కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 4/1 పేజీ 11
  • సహోదరప్రేమ క్రియాత్మకమైనది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సహోదరప్రేమ క్రియాత్మకమైనది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రేమ విశ్వాసములకొరకు మెప్పుదల
  • ఫిలేమోను, ఒనేసిము క్రైస్తవ సహోదరత్వంలో ఐక్యమైవున్నారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • రోమాలో పౌలు
    నా బైబిలు కథల పుస్తకము
  • ఫిలేమోను విషయసూచిక
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • తీతుకు, ఫిలేమోనుకు, హెబ్రీయులకు రాసిన పత్రికల్లోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 4/1 పేజీ 11

సహోదరప్రేమ క్రియాత్మకమైనది

ఫిలేమోనులోని ముఖ్యాంశములు

యేసుక్రీస్తు వారిని ప్రేమించిన రీతిగా వారును ఒకరినొకరు ప్రేమించవలెనని తన శిష్యులకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చెను. (యోహాను 13:34, 35) అట్టి ప్రేమ కలిగియున్నందున వారు ఒకరికొకరు ప్రాణమును కూడా ఇచ్చెదరు. అవును, సహోదర ప్రేమ అంత బలమైనది, క్రియాత్మకమైనది. ఆసియా మైనరులోని ఒక పట్టణమైన కొలస్సయిలోని సంఘములో ఒకడైన ఫిలేమోనును కూడా ఆ సహోదర ప్రేమ పురికొల్పునని అపొ. పౌలు నిశ్చయతను కలిగియుండెను. ప్రేమ ఫిలేమోనును తన యింటిని క్రైస్తవకూటముల నిమిత్తం ఉపయోగించుటకై పురికొల్పెను. ఫిలేమోనుయొక్క దాసుడైన ఒనేసీము పారిపోయెను. బహుశా తన రోమా ప్రయాణమునకు కావలసిన డబ్బును దొంగిలించియుండవచ్చును. ఆ పిమ్మట అతడు పౌలును కలిసికొని క్రైస్తవత్వమును చేపట్టెను.

సుమారు సా.శ. 60-61లో రోమా చెరలో ఉన్నప్పుడు పౌలు ప్రత్యేకంగా ఫిలేమోనును ఉద్దేశించి ఒకపత్రికను వ్రాసెను. తిరిగివస్తున్న ఒనేసీమును అది సహోదర ప్రేమతో స్వీకరించుమని ఫిలేమోనుకు మనవిచేసెను. దీనిని మీరుచదవండి, ఇది అనురాగమునకు జ్ఞానయుక్తమైన నేర్పునకు ఒక మంచి ఉదాహరణని మీరే గమనించగలరు. — దీనిని యెహోవా ప్రజలు అనుకరించగలరు.

ప్రేమ విశ్వాసములకొరకు మెప్పుదల

ఫిలేమోనును ఇతరులను సంబోధిస్తూ పౌలు మొదట వారిని మెచ్చుకొనెను. (ఫిలేమోను 1-7) క్రీస్తుయెడల మరియు అందరి పరిశుద్ధులయెడల ఫిలేమోనుకు ఉన్న ప్రేమను మరియు ఆయన విశ్వాసమునుగూర్చి పౌలు వినియుండెను. ఇది పౌలును యెహోవాకు కృతజ్ఞత చెప్పుటకు పురికొల్పినది. మరియు అది ఆయనకు సంతోషమును ఓదార్పును కలుగజేసినది. మనతోటి విశ్వాసులు మాదిరికరమైన ప్రేమ విశ్వాసములను చూపినపుడు మనము వ్యక్తిగతముగా మెచ్చుకొనుచున్నామా? మనమటుల చేయవలెను.

సహ క్రైస్తవులతో వ్యవహరించునపుడు ప్రేమాపూర్వకమైన ఉపదేశము కోరదగినదని పౌలు మాటలు చూపుచున్నవి. (ఫిలేమోను 8-14) వివేకయుక్తముగా మొదలుపెట్టిన తరువాత తాను సరైనదానిని ఫిలేమోనుకు ఆజ్ఞాపించగలిగినను ఉద్భోదించుటకు ఆయన ఎన్నుకొనెను. ఏమి చేయుటకు? ఒనేసీమును తనయొద్దకు తిరిగిచేర్చుకొనుటకు! తనకు పరిచారముచేయుటకు ఒనేసీమును తనయొద్ద ఉంచుకొనుటకు పౌలు ఇష్టపడినను ఫిలేమోను సమ్మతిలేకుండా అట్లు చేయుటకు ఇష్టపడలేదు.

ప్రతికూలముగా కనబడు పరిస్థితులు తరచుగా ప్రయోజనకరంగా మారగలవను విషయమును పౌలు తదుపరి సూచించెను. (ఫిలేమోను 15-21 వచనములు) వాస్తవముగా ఒనేసీము పారిపోవుటవలన మంచి సంభవించినది. ఎందుకు? ఎందుకనగా ఇప్పుడు ఫిలేమోను అతనిని ఇష్టపడు నమ్మదగిన క్రైస్తవ సహోదరునిగా పొందవచ్చును. కాని ఇష్టములేని అపనమ్మకమైన దాసునిగా కాదు. పౌలును ఎట్లు చేర్చుకొనునో ఒనేసీమును కూడ అదేవిధముగా చేర్చుకొనుమని పౌలు ఫిలేమోనును అడిగెను. ఒనేసీము ఫిలేమోనుకు ఏమైనా నష్టము చేకూర్చిన యెడల పౌలు దానిని చెల్లించును. ఫిలేమోను ఒప్పుకొనుటకు ఇష్టపడురీతిగా, క్రైస్తవుడవుటలో అతడే అపొస్తలునికి రుణపడియున్నాడని గుర్తుచేసెను. కావున చెప్పిన దానికంటే ఫిలేమోను ఎక్కువగానే చేయునని పౌలు నిశ్చయత వ్యక్తపరిచెను. ఎంత యుక్తమైన మరియు ప్రేమపూర్వకమైన మనవి! నిశ్చయముగా, మన క్రైస్తవ సహోదరులతో మనము ఈ విధముగా వ్యవహరించవలెను.

పౌలు తన పత్రికను నిరీక్షణ వందనములు మరియు ఆశీస్సులతో ముగించెను. (ఫిలేమోను 22-25 వచనములు) ఆయనకొరకు ఇతరులు చేయు ప్రార్థనల ద్వారా, తాను చెరసాలనుండి విడుదల పొందగలడన్న నిరీక్షణను వ్యక్తపరిచెను. (పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక చూపురీతిగా, ఆ ప్రార్థనలకు జవాబు దొరికెను.) తన పత్రికను ముగిస్తూ పౌలు వందనములు పంపెను మరియు యేసుక్రీస్తు యొక్క కృప ఫిలేమోను మరియు యెహోవాయొక్క సహ ఆరాధికులు చూపు ఆత్మపై తోడైయుండవలెనను కోరిక వ్యక్తపరిచెను. (w91 2/15)

[11వ పేజీలోని బాక్సు/చిత్రం]

దాసునికంటే ఎక్కువ: ఫిలేమోను యొక్క పారిపోయిన దాసుడైన ఒనేసీమును గూర్చి పౌలు ఇట్లు చెప్పెను “అతడికమీదట దాసుడుగా ఉండక దాసునికంటె ఎక్కువవాడుగాను, ప్రియసహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీరవిషయమును, ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును, ప్రియసహోదరుడుగాను, నీయొద్ద ఎల్లపుడు ఉండుటకే కాబోలు అతడు కొద్దికాలము నిన్ను ఎడబాసియుండెను.” (ఫిలేమోను 15, 16) రోమాసామ్రాజ్యములో బానిసత్వమును రాజ్య పరిపాలకులు బలముతో ప్రయోగించిరి. మరియు పౌలు ఆ పైఅధికారులను గుర్తించెను. (రోమా 13:1-7) ఆయన దాసులు తిరుగుబాటు చేయవలెనని వాదించలేదుకాని అటువంటి వ్యక్తులు ఆత్మీయ యజమానులకు విధేయులై యుండవలెనన్న తన ఉపదేశమునకు అనుగుణంగా పౌలు ఒనేసీము ఫిలేమోను యొద్దకు పంపెను (కొలొస్సయులు 3:22-24; తీతు 2:9, 10) ఒనేసీము ఇప్పుడు ఒక ప్రత్యేక లౌకిక దాసునికంటె ఎక్కువైయున్నాడు. అతడు ఒక ఉత్తమ దాసుడై ఫిలేమోనుకు లోబడియుండి దైవిక సూత్రముల ద్వారా నడిపింపబడినవాడును మరియు సహోదరప్రేమను వ్యక్తపరచు ప్రియ సహోదరుడైయున్నాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి