కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 10/1 పేజీ 21
  • అలెగ్జాండ్రియన్‌ కోడెక్స్‌

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అలెగ్జాండ్రియన్‌ కోడెక్స్‌
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఇలాంటి మరితర సమాచారం
  • బెజాయి కోడెక్స్‌ ఒక సాటిలేని వ్రాతప్రతి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • వాటికన్‌ కోడెక్స్‌యొక్క రహస్యము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 10/1 పేజీ 21

అలెగ్జాండ్రియన్‌ కోడెక్స్‌

ఈ అలెగ్జాండ్రియన్‌ కోడెక్స్‌ విద్వాంసులకు లభ్యమైన పెద్ద బైబిలు చేతివ్రాతప్రతులలో మొట్టమొదటిది. దీనిని కనుగొనుటయనునది గ్రీకు మూలగ్రంథపు నిర్మాణాత్మకమైన విమర్శకు నడిపి తద్వారా తదుపరి పరిశుద్ధ లేఖనముల తర్జుమాదారులందరికి ప్రయోజనాత్మకముగా తయారైనది. ఎప్పుడు మరియు ఏ విధముగా అది వెలుగులోకి వచ్చింది?

ఐగుప్తు నందలి అలెగ్జాండ్రియాలో ప్రధాన మతగురువుగా ఉన్న క్రిలోస్‌ లూకారిస్‌ పుస్తకములను సమకూర్చుటలో ఎంతో గొప్పవాడు. 1621లో ఆయన టర్కీనందలి కాన్‌స్టాంటినోపుల్‌లో ప్రధానగురువుగా అయినప్పుడు, ఈ అలెగ్జాండ్రినస్‌ కోడెక్స్‌ను (వ్రాతప్రతి పుస్తకము) తనతో తీసుకెళ్లాడు. ఏమైనను, మిడిల్‌ ఈస్ట్‌లో నెలకొనియున్న ఉద్రిక్తత మరియు ముస్లీంల చేతిలో పడితే వారు దానిని నాశనముచేసే పరిస్థితియున్నందున, ఇంగ్లాండులో అయితే అది ఎంతో భద్రంగాయుండునని ఆయన భావించెను. ఆ ప్రకారంగా 1624లో ఆంగ్లేయ రాజైన జేమ్సు Iకి బహుమానముగా అందజేయుమని టర్కీలోని బ్రిటీష్‌ రాయబారికి దానినిచ్చెను. అయితే ఆ చేతివ్రాతప్రతిని అందించక ముందే రాజు చనిపోయినందున, తదుపరి మూడు సంవత్సరములకు అతని తరువాతి రాజైన చార్లెన్‌ Iకి ఆయన దానినిచ్చెను.

క్రిలోస్‌ లూకారిస్‌ దానిని భావించినంతటి విలువైనదా ఆ చేతివ్రాతప్రతి? అవును. సా.శ. అయిదవ శతాబ్దమునాటి తొలి భాగము నాటిదిగా ఆ చేతివ్రాతప్రతి లెక్కించబడుచున్నది. అనేకమంది శాస్త్రులు దానిని వ్రాయుటలో పాల్గొనిరి. మరియు ఆ గ్రంథమందు అనేక సవరణలు జరిగినవి. అది వెల్లం అనబడు నాణ్యమైన చర్మపుకాగితము మీద వ్రాయబడెను, కాగా దానిలోని ప్రతి పేజీ రెండు కాలమ్‌లుగా అన్సియల్‌ (పెద్ద) అక్షరములతో పదముల మధ్య దూరము లేకుండా వ్రాయబడినవి. దీనిలో మత్తయి యొక్క ఎక్కువ భాగము కనిపించుటలేదు. అలాగే ఆదికాండము, కీర్తనలు, యోహాను, 2 కొరింథీయులలోని కొన్ని భాగములు అందులేవు. ప్రస్తుతము అధికారపూర్వకముగా కోడెక్స్‌ A అని గుర్తింపబడుచున్న, ఈ చేతివ్రాతప్రతి ప్రస్తుతము 773 పత్రములను కలిగియుండి, గమనించదగిన ప్రాధాన్యతతో తొలి సాక్ష్యముగా నిలిచియున్నది.

వాటి మధ్యలోయున్న సమపోలికలమూలంగా అనేక బైబిలు చేతివ్రాతప్రతులను వాటివాటి కుటుంబములు, లేక శాఖలుగా ఉంచవచ్చును. శాస్త్రులు (కాపీచేయువారు) ఒకే మూలమునుండి లేక వాటి సన్నిహిత నమూనాలను బట్టి ప్రతులను తయారుచేసినపుడు ఇవి ఏర్పడినవి. ఏమైనను, అలెగ్జాండ్రియన్‌ కోడెక్స్‌తో శాస్త్రులు విభిన్న కుటుంబముల వ్రాతలను సమకూర్చి సాధ్యమైనంతమేరకు ఒక శ్రేష్ఠమైన పుస్తకమును అందించుటకు శ్రద్ధతీసుకొన్నట్లు కనిపిస్తుంది. నిజానికి యిది, 1611నాటి కింగ్‌ జేమ్సు వర్షన్‌కు ఆధారముగా ఉపయోగింపబడిన ఏ యితర గ్రీకు చేతివ్రాతప్రతులకంటెను, పురాతనమైనదిగా మరియు శ్రేష్ఠమైనదిగా నిరూపింపబడెను.

మొదట ప్రచురింపబడినప్పుడు, అలెగ్జాండ్రియన్‌నందుగల 1 తిమోతి 3:16ను చదువు విషయములో అది గొప్ప విభిన్నతను రేకెత్తించింది. క్రీస్తును సూచిస్తు కింగ్‌ జేమ్సు వర్షన్‌ యిక్కడ ఇలా చదువబడుతుంది: “దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.” అయితే “దేవుడు” అనుదానికి సంక్షిప్తపదముగానున్న రెండు గ్రీకు అక్షరములైన “ΘC,” ఆదిలో “ఆయన” అనుదానికి పదమైన “OC” గా చదువబడినట్లు ఈ పురాతన కోడెక్స్‌లో కన్పించుచున్నది. సాక్ష్యాధారముగా, దీని భావము యేసు క్రీస్తు “దేవుడై” యుండలేదు.

యితర పురాతన చేతివ్రాతప్రతులను కనుగొనుటతోపాటు ఇచ్చట ఉన్నది “ఆయన” లేక “అది” అని నిర్థారించుటకు రెండువందలకంటే ఎక్కువ సంవత్సరములు పట్టినది. తనయొక్క టెక్‌స్టువల్‌ కామెంటరీ ఆన్‌ది గ్రీక్‌ న్యూటెస్ట్‌మెంట్‌ అను పుస్తకములో బ్రూస్‌ యం. మెట్‌జెర్‌ దానికి ఇట్టి ముగింపునిచ్చుచున్నాడు: “ఎనిమిది లేక తొమ్మిదవ శతాబ్దమునకు ముందర. . .ఏ పెద్ద అక్షరముల చేతివ్రాతప్రతియు θεόςను [థియోస్‌] బలపరచుటలేదు; పురాతన ప్రతులన్నియు ὅς లేక ὅ అంతర్గత భావముతో యున్నవి; నాలుగవ శతాబ్దపు చివరి మూడవ భాగమునకు ముందర మతభావముగల ఏ రచయితయు θεός [థియోస్‌] అని చదువుటను ధృవపరచుటలేదు.” ఈనాడు అనేక తర్జుమాలు ఈ వచనములో “దేవుడు” అని చదువబడుటను తీసివేయుటతో ఏకీభవించుచున్నవి.

1757లో రాజుయొక్క రాయల్‌ లైబ్రరీ, బ్రిటీష్‌ లైబ్రరీలో భాగమయ్యింది. ఈ ఉత్తమమైన కోడెక్స్‌ చేతివ్రాతప్రతుల గదిలో బ్రిటీష్‌ మ్యూజియంలో స్పష్టముగా ప్రదర్శింపబడుచున్నది. నిజముగా చూచుటకు అది యోగ్యమైనది. (w88 12⁄15)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి