దుష్టులు ఎందుకు వర్థిల్లుతున్నారు?
“భక్తిహీనులు ఏల బ్రదుకుదురు?” ఈ ప్రశ్నను చాలాకాలం క్రితం నమ్మకస్థుడైన యోబు అడిగాడు, ఆయన కాలం తర్వాత అది మళ్లీ అనేకసార్లు అడగబడింది. ఒక దుఃఖకరమైన యుద్ధ బాధితుల కొరకు ఏడ్చే పూర్వపు ప్రాంతంలో వున్న యుగోస్లావియా (మా కవరుపై చూపబడిన స్త్రీవంటి) అనేకమంది ప్రజల మనస్సుల్లో ఈ ప్రశ్న ఉండి ఉండవచ్చు. మరి చెడ్డ ప్రజలు బ్రదికి ఉండి ఎందుకు వర్థిల్లుతారు? యోబు చెప్పినట్లు, తరచుగా “వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమముగా నున్నవి దేవుని దండము వారిమీద పడుట లేదు.”—యోబు 21:7, 9.
దేవున్ని సేవించడం, తమ పొరుగువారిని ప్రేమించడం, చెడు చేయడంనుండి దూరంగా వుండడం వంటివి కూడా వ్యర్థమేనని భావమా? ఎంత మాత్రం కాదు! యిలా చెప్పడం ద్వారా బైబిలు మనకు సరైన దృష్టి కోణాన్ని అందిస్తుంది: “చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూరవలెనే వాడిపోవుదురు ప్రభువుయందు నమ్మికయుంచి మేలుచేయుము.”—కీర్తన 37:1-3, ది న్యూ ఇంగ్లీష్ బైబిల్.
అవును, దుష్టులు అనుభవిస్తున్నట్లు కనిపించే సమృద్ధి కేవలం తాత్కలికమైనదే. వాస్తవానికి, వారి జీవితాలు చాలా చిన్నవి, అయితే దేవున్ని సేవించే వారికి భవిష్యత్తును గూర్చిన అద్భుతమైన నిరీక్షణ ఉంది. త్వరలోనే దేవుని వాగ్దానం నెరవేర్చబడుతుంది: “[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి” పోయెను. (ప్రకటన 21:4) దుష్టులు కాదుగానీ కేవలం నీతిమంతులు మాత్రమే ఆ సమయాన్ని చూస్తారు. మన చుట్టూ ఉన్నవారు ఎంత చెడుగా ఉన్నా, దేవునికి దగ్గరై, ఆయన చిత్తాన్ని చేయడానికి యిది ఎంతటి ప్రోత్సాహము!
మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే లేదా ఉచితంగా మీతో బైబిలును పఠించడానికి ఎవరైనా మీ ఇంటికి రావాలంటే, దయచేసి Watch Tower, H-58 Old Khandala Road, Lonavla, 410 401, Mah., india, లేదా రెండవ పేజీలో ఇవ్వబడిన చిరునామాల్లో మీకు అనుకూలమైన దానికి వ్రాయండి.