గిలియడ్ పట్టభద్రులు సువార్త వ్యాప్తి చేయాలని ఆతురత కలిగివున్నారు
“మేము ఊహించగలిగిన అత్యంత అద్భుతమైన విషయం.” ఆండర్స్ మరియు అమల్య గ్రోట్ తమ మిషనరీ శిక్షణ గురించి అలా భావించారు. వాచ్‌టవర్ గిలియడ్ బైబిల్ పాఠశాల యొక్క 97వ తరగతిలోని మొత్తం 48 మంది పట్టభద్రుల భావాలను యిలా చెబుతూ వ్యక్తపర్చారు: “గిలియడ్ శిక్షణ మమ్మల్ని పురికొల్పి, సిద్ధపర్చింది, కాబట్టి మేము మా క్రొత్త నియామకాలకు వెళ్లడానికి ఆతురత కలిగివున్నాము.”
పట్టభద్రులయ్యే కార్యక్రమంపై విద్యార్థులు వ్యాఖ్యానిస్తుండగా మనం ఆ ఆనందాన్ని చవిచూడవచ్చు; 1994 సెప్టెంబరు 4న ఆ సందర్భం కొరకు 6,420 మంది సమావేశమయ్యారు.
“పరిపాలక సభలోని థియడర్ జరాస్ ‘యెహోవాచే బోధింపబడుట’ అనే అంశంపై మాట్లాడుతూ కార్యక్రమాన్ని ప్రారంభించాడని” డేవిడ్ ఏబెల్ మరియు ఆయన భార్య కెల్లీ చెప్పారు. “మేము ఎన్నడూ మరచిపోలేని విషయం ఏమిటంటే, ‘యెహోవాతో పోల్చుకున్నప్పుడు మన అల్పత్వాన్ని మనం గుర్తించాలి’ అని సహోదరుడు జరాస్ చెప్పడమే, ఆయన దాన్ని యోబు 38 మరియు 39 అధ్యాయాలలోని శక్తివంతమైన పాఠంతో ఉదాహరించాడు. గిలియడ్ పాఠశాల ద్వారా మనం మన బైబిలు జ్ఞానాన్ని అధికం చేసుకున్నప్పటికీ, మనకు ప్రతి ప్రశ్నకు జవాబు తెలియదు. దేవుని వాక్యాన్ని పఠించడంలో మనం కొనసాగాలి అని సహోదరుడు జరాస్ నొక్కిచెప్పాడు.”
క్రిస్టియాన్ మరియు ఆన్జెల్ కొఫి యిలా తెలియజేసారు: “మాక్స్ లార్సన్ ‘మంచి పునాది యొక్క విలువేమిటి?’ అనే అంశంపై యిచ్చిన ప్రసంగంతో మేము ముగ్ధులమయ్యాము. భూకంపం సంభవించినప్పుడు కూడా పటిష్ఠంగా వుండేలా భూమిలో లోతుగా పునాది అవసరమైన భవనంతో ఆయన మమ్మల్ని పోల్చడం మాకు నచ్చింది. శ్రద్ధతో పఠించడం ద్వారా, మనం యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు, కష్టసమయాల్లో పటిష్ఠంగా వుండగలిగేలా మనం మన విశ్వాసానికి లోతైన జ్ఞానాన్ని ఆధారంగా చేసుకోవచ్చు.”
“పాఠశాల అధ్యక్షుడైన మిల్టన్ హెన్షల్ ‘పొలాలు కోత కొరకు సిద్ధంగా వున్నాయి’ అనే అంశంపై యిచ్చిన ప్రసంగం, దీర్ఘకాలం గుర్తుండే ప్రసంగము” అని గారీ మరియు లిన్ ఎల్ఫర్స్ చెప్పారు. “మూల లేఖనమైన యోహాను 4:35-38, మునుపటి పనివారిచే యిప్పటికే విత్తబడిన ప్రాంతంలోకి ప్రవేశించే మా ఆధిక్యతను నొక్కిచెప్పింది. అత్యవసర భావంతో పనిచేసేలా యిది మమ్మల్ని పురికొల్పుతుంది.” దీనితో ఏకీభవిస్తూ, యాన్ మరియు సిర్పా వాటోలా యిలా చెప్పారు: “బాల్టిక్ రాష్ట్రాల నుండి వచ్చిన తాజా నివేదికను తెలియజేయడం ద్వారా సహోదరుడు హెన్షల్ జరుగబోయే కోతను గూర్చిన మా ఆసక్తిని పురికొల్పాడు. ఆస్టోనియాలో 51 శాతం, లాట్వియాలో 106 శాతం, లిథుయేనియలో 51 శాతం అభివృద్ధి జరిగింది. ఎంత ఉత్తేజకరమైనది! అక్కడి సహోదరులు పనివారిని పంపించమని తమ యజమానిని వేడుకుంటున్నారు. మాకు పని నియామకం ఇస్టోనియాలో యివ్వబడింది గనుక, ఇది విని మేము ప్రత్యేకంగా ఆనందించాము!”
“జోల్ ఆడమ్స్ ‘యెహోవా యందు నమ్మకముంచండి’ అనే అంశంపై మాట్లాడారని” కెవన్ మరియు ఎవ్లన్ కార్టీనా గుర్తుచేసుకున్నారు. “మనం కొన్నిసార్లు యెహోవా యందు నమ్మకముంచి, కొన్నిసార్లు మన స్వంత ఆలోచనపై ఆధారపడవచ్చునని మనం ఎన్నడూ అనుకోకూడదని ఆయన మాకు ఉపదేశించాడు. మనం మన పని నియామకంలో ఆరోగ్యం, ఆహారం, భాష, ఆచారాలు, మరితర అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. వాటికన్నిటికీ మనం యెహోవాపై ఆధారపడడం అవసరము.”
ఆ తర్వాత, పరిపాలక సభ సభ్యుడైన గెరిట్ లాష్ “యెహోవా దయను ప్రతిఫలిస్తూ ఉండండి” అనే అంశాన్ని పెంపొందించాడు. అలెన్ మరియు ఆన్ మారీ గొకావి యిలా చెప్పారు: “మన తోటి మిషనరీల యెడల, మనం సువార్త పంచుకొనే వారి యెడల కనికరం చూపించడం క్రైస్తవ పరిపక్వతకు నిదర్శనం అని ఆయన చెప్పాడు. విదేశాల్లో పని నియామకం లభిస్తే త్యాగం చేయవలసి వుంటుంది, కాని కనికరం లేకపోతే, మన త్యాగానికి విలువుండదు.” (మత్తయి 9:13) పీటర్ మరియు ప్లూర్ హప్స్టన్ యిలా జత చేశారు: “సూచనార్థకంగా చెప్పాలంటే, మనం మన సహోదరులను, సహోదరీలను వాళ్ల తప్పులు, పెద్దవిగా కనిపించే బదులు చిన్నవిగా కనిపించేలా బైనాకులర్స్ యొక్క మరో వైపు నుండి చూస్తున్నట్లుగా చూడడం ద్వారా మనం వారి యెడల దయ చూపించాలని సహోదరుడు లాష్ చెప్పాడు.”
“మా గిలియడ్ ఉపదేశకులలో ఒకరైన జాక్ రెడ్ఫర్డ్ ‘మీరు గద్దింపును లక్ష్యపెడతారా?’ అనే అంశంపై మాట్లాడాడని” మిక్కీ మరియు షెర్రీ మిన్స్కీ గుర్తు చేసుకున్నారు. “గర్వం మనం గద్దింపును లక్ష్యపెట్టడం కష్టమయ్యేలా చేస్తుంది, మనం ఉపదేశం యెడల మరీ సున్నిత భావం కలిగివుంటే, దాని నుండి ప్రయోజనం పొందలేము. తర్వాత విలాపవాక్యములు 3:27-31 ఆధారంగా, గద్దింపును అంగీకరించడానికి ఆయన కొన్ని ఆచరణాత్మకమైన సలహాలనిచ్చాడు.” చాల్స్ మరియు జోన్ హెల్డ్ యిలా జత చేశారు: “చాలాసార్లు మనం మన స్వంత లోపాలను గుర్తించలేము; గనుక గద్దింపును, మనకు తెలియని విషయాల యెడల మనకు కనువిప్పు కల్గించేదానిగా మనం దృష్టించాలి. యెహోవా నుండి వచ్చే గద్దింపు లేక ఉపదేశం మన యెడల ఆయనకు గల ప్రేమకు నిదర్శనము.”
“మరో ఉపదేశకుడు, యులిసెజ్ గ్లాస్ ‘జీవానికి నడిపే ఆచరణాత్మకమైన జ్ఞానాన్ని సంపాదించుకోండి’ అనే అంశంపై మాట్లాడాడు. ‘మీరు నేర్చుకున్న దాన్ని మీరెలా అన్వయిస్తారు?’ అని ఆయన ప్రశ్నించాడు” అని కెన్నెత్ మరియు లిస్బెత్ ఆర్డషెల్ చెప్పారు. “తర్వాత ఆయన సామెతలు 30:24-26 ఆధారంగా చిన్న కుందేలు గురించి, మనుగడ సాగించడానికి దానిని యెహోవా ఎలా పూర్తిగా ఆయత్తపర్చాడనేదాని గురించి ఒక ఉపమానం చెప్పాడు. మరో వైపున మనం, సహజసిద్ధమైన జ్ఞానం గలవారము కాము, గనుక మనం జ్ఞానం సంపాదించుకోడానికి ఎంతో కష్టపడవలసిన అవసరత వుంది. మనం దానిని సంపాదించడానికి మనకు అవసరమైన వాటితో యెహోవా మనలను సిద్ధపర్చాడు. మనం యెహోవాకు, అలాగే ఒకరికి ఒకరం ప్రేమయందు సన్నిహితమయితే, మనం ఎంతో సాధించగలము.”
ముఖ్య ప్రసంగం
“పరిపాలక సభ సభ్యుడైన సహోదరుడు కార్ల్ ఎఫ్. క్లైన్, ‘ఆభరణాలలో ఆభరణం వంటిది’ అనే తన ప్రసంగంలో, 19వ కీర్తనను మాతో కలిసి ప్రేమ పూర్వకంగా పరిశీలించాడు” అని జె మరియు గ్వెన్ ఆబ్రాసిన్స్కాస్ చెప్పారు. “కీర్తనల గ్రంథకర్తయైన దావీదుకు యెహోవా యెడల గల లోతైన మెప్పును, దేవుని వాక్యం యెడల ఆయనకు గల యిష్టాన్ని ఆయన ఉన్నతపర్చాడు.” “సహోదరుడు క్లైన్ కీర్తనను మూడు భాగాలుగా విభజించాడు” అని కీత్ మరియు డాన్నా హార్న్బక్ చెప్పారు. “మొదటి భాగం (1-6 వచనాలు) దేవుని సృష్టి యెడల దావీదుకు గల మెప్పును చూపిస్తుంది, రెండవ భాగం (7-10 వచనాలు) దేవుని చట్టాల యెడల ఆయన మెప్పును వ్యక్తపరుస్తుంది, మూడవ భాగం (11-14 వచనాలు) దావీదు వలె, మనం కూడా యెహోవాతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోనే కోరిక కల్గివుండాలని మనకు గుర్తుచేస్తుంది.”
“మనం చెడును విసర్జించాలంటే యెహోవా యెడల భయం కల్గివుండడం అత్యావశ్యకమని చెప్పబడిన విషయాన్ని మేము ఆనందించాము. ఆయన దృష్టిలో సరైనది చేసేలా యిది మనల్ని నడిపిస్తుంది” అని డేవిడ్ మరియు రెలెన్ లాంగ్ చెప్పారు. ఫ్రాంక్ మరియు విబెకె మాసన్ దానితో ఏకీభవిస్తూ యిలా చెప్పారు: “మేము గిలియడ్ నందు నేర్చుకున్న దానిని, యెహోవా యొక్క జ్ఞాపికలు, సూత్రాలు, ఆజ్ఞలు ఎంత ప్రయోజన కరమైనవనేదాన్ని గూర్చిన సహోదరుడైన క్లైన్ వ్యాఖ్యానాలు చక్కగా పొందుపర్చాయి. అది, భవిష్యత్తులో దేవుని వాక్యానికి మరింతగా హత్తుకొని ఉండాలని మేము తీర్మానించుకొనేలా, దాన్ని ఆభరణాల నిధివలె పరిగణించేలా చేసింది.”
ముఖ్య ప్రసంగం తర్వాత, విద్యార్థులు తమ పట్టాలు పొందారు, వారి విదేశీ పని నియామకాలు ప్రకటించబడ్డాయి. అల్పాహారం కొరకు కొంత విరామం తర్వాత అందరూ మధ్యాహ్న కార్యక్రమం కొరకు తిరిగి సమావేశమయ్యారు. విద్యార్థులు, సంక్షిప్త కావలికోట పఠనంలో పరిశీలించబడిన ప్రశ్నలకు సమాధానాలివ్వడంలో పాల్గొన్నారు.
“తర్వాత ‘భూవ్యాప్తంగా రాజ్య ప్రచారకులగుటకు శిక్షణ పొందుట’ అనే విద్యార్థి కార్యక్రమం జరిగింది” అని బాబ్ మరియు షనెన్ లాకటాస్ గుర్తు చేసుకున్నారు. “కార్యక్రమంలోని మొదటి భాగం, ఐదు నెలల కాలంలో విద్యార్థులు ప్రాంతీయ సేవలో పొందిన అనుభవాలకు సంబంధించినది. మన పరిచర్యలో ప్రశ్నలను సమర్థవంతంగా ఉపయోగించడంపై అది కేంద్రీకరింపబడింది. ఇంటర్వ్యూ కార్యక్రమం మిషనరీ జీవితం యొక్క సవాళ్లను, మారుతున్న పరిస్థితులను ఎదుర్కోడానికి అనుకూలమైన మార్గాలను చూపించింది. కోస్టా రికా, ఇండియా మరియు మలావీలకు చెందిన మూడు స్లైడ్ ప్రదర్శనలు మాకు యెహోవా ప్రపంచవ్యాప్త సంస్థను గూర్చిన సంగ్రహావలోకనాన్ని యిచ్చాయి.”
“తర్వాత వున్న దైవపరిపాలన కలిగివుండండి, లోకసంబంధంగా వుండకండి అనే నాటకం, లోకసంబంధమైన, స్వతంత్ర దృక్పథంగల బంధువులు కలిగించే చెడు ప్రభావాన్ని చూపించింది,” అని జెస్సీ మరియు మిషెల్ డంకన్ చెప్పారు. “దైవపరిపాలన యొక్క నడిపింపు మరియు సూత్రాలు అవసరమైనవని, ప్రయోజనకరమైనవని క్రైస్తవులు గుర్తించాలని అది చూపించింది,” అని వెన్సెల్ మరియు కెల్లీ కోలా జతచేశారు.
చివరి పాట మరియు ప్రార్థన ఆనందభరితమైన కార్యక్రమాన్ని ముగింపుకు తెచ్చాయి. పట్టభద్రులు 18 దేశాల్లో తమ విదేశీ పని నియామకాలకు వెళ్లడానికి ఆతురతతో వెళ్లుతుండగా, టామీ మరియు యెల్ కాకో యొక్క ఈ వీడ్కోలు వ్యాఖ్యానంలో వారి భావాలు చక్కగా వ్యక్తపర్చబడ్డాయి: “మేము మా పని నియామకాలకు వెళ్లి, మేము నేర్చుకున్న వాటిని ఆచరణలో పెట్టాలని ఆతురత కలిగివున్నాము. మేము ఎంతో పొందాము—ఇప్పుడు యివ్వడం మా వంతు.”
[26వ పేజీలోని చిత్రం]
వాచ్‌టవర్ గిలియడ్ బైబిల్ పాఠశాల యొక్క పట్టభద్రులను చేసే 97వ తరగతి
ఈ క్రింది పట్టికలో, వరుసలు ముందు నుండి వెనుకకు యివ్వబడ్డాయి, ప్రతి వరుసలో పేర్లు ఎడమ నుండి కుడికి యివ్వబడ్డాయి.
(1) హాంగ్, జె.; హాంగ్, డి.; గ్రోట్, ఎ.; కార్టీనా, ఇ.; లాకెటాస్, ఎస్.; హార్న్‌బాక్, డి.; అసెవెడో, ఎల్.; కొఫి, ఎ. (2) ఎల్ఫర్స్, ఎల్.; గొకావి, ఎ.; ఆర్డషెల్, ఎల్.; ఆబ్రాసిన్స్కాస్, జి.; క్నాట్, కె.; లైజర్, టి.; ఏబెల్, కె.; ఏబెల్, డి. (3) డన్కన్, ఎమ్.; గొకావి, ఎ.; హెల్డ్, జె.; హప్స్టన్, ఎఫ్.; లాకెటాస్, బి.; లాంగ్, ఆర్.; మిన్స్కీ, ఎస్.; అసెవెడో, ఇ. (4) ఆర్డషెల్, కె.; కావుకో, జె.; వాటోలా, ఎస్.; కార్టీనా, కె.; కార్సన్, ఎన్.; మిన్స్కీ, ఎమ్.; లైజర్, జి.; కోలా, కె. (5) డన్కన్, జె.; ఆబ్రాసిన్స్కాస్, జె.; వాటోలా, జె.; మాసన్, ఎఫ్.; మాసన్, వి.; లాంగ్, డి.; కార్సన్, సి.; ఎల్ఫర్స్, జి. (6) కావుకో, టి.; హప్స్టన్, పి.; హెల్డ్, సి; గ్రోట్, ఎ.; హార్న్‌బాక్, కె.; కాకోలా, డబ్ల్యూ.; క్నాట్, డి.; కొఫి, సి.