పరిపాలక సభలో చేరిక
యెహోవాసాక్షుల పరిపాలక సభలోని సభ్యులను ఎక్కువ చేసే ఉద్దేశంతో, ప్రస్తుతం సేవచేస్తున్న 11 మంది పెద్దలకు జూలై 1 1994 నుండి మరో సభ్యుడ్ని చేర్చడం జరిగింది. ఆ కొత్త సభ్యుడు గెర్రిట్ లాష్చ్.
సహోదరుడైన లాష్చ్ 1961 నవంబరు 1న పూర్తికాల సేవను ప్రారంభించారు, వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ 41వ తరగతి నుండి పట్టభద్రుడయ్యాడు. ఆయన 1963 నుండి 1976 వరకు ఆస్ట్రియా నందు ప్రాంతీయ మరియు జిల్లా కాపరి సేవలను చేశారు. ఆయన 1967లో వివాహం చేసుకున్నారు, ఆయన భార్యయైన మెరిట్‌తో కలిసి తర్వాతి 14 సంవత్సరాలు మెన్నా నందలి ఆస్ట్రేలియా బేతేలు కుటుంబ సభ్యులుగా పనిచేశారు. నాలుగు సంవత్సరాల క్రితం వారు న్యూయార్క్ బ్రూక్లిన్ నందలి సంస్థ ముఖ్య కార్యాలయానికి బదిలీ చేయబడ్డారు. అక్కడ సహోదరుడైన లోష్చ్ కార్య నిర్వాహక కార్యాలయాల్లోనూ సేవా కమిటీకి సహాయకునిగానూ పనిచేశారు. ఐరోపా ప్రాంతంలో ఆయనకున్న విస్తృత అనుభవంతో అలాగే జర్మనీ, ఇంగ్లీష్, రొమేనియన్, ఇటాలియన్ భాషల్లో ఆయనకున్న జ్ఞానంతో పరిపాలక సభ పనికి ఆయన విలువైన సహాయాన్నందించగలడు.