కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 8/1 పేజీలు 17-22
  • పెద్దలారా దేవుని మందను మృదువుగా కాయుడి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పెద్దలారా దేవుని మందను మృదువుగా కాయుడి!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మందపై అధికారులైనట్లుండక
  • నివారణకు ఊరట కల్గించుటకు ఆధారములు
  • నీతి న్యాయములతో
  • కనికరమును చూపిస్తూనే ఉండుము
  • ‘మీ మధ్యనున్న దేవుని మందను కాయండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • పెద్దలు, నీతిననుసరించి తీర్పుతీర్చుదురు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • కాపరులారా, మహాగొప్ప కాపరులను అనుకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • నాయకులుగా ఉన్నవారికి విధేయులై యుండుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 8/1 పేజీలు 17-22

పెద్దలారా దేవుని మందను మృదువుగా కాయుడి!

“స్తన్యమిచ్చు తల్లి తన సొంతబిడ్డలను గారవించునట్లుగా, మేము మీ మధ్యను సాధువులమై యుంటిమి.”—1 థెస్సలొనీకైయులు 2:7.

1. నమ్మకమైన ప్రతి యెహోవా సాక్షి ఎందుకు క్షేమంగా వున్నట్లు భావించగలడు?

యెహోవా దేవుడు మహాగొప్పకాపరి. ఆయన తన గొర్రెలాంటి సేవకులకు ఆహార సమృద్ధిని కలుగజేసి, తన పరిశుద్ధ నామము నిమిత్తము వారిని “నీతి మార్గములో” నడిపిస్తాడు. కావున, ఆయన చిత్తాన్ని చేసేవారు చెడుకలుగుతుందని భయపడనక్కర్లేదు మరియు ఓదార్పుకొరకు దయగల దేవున్ని వారు ఆశ్రయించవచ్చును. నిజానికి, యథార్థపరులైన ప్రతి యెహోవా సాక్షి దేవుని ప్రేమగల బాహువు క్రింద పదిలంగా వున్నానని భావించుటకు బలమైన హేతువున్నది.—కీర్తన 23:1-4.

2.దేవుని మహిమాస్వరూపిగా యేసు ఏ లక్షణములను కనబరచెను?

2 యేసుక్రీస్తు “దేవుని మహిమయొక్క తేజస్సును ఆయనతత్వముయొక్క మూర్తిమంతమునైయున్నాడు.” (హెబ్రీయులు 1:1-4) గనుక, మంచి కాపరియైన యేసుక్రీస్తుకూడ ప్రేమ కనికరములను చూపుతాడు. (యోహాను 10:14, 15) ఉదాహరణకు, ఒకసారి “ఆయన ఆ గొప్పసమూహమునుచూచి వారు కాపరిలేని గొర్రెలవలెవున్నందున వారిమీద కనికరపడి, వారికి అనేక సంగతులను బోధింపసాగెను,”—మార్కు 6:34.

3. (ఎ) యెహోవా దేవుడు, యేసు క్రీస్తువలె ఉపకాపరులు ఏ లక్షణములను, కనబరచాలి? (బి) అపొస్తలుడైన పౌలు కాపరులకు ఎట్టి సలహాను, హెచ్చరికను ఇచ్చాడు?

3 క్రైస్తవులంతా, ‘దేవుని పోలి క్రీస్తువారిని ప్రేమించినట్లు వారును ప్రేమగలిగి నడుచుకోవాలి.’ (ఎఫెసీయులు 5:1,2) కావున వారు ప్రేమ కనికరం కలిగివుండవలెను. ప్రత్యేకంగా దేవుని మందును కాయు కాపరులలో ఇది సత్యమైయుండాలి. అపొస్తలుడైన పౌలు ఇట్లన్నాడు: “దేవుడు తన స్వకూమరుని రక్తమిచ్చిసంపాదించి తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా వుంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీమట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తపడుడి. నేను వెళ్లిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును. వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొనిపోవలెనని ప్రతికూల వచనములు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.”—అపొ.కార్యములు 20:28-30 NW.

4. (ఎ) కాలమైనప్పుడు అపొ.కార్యములు 20:29, 30 లో పౌలు ఇచ్చిన హెచ్చరికను అమలుపరచు విషయమేమైనది? (బి)  ఏ ప్రశ్నలు పరిశీలనకు తగినవి?

4 కాలమైనప్పుడు, మతభ్రష్టులైన “కౄరమైన తోడేళ్లు” వచ్చి “మందను కనికరించలేదు.” అయితే, యెహోవా సాక్షులలోని పెద్దలు అట్టి కౄరత్వాన్ని అభ్యసించుట లేదనుట మనకెంత సంతోషం! అయిననూ, ఆత్మ-నియమిత కాపరులనుండి తొటివిశ్వాసులు ఎటువంటి ఆదరణను పొందాలని అనుకుంటారు? అలాంటి నియమితులు యెహోవా మంద యెడల ఎట్లు మృదువైన శ్రద్ధను కనబరచగలరు?

మందపై అధికారులైనట్లుండక

5. (ఎ) లోక నాయకులు తరచూ వారి క్రింది వారిని ఎలా చూస్తారు? (బి) తన అనుచరులలో అధికారానికి తావులేదని యేసు ఎలా చూపించాడు?

5 క్రైస్తవ పెద్దలు మనలను కనికరముతో చూడాలనుకొనుట న్యాయమే. వారు తరచు తమ క్రింది వారికి ప్రభువులైనట్లు ప్రవర్తించే లోక పాలకులవలె వారుండరు. ఉదాహరణకు, ఫ్రాంకిష్‌ రాజు చార్షీమాగ్నె (సా.శ. 768-814 వరకు పాలించాడు.) “ఉత్తర జర్మనీ దేశస్థులకు బాప్తిస్మమిచ్చుటకై మరణ భయం పెట్టాడు, ఉపవాసముండని వారిని కఠినంగా శిక్షించాడు, మార్పిడికొరకు ప్రతిచోట బలప్రయోగంచేశాడు.” (విలియం జోన్స్‌ రచించిన ది హిస్టరీ ఆఫ్‌ ది క్రిష్టియన్‌ చర్చ్‌) యేసు అనుచరులలో అధికారం చెలాయించుటకు తావే లేదు, ఏలయనగా ఆయనిట్లన్నాడు: “అన్యజనుల పాలకులు వారిమీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారిని నిరంకుశముగా పాలింతురనియు మీకు తెలియును. మీలో ఆలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ సేవకుడై వుండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై వుండగోరునో వాడు మీకు దాసుడై వుండవలెను. ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచనక్రయ ధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను.”—మత్తయి 20:25-28, ఏన్‌ అమెరికన్‌ ట్రాన్స్‌లేషన్‌.

6. (ఎ) పెద్దల విషయంలో, ఏ మూలాంశములు ముఖ్యంగా కనబడుచున్నవి? (బి) పెద్దలు ఎలా మెలగవలెనని సంఘం ఎదురుచూస్తుంది, మరియు ఈ పురుషులు తమ్మునుతాము ఎలా భావించుకోవాలి?

6 ఒక క్రైస్తవ పురుషుడు ‘అధ్యక్ష పదవిన ఆశించిన యెడల అతడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు.’ (1 తిమోతి 3:1) మనం దీనిని, ఇప్పుడే పైన తెలిపిన యేసు సలహాను పరిశీలిస్తే యీ మూలాంశములు ముఖ్యంగా కనబడుచున్నవి, (1) క్రైస్తవ పెద్దలు ఇతరులపై అధికారం చెలాయించకూడదు; (2) యేసు అనుచరుల మధ్య బాధ్యతలు నిర్వహించువారు వారికి దాసులై యుండవలెనే గాని యజమానులుగా వుండకూడదు; మరియు (3) అధ్యక్ష్యపదవిని ఆశించు పురుషులు దాన్ని “శ్రేష్ఠమైన పనిగానే” భావించాలి గాని అది ఉన్నతమైన స్థానమని భ్రమపడకూడదు. (సామెతలు 25:27; 1 కొరింథీయులు 1:31) “పెద్ద” అనే పదము ఏ పురుషున్ని యెహోవా ఇతర ఆరాధికులకన్న గొప్పవానిగా చేయుట లేదు. బదులుగా, పెద్దలంతా ఆత్మీయ పరిపక్వతగల, అనుభవజ్ఞులై, పవిత్ర సేవలో నాయకత్వం వహించు వినయస్థులగు పురుషులని సంఘం భావించుట భావ్యమే. నిజానికి పెద్దలు యెహోవా దేవునికి, యేసు క్రీస్తుకు, తోటి క్రైస్తవులకు వినయంగల దాసులమని తమ్మును తాము పరిగణించుకోవాలి.—రోమీయులు 12:11; గలతీయులు 5:13; కొలొస్సయులు 3:24.

7. (ఎ) పెద్దలు ఇతరులతో వ్యవహరించునప్పుడు 2 కొరింథీయులు 1:24 ను ఎలా వర్తింపజేయాలి? (బి) పరిపాలక సభనుండి వచ్చు ఉపదేశాలను పెద్దలెట్లు స్వీకరించాలి?

7 ఇతరులకు వినయముతో కూడిన సేవచేస్తువుంటే ఒకపెద్ద వారిపై “అధికారం” చెలాయించుటకు ప్రయత్నించలేడు. మన అధ్యక్షులు కూడ పౌలువంటి స్వభావాన్నే కనబరచుట ఎంతమంచిది! ఆయన కొరింథు క్రైస్తవులతో ఇట్లన్నాడు: “మీ విశ్వాసము మీద మేము ప్రభువులము కాదుగాని మీ ఆనందమునకు సహకారులమైయున్నాము.” (2 కొరింథీయులు 1:24) ఈ కారణంచేత, ప్రేమతో కాయువారు తోటి విశ్వాసులను అనవసరమైన మానవ శాసనములతో బరువు మోపరు. బదులుగా, యెహోవా సాక్షులలోవున్న అధ్యక్షులు లేఖనానుసారమైన సూత్రాలకు కట్టుబడి దయతోకూడిన సహాయాన్ని అందిస్తారు. వారు యెహోవా సాక్షుల పరిపాలక సభనుండి వచ్చే ఉపదేశాలను వెంటనే అమలు పరచుట ద్వారా దేవుని మంద యెడల ప్రగాఢ గౌరవాన్ని చూపిస్తారు.—అపొ.కార్యములు 15వ అధ్యాయము.

8. పౌలు తోటి విశ్వాసుల యెడల ఎటువంటి స్వభావాన్ని కలిగివుండెను, మరియు 20వ శతాబ్దపు పెద్దలకిది ఎలా వర్తిస్తున్నది?

8 పౌలునకు దేవుని మంద యెడల కనికరము కలిగివుండెను గనుక ఆయన థెస్సలొనీకయ క్రైస్తవులకిట్లు చెప్పగలిగాడు: “స్తన్యమిచ్చు తల్లి తన స్వంత బిడ్డలను గారవించునట్లుగా మేము మీ మధ్య సాధువులముగా యుంటిమి. మీరు మాకు బహు ప్రియులై యుంటిరి గనుక మీయందు విశేషాసక్తి గలవారమై దేవుని సువార్తను మాత్రముగాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడి యుంటిమి.” (1 థెస్సలొనీకయులు 2:7, 8) స్తన్యమిచ్చు తల్లి తన పిల్లలనెలా ప్రేమించి తనకంటే వారి సుఖాలను ప్రధమముగా ఎంచి వారిని గారాబముగా పెంచునో, అట్లే పౌలుకూడ చేశాడు. మరి ఇది 20వ శతాబ్దంలోని పెద్దలు దేవుని మందను మృదువుగా కాయుటకెట్లు వారిని పురికొల్పుతుంది!

నివారణకు ఊరట కల్గించుటకు ఆధారములు

9. ఈనాటి యెహోవా ప్రజలనుగూర్చిన ఎట్టి పరిస్థితులను యెషయా 32:1, 2 ప్రవచించినది?

9 యేసుక్రీస్తు ఈనాడు చేయు రాజ్యపాలనను సూచిస్తూ ప్రవక్తయగు యెషయా “రాజు నీతినిబట్టి పరిపాలనచేయును” అనియు “అధికారులు న్యాయమునుబట్టి ఏలుదురని” ప్రవచించాడు. గనుక ప్రస్తుత దైవపరిపాలనాసంస్థలోని పెద్దలు స్థాపించబడిన పరలోక రాజ్య సేవలను చేస్తున్నారు—నిశ్చయంగా అధికారసేవయే! బాధ్యతగల ఈ పురుషులకే యెషయా యొక్క ముందు ప్రవచన వాక్యములు వర్తించును: “మనుష్యుడు గాలికి మరుగైన చోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును. ఎండినచోట నీళ్లకాలువలవలెను, అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను వుండును.”—యెషయా 32:1, 2.

10. యెహోవా సాక్షులలోనున్న ప్రతి పెద్ద దేనికి ఊటయై యుండాలి?

10 క్రీస్తుమత సామ్రాజ్యపు కౄర మతనాయకులవలెగాక, యెహోవా సాక్షులలోని పెద్దలు నివారణ, ఊరటకు ఊటగా వున్నారు. పెద్దల కూటమిగా వారు శాంతి, సమాధాన, భద్రతలను వృద్ధిపరచెదరు. ప్రతి పెద్ద, స్వయంగా తాను దేవుని మందను కనికరముతో కాయుచు ఈ శ్రేష్ఠమైన పరిస్థితికి దోహదకారి కావచ్చును.

నీతి న్యాయములతో

11. (ఎ) మొదటి శతాబ్ద క్రైస్తవులలోవున్న ఎటువంటి సాధారణ పరిస్థితులే ఈనాడు అనేక యెహోవా సాక్షుల సంఘాలలో వున్నివి? (బి) కాపరులకు సంఘం యెడల ఏ బాధ్యతవున్నది, ఎందుకు?

11 మొదటి శతాబ్దపు కొన్ని క్రైస్తవ సంఘాలలో సమస్యలు తలెత్తినప్పటికినీ, వారి సాధారణ స్థితి శాంతి, సమాధాన ఐక్యతలతోనే వుండేది. (1 కొరింథీయులు 1:10-12; 3:5-9; ఎఫెసీయులు 1:2; యాకోబు 2:1-9; 3:2-12; 4:11, 12; 1 యోహాను 1:3, 4) దేవుని దీవెనలవల్ల, క్రీస్తు నాయకత్వము మూలంగా, నియమిత పైవిచారణకర్తలు యథార్థసేవలవలన ఈనాడు యెహోవా సాక్షుల చాలా సంఘాలలో కూడ శ్రేష్ఠమైన ఆత్మీయ స్థితి నెలకొనివుంది. సంఘ శాంతి సమాధాననైక్యతలు సాధించుటకై ఈ పురుషులు దైవసహాయాన్ని వెదకి, దేవుని సంస్థ నైతికంగా ఆత్మీయంగా పరిశుద్ధత కలిగియుండునట్లు గట్టిగా కృషిచేస్తారు. (యెషయా 52:11) అపరిశుద్ధమైన సంఘమని మెప్పుడును శాంతి సమాధానాలతోవుండలేదు మరియు దేవుని దీవెనలు, అనుమతి దానికుండవు. ఆయన “దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కళంకమైన కనుదృష్టిని” కలిగివున్నాడు. (హబక్కూకు 1:13) ఇతర విషయాలతోపాటు, పెద్దలు న్యాయవిచారణా విషయాలను యథార్థత, లేఖనానుసారమైన పద్ధతిలో విచారిస్తారు. అలాంటి కేసులను విచారించునప్పుడు జ్ఞాపకముంచుకోవలసిన కొన్ని అంశాలేమిటి?

12. బైబిలు నియమాలను లేక చట్టాలను ఉల్లంఘించనటువంటి వ్యక్తిగత విషయాలను పరిశీలించవలసిన అవసరం పెద్దలకు లేకపోయినను గలతీయులు 6:1 దృష్ట్యా ఏమిచేయాలి?

12 వ్యక్తిగత భేదాభిప్రాయాలకు సంబంధించిన కేసుల విషయంలో ఆ వ్యక్తులే వాటిని పరస్పరంగా తీర్చుకునే అవకాశముంది. (మత్తయి 18:15-17) పెద్దలు మన ‘విశ్వాసమునకు అధికారులు’ కారు గనుక బైబిలు నియమాలను లేక చట్టాలను ఉల్లంఘించే తీవ్రమైన తప్పిదాలేవి లేనటువంటి పూర్తి వ్యక్తిగత విషయాల్లో వారు జోక్యం కల్గించుకొనరు. ఒకడు “అనుకోకుండా తప్పిదములో చిక్కుకున్నట్లు” ఆధారం లభిస్తే ఆత్మీయారక్షతలుగలవారు “అట్టివానిని సాత్వికముతో మంచిదారికి తీసికొని వచ్చుట సహజమే”.—గలతీయులు 6:1.

13. పెద్దలు, చెప్పుడు మాటల మీదగాక, సాక్ష్యాధారం మీద తప్పును గూర్చి విచారణ చేయాలని లేఖనములెట్లు చూపిస్తున్నవి?

13 పెద్దలు ఎల్లప్పుడు నిష్పక్షపాతంగా “న్యాయము తీర్చవలెను.” అందుచేత వారు చెప్పుడు మాటలను బట్టిగాక, తప్పుయొక్క రుజువు మీద ఆధారపడి తీర్పుతీర్చాలి. పౌలు ఇలా హెచ్చరించాడు: “ఇద్దరు ముగ్గురు సాక్షులుంటే గాని పెద్దమీద దోషారోపణ అంగీకరింపకుము.” (1 తిమోతి 5:19) యెహోవా నియమం ప్రకారం ఇశ్రాయేలీయుల కాలంలో గంభీరమైన పాపముచేసిన వ్యక్తికి, ఒక్కరు కాదు ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల సాక్ష్యమునుబట్టియే మరణశిక్ష విధించేవారు. అదియునుగాక, నిందితుడు నిందవేసినవారి ఎదుటకు తీసికొని రాబడే అవకాశం పొందును గనుక సాక్ష్యము సరిపోతేనే ‘మరణానికి పాత్రుడైన వానిపై సాక్షుల చేతులుంచబడును.’—ద్వితీయోపదేశకాండము 17:6, 7.

14. (ఎ) థియొత్రెఫే తప్పుగా ఏంచేయాలని ప్రయత్నించాడు? (బి) న్యాయవిచారణ చేయునప్పుడు పెద్దలేమి చేయాలని దేవుడు కోరుకొంటున్నాడు?

14 న్యాయవిచారణ చర్యకు లేఖనానుసారమైన గట్టి సాక్ష్యాధారముండవలెను. సంఘ కాపరులు సా.శ. మొదటి శతాబ్దంలోని అహంకారియైన థియెత్రెఫేవలె లేరనుట మనకెంత ఆనందంగా వుంది! అతడు ప్రయాణకాపరులకు ఆతిథ్యమియ్యవలెనను మనస్సుగలవారిని “సంఘమునుండి వెలివేయుటకు” ప్రయత్నించాడు. అపొస్తలుడైన యోహాను ఈ విషయాన్ని మరియు ఇతర తప్పుడుపనులను చులకనగా తీసికొనక ఇట్లు హెచ్చరించాడు: “నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసికొందును.” (3 యోహాను 9, 10) అట్లు, ప్రస్తుత-కాలములోని న్యాయవిచారణ కమిటీవారు వెలివేయదలచిన దానికి బైబిలు ఆధారమున్నదా లేదాయని రూఢి పరచుకోవాలి.a నిజమే, క్రైస్తవ పెద్దలు ఇతరుల వ్యవహారములను న్యాయంతో తీర్చవలెనని దేవుడు కోరుచున్నాడు. నిజానికి, యెహోవాయొక్క భూసంస్థ పనులు నిర్వహించే వారు “సమర్థులు, దైవభక్తిగల్గి, నమ్మదగిన పురుషులై,” వుండాలి.—నిర్గమకాండము 18:21.

15. న్యాయ విచారణ సమయంలో చేసే ప్రార్థనకెంత ప్రాముఖ్యత వున్నది?

15 ప్రతి క్రైస్తవ న్యాయ విచారణా కమిటి హృదయపూర్వక ప్రార్థనతో యెహోవా సహాయాన్ని కోరాలి. గంభీరమైన తప్పు చేశారనే నిందమోపబడిన సహోదరుడు లేక సహోదరితో చేసే కూటము ప్రార్థనతో ప్రారంభించాలి. ఆ చర్యలో దేవుని సహాయం అవసరమని అనుకొన్నప్పుడు ఎప్పుడైనా ప్రార్థనచేయడం యుక్తమే.—యాకోబు 5:13-18.

16. పెద్దలు ఏ విధంగా న్యాయవిచారణ జరపాలి, ఎందుకు?

16 తప్పుచేశాడనే నేరారోపణగల తోటివిశ్వాసి దేవుని మందలోని ఒక “గొర్రె” యని అతన్ని కనికరంతో చూడవలెనని పెద్దలకు తెలుసు. (యెహెజ్కేలు 34:7-14 పోల్చుము.) అక్షరార్థమైన గొర్రెలను మృదువుగా చూడాలి, ఎందుకంటే అవి పిరికి జీవాలు, అవి తమ కాపరి కాపుదల మీద ఆధారపడి వుండును. గనుక సాదృశ్యమైన స్థానిక సంఘ గొర్రెల విషయమేమిటి? వారు నిశ్చయంగా మహాకాపరియైన యెహోవా దేవుని క్రిందను, మంచి కాపరియైన యేసుక్రీస్తు క్రిందను సురక్షితంగా వున్నారని భావిస్తున్నారు. అయితే మందకు ఉపకాపరులైన వారు యెహోవాయొక్క గొర్రెవంటి సేవకుల అంతర్గత శాంతి భద్రతలకు దోహదమిచ్చే రీతిగా పనిచేయాలి. నీవును ఒక క్రైస్తవ ఉపకాపరివైతే మరి నీ సహోదర సహోదరీలు నీ క్రింద భద్రంగా ప్రశాంతముగా వున్నారని భావిస్తున్నారా? నిజమే, పెద్దలు బైబిలు చట్టాలను నియమాలను స్థిరంగా అమలుపరచాలి. అయితే వారు లేఖనానుసారంగా, గొర్రెలను ప్రేమతో పరామర్శిస్తూ, న్యాయ విచారణలను ప్రశాంతముగా క్రమపద్ధతిలో దయాకనికరముల చొప్పున జరిపించాలి.

17. ముఖ్యంగా న్యాయవిచారణ జరగునప్పుడు పెద్దలు లేఖనానుసారమైన ఏ అంశాలను మనస్సునందుంచుకోవాలి?

17 అసంపూర్ణులమైనందున మాటల్లో “మనమందరము అనేక విషయాలలో తప్పిపోవుచున్నాము.” (యాకోబు 3:2) మనలో ప్రతివ్యక్తి దేవుని కనికరము క్రీస్తు “విమోచన” అవసరము. (1 యోహాను 1:8–2:2; కీర్తన 130:3) గనుక క్రైస్తవ ఉపకాపరి తన్నుతాను తగ్గించుకోవాలి. అతడు యేసు మాటలను కూడ జ్ఞాపకముంచుకోవాలి: “మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి.” (లూకా 6:31) ముఖ్యంగా ఈ లేఖనం న్యాయవిచారణ చేయునప్పుడు వర్తింపజేసుకోవాలి. లేఖనారక్షతగల పురుషులు తప్పుచేసిన క్రైస్తవున్ని, ‘వారును శోధింపబడుదురేమోనను భయముతోను, సాత్వికముతోను మంచి దారికి తీసికొనిరావలెను.’—గలతీయులు 6:1; 1 కొరింథీయులు 10:12.

18. (ఎ) న్యాయవిచారణ సమయములో పెద్దలు ఇతరులను కఠినంగా చూస్తే ఏమి జరుగవచ్చును? (బి) మార్కు 9:42 దృష్ట్యా, పెద్దలును ఇతర క్రైస్తవులును ఏం చేయకుండ జాగ్రత్త వహించాలి?

18 పెద్దలు న్యాయవిచారణ సమయంలో ఇతరులను కఠినంగాచూస్తే అది వారికి హాని కల్గించవచ్చును. భావోద్రేక లేక శారీరక హాని ఏదియు జరుగకపోయినను గట్టి ఆత్మీయ హాని కలుగుతుంది గనుక, అట్టి కాపరులు అర్హతలనుగూర్చి సందేహింపవలసి వస్తుంది. (యాకోబు 2:13 పోల్చుము.) కావున, న్యాయవిచారణా సమయాల్లోను ఇతర సమయాల్లోనూ పెద్దలు దయతో వ్యవహరిస్తు ఇతరులు అభ్యంతర పడకుండునట్లు జాగ్రత్తపడాలి. క్రైస్తవులంతా ఈ విషయంలో జాగ్రత్తవహించవలసిన అవసరత ఎంతైనా వున్నది, ఎందుకంటే యేసు ఇట్లన్నాడు: “ఈ చిన్నవారిలో నొకని అభ్యంతర పరచువాడైవడో వాడు, మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు,” (మార్కు 9:42) తిరుగలి పైరాయి ఎంత పెద్దగా వుంటుందంటే సాధారణంగా దాన్ని త్రిప్పుటకు ఒక జంతువు బలం కావాలి, మరి అంత బరువున్న దాన్ని మెడకుకట్టి సముద్రములో పడవేస్తే త్రోయబడినవాడెవడు బ్రతుకడు. గనుక తనకును, అభ్యంతర పరచబడిన వ్యక్తికిని శాశ్వత ఆత్మీయ హానికలిగే పని చేయకుండ చూచుకోవాలి.—ఫిలిప్పీయులు 1:9-11.

కనికరమును చూపిస్తూనే ఉండుము

19. పేతురు తోటి పెద్దలకు ఏ హెచ్చరిక ఇచ్చాడు, మరిదానికి తగినట్లు నడుచుకొనుటవలన అది వారి భావినిరీక్షణపై ఎట్టి ప్రభావం చూపును?

19 తోటి కాపరులు ఎలా మందను కాయవలెనో తెల్పుచూ అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతోకాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణ చేయుచు దాని కాయుడి. మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి; ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు.” (1 పేతురు 5:2-4) అట్టి సలహాను పాటించుట వల్లనూ, దేవుని మందయెడల కనికరము చూపుట మూలంగా మాత్రమే ఆత్మాభిషేక కాపరులు ఆత్మీయప్రాణులుగా పరలోక బహుమానాన్ని, భూలోక నిరీక్షణగల పెద్దలు రాబోవు పరదైసులో నిత్యజీవమును పొందగలరు.

20. (ఎ) క్రైస్తవ ఉపకాపరులెట్లు తమతోటి విశ్వాసులతో వ్యవహరించాలి? (బి) ప్రేమగల పెద్దల కనికరము, మాదిరికరమగు సేవలనుగూర్చి నీవెట్లు తలంచుచున్నావు?

20 యెహోవా దేవుడు, యేసుక్రీస్తు వీరిద్దరూ దయాదాక్షిణ్యముగల కాపరులే. క్రైస్తవ ఉపకాపరులు దైవనియమాలను స్థిరంగా చేపట్టేవారు గనుక వారి సహవిశ్వాసుల విషయంలో దయా దాక్షిణ్యములను కనబరచాలి. దేవుని మందను కనికరముతో చూస్తూ, తమ బాధ్యతను కాపాడుకొనుచున్న అట్టి స్వయంత్యాగులైన పెద్దల మాదిరికరమగు సేవను యథార్థపరులైన యెహోవా సాక్షులందరు మనఃపూర్వకంగా నిశ్చయంగా ప్రశంసిస్తారు. మనకు నాయకత్వం వహించు వారికి విధేయులమై యుండుటద్వారా అట్టి ప్రశంసను, సరియైన గౌరవంతోపాటు చూపగలం. (w89 9/15)

[అధస్సూచీలు]

a తనను వెలివేయవలెనని తీర్పుచెప్పుటలో తీవ్రమైన తప్పు జరిగినదని ఒకడు నమ్మితే అతడు ఆ తీర్మానాన్నిగూర్చి మరల అప్పీలు చేసికొనవచ్చును.

మీ తలంపేమిటి

◻ తన అనుచరులలో అధికారానికి తావులేదని యేసు ఎలా కనబరచాడు?

◻ పరిపాలక సభనుండి ఉపదేశాలు అందినప్పుడు పెద్దలు ఏంచేయాలి?

◻ యెషయా 32:1, 2 ప్రకారం పెద్దలు దేనికి నెలవై వున్నారు?

◻ పెద్దలు, చెప్పుడు మాటల ప్రకారం చేయకూడదని లేఖనములెట్లు చూపిస్తున్నవి?

◻ క్రైస్తవ ఉపకాపరులు మందనెట్లు పరామర్శించాలి?

[20వ పేజీలోని చిత్రాలు]

న్యాయవిచారణ కమిటి ఒక తోటి విశ్వాసిని కలిసినప్పుడు హృదయపూర్వకముగా ప్రార్థించుట ఆవశ్యకము

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి