యౌవనస్థులకు కూడా వర్తిస్తుంది. లేఖనాల ప్రకారం సరైనదని మీకు తెలిసినదాని ఆధారంగా మీరు చేయవలసిన దానిని మీరు నిర్ణయించుకోవలసిన సందర్భాలు కూడా రావచ్చు. అబద్ధ ఆరాధనలో పాల్గొనడానికి నిరాకరించినందుకు ఏదైనా ఒక రకమైన శిక్ష అనుభవించవలసి ఉండవచ్చు. అది అసంతోషకరమైన విషయమైనప్పటికీ, దేవుని దృష్టిలో సరైన దానిని చేయడానికే మీరు శ్రమపడుతున్నారన్న వాస్తవం మీకు ఉపశమనాన్నివ్వవచ్చు, సంతోషాన్ని కూడా ఇవ్వవచ్చు.—1 పేతురు 2:19, 20.

మీ తలంపులు బైబిలు సూత్రాలద్వారా నడిపించబడుతున్నాయి గనుక, కొన్ని విషయాల్లో మీరు మీ తలిదండ్రులకు భిన్నంగా ఉండవచ్చు. ఇది వారిని మీకు శత్రువులనుగా చేయదు. వారు యెహోవాకు సమర్పించుకున్న సేవకులు కాకపోయినప్పటికీ, సముచితమైన గౌరవానికి వారు అర్హులు. (ఎఫెసీయులు 6:2) సొలొమోను ఈ విధంగా చెప్పాడు: “నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము.” (సామెతలు 23:22) వారికి వింతగా అనిపించే విశ్వాసాన్ని మీరు వెంబడించడం వారిని ఎంతగా గాయపరుస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారితో మాట్లాడండి, ‘మీ సహేతుకతను తెలియబడనియ్యుడి.’ (ఫిలిప్పీయులు 4:5) మీ బాధలను, వ్యాకులతలను పంచుకోండి. దేవుని సూత్రాలను అంటిపెట్టుకొని ఉండండి, అయినప్పటికీ, “శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.” (రోమీయులు 12:18) మీరు ఇప్పుడు తలిదండ్రుల నియమాలకు లోబడుతున్నారన్న వాస్తవం, మీరు రాజ్యం యొక్క ప్రజలుగా విధేయులుగా కొనసాగాలన్న మీ కోరికను యెహోవాకు తెలియజేస్తుంది.

ఇతరులు ఏమి చేయగలరు

మతపరంగా విభాగించబడిన కుటుంబాల్లో ఉన్న క్రైస్తవులకు సహ ఆరాధికుల నుండి మద్దతు, అవగాహన అవసరము. ఈ విధంగా చెప్పిన ఒకరి మాటల్లో ఇది స్పష్టం: “ఎవరూ ఏమి చేయలేరు, దానిని మార్చుకోవడానికి నేను కూడా ఏమీ చేయలేను గనుక, నేను పూర్తిగా నిరీక్షణ లేనట్లు, సహాయం లేనట్లు భావించాను. మా కుటుంబంలో యెహోవా చిత్తం ఏదైనప్పటికీ, దాన్ని నెరవేర్చడానికి నేను ఆయనయందు నమ్మకముంచుతున్నాను.”

క్రైస్తవ కూటాల్లో ఆత్మీయ సహోదర సహోదరీలతో సహవసించడం ఒక ఆశ్రయం. ఈ వ్యక్తే తన జీవితాన్ని ఈ విధంగా వర్ణించింది, “రెండులోకాల్లో ఉన్నట్లుగా ఉంది. ఒకటి నేను ఉండవలసిన లోకం, మరొకటి నేనుండాలని ఇష్టపడుతున్న లోకం.” సహోదర ప్రేమ అనేది ఇలాంటి పీడితులు అన్ని పరిస్థితులను తాళుకుని సేవించడాన్ని సాధ్యపరుస్తుంది. మీ ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోండి. (ఎఫెసీయులు 1:16) క్రమంగాను ప్రతి సందర్భంలోను ప్రోత్సాహకరమైన, అనుకూలమైన, ఊరట కలిగించే మాటలనే వారితో పలకండి. (1 థెస్సలోనీకయులు 5:14) ఆచరణాత్మకమైనప్పుడెల్లా, సముచితమైనప్పుడెల్లా, మీ దైవపరిపాలనా మరియు సాంఘిక కార్యక్రమాల్లో వారిని చేర్చుకోండి.

దైవిక విధేయత వలన ఆశీర్వాదాలు, ప్రయోజనాలు

మతపరంగా విభాగించబడిన ఇంట్లో దైవిక విధేయతను చూపించడం వల్ల కలిగే ఆశీర్వాదాలను, ప్రయోజనాలను గూర్చి ప్రతిరోజు ధ్యానించండి. విధేయులుగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ‘అలిసిపోవద్దు.’ (గలతీయులు 6:9) “దేవుని గూర్చిన మనస్సాక్షికలిగి” ఉన్నందువల్ల ప్రతికూలమైన పరిస్థితులను, అన్యాయాలను సహించడం దేవునికి “హితమగును.” (1 పేతురు 2:19, 20) యెహోవా యొక్క నీతియుక్తమైన సూత్రాలకు, నియమాలకు రాజీపడనంత మేరకు విధేయులుగా ఉండండి. ఇది యెహోవా ఏర్పాటు ఎడల యథార్థతను చూపిస్తుంది. మీ దైవిక ప్రవర్తన మీ వివాహ జత యొక్క జీవితాన్ని, మీ పిల్లల లేదా తలిదండ్రుల జీవితాన్ని కూడా రక్షించవచ్చు.—1 కొరింథీయులు 7:16; 1 పేతురు 3:1.

మతపరంగా విభాగించబడిన కుటుంబంలో అవసరాలను, అపేక్షలను తీర్చడానికి మీరు పోరాడుతుండగా, యెహోవా దేవుని ఎడల మరియు యేసుక్రీస్తు ఎడల యథార్థతను కాపాడుకోవలసిన ప్రాముఖ్యతను గుర్తుంచుకోండి. మీరే విషయాన్నైనా విడిచిపెట్టవచ్చు, కాని యథార్థతను విడిచిపెట్టడం అంటే జీవంతో సహా అన్నింటినీ విడిచిపెట్టడమే. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్పాడు: “దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయనద్వారా ప్రపంచములను నిర్మించెను.” అలాంటి “గొప్ప రక్షణను” గుర్తించడం మీరు విధేయులుగా ఉండేందుకు తోడ్పడుతుంది.—హెబ్రీయులు 1:1, 2; 2:3.

రాజీపడని మీ విధేయత, సరైన నైతిక నియమాలు మరియు మూల్యాల ఎడల మీ స్థిరత్వం అనేది మీకు, అవిశ్వాసియైన మీ వివాహ జతకు ఆరోగ్యకరమైన రక్షణగా ఉంటుంది. నమ్మకము కుటుంబ బంధాలను పటిష్టం చేస్తుంది. సామెతలు 31:11 సామర్థ్యంగల నమ్మకస్థురాలైన భార్యను గూర్చి ఈ విధంగా చెబుతుంది: “ఆమె పెనిమిటి ఆమెయందు నమ్మికయుంచును.” మీ మంచి ప్రవర్తన, ప్రగాఢమైన గౌరవం అవిశ్వాసియైన మీ భర్త కన్నులను తెరువవచ్చు. దేవుని సత్యాన్ని అంగీకరించడానికి అది అతనిని నడిపించవచ్చు.

దైవిక విధేయత నిజంగా అమూల్యమైనది, జీవాన్ని రక్షించేది. మీ కుటుంబ జీవితంలో దాని కొరకు ప్రార్థించండి. అది మనశ్శాంతినిస్తుంది, యెహోవాకు స్తుతులను తెస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి