కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 10/1 పేజీ 32
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • పాఠకుల ప్రశ్న
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగరడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • పక్షిరాజు కన్ను
    తేజరిల్లు!—2003
  • యౌవనులారా మీ హృదయాన్ని కాపాడడానికి మీ తల్లిదండ్రులను సహాయం చేయనివ్వండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 10/1 పేజీ 32

పాఠకుల ప్రశ్నలు

ఒక పురుషుడు కుయుక్తితో కన్యకను లోబరుచుకొను విధానము “అత్యంత ఆశ్చర్యకరమైన” దని సామెతలు 30:19 (NW) వ్రాసిన రచయిత నిజముగా అలా భావించెనా?

సామెతలు 30:19కి అటువంటి భావముండు అవకాశము కలదు, ఇది సులభముగా అర్థము చేసికోగల వచనము కాదని ఒప్పుకోవలసిందే.

ఈ వచన భావమును గ్రహించుటకు ప్రయత్నించుటలో, మనము సందర్భాన్ని వదిలివేయకూడదు. ఈ వాక్యభాగమునకు ముందు, ప్రేరేపిత రచయిత తృప్తిచెందని నాలుగు సంగతులను గూర్చి ప్రస్తావించాడు. (సామెతలు 30:15, 16) ఆ తరువాత ఆయనిట్లు వ్రాశాడు: “నా బుద్ధికి మించినవి (అత్యంత ఆశ్చర్యకరమైనవి NW) మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు. అవేవనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండమీద సర్పము జాడ, నడిసముద్రమున ఓడ నడచు జాడ, కన్యకతో పురుషుని జాడ.”—సామెతలు 30:18, 19.

ఈ నాలిగింటిలో “ఆశ్చర్యకరమైన” సంగతి ఏమైయుండ గలదు?

“ఆశ్చర్యకరమైన” అనుమాటకు అనుకూలమైన లేక మంచి అను భావము కలదని బహుశ భావించుచు కొందరు విద్వాంసులు ఈ నాలిగింటిలో ప్రతిదీ: అనగా ఒక పెద్ద పక్షి ఎగిరివెళ్లుట, కాళ్లులేని సర్పము ఒక పెద్దబండ రాయిపై కదలివెళ్లగల్గుట, అల్లకల్లోల సముద్రములో బరువైన ఓడ తేలియాడుట, అందమైన యువకుడు మైమరచి ప్రేమలోపడి ఒక అందమైన అమ్మాయిని వివాహమాడి, ఆ పిమ్మట అత్యంత అద్భుతమైన మానవ శిశువుకు జన్మనిచ్చుట అపురూపమైన దేవుని సృష్టిజ్ఞానమును ప్రదర్శించుచున్నవని వివరించుచున్నారు. ఒక విద్వాంసుడు ఈ నాలుగు సంగతులలో మరొక పోలికను కనుగొనెను, అదేమనగా అందలి—పక్షిరాజు, సర్పముల గమనము, రహదారి లేనిచోట ఓడ వెళ్లుట మరియు ప్రేమను వికసింపజేసికొనుటలో ఒక జంట కలిగియుండు క్రొత్తదనము—ఇలా ఎప్పుడూ క్రొత్తగావుండు మార్గమున పయనించును.

అయితే, మంచి భావమునందు ఆ నాలుగు సంగతులు “ఆశ్చర్యకరమై” ఉండనవసరము లేదు, అనగా వాటన్నింటిలో అనుకూలమైనది ఉన్నదని కాదు. సామెతలు 6:16-19, “యెహోవాకు అసహ్యములైన” వాటిని గూర్చి చెప్పుచున్నది. ముందుగా చూసినట్లుగానే, ప్రశ్నలోని వచనములకు ముందు, సామెతలు 30:15, 16 “చాలును” అని ఎన్నటికిని చెప్పని (షియోల్‌, కనని గర్భము, ఎండిన భూమి, మండుచున్న అగ్నిని) గూర్చి చెప్పుచున్నది. నిశ్చయముగా అవి ఆశ్చర్యపడునంత మంచివి కాదు.

సామెతలు 30:18 నందు “ఆశ్చర్యకరము” అని అనువాదము చేయబడిన హెబ్రీ పదమునకు “వేరుపరచు, ప్రత్యేకించు; ప్రత్యేకపరచుట, అసాధారణము చేయుట, అద్భుతకరము చేయుట” అని భావము. అందులో మంచియనేది లేకుండానే ఒక సంగతిని ప్రత్యేకముగా, అసాధారణముగా, లేదా అద్భుతకరమైనదిగా ఉండవచ్చును. క్రూరుడగు ఒక రాజు “ఆశ్చర్యముగా” శత్రువులను నాశనము చేయుచు, పరిశుద్ధులతో సహా “బలవంతులను నశింపజేయుటను” గూర్చి దానియేలు 8:23, 24 ప్రవచించినది.—ద్వితీయోపదేశకాండము 17:8; 28:59; జెకర్యా 8:6 పోల్చుము.

రచయిత దేనిని అర్థము చేసికొనుట కష్టమని భావించెనో తెలిసికొనుటకు సామెతలు 30:18, 19 క్రిందగల వచనము కావల్సిన సమాచారము నిచ్చుచున్నది. “తిని నోరు తుడుచుకొని—నేను ఏ దోషము ఎరుగననే” జారిణిని గూర్చి 20వ వచనము ప్రస్తావించుచున్నది. బహుశ రహస్యమందు, పన్నాగముతో ఆమె పాపముచేసి యుండవచ్చును, గాని ఆమెచేసిన నేరముయొక్క జాడ తెలియనందున ఆమె నేను ఏ దోషము ఎరుగనని బుకాయించవచ్చును.

ముందు చెప్పబడినవాటికి దీనికి సారూప్యము కలదు. పక్షిరాజు అంతరిక్షమున ఎగిరిపోయినప్పుడు, సర్పము బండను దాటినప్పుడు, ఓడ సముద్రపు అలలను చీల్చుకుంటూ ముందుకు దూసుకు పోయినప్పుడు, ఆ మూడింటిలో దేని ప్రయాణపు జాడనైనను మచ్చుకైనా పసిగట్టుట కష్టము. ఈ మూడింటిలో ఒక విషయము సామాన్యమై యుండగా మరి నాల్గవదియైన—“కన్యకతో పురుషుని జాడ” విషయమేమి?

ఇది కూడా వాటివలెనే జాడ పసిగట్టలేనిదై యుండగలదు. అమాయకురాలైన ఒక కన్య ప్రేమను సంపాదించులాగున, ఆమెను వంచించుటకు యువకుడొకడు మృదువైన, కపటమైన పన్నాగములు పన్నవచ్చును. అనుభవములేక ఆమె అతని జిత్తులు కనిపెట్టలేకపోవచ్చును. మోసగింపబడిన తర్వాతకూడ, అతడు తననెట్లు వశపరచుకొనెనో ఆమె చెప్పలేక పోవచ్చును; గమనించువారు సహితము దానిని సరిగా వివరించలేక పోవచ్చును. అయినప్పటికిని, యువతు లనేకమంది ఇటువంటి కపట వంచకుల మోసాలకు బలియైపోయారు. అటువంటి వంచకుల జాడ పసిగట్టుట కూడ కష్టమే, అయినను ఎగిరిపోవు పక్షికి, బండమీద పాకిపోవు సర్పమునకు లేక సముద్రమందలి ఓడకు ఒక గమ్యమున్నట్లే వీరికిని ఒక గమ్యము ఉండును. లైంగిక వంచనే ఈ మోసగాళ్ల ఉద్దేశము.

దీని ప్రకారము చూసినట్లయితే సామెతలు 30:18, 19లోని అంశము సృష్టిసంగతుల విజ్ఞానశాస్త్ర సంబంధమైన లేక యాంత్రిక సంబంధమైనది కాదు. బదులుగా, ప్రోద్బలించే జారస్త్రీ వలనవచ్చు ప్రమాదములను తప్పించుకొనుటను గూర్చి సామెతలు 7:1-27 హెచ్చరించుచున్నట్లే, ఆ వాక్యభాగము మనకు నైతిక హెచ్చరికను అందించుచున్నది. సామెతలు 30:18, 19లోని హెచ్చరికనుండి క్రైస్తవ సహోదరీలు హృదయమునకు తీసికొనగల ఒక అంశమేమనగా, బైబిలు నేర్చుకొనుటకు తమకు ఆసక్తిగలదని చెప్పే పురుషుల విషయములో జాగ్రత్తగా యుండవలెను. స్నేహపూర్వకముగా ఉండు పురుషుడు, సహోద్యోగియైనప్పటికిని అటువంటి ఆసక్తి చూపించుచున్నట్లు కన్పించినట్లయిన, ఆ సహోదరి అతనిని సంఘములోని ఒక సహోదరుని యొద్దకు నడిపించవచ్చును. “కన్యకతో పురుషుని” విషయమైన ప్రమాదములు లేకుండా ఆ సహోదరుడు ఎటువంటి నిజమైన ఆసక్తినైనను సంతృప్తిపరచ గలడు. (w92 7/1)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి