కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 10/1 పేజీ 31
  • తూర్పు ఐరోపానుండి శుభవార్త

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తూర్పు ఐరోపానుండి శుభవార్త
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘బాలుర నోటి నుండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ప్రేమ కుటుంబములను ఐక్యపరచును
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • “మీరు . . . తన నామమునుబట్టి చూపిన ప్రేమను” దేవుడు మరచిపోడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 10/1 పేజీ 31

రాజ్య ప్రచారకుల నివేదిక

తూర్పు ఐరోపానుండి శుభవార్త

తూర్పు ఐరోపానందలి దైవపరిపాలనా క్షేత్రమందు ఎన్నో ఉత్తేజకరమైన సంగతులు జరుగుచున్నవి. వీటిలో 1991 ఆగష్టు 16-18 వరకు జాగ్రెబ్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశము ప్రత్యేకముగా చెప్పుకోతగ్గది. అక్కడి 7,300 మంది సాక్షులు 15 దేశాలనుండి వస్తున్న తమ సహోదరులకు హృదయపూర్వక స్వాగతం పలికారు. ఆ సమావేశానికి మొత్తం 14,684 మంది హాజరయ్యారు. అశాంతితో వణకుచున్న ఆ దేశములో అది ప్రేమ, ఐక్యతయొక్క అద్భుతకరమైన ప్రదర్శనయై యుండెను!

నిజమైన సమాధానమునకు ఒకేఒక నిరీక్షణయని తాము తెలిసికున్న యెహోవా రాజ్యమును గూర్చిన సువార్తను ఇతరులకు చెప్పుటలో తూర్పు ఐరోపాలోని సాక్షులు పనిరద్దీగా ఉన్నారు. కొన్ని ప్రాంతాలలో తమ తటస్థవైఖరిని కాపాడుకొనుట వారికి సవాలుగా ఉన్నది. అయినప్పటికిని, ప్రజలు తరచు వింటున్నారు, సాక్షులు అనేకమైన చక్కని అనుభవాలను నివేదిస్తున్నారు.

ఆ పట్టణములోవున్న ఒకేఒక యెహోవాసాక్షి చెప్పిన సువార్తను ఒక 16 సంవత్సరాల బాలిక విన్నది. ఆమెతో క్రమముగా బైబిలు పఠనముచేయుట ఆరంభించబడగా, సత్యముయెడల ఆమెకున్న మెప్పు అభివృద్ధిచెందింది. తాను నేర్చుకున్న అద్భుతకరమైన సంగతులను ఇతరులకు చెప్పాలనే గొప్పకోరికతో, ఆమె తన తోటి పాఠశాల విద్యార్థినిలతో మాట్లాడుటకు ప్రయత్నించింది, అయితే ఆమెకు వ్యతిరేకత అపహాస్యము ఎదురైనవి. తనకు కలిగిన అవమానవంతటిలో ఈ యౌవన బైబిలు విద్యార్థిని కోపము తెచ్చుకొనకుండా ఎంతో ఓపికను ప్రదర్శించుట చూచి, ప్రత్యేకముగా ఆమెను వ్యతిరేకించిన ఒక తోటి పాఠశాల విద్యార్థిని ఆశ్చర్యపడి, ముగ్ధురాలయ్యింది. ఆ తర్వాత, ఈ బాలికకు మరియెక్కువగా సాక్ష్యమిచ్చినప్పుడు, ఆమె తన దృక్పధం తప్పని తెలుసుకుంది. ఆమెతో బైబిలు పఠనం ప్రారంభించబడింది. అలా మొదటి విద్యార్థిని, ఈ క్రొత్త సహవాసి తమ తలిదండ్రులనుండి, టీచరునుండి, తమ తోటి పాఠశాల విద్యార్థినులనుండి వ్యతిరేకత వచ్చినను, వారు తమ సంతోషమును ఇతరులతో పంచుకొనుటకు ప్రయత్నించారు.

వారి సాక్ష్యము ఫలితముగా, మరొక పాఠశాల విద్యార్థిని సత్యమును అంగీకరించింది. తరగతిలో వారిప్పుడు ముగ్గురయ్యారు, ఈ ముగ్గురుకూడా ఇతరులకు సహాయము చేయుటకు ఇష్టము చూపుటలో, తమమధ్య ప్రేమను ప్రదర్శించుటలో చక్కని మాదిరి చూపారు. దానితో మరొక బాలిక వారితో చేరింది.

ఆ పాఠశాల ఆవరణలోవున్న బల్లపై ఈ నలుగురు కూర్చుండి కలిసి ఇప్పుడు బైబిలును చర్చించుట కారంభించారు. అనేకులు ఆశ్చర్యపడునట్లు, వారి సంఖ్య వృద్ధియైనది. తరగతిలోని మరొక బాలిక వారి చక్కని ప్రవర్తనకు ముచ్చటపడి, వారితో కలిసి బైబిలు పఠనమునకు కూర్చొనవలెనని తీర్మానించుకుంది. వారు ఐదుగురు కలిసి, తమవలెనే వారును చేయవలెనని ఇతరులను, విద్యార్థినులను, టీచర్లను ఎడతెగక ఆహ్వానించారు. ఏమైననూ, ఈ బాలికలు తమ తలిదండ్రులచే గొప్ప వ్యతిరేకతను అనుభవించారు. వారి తలిదండ్రులు ఈ బాలికల సాహిత్యములను నాశనం చేసి, వారిని హింసించి వారి బైబిలు పఠనమును ఆపుజేయవలెనని వత్తిడి తెచ్చుటకు బహుగా ప్రయత్నించారు.

ఆసక్తిగల ఈ ఒక్క యౌవన బాలికతో ఆరంభమయిన సాక్ష్యపు పని ఫలితమేమై యుండెను? వీరిలో ఒక బాలిక 1990లో జరిగిన జిల్లాసమావేశములో బాప్తిస్మము తీసికొనగా, మిగిలిన నలుగురు 1991, వసంత కాలంలో జరిగిన ప్రాంతీయ సమావేశములో బాప్తిస్మము తీసుకున్నారు. ఆనందానికి ఇదెంత చక్కని కారణం! ఈనాడు, యీ ఐదుగురు బాలికలుకూడ క్రమ పయినీరు సేవచేస్తున్నారు. ఇది జరిగిన పట్టణములో, ఇప్పుడు 11 మంది ప్రచారకులు ఉండగా, వారిలో 8 మంది పయినీరు సేవచేస్తున్నారు.

తూర్పు ఐరోపాలో యెహోవా తన సాక్షులను కాపాడుతూ, ఆశీర్వదిస్తున్నాడు. ప్రపంచములో ఈ ప్రాంతమందలి సహృదయుల మధ్య గొప్ప అభివృద్ధికి స్పష్టముగా అవకాశమున్నది. (w92 7/1)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి