ప్రపంచ మతాల సమావేశం—విజయవంతం కాగలదా?
అమెరికా, ఇల్లినోయిస్, చికాగోలో 1993 వసంతకాలంలో జరిగిన రెండవ ప్రపంచ మతాల సమావేశానికి వందలాదిమంది మత నాయకులు హాజరయ్యారు. బౌద్ధ మతం, క్రైస్తవ మత సామ్రాజ్యం, హిందూ మతం, యూదా మతం, మహమ్మదీయ మతాల వారంతా దానికి ప్రాతినిధ్యం వహించారు. మంత్రగాళ్లు, దేవతలను ఆరాధించేవారు కూడా హాజరయ్యారు. యుద్ధాన్ని అంతమొందించటంలో తమ పాత్రను గురించి వారు చర్చించారు. సమావేశ అధ్యక్షుడు “ఈనాడు ప్రపంచంలో జరిగే ప్రముఖ యుద్ధాలలో మూడింట రెండొంతులు మతంతో ముడిపెట్టబడి ఉన్నాయని” అంగీకరించాడు.
ఓ వంద సంవత్సరాల క్రితం
సమావేశం విజయవంతమైందా? వంద సంవత్సరాల క్రితం జరిగిన ప్రపంచ మతాల మొదటి సమావేశంలో ఏం జరిగిందో ఒకసారి చూడండి. అది కూడా చికాగోలోనే 1893 వేసవికాలంలో, జరిగింది, దాదాపు 40 కంటే ఎక్కువ మతాలు అందులో పాల్గొన్నాయి. ప్రపంచ మతాల సమావేశ పరిపాలక సభ అంగీకరించిందేమంటే, 1893లో హాజరైనవారందరూ “పరస్పర అవగాహనకు, శాంతికి, పురోభివృద్ధికి దోహదపడే అంతర్జాతీయ మిశ్రిత విశ్వాస సమావేశ పరంపరలో ఇది మొదటిదౌతుందని విశ్వసించారు. కాని అది అలా జరగలేదు. గత 100 సంవత్సరాల యుద్ధాల్లో మత దురహంకారం, దౌర్జన్యం భాగమయ్యాయి, ఈనాడును అలాగే భాగం వహిస్తున్నాయి.” అది ఎందుకు విఫలమైంది? ఎందుచేతనంటే మొత్తం ఆ మిశ్రిత విశ్వాస భావనంతా దేవునిచే అంగీకరింపబడలేదు. బైబిలు ఇలా తెలియజేస్తుంది: “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి.”—2 కొరింథీయులు 6:14-17
దానికి తగినట్లుగానే, జాయిన్స్ వాచ్‌టవర్ 1893 సెప్టెంబరు సంచిక అపహసిస్తూ ఇలా అనడం ద్వారా ప్రపంచ మతాల సమావేశానికి లేఖనాధారం లేదన్న విషయాన్ని ఉన్నతపర్చింది: “బబులోను, ఇతర ప్రాచీన నగరాల శిధిలాల నుండి పురాతత్వ శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతమైన మట్టి స్థూపాలను వెలికి తీసారు, కాని ఇంకా కనుగొనబడనివి కొన్ని ఉన్నాయి. . . . మోషే యెహోషువాలు మోయాబీయులను, అమ్మోనీయులను, ఏదోమీయులను ‘మతాల సమావేశానికి’ ఆహ్వానించాడని చెప్పే దేనిని వారు కనుగొనలేదు . . . బలిష్ఠుడైన వృద్ధ సమూయేలు గాతు, ఎక్రోనులకు వెళ్లి దాగోను యాజకులను షిలోహులో జరిగే యెహోవా యాజకుల సమావేశానికి రమ్మని ఆహ్వానించటానికి వెళ్లాడని తెలియజేసే దేనిని వారు కనుగొనలేదు . . . తోలు దట్టీ ధరించిన వృద్ధ ఏలియా బయలు, మొలెకు యాజకులతో ఒకరి మతం యెడల ఒకరు పరస్పర గౌరవాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో తమతమ విశ్వాసాల గురించి ఒక వారం రోజులు చర్చ జరుపుకోటానికి ‘సమావేశం’ ఏర్పాటు చేసినట్లు చెప్పే దేనిని వారు కనుగొనలేదు.”
దేవుని రాజ్యం—ఏకైక నిరీక్షణ
ప్రపంచ మతాల సమావేశం విజయవంతం కాదు. వార్తాపత్రికలు, ప్రతినిధులు సమావేశానికి సంబంధించి, “గందరగోళం,” “కోలాహలం,” “గలబా” వంటి పదాలను ఉపయోగించారు. ఒక నివేదిక ప్రకారం, రాజకీయ వర్గాలు కల్గించిన రెండు అవాంతరాలను సద్దుమణుగునట్లు చేయడానికి పోలీసులు కూడా చర్యతీసుకున్నట్లు తెలిసింది. దాని 1952 ప్రమాణపత్రంలో “ప్రపంచ శాంతి, ప్రజల మధ్య అవగాహన పెంపొందింప జేయటానికి ఐక్యరాజ్య సమితితో కలిసి ఓ స్థిరమైన, మతాల ప్రపంచ సమావేశాన్ని స్థాపించటం” తన సంకల్పాలలో ఒకటని సమావేశం తెలియజేసింది. దానికి వ్యతిరేకంగా, యేసు తన రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదని చెప్పాడు. మానవజాతి సమస్యలకు కేవలం దేవుని రాజ్యం మాత్రమే పరిష్కారం తేగలదని బైబిలు చూపిస్తున్నది.—దానియేలు 2:44; యోహాను 18:36.