కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 4/1 పేజీలు 26-29
  • ప్రజానిందను క్రైస్తవులెట్లు ఎదుర్కొంటారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రజానిందను క్రైస్తవులెట్లు ఎదుర్కొంటారు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రైస్తవులు అనుసరించవలసిన ఒక మాదిరి
  • విమర్శకు ప్రతిస్పందించాలా?
  • అసలు వ్యక్తుల సమాచారం ప్రాముఖ్యం
  • వ్యతిరేకులను బట్టి భయపడకండి
  • మన విశ్వాసాన్ని సమర్థించుకోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • నిర్హేతుకంగా ద్వేషించబడ్డారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • హింసించబడినా సంతోషంగా ఉండడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • తమ మీద వేసిన నిందలన్నిటికి యెహోవాసాక్షులు ఎందుకు జవాబు చెప్పరు?
    తరచూ అడిగే ప్రశ్నలు
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 4/1 పేజీలు 26-29

ప్రజానిందను క్రైస్తవులెట్లు ఎదుర్కొంటారు

ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడు లేక మీ గురించి అబద్ధాలు చెప్పినప్పుడు మీరెలా భావిస్తారు? సహజంగా మీరు తీవ్రంగా బాధపడతారు. యెహోవాసాక్షులు కూడా తాము సమాచార మాధ్యంలో తప్పుడు లేక అసత్యమైన సమాచారానికి గురైనప్పుడు అలాంటిదే అనుభవిస్తారు. అయితే మత్తయి 5:11, 12 నందు యేసు చెప్పినట్లుగా, వారు ఆనందంగా ఉండడానికి కారణముంది.

ఉదాహరణకు, జర్మనీనందలి ఒక కాథోలిక్‌ ప్రచురణ “ప్రతి సాక్షికి, తన సంపాదన నుండి 17 నుండి 28 శాతం ఆ తెగ యొక్క ప్రధాన కార్యాలయానికి విరాళం ఇవ్వవలసిన బాధ్యత ఉంది” అని ఆరోపించింది. అయితే, యెహోవాసాక్షులు ఒక తెగ కాదు, వారి పని పూర్తిగా స్వచ్ఛంద విరాళాలపై కొనసాగుతుంది. ఈ అబద్ధ సమాచారాన్ని బట్టి అనేకమంది పాఠకులు తప్పుదోవ పట్టించబడ్డారు, దానికి యెహోవాసాక్షులు చింతిస్తున్నారు. కాని సమాచార మాధ్యం ద్వారా వచ్చే నిందకు నిజ క్రైస్తవులు ఎలా ప్రతిస్పందించాలి?

క్రైస్తవులు అనుసరించవలసిన ఒక మాదిరి

యేసు తన మత సంబంధ వ్యతిరేకులను వారి వేషధారణ మరియు మోసాన్ని బట్టి ఎలా నిందించాడో మత్తయి 23వ అధ్యాయం విపులంగా వివరిస్తుంది. క్రైస్తవులు నేడు విమర్శకులను ఎలా ఎదుర్కోవాలనే దానికి అది ఒక మాదిరినిస్తుందా? ఎంతమాత్రం కాదు. దేవుని కుమారుడు తన మతసంబంధమైన వ్యతిరేకులను తనకున్న విశేషమైన అధికారాన్ని, తాను కలిగివున్న జ్ఞానాన్ని బట్టి, వింటున్న జనసమూహం యొక్క ప్రయోజనార్థం అలా నిందించాడు.

ఆయన శిష్యులు యూదా సాంప్రదాయాన్ని అధిగమించారని యేసు విమర్శించబడ్డాడని మత్తయి 15:1-11 తెలియజేస్తుంది. యేసు ఎలా ప్రతిస్పందించాడు? ఆయన స్థిరంగా నిలబడ్డాడు. కొన్ని సందర్భాల్లో, యేసు వారి తప్పుడు దృక్పథాలను తప్పని నిరూపిస్తూ, తన విమర్శకులతో బహిరంగంగా వాదించాడు. సాధారణంగా చెప్పాలంటే, క్రైస్తవులు నేడు తమ పనిని లేక బోధలను గూర్చిన తప్పుడు ప్రాతినిధ్యాలను సరిచేసుకోవడానికి ప్రయత్నించడంలో, పరిస్థితిని వాస్తవమైన మరియు లౌకికమైన విధంగా సరిచేసుకోవడానికి యత్నించడంలో తప్పులేదు. యెహోవాసాక్షులను విమర్శించడం అనధికారికమని, అపనిందలు వేయడమని యథార్థమైన ప్రజలు గుర్తించడానికి సహాయం చేసేందుకు వారిది చేస్తారు.

కాని, కొంతసేపటి తర్వాత “పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా” అని ఆయన శిష్యులు ఎత్తిచూపించినప్పుడు యేసు ఎలా ప్రతిస్పందించాడో గమనించండి. ఈ పరిసయ్యులు ‘అభ్యంతరపడ్డారు’—వారు కేవలం కలవరపడలేదు కాని యేసు నిరాకరించిన సరిదిద్దనశక్యమైన వ్యతిరేకులయ్యారు. గనుక ఆయనిలా సమాధానమిచ్చాడు: “వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవచూపువారు.” అలాంటి ప్రతికూలమైన విరోధులతో మరింత చర్చించడం అర్థంలేనిది, నిష్ప్రయోజనమైనది, కేవలం నిష్ఫలమైన వాదనకు దారితీయగలదు. (మత్తయి 7:6; 15:12-14; 27:11-14 పోల్చండి.) యేసు ఇచ్చిన సమాధానాలు “మౌనముగా నుండుటకు మాటలాడుటకు” సమయము కలదని చూపిస్తున్నాయి.—ప్రసంగి 3:7.

తమ గురించి అందరు అనుకూలంగా మాట్లాడాలని యెహోవాసాక్షులు ఎదురు చూడరు. వారు యేసు యొక్క ఈ మాటలను మనస్సులో ఉంచుకుంటారు: “మనుష్యులందరు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ; వారి పితరులు అబద్ధప్రవక్తలకు అదే విధముగా చేసిరి.” (లూకా 6:26) తనను నిందించే వారికి ఎందుకు సమాధానమివ్వరని ఒకసారి వాచ్‌టవర్‌ మొదటి అధ్యక్షుడైన సి. టి. రస్సెల్‌ను అడగడం జరిగింది. ఆయనిలా సమాధానమిచ్చాడు: “మిమ్మల్ని చూసి మొరిగే ప్రతి కుక్కను తన్నడానికి ఆగుతున్నట్లయితే, మీరు ఎంతో దూరం వెళ్లలేరు.”

వ్యతిరేకుల వ్యాఖ్యానాలు దేవునికి మనం చేసే సేవనుండి మనల్ని దూరం చేయడానికి మనం అనుమతించకూడదు. (కీర్తన 119:69) నిజక్రైస్తవుల పనియైన సువార్త పనియందు మనం శ్రద్ధకలిగి ఉందాము. దాని సహజ పరిణామంగా, ఒక వ్యక్తి నైతికతలను పెంపొందింపజేయడం, దేవుని వాక్యమందు ఉపదేశమివ్వడమనే మన పని యొక్క ఉద్దేశాన్ని వివరించడానికి మరియు ప్రశ్నలకు సమాధానమివ్వడానికి, మనకు అవకాశాలు లభిస్తాయి.—మత్తయి 24:14; 28:19, 20.

విమర్శకు ప్రతిస్పందించాలా?

యేసు తన అనుచరుల గురించి ఇలా తెలియజేసాడు: “మీరు లోకసంబంధులు కారు . . . అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.” (యోహాను 15:19) ప్రచార మాధ్యమాల ద్వారా యెహోవాసాక్షులపై వేయబడే అనేక నిందలు ఈ ద్వేషాన్ని వ్యక్తం చేయడమే, అలాంటి వాటిని పట్టించుకోకూడదు. అయితే, కొన్నిసార్లు ప్రచార సాధనాలు అందజేసే సమాచారం సాక్షుల గురించి ఎక్కువగా తెలియకపోవడాన్ని లేక కొన్ని వాస్తవాలను తప్పుదోవ పట్టించి తప్పు భావం అందజేయడాన్ని సూచిస్తుంది. కొంతమంది విలేఖరులు పక్షపాతంగల మూలాల నుండి సమాచారాన్ని సేకరించవచ్చు. మనం ప్రచార మాధ్యమాల తప్పుడు సమాచారాన్ని నిర్లక్ష్యం చేయడం లేక సరైన మార్గాల ద్వారా సత్యాన్ని పరిరక్షించడం పరిస్థితులపైన, విమర్శ చేసిన వ్యక్తి మరియు అతని ఉద్దేశం వంటివాటిపైన ఆధారపడి ఉంటుంది.

కొన్నిసార్లు, సంపాదకునికి సరైన విధంగా ఉత్తరం వ్రాయడం ద్వారా, ఆ ఉత్తరం పూర్తిగా ప్రచురించబడినట్లయితే వాస్తవాలు సరిచేయబడవచ్చు. అయితే అలాంటి ఉత్తరం, ఏది అవసరమో దానికి పూర్తిగా విరుద్ధమైనదాన్ని సాధించవచ్చు. ఎలా? మొదటి అసత్యం మరింత ప్రచారాన్ని పొందవచ్చు, లేదా వ్యతిరేకులు మరిన్ని అబద్ధాలను లేక నిందలను ముద్రించడానికి వారికి అవకాశం లభించవచ్చు. అనేక సందర్భాలలో సంపాదకునికి ఉత్తరం వ్రాయాలా వద్దా అన్న ప్రశ్నను సంబంధిత పెద్దలకు విడిచిపెట్టడం మంచిది. ఒక ప్రతికూలమైన వార్తా నివేదిక దురభిమానాన్ని రేకెత్తించినట్లయితే, వాచ్‌టవర్‌ సంస్థ యొక్క బ్రాంచి కార్యాలయం ఆ దేశంలోని సంఘాలకు వాస్తవాల గురించి తెలియజేసి, తద్వారా వాకబు చేసేవారికి సంతృప్తికరమైన వివరణనివ్వడానికి ప్రచారకులకు సహాయం చేయగలదు.

అలాంటి వక్రీకరించబడిన ఆరోపణలలో మీరు వ్యక్తిగతంగా ఇమిడి ఉండవలసిన అవసరత ఉందా? “వారి జోలికి పోకుడి,” వారిని లక్ష్యపెట్టకండి అని యేసు ఇచ్చిన ఉపదేశం, ఈ వ్యతిరేకుల గుంపుకు స్పష్టంగా అన్వయిస్తుంది. మతభ్రష్టులను, వారి దృక్పథాలను నిరాకరించడానికి విశ్వాసులైన క్రైస్తవులకు బైబిలు ఆధారిత కారణాలున్నాయి. (1 కొరింథీయులు 5:11-13; తీతు 3:10, 11; 1 యోహాను 2:19; 2 యోహాను 10, 11) సాక్షులను గూర్చిన విమర్శ వాస్తవంపై ఆధారపడినదా లేక కల్పితమా అని నిజంగా ఆసక్తి కలిగివున్నవారికి సమాధానమిచ్చేందుకు, సాధారణంగా మీ స్వంత బాగా తెలిసిన జ్ఞానమే సరిపోతుంది.—కావలికోట (ఆంగ్లం) మార్చి 15, 1986, 13 మరియు 14 పేజీలను చూడండి.

ప్రచార మాధ్యమమందు మీరు తప్పుదోవ పట్టింపబడిన సమాచారాన్ని ఎదుర్కొన్నట్లయితే, సామెతలు 14:15 నందలి ఈ ఉపదేశాన్ని మనస్సునందుంచుకోండి: “జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.” వైద్య సిబ్బంది రక్త మార్పిడి చేయడానికి ఆమె బంధువులు నిరాకరించారు గనుక సాక్షియైన ఒక యౌవన బాలిక మరణించిందని స్విట్జర్‌లాండ్‌లో ఒక భావోద్రేకపూరిత వార్తా నివేదిక తెలియజేసినప్పుడు అనేకమంది ఆగ్రహం తెచ్చుకున్నారు. అయితే జరిగిన వాస్తవాలు అవేనా? కాదు. మతసంబంధమైన ఆధారాలపై రోగియే రక్త మార్పిడిని నిరాకరించింది కాని, రక్తరహిత ప్రత్యామ్నాయ వైద్య నిర్వహణకు ఆమె అంగీకరించింది. మరింత గందరగోళం సృష్టించబడకుండా అది జరిగి ఉంటే, అది ఆమె జీవితాన్ని కాపాడి ఉండేది. అయితే ఆసుపత్రి, ఆమె మరణించేంత వరకు విషయాలను అనవసరంగా జాప్యం చేసింది. వార్తా నివేదిక ఈ వాస్తవాలను తెలియజేయలేదు.

గనుక, అలాంటి నివేదికల్లో ఎంతవరకు నిజం ఉందో జాగ్రత్తగా పరిశీలించండి. అలాంటి విషయాలను స్థానిక పెద్దలు ప్రేమపూర్వకమైన విధంగా, బైబిలు నిర్దేశకాల అనుసారంగా చూసుకుంటారని, వాకబు చేసేవారికి మనం వివరించవచ్చు. సమాధానమిచ్చేటప్పుడు సూత్రాలకు కట్టుబడి ఉండడం, మనం తొందరపాటుగా ఒక ముగింపుకు రాకుండా కాపాడుతుంది.—సామెతలు 18:13.

అసలు వ్యక్తుల సమాచారం ప్రాముఖ్యం

మొదటి శతాబ్దంలో, యేసుక్రీస్తు పేరు చెడగొట్టాలని ప్రజలు ఆయన గురించి అబద్ధాలు వ్యాప్తి చేశారు, కొందరు ఆయనను రాజద్రోహి అని కూడా అన్నారు. (లూకా 7:34; 23:2; మత్తయి 22:21 పోల్చండి.) తర్వాత, తొలి క్రైస్తవ సంఘం మతసంబంధమైన మరియు లోక సంబంధమైన మూలముల నుండి విస్తృత వ్యతిరేకతను ఎదుర్కొంది. “లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు” గనుక అనేకులు ఆయన సేవకులను చిన్నచూపు చూశారు. (1 కొరింథీయులు 1:22-29) ఒక రకంగా హింసయైన నిందను నిజక్రైస్తవులు నేడు పరిగణలోకి తీసుకోవాలి.—యోహాను 15:20.

అయితే, వారు సంభాషిస్తున్న వ్యక్తి నిష్పక్షపాతియై, “ఈ విషయమై నీ అభిప్రాయము నీవలన వినగోరుచున్నాము; ఈ మతభేదమునుగూర్చి అంతట ఆక్షేపణ చేయుచున్నారు ఇంతమట్టుకు మాకు తెలియునని” చెప్పిన రోములోని పౌలు యొక్క కొంతమంది సందర్శకుల వంటి దృక్పథాన్నే చూపిస్తే, యెహోవాసాక్షులు దాన్ని మెచ్చుకుంటారు.—అపొస్తలుల కార్యములు 28:22.

తప్పు సమాచారం తెలియజేయబడిన ప్రజలకు దీనత్వంతో వివరించండి. (రోమీయులు 12:14; 2 తిమోతి 2:25 పోల్చండి.) యెహోవాసాక్షుల గురించి అసలు వ్యక్తుల నుండే సమాచారాన్ని పొందడానికి ఆహ్వానించండి, అబద్ధ నిందలను గుర్తించడానికి ఇది వారికి సహాయం చేస్తుంది. సంస్థ గూర్చి, దాని చరిత్ర మరియు దాని బోధలను గురించిన వివరాలు అందజేసే వాచ్‌టవర్‌ సంస్థ ప్రచురించిన వివరణలను కూడా మీరు ఉపయోగించవచ్చు.a కేవలం ఇలా చెప్పడం ద్వారా ఫిలిప్పు ఒకసారి నతనయేలుకు సమాధానమిచ్చాడు: “వచ్చి చూడుము.” (యోహాను 1:46) మనం కూడా అలాగే చేయవచ్చు. యెహోవాసాక్షులు ఎలాంటి వ్యక్తులో, వారు ఏమి విశ్వసిస్తారో తనకు తానే గమనించి తెలుసుకోడానికి, ఇష్టపడే ఎవరైనా సరే, స్థానిక రాజ్య మందిరాన్ని దర్శించడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానితులే.

వ్యతిరేకులను బట్టి భయపడకండి

ప్రజలు యెహోవాసాక్షులు కాకుండా నింద వారిని ఆపలేదని తెలుసుకోవడం ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుంది! జర్మనీలో ఒక టి.వి. కార్యక్రమంలో అబద్ధమతస్థులు సాక్షుల గురించి ఎన్నో అబద్ధాలు చెప్పారు. ఒక ప్రేక్షకుడు అబద్ధమతస్థులు చాతుర్యముగా కల్పించిన కట్టుకథలని గుర్తించి సాక్షులతో తన బైబిలు పఠనాన్ని పునఃప్రారంభించడానికి పురికొల్పబడ్డాడు. అవును ప్రజా నింద కొన్నిసార్లు అనుకూలమైన ఫలితాలకు కూడా దారితీయవచ్చు!—ఫిలిప్పీయులు 1:12, 13 పోల్చండి.

కొందరు సత్యం యెడల కంటే “కల్పనాకథల” యెడల ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారని అపొస్తలుడైన పౌలుకు తెలుసు. అందుకే ఆయనిలా వ్రాశాడు: “నీవు అన్నివిషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.” (2 తిమోతి 4:3-5) కాబట్టి మిమ్మల్ని మీరు తప్పుదోవపట్టి పోవుటకు అనుమతించకండి, మీ వ్యతిరేకులను బట్టి ‘బెదరకండి.’ (ఫిలిప్పీయులు 1:28) శాంతము, సమతుల్యత కలిగి ఉండి, సంతోషంగా సువార్త ప్రకటించండి, అప్పుడు మీరు ప్రజా నిందను స్థిరంగా ఎదుర్కోగలుగుతారు. అవును, యేసు యొక్క ఈ వాగ్దానాన్ని గుర్తుంచుకోండి: “నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.”—మత్తయి 5:11, 12.

[అధస్సూచీలు]

a ఈ ప్రచురణలు చూడండి, యెహోవాసాక్షులు—ప్రపంచవ్యాప్తంగా దేవుని చిత్తాన్ని ఐక్యంగా చేస్తున్నారు, ఇరవయ్యో శతాబ్దమందలి యెహోవాసాక్షులు మరియు యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం).

[27వ పేజీలోని చిత్రం]

వ్యతిరేకులను ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు: “వారి జోలికి పోకుడి.” ఆయన ఉద్దేశమేమిటి?

[29వ పేజీలోని చిత్రం]

“నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.”—మత్తయి 5:11

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి