కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 6/1 పేజీలు 30-31
  • పాఠకుల నుండి ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల నుండి ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసుక్రీస్తు మనకెలా సహాయం చేయగలడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • దేవుని కృపకు కృతజ్ఞత చూపించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • మీరు అపారదయ వల్ల విడుదల పొందారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • దేవుని కృప గురించిన సువార్త ప్రకటించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 6/1 పేజీలు 30-31

పాఠకుల నుండి ప్రశ్నలు

హెబ్రీయులు 4:15, 16లో పేర్కొనబడిన క్రీస్తుయేసు యొక్క ప్రధానయాజక సేవ ఫలితాలు “వేరే గొఱ్ఱెలకు” ఇప్పుడు ఎలా అన్వర్తించబడతాయి?

ప్రధానయాజకునిగా యేసు పాత్ర ఆయనతోపాటు పరలోకంలో ఉండేవారికి ప్రాథమిక భావాన్ని సూచిస్తున్నప్పటికీ, భూ నిరీక్షణలున్న క్రైస్తవులు యేసు యాజక సేవల నుండి ఇప్పుడు కూడా ప్రయోజనం పొందుతారు.

ఆదాము కాలం నుండి మానవులపై పాపపు భారం మోపబడింది. ఇశ్రాయేలీయులవలె మనం కూడా సంతరించుకున్న అపరిపూర్ణత వల్ల కష్టమనుభవిస్తున్నాము. తమ స్వంత పాపాలకు, అలాగే ప్రజల పాపాలకు బలులనర్పించే ప్రధానయాజకుల మరియు సహ యాజకుల వంశము మీద ఆధారపడేవారు. కాలక్రమేణ, “మెల్కీసెదెకు క్రమము చొప్పున” యేసు యాజకునిగా అభిషేకించబడ్డాడు. పునరుత్థానం చేయబడిన తర్వాత యేసు తన పరిపూర్ణమానవ బలి మూల్యాన్ని ఇవ్వడానికి యెహోవా సన్నిధికి వెళ్ళాడు.—కీర్తన 110:1, 4.

మనకు నేడు దీని భావమేమిటి? హెబ్రీయులకు తాను వ్రాసిన పత్రికలో ప్రధానయాజకునిగా యేసు పరిచర్యను గూర్చి పౌలు చర్చించాడు. హెబ్రీయులు 5:1నందు మనమీ విధంగా చదువుతాము: “ప్రతి ప్రధానయాజకుడును మనుష్యులలోనుండి యేర్పరచబడినవాడై, పాపములకొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యులనిమిత్తము నియమింపబడును.” తర్వాత 5, 6 వచనాల్లో యేసు ప్రధాన యాజకుడయ్యాడని అది మనకు ప్రయోజనాన్నిస్తుందని పౌలు చూపించాడు.

అదెలా? పౌలు ఈ విధంగా వ్రాశాడు: “ఆయన కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, . . . తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను.” (హెబ్రీయులు 5:8, 9) మొదట ఆ వచనం, దేవునికి, యేసుకు విధేయులయ్యే మానవుల పాపపూర్ణ స్థితి తొలగించబడినప్పుడు, నూతన లోకంలో మనం ఎలా ప్రయోజనం పొందగలుగుతామని ఆలోచించేలా చేస్తుంది. అది యేసు బలి మరియు ప్రధానయాజకునిగా ఆయన సేవల యొక్క విమోచనా మూల్యం పై ఆధారపడిన అమూల్యమైన నిరీక్షణ.

అయితే, నిజంగా మనం ఇప్పుడే ప్రధానయాజకునిగా ఆయన పాత్ర లేదా సేవ నుండి ప్రయోజనం పొందవచ్చు. హెబ్రీయులు 4:15, 16 గమనించండి: “మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.” ఏది “సమయోచితమైన సమయమై” ఉంటుంది? మనకు కనికరము, కృప అవసరమున్న సమయమది. మనమందరం మన అపరిపూర్ణతను బట్టి ఇప్పుడే ఆ అవసరమున్నట్లు భావించాలి.

ఇప్పుడు పరలోకంలో ప్రధానయాజకుడగు యేసు ఒకప్పుడు మానవునిగా కూడా జీవించాడు గనుక తాను సహానుభూతి చూపించగలడని హెబ్రీయులు 4:15, 16 చూపిస్తుంది. ఎవరికి చూపించగలడు? మనకే. ఎప్పుడు? ఇప్పుడే. యేసు మానవుడుగా ఉన్నప్పుడు, మానవులకు సర్వసాధారణమైన ప్రయాసాలను, కష్టాలను ఆయన అనుభవించాడు. ఒక సందర్భంలో యేసు ఆకలిగొన్నాడు, దప్పిగొన్నాడు. ఆయన పరిపూర్ణుడైనప్పటికీ అలసటచెందాడు. అది మనకు అభయాన్నిస్తుంది. ఎందుకని? యేసు సహజమైన అలసటను పొందాడు గనుక, మనం తరచూ ఎలా భావిస్తామో ఆయనకు తెలుసు. తన అపొస్తలుల మధ్య ఈర్ష్య వలన కలిగిన వివాదాన్ని యేసు తీర్చవలసి వచ్చిందని కూడా గుర్తుంచుకోండి. (మార్కు 9:33-37; లూకా 22:24) అవును, ఆయనకు నిరాశ కలిగింది. మనం నిరాశచెందినప్పుడు, నిరుత్సాహం చెందినప్పుడు ఆయన మనలను అర్థం చేసుకోగలుగుతాడని అది మనకు నమ్మకాన్నివ్వదా? తప్పకుండా.

మీరు నిరుత్సాహపడినప్పుడు, మీరు ఏమి చేయగలరు? క్రొత్తలోకంలో మీరు శారీరకంగాను, మానసికంగాను పరిపూర్ణులగుటకు ప్రధానయాజకునిగా యేసు మీకు తోడ్పడేంతవరకు మీరు ఎదురు చూడవలసిందేనని పౌలు చెప్పాడా? లేదు. పౌలు ఈ విధంగా చెప్పాడు: ‘మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందవచ్చు.’ మరి అందులో ప్రస్తుత కాలం కూడా ఇమిడి ఉంది. అంతేకాక, యేసు మానవుడిగా ఉన్నప్పుడు, ఆయన కష్టాలను, బాధలను అనుభవించాడు, ‘సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడ్డాడు.’ కాబట్టి మనమలాంటి వాటిని ఎదుర్కొన్నప్పుడు, మనం ఏమి అనుభవిస్తున్నామన్న దానిని గూర్చిన ఆయన అవగాహన ఆధారంగా మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధమే. అది మిమ్మల్ని ఆయనకు సమీపస్థులనుగా చేయదా?

ఇప్పుడు 16వ వచనాన్ని గమనించండి. మనం అంటే అభిషక్తులు మరియు వేరే గొర్రెలకు చెందినవారును దేవుని యొద్దకు ధైర్యముగా చేరగలమని అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు. (యోహాను 10:16) మనం ప్రార్థనలో మనకిష్టమైన దేనినైనా, కోపము మరియు అగౌరవనీయమైన విషయాలను కూడా చెప్పవచ్చని అపొస్తలుడు భావించలేదు. బదులుగా, యేసు బలి మరియు ప్రధానయాజకుడనే ఆయన పాత్ర ఆధారంగా, మనం పాపులమైనప్పటికీ దేవున్ని సమీపించగలము.

మనం ప్రధానయాజకునిగా యేసుక్రీస్తు సేవల నుండి ఇప్పుడే ప్రయోజనం పొందగలిగే మరొక మార్గంలో మన పాపాలు లేదా తప్పిదాలు ఇమిడి ఉన్నాయి. నిజమే, ప్రస్తుత విధానంలో యేసు తన బలి యొక్క పూర్తి విలువను ఉపయోగిస్తాడని నిరీక్షించలేము. ఆయన అలా చేసినా, మనకు నిత్యజీవం కలుగదు. లూకా 5:18-26నందు వ్రాయబడిన, పక్షవాతంగలవానితో సహా అతని పడకను ఇంటికప్పు తెరిచి క్రిందకు దింపిన సంఘటనను గూర్చిన కథ జ్ఞాపకముందా? “మనుష్యుడా నీ పాపములు క్షమింపబడియున్నవని” యేసు అతనితో చెప్పాడు. అది పక్షవాతానికి కారణమైన కొన్ని ప్రత్యేక పాపాలను అది చూపించలేదు. ఆ వ్యక్తి యొక్క పాపాలను అది సూచించి ఉంటుంది, అందులో బాధలకు కొంతవరకు కారణమైన అతని వారసత్వపు పాపం ఇమిడి ఉంటుంది.

పాపపరిహారార్థ దినమున అజాజేలు మేకపిల్ల ఇశ్రాయేలీయులు పాపమును మోసినట్లు, తాను అర్పించబోయే బలి ఆధారంగా యేసు ఆ వ్యక్తి యొక్క పాపాన్ని మోశాడు. (లేవీయకాండము 16:7-10) అయితే, పక్షవాతం గల ఆ వ్యక్తి అప్పటికీ మానవుడే. అతడు మళ్ళీ పాపం చేసేవాడే, కాలక్రమేణా, పాపులు మరణించవలసి ఉన్నట్లు మరణించాడు కూడా. (రోమీయులు 5:12; 6:23) యేసు చెప్పిన దాని భావం, ఆ మనిషి ఆ నిమిషంలోనే నిత్య జీవాన్ని పొందుతాడని కాదు. కాని, ఆ మనిషి ఆ సమయంలో కొంతమేరకు పాపక్షమాపణ పొంది, ఆశీర్వదించబడ్డాడు.

ఇప్పుడు మన పరిస్థితిని పరిగణించండి. మనం అపరిపూర్ణులం గనుక ప్రతిరోజు తప్పులు చేస్తాము. (యాకోబు 3:2) దానిని గూర్చి మనమేం చేయగలం? మనకు పరలోకంలో కృపగల ప్రధానయాజకుడు ఉన్నాడు, ఆయన ద్వారా మనం ప్రార్థనలో యెహోవాను సమీపించగలము. అవును, పౌలు వ్రాసినట్లు మనమందరం “కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో [దేవుని] కృపాసనమునొద్దకు చేర”గలం. దాని ఫలితంగా, నేడు వేరే గొర్రెలకు చెందినవారందరు తప్పకుండా క్రీస్తు యొక్క ప్రధానయాజక సేవలోనుండి మంచి మనస్సాక్షితో సహా అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.

భూ నిరీక్షణ గల క్రైస్తవులందరూ సమీపమౌతున్న క్రొత్త లోకంలో గొప్ప ప్రయోజనాల కొరకు ఎదురు చూడగలరు. అప్పుడు మన పరలోక ప్రధానయాజకుడు పాపం నుండి పూర్తి క్షమాపణనిస్తూ, తన బలి యోగ్యతను పూర్తిగా ఉపయోగిస్తాడు. ప్రజల శారీరక, ఆత్మీయ ఆరోగ్యం ఎడల జాగ్రత్త వహించడం ద్వారా మరి గొప్ప ప్రయోజనాలను ఆయన చేకూర్చుతాడు. భూమిపై దేవుని ప్రజల విద్యాభ్యాసాన్ని యేసు ఎంతో విస్తృతపరుస్తాడు, ఎందుకంటే ఇశ్రాయేలులో ధర్మశాస్త్రాన్ని నేర్పించడం యాజకుల పెద్ద బాధ్యత. (లేవియకాండము 10:8-11; ద్వితీయోపదేశకాండము 24:8; 33:8, 10) అలా, మనమిప్పుడు యేసు యొక్క యాజక సేవ నుండి ప్రయోజనం పొందుతుండగా, మనకొరకు మరి అధికమైనది వేచి ఉంది!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి