కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 4/15 పేజీలు 2-6
  • మత సత్యం పొందగల్గినదేనా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మత సత్యం పొందగల్గినదేనా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • తత్వశాస్త్రం మరియు సత్యం
  • సత్యం బయల్పర్చబడవల్సిన అవసరముందా?
  • మతము మరియు సత్యము
  • ‘గోధుమలూ గురుగులు’
  • క్రైస్తవులు ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • సత్యంకొరకు ఎందుకు అన్వేషించాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • సత్యదేవుని అనుకరించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ‘సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 4/15 పేజీలు 2-6

మత సత్యం పొందగల్గినదేనా?

స్వీడన్‌నందున్న ఉప్ప్‌సాలా పట్టణంలోని విశ్వవిద్యాలయమందు, ఆత్మీయ విషయాల్లో ఆసక్తిగల ఒక వ్యక్తి తన పట్టణంలోని వివిధ మత ఆరాధనా స్థలాలను సందర్శించడంతో సహా, వాటి నమ్మకాలను అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నాడు. వారి మతనాయకులు ప్రకటించగా ఆయన విన్నాడు, మరియు ఆయన కొందరు సభ్యులను ఇంటర్వ్యూ చేశాడు. యెహోవాసాక్షులు మాత్రమే “సత్యాన్ని కనుగొన్నామని” ఒప్పించబడినట్లుగా ఆయన గమనించాడు. ఇప్పుడున్న వివిధ రకాల మతాభిప్రాయాలను పరిశీలిస్తూ సాక్షులు, అలా ఎలా చెప్పగల్గారా అని ఆయన ఆశ్చర్యపోయాడు.

మతం విషయంలోని సత్యాన్ని కనుగొనడం సాధ్యమేనని మీరు వ్యక్తిగతంగా అనుకుంటున్నారా? ఫలానాది పరమ సత్యమని నిర్ణయించడం కూడా సాధ్యమేనా?

తత్వశాస్త్రం మరియు సత్యం

తత్వశాస్త్రాధ్యయనం చేసినవారు, పరమ సత్యం మానవజాతికి అందుబాటులో లేదనే దృక్పథాన్ని వృద్ధిచేసుకున్నారు. తత్వశాస్త్రమన్నది “జీవితము మరియు జీవపు ఆరంభమును గూర్చి వివరించేందుకు ప్రయత్నించే విజ్ఞానశాస్త్రంగా” నిర్వచించబడిందని మీకు తెలిసివుండవచ్చు. అయితే, వాస్తవానికి అది అంతమేరకు వెళ్లడం చాలా అరుదు. ఫిలొసొఫిన్స్‌ హిస్టోరియా (తత్వశాస్త్ర చరిత్ర) నందు, స్వీడిష్‌ రచయితయైన ఆల్ఫ్‌ అల్బర్గ్‌ ఇలా వ్రాశారు: “తత్వశాస్త్ర ప్రశ్నల్లో అనేకం ఎలాంటివంటే వాటికి కచ్చితమైన జవాబు చెప్పడం సాధ్యంకాదు. . . . [విషయాలను గూర్చిన మొదటి సూత్రాలకు సంబంధించిన] ఆధ్యాత్మిక సమస్యలన్ని . . . ఈ కోవకు చెందినవేనని అనేకులు అభిప్రాయపడుతున్నారు.”

తత్ఫలితంగా, తత్వశాస్త్రం ద్వారా జీవాన్ని గూర్చిన ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబును వెతికేందుకు ప్రయత్నించేవారు తరచూ చివరికి అసంతృప్తిని లేక బాధను అనుభవిస్తారు. టాంకలిన్‌యర్‌ ఒక్‌ ట్రాస్‌ఫోర్మర్‌ (ఆలోచన మరియు మత విశ్వాస పరంపర) అనే తన పుస్తకంలో, స్వీడన్‌ రచయిత గన్నార్‌ ఆస్పలిన్‌ ఇలా చెప్పాడు: “ప్రకృతి, ఒక సీతాకోకచిలుకపైన ఒక దోమపైన చూపించేంత ఆసక్తిని మాత్రమే మానవులపైన చూపుతోందని మనం చూడగలము. . . . అంతరిక్ష్యంలోనూ మన అంతర్గత ప్రపంచంలోను ఒకదానిపై ఒకటి ప్రభావం చూపే శక్తులున్నప్పుడు మనం శక్తిలేనివాళ్లం, బొత్తిగా శక్తిలేనివాళ్లం. అభివృద్ధినందు విశ్వసించి మరియు మంచి భవిష్యత్తును గూర్చి ప్రజలు కలలుగన్న శతాబ్దపు చివరిబాగంలోని సాహిత్యాల్లో ఈ దృక్పథం తరచూ కనిపించేది.”

సత్యం బయల్పర్చబడవల్సిన అవసరముందా?

జీవాన్ని గూర్చిన సత్యాన్ని కనుగొనడంలో మానవ ప్రయత్నాలు సఫలం కాలేదు మరియు అవి ఎన్నడూ సఫలమవ్వవన్నట్లుగా అనిపిస్తుంది. అయితే, ఏదొక రకమైన దైవిక ప్రకటన అవసరమని నిర్ధారించేందుకు మంచి కారణముంది. ప్రకృతి అనే పుస్తకం కొంత వెల్లడిస్తుంది. జీవోద్భవాన్ని గూర్చి నిర్దిష్టమైన వివరణలను ఇవ్వకపోయినప్పటికి, జీవాన్ని గూర్చి నిరీశ్వరవాదపూరితమైన వివరణకంటే కూడా ఎంతో సంతృప్తికరమైన వివరణ ఉందని చూపిస్తోంది. శిధిలమవుతున్న ఒక బొరియలో పేరుకుపోయిన రాళ్లు ఏ నియమాలను బట్టి ఉన్నాయో దానికి పూర్తి విరుద్ధమైన నియమాన్ని బట్టి ఒక గడ్డి మొలక పైకి పెరుగుతుంది. నిర్జీవ పదార్థాలు చేసుకోలేని విధంగా, ప్రకృతిలోని సజీవపదార్థాలు తమను తాము నిర్మించుకోగలవు, అమర్చుకోగలవు. “ఆయన [దేవుని] అదృశ్యలక్షణములు, . . . జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి” అని న్యాయం మరియు మతం విషయాల్లో ప్రసిద్ధిగాంచిన విద్యార్థి నిర్ధారించి చెప్పేందుకు ఆధారంకల్గివున్నాడు.—రోమీయులు 1:20.

ఈ నిర్మాణం మరియు సంస్థీకరణ వెనుక ఎవరున్నారన్నదాన్ని కనుగొనేందుకు, మనకింకా ప్రకటనలు అవసరం. అలాంటి ప్రకటన ఉండాలని మనం అపేక్షించకూడదా? భూమ్మీది జీవానికి కారణమైనవాడు తన ప్రాణులకు తనను తాను బయల్పర్చుకుంటాడని అపేక్షించడం సహేతుకం కాదా?

బైబిలు అలాంటి ప్రకటనలుగల గ్రంథంగా చెప్పుకుంటోంది. ఈ పత్రికలో, బైబిలు అలాంటి గ్రంథమని అంగీకరించేందుకుగల మంచి కారణాలను మేము తరచూ అందిస్తూనే ఉన్నాము, మరి ఆలోచనాపరులైన అనేకమంది ప్రజలు దీన్ని అంగీకరించారు కూడా. బైబిలును వ్రాసినవారు, తమంతట తామే వాటిని వ్రాయలేదని స్పష్టపర్చాలనే కుతూహలాన్ని కల్గివున్నారన్న వాస్తవమే గమనార్హమైన విషయం. బైబిలు ప్రవక్తలు మూడువందల కంటే ఎక్కువ సార్లు, “యెహోవా సెలవిచ్చునదేమనగా” అనేటటువంటి మాటలను ఉపయోగించారని మనం కనుగొనగలము. (యెషయా 37:33; యిర్మీయా 2:2; నహూము 1:12) పుస్తకాలు లేక శీర్షికలు వ్రాసే స్త్రీపురుషులు వాటిపై తమ సంతకం చేయాలనే ఆతురతను ఎంతగానో కల్గివుంటారని బహుశ మీకు తెలిసేవుండవచ్చు. అయితే, బైబిలును వ్రాసిన వారు తమను తాము తెరవెనుకనే ఉంచుకున్నారు; బైబిలునందలి కొన్ని భాగాలను ఎవరు వ్రాశారో తెలుసుకోవడం కొన్ని సందర్భాల్లో చాలా కష్టం.

బైబిలునందు ప్రాముఖ్యమైందిగా కనుగొనగల మరో విషయం దాని అంతర్గత సమన్వయమే. పదహారు వందల సంవత్సరాల పాటు బైబిల్లోని 66 పుస్తకాలు వ్రాయబడడమనే విషయాన్ని పరిశీలించినప్పుడు ఇది నిజంగా గణనీయమే. మీరొక ప్రజా గ్రంథాలయానికి వెళ్లి, 16 శతాబ్దాల పాటు రచించబడిన 66 మత సంబంధమైన పుస్తకాలను ఎన్నుకున్నారనుకోండి. తర్వాత ఆ విడి పుస్తకాలను మీరు ఒక సంపుటి క్రింది బౌండ్‌ చేయిస్తారు. ఆ సంపుటిలో ఒకే అంశముండి, ఒకే సమన్వయ వర్తమానం ఉంటుందని మీరు అపేక్షిస్తారా? అపేక్షించము. దానికో అద్భుతం జరగాలి. దీన్ని పరిశీలించండి: బైబిలునందలి పుస్తకాలకు అలాంటి ఒకే అంశముంది మరియు అవి తప్పక ఒకదానినొకటి ధ్రువపర్చుకుంటాయి. బైబిలు రచయితలు వ్రాసిన వాటిని నడిపించేందుకు ఒక నిపుణుడు లేక రచయిత ఉన్నాడని ఇది ప్రదర్శిస్తుంది.

అయితే, ఇంకా అన్నిటికంటే కూడా అధికంగా బైబిలు దేవుని నుండి కలిగినదని నిరూపించేది ఒకటి ఉందని మీరు కనుగొంటారు. అవే ప్రవచనాలు—భవిష్యత్తునందు కచ్చితంగా సంభవించే వాటిని గూర్చి ముందుగా వ్రాయబడిన సమాచారం. “ఆ దినమున” మరియు “అంత్య దినములలో” వంటి మాటలు బైబిలునందు విశేషంగా ఉన్నాయి. (యెషయా 2:2; 11:10, 11; 23:15; యెహెజ్కేలు 38:18; హోషేయ 2:21-23; జెకర్యా 13:2-4) యేసుక్రీస్తు భూమి మీద కనిపించకముందు అనేక సంవత్సరాల క్రితం, హెబ్రీ లేఖనాల్లోని ప్రవచనాలు ఆయన జీవితాన్ని గూర్చిన వివరాలను, అంటే ఆయన జననంనుండి మరణం వరకున్న వివరాలను అందించాయి. బైబిలే అసలైన జీవిత సత్యానికి మూలమనే సహేతుకమైన నిర్ధారణ కంటే మేలైనది లేదు. “నీ వాక్యము సత్యము” అనే మాటలతో దీనిని యేసు నిర్ధారిస్తున్నాడు.—యోహాను 17:17.

మతము మరియు సత్యము

బైబిలునందు విశ్వసిస్తున్నామని చెప్పుకునే అనేకులు కూడా పరిపూర్ణ సత్యాన్ని పొందడం అసాధ్యమని నమ్ముతున్నారు. అమెరికా మతనాయకుడైన జాన్‌ ఎస్‌. సాంజ్‌ ఇలా వ్యాఖ్యానించాడు: “మన వద్ద సత్యముందని మరియు ఇతరులు మన ఆలోచనా విధానానికి రావాలనే ఆలోచననుండి . . . మనం మార్చుకుని, పరమ సత్యం మనందరి అవగాహనకు ఎంతో దూరాన ఉందనే గ్రహింపుకు రావాలి.” ఒక రోమన్‌ కాథోలిక్‌ రచయితయైన క్రిస్టఫర్‌ డెర్రిక్‌, సత్యాన్ని కనుగొనే విషయంలో ప్రతికూల దృక్పథానికి గల కారణాన్నిస్తున్నాడు: “మతపరమైన ‘సత్యాన్ని’ ప్రస్తావించడం, ఏదొక రకంగా అది తెలుసు అని చెప్పుకోవడం అవుతుంది. . . . వారెవరో చెప్పింది బహుశ తప్పని మీరు భావించవచ్చు; మరి అది అంగీకృతమైంది కానే కాదు.”

అయితే, ఆలోచనాపరుడైన వ్యక్తిగా కొన్ని యుక్తమైన ప్రశ్నలను పరిశీలించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సత్యం పొందలేనిదైతే, “మీరు . . . సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును” అని యేసు ఎందుకు చెబుతాడు? “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని” దేవుడు ఇచ్ఛయిస్తున్నాడని యేసు అపొస్తలుల్లో ఒకరు ఎందుకు చెబుతాడు? విశ్వాసం సంబంధంగా “సత్యం” అనే పదం క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో వందమార్లకుపైగా ఎందుకు కనిపిస్తుంది? అవును, సత్యం పొందలేనిదైనప్పుడు అలా ఎందుకు కనిపిస్తుంది?—యోహాను 8:31, 32; 1 తిమోతి 2:3, 4.

అసలు, సత్యం పొందగల్గిందేనని సూచించడమేకాకుండ, మన ఆరాధనను దేవుడు అంగీకరించాలంటే, అలా దాన్ని కనుగొనడం అవసరమని యేసు చూపాడు. అది, యెరూషలేము నందు యూదుల ఆచార విధానమా లేక గెరిజెము పర్వతంపై సమరయలు ఆరాధించే విధానమా ఆరాధించే అసలు విధానమేమిటని సమరయ స్త్రీ ఆలోచనలో పడినప్పుడు, సత్యం పొందగల్గినది కాదు అని యేసు జవాబు చెప్పలేదు. బదులుగా, ఆయన ఇలా అన్నాడు: “అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించుకాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను.”—యోహాను 4:23, 24.

‘బైబిలుకు వివిధ రకాలుగా అర్థవివరణనివ్వవచ్చు కనుక, సత్యం కచ్చితంగా ఇదేనన్న నిర్ధారణను కల్గివుండలేమని’ అనేకమంది ప్రజలు చెప్పవచ్చు. అయితే నిజంగా బైబిలును ఎలా అర్థం చేసుకోవాలో తెలియనంతటి అస్పష్టమైన విధానంలో అది వ్రాయబడిందా? కొన్ని ప్రవచనార్థక, సూచనార్థక భాషలను అర్థం చేసుకోవడం కష్టమేనన్న విషయాన్ని అంగీకరించాల్సిందే. ఉదాహరణకు, ప్రవచనార్థకమైన భాషగల తన గ్రంథం “అంత్యకాలము” వరకు పూర్తిగా అర్థం చేసుకోబడదని ప్రవక్తైన దానియేలుతో దేవుడు చెప్పాడు. (దానియేలు 12:9) మరియు కొన్ని ఉపమానాలూ సూచనల భావాన్ని చెప్పాల్సిన అవసరముందని స్పష్టమౌతోంది.

అయితే, యేసు దేవున్ని సత్యంతో ఆరాధించేందుకు అవసరమైన క్రైస్తవ మూల బోధలు మరియు నైతిక విలువలను గూర్చి బైబిలు సూటిగా చెబుతుందన్నది స్పష్టమే. వివాదాస్పదమైన భావాలకు అది తావివ్వదు. ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో, అనేక విశ్వాసాలు లేవని చూపుతూ క్రైస్తవ విశ్వాస“మొక్కటే” అని చెప్పడం జరిగింది. (ఎఫెసీయులు 4:4-6) ‘బైబిలును అనేక విధాల్లో అన్వయించబడలేకపోతే, మరి ఇన్ని వివిధ “క్రైస్తవ” శాఖలు ఎందుకు ఉన్నాయని’ మీరు బహుశ ఆలోచించవచ్చు. యేసు శిష్యులు చనిపోయిన తర్వాతి కాలాన్ని మరియు నిజమైన క్రైస్తవ విశ్వాసం నుండి వృద్ధి చెందిన మత భ్రష్టత్వపు కాలాన్ని మనం చూస్తే, దాని జవాబును మనం కనుగొనగలం.

‘గోధుమలూ గురుగులు’

ఈ మత భ్రష్టత్వాన్ని గూర్చి గోధుమలూ గురుగుల ఉపమానంలో యేసు ముందుగానే చెప్పాడు. “గోధుమలు” నిజమైన క్రైస్తవులను సూచిస్తున్నాయని; “గురుగులు” అబద్ధ లేక మతభ్రష్ట క్రైస్తవులను సూచిస్తున్నాయని యేసు తానే వివరించాడు. “మనుష్యులు నిద్రించుచుండగా” ఒక “శత్రువు” గోధుమల పొలంలో గురుగులను నాటుతాడని యేసు చెప్పాడు. అపొస్తలులు మరణించిన తర్వాత ఈ నాటడం ప్రారంభమైంది. అబద్ధ క్రైస్తవులతో, నిజ క్రైస్తవులను గందరగోళపర్చడమన్నది “యుగసమాప్తి” వరకు కొనసాగుతుందని ఈ ఉపమానం చూపుతోంది. ఆ విధంగా, శతాబ్దాల పొడుగునా, మతం అనే పొలం నామకార్థ క్రైస్తవుల అధికారంలో ఉంది కనుక, నిజ క్రైస్తవుల గుర్తింపు మరుగున పడిపోయింది. అయినప్పటికీ, “యుగసమాప్తి” యందు ఒక మార్పు సంభవిస్తుంది. “మనుష్యకుమారుడు” నిజ క్రైస్తవులనుండి అబద్ధ క్రైస్తవులను వేరుపర్చేందుకు “తన దూతలను పంపును.” అంటే అపొస్తలుల కాలంలోని తనకుగల స్థానాన్ని మరలా పొంది క్రైస్తవ సంఘం అప్పుడు సులభంగా గుర్తించబడగలదని దాని భావం.—మత్తయి 13:24-30, 36-43.

“అంత్యదినములలో” సత్య ఆరాధికుల యొక్క అలాంటి పునఃసమకూర్పును గూర్చి యెషయా మరియు మీకా ప్రవచనాలు ముందే చెప్పాయి. యెషయా ఇలా చెబుతున్నాడు: “అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ‘జనములు గుంపులు గుంపులుగా వచ్చి . . . —యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.” వాస్తవాలను స్పష్టంగా సూటిగా చూడడం, మన కాలంలో యెషయా ప్రవచనం నెరవేరుతోందని చూపుతుంది.—యెషయా 2:2, 3; మీకా 4:1-3.

అయితే, క్రైస్తవ సంఘాభివృద్ధి మానవ ప్రయత్నాల ద్వారా జరగడంలేదు. సమకూర్చే పనిని చేసేందుకు తాను ‘తన దూతలను పంపుదును’ అని యేసు ముందుగానే చెప్పాడు. దానికిగల ఎంతో ప్రత్యేక ఉద్దేశాన్ని కూడా ఆయన ఇలా సూచించాడు: “అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు.” (మత్తయి 13:43) అంటే, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంఘం చేత జ్ఞానోదయ కార్యక్రమం, లేక విద్యాకార్యక్రమం జరిగించబడుతోందని ఇది చూపుతోంది.

నేడు 232 దేశాల్లో వారు నిర్వహించే విద్యా కార్యక్రమంలో ఈ ప్రవచనాల నెరవేర్పును యెహోవాసాక్షులు చూస్తున్నారు. సాక్షుల నమ్మకాలను, ప్రవర్తనా సూత్రాలనూ వారి సంస్థీకరణను బైబిలుతో పోల్చి చూడడం ద్వారా, అవి మొదటి శతాబ్ద క్రైస్తవ సంఘంతో పొందిక కల్గివున్నాయని పక్షపాత రహిత ప్రజలు స్పష్టంగా చూడగలరు. సాక్షులు తమ విశ్వాసాన్ని “సత్యమని” పేర్కొంటారు, అయితే అది తమ స్వంత గొప్పతనంవల్ల వచ్చే గర్వంతో కాదు. బదులుగా, వారు దేవుని వాక్యమైన బైబిలును విస్తృతంగా పఠించారు మరియు మతాన్ని సరైన విధంగా తూచేందుకు దాన్నే ఏకైక సూత్రంగా వారు అనుసరిస్తారు కనుక వాళ్లు అలా చేస్తారు.

తొలి క్రైస్తవులు తమ విశ్వాసాన్ని “సత్యం” అని సూచించారు. (1 తిమోతి 3:15; 2 పేతురు 2:2; 2 యోహాను 1) ఆ నాడు వారికి ఏది సత్యమైందో నేడు మనకు కూడా అదే సత్యమై ఉండాలి. బైబిలును పఠించడం ద్వారా దాన్ని గూర్చి పూర్తిగా తెలుసుకునేందుకు యెహోవాసాక్షులు అందరినీ ఆహ్వానిస్తున్నారు. అలా చేయడం ద్వారా, ఇతర వాటికి మిన్నైన మతాన్ని కనుగొన్నామన్న ఆనందాన్నే కాకుండ సత్యాన్ని కనుగొన్నామన్న ఆనందాన్ని మీరు కూడా అనుభవిస్తారని మేము ఆశిస్తున్నాము!

[5వ పేజీలోని బాక్సు]

కొన్ని తత్వశాస్త్రాలు సత్యంతో పోటీపడుతున్నాయి

వాస్తవికతావాదము: మతపరమైన ఆలోచనలన్నీ రుజువులేని వ్యర్థమాటలని మరియు తత్వశాస్త్ర ఉద్దేశమేమంటే వాస్తవ శాస్త్రాలను పూర్తిగా ఐక్యపర్చడమే.

అస్తిత్వవాదము: దాని పక్షంగా వాదించేవారు రెండవ ప్రపంచయుద్ధ భయాల వల్ల ఎంతో ప్రభావితం చెందారు, అందువల్ల వారు జీవితం విషయంలో నిరాశావాద దృక్పథాన్ని పెంచుకున్నారు. మరణం మరియు అర్థవిహీన జీవితమున్నప్పుడు మానవుని బాధను పరిశీలించమని అది నొక్కిచెబుతోంది. మానవ స్వతంత్రవాదపు రచయితయైన జీన్‌ పౌలు సార్టే, దేవుడు లేడు కనుక పూర్తిగా ఉదాసీనమైన విశ్వంలో మానవుడు విడిచిపెట్టబడ్డాడు మరియు ఉంటున్నాడు అని చెప్పాడు.

శంకావాదం: ఉనికిని గూర్చిన ఏ ఉద్దేశాన్ని అంటే విశ్వ జ్ఞానమైన ఏ సత్యాన్నైనా కేవలం గమనించడం ద్వారా, వాదించడం ద్వారా పొందడం అసాధ్యమని చెబుతుంది.

ఆచరణాత్మక ఫలితవాదం: విద్యనూ నైతిక విషయాలనూ మరియు రాజకీయాలకు మరలా రూపుదిద్దేటువంటి మానవ ఆసక్తుల సంబంధంగా మన విశ్వాసాల ఆచరణాత్మకతపైన వాటి నిజమైన విలువ అంచనావేస్తుంది. విడిగా సత్యానికి ఓ విలువ ఉందని అది పరిగణించడంలేదు.

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

Page 3: Second from left: Courtesy of The British Museum; Right: Sung Kyun Kwan University, Seoul, Korea

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి