ఆరోగ్యకరమైన విశ్వాసమును కలిగియుండుము!
తీతునుండి ముఖ్యాంశములు
మద్యధరా సముద్రములో ఉన్న క్రేతు ద్వీపములోని క్రైస్తవ సంఘమునకు అవధానము అవసరమైయుండెను. వారికి ఎవరు సహాయముచేయుదురు? ఎందుకు, అపొస్తలుడైన పౌలుయొక్క తోటి పనివాడైన తీతు! అతడు ధైర్యముగలవాడును, మంచి ఉపదేశకుడును, సత్కార్యములవిషయమై ఆసక్తిగలవాడును, ఆరోగ్యకరమైన విశ్వాసముగలవాడైయుండెను.
పౌలు రోమాలో చెరసాలలో వేయబడిన మొదటిసారికి, మరియు రెండవసారికి మధ్యకాలములో క్రేతును దర్శించెను. కొన్ని విషయములను సరిదిద్దుటకును, మరియు సంఘపెద్దలను నియమించుటకును ఆ ద్వీపమందు ఆయన తీతును విడిచిపెట్టెను. మరియు తీతు అబద్ధబోధకులను కఠినముగా గద్దించి, ఒక మంచి మాదిరిని ఉంచవలసియుండెను. సా.శ. 61 మరియు 64 మధ్యలో మాసిదోనియనుండి పౌలు తీతుకు వ్రాసిన పత్రికలో ఇదంతయు బయలుపరచబడినది. పౌలుయొక్క ఉపదేశమును అనుసరించుట ద్వారా ప్రస్తుత దిన అధ్యక్షులు మరియు తోటి విశ్వాసులు, ధైర్యముగా ఆసక్తి కలిగి ఆత్మీయంగా ఆరోగ్యకరంగా ఉండుటకు సహాయము పొందగలరు.
అధ్యక్షులనుండి ఏమి కోరబడుతుంది?
అధ్యక్షులను నియమించుట మరియు కొన్ని గంభీరమైన సమస్యలను పరిష్కరించుట అవసరమైయుండెను. (తీతు 1:1-6) అధ్యక్షునిగా నియమించబడుటకు ఒక వ్యక్తి నిందారహితుడును, వ్యక్తిగతంగా మరియు కుటుంబ జీవితమందు మంచి ఉదాహరణమై అతిధి ప్రియుడును, సమతూకముగలవాడును, మరియు ఆశానిగ్రహముగలవాడునై యుండవలెను. అతడు సత్యమైన దానిని బోధించి ఎదురాడు వారిని హెచ్చరించి ఖండించవలెను. సంఘములో అవిధేయులైన వారి నోరు మూయించుటకు ధైర్యము అవసరము. ప్రాముఖ్యముగా సున్నతి సంబంధుల విషయము ఇది నిజమైయుండెను. వారు పూర్తి కుటుంబములను మోసపుచ్చియున్నారు. సంఘములు ఆత్మీయముగా ఆరోగ్యకరంగా ఉండునిమిత్తము తీవ్రమైన గద్దింపు అవసరమైయుండెను. ఈరోజు క్రైస్తవ అధ్యక్షులు కూడా సంఘమును బలపరచుదృష్టితో గద్దింపు మరియు ఉద్భోదన నిచ్చుటకు ధైర్యము కలిగియుండవలెను.
ఆరోగ్యకరమైన బోధను అనుసరించుట
తీతు ఆత్మీయంగా ఆరోగ్యకరమైన బోధను అందించవలసియుండెను. (2:1-15) వృద్ధులు మితానుభవముగలవారును మాన్యులును, స్వస్థబుద్ధిగలవారును, విశ్వాసము ప్రేమ మరియు సహనములయందు మంచి ఉదాహరణమైయుండవలెను. వృద్ధస్త్రీలు “ప్రవర్తనయందు భయభక్తులు” గలవారై యుండవలెను. “మంచి ఉపదేశము చేయువారిగా” వారు యౌవన స్త్రీలు భార్యలుగా మరియు తల్లులుగా తమబాధ్యతలను సరిగా నిర్వహించుటకు వారికి సహాయము చేయగలరు. యౌవన పురుషులు స్వస్థబుద్ధిగలవారును దాసులైనవారు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు తమ యజమానులకు లోబడియుండవలెను. అందరు క్రైస్తవులు భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మన దేవునియొక్కయు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షతకొరకు ఎదురుచూచుచూ ఉండవలెను. ఆయన “సమస్త దుర్నీతినుండి మనలను విమోచించి సత్క్రియలందాసక్తిగల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.” అటువంటి ఆరోగ్యకరమైన ఉపదేశమును అనుసరించి మనము కూడా దేవుని ‘ఉపదేశమును అలంకరించుదుము.’
ముగింపులో పౌలు ఇచ్చిన ఉపదేశము ఆత్మీయ ఆరోగ్యమును పెంపొందించును. (3:1-15) అధికారులకు లోబడి విధేయులుగా ఉండుట మరియు శాంతులైయుండుట అవసరమైయున్నది. క్రైస్తవులు నిత్యజీవ నిరీక్షణను కలిగియున్నారు గనుక వారి మనస్సులు సత్క్రియలపై నిలిచియుండుటకు పురికొల్పు నిమిత్తము పౌలు మాటలను నొక్కిచెప్పవలసియుండెను. ధర్మశాస్త్రమునుగూర్చిన వివాదములకు కలహములకు దూరముగా ఉండవలెను. మరియు మతబేధములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండుమార్లు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించవలెను. పెద్దలు అటువంటి ఉపదేశమును అనుసరించినకొలది వారును, వారి తోటి విశ్వాసులును, ఆరోగ్యకరమైన విశ్వాసమును కలిగియుందురు. (w91 2/15)
[10వ పేజీలోని బాక్సు/చిత్రం]
ద్రాక్షారసమునకు బానిసలు కాకుండుట: సంఘములో పురుషులకు స్త్రీలు బోధించలేక పోయినప్పటికి, వృద్ధస్త్రీలు యౌవన స్త్రీలకు వ్యక్తిగతముగా ఉపదేశించవచ్చును. అయితే ఈ విషయములో ప్రభావితమవుటకు, వృద్ధస్త్రీలు పౌలు మాటలను వినవలెను. “ఆలాగుననే వృద్ధస్త్రీలు, కొండెకత్తెలును, మిగుల మద్యపానాసక్తులునైయుండక, ప్రవర్తనయందు, భయభక్తులుగలవారై మంచివిషయములను బోధించువారైయుండవలెను.” (తీతు 2:1-5; 1 తిమోతి 2:11-14) త్రాగుట వలన కలుగు ప్రభావముల విషయము చింతించి, అధ్యక్షులు పరిచారకులు మరియు వృద్ధస్త్రీలు మితము గలవారైయుండవలెను. (1 తిమోతి 3:2, 3, 8, 11) అందరు క్రైస్తవులు త్రాగుబోతుతనమునకు దూరముగా ఉండి పరిశుద్ధపనియైన సువార్తను ప్రకటించుపనిచేయునపుడు మధ్యపానీయములను పుచ్చుకొనకుండా ఉండవలెను.—రోమీయులు 15:16; సామెతలు 23:20, 21.