కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 8/1 పేజీలు 12-17
  • పెద్దలారా మీ బాధ్యతను కాపాడుకొనుడి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పెద్దలారా మీ బాధ్యతను కాపాడుకొనుడి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీకెందుకు అప్పగింపబడినది?
  • నీ బాధ్యతను ఎలా కాపాడుకోవాలి
  • ప్రమాదములను తప్పించుకొనుము
  • “మిమ్మునుగూర్చి జాగ్రత్తపడుడి”
  • మీ బాధ్యతను కాపాడుకొనుట వలన ఆనందము వచ్చును
  • కాపరులారా, మహాగొప్ప కాపరులను అనుకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • నాయకులుగా ఉన్నవారికి విధేయులై యుండుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • సేవచేయుటకు మీరు అర్హత కల్గియున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • తండ్రి మరియు పెద్ద—రెండు పాత్రలను నిర్వర్తించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 8/1 పేజీలు 12-17

పెద్దలారా మీ బాధ్యతను కాపాడుకొనుడి

“దేవుడు తన స్వకూమరుని రక్తమిచ్చిసంపాదించి తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా వుంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీమట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తపడుడి.”—అపొ.కార్యములు 20:28 NW.

1. క్రైస్తవుని బాధ్యతలో ఏమి ఇమిడియున్నది?

యెహోవా దేవుడు తన భూసంస్థలోనున్నవారికి ఒక అద్భుతమైన బాధ్యతను ప్రసాదించాడు. అయితే ఈ బాధ్యత ఏమైయున్నది? ఇది లెక్కఒప్పజెప్పవలసిన వ్యక్తికి అప్పగించిన పనికి సంబంధించినది. క్రైస్తవుని బాధ్యతలో “హితవాక్యములును” లేఖనముల ద్వారా అందింపబడి “నమ్మకమును బుద్ధిమంతుని” ద్వారా “తగిన కాలములో” పంచిబెట్టబడుచున్న సత్యము ఇమిడియున్నది. (2 తిమోతి 1:13, 14; మత్తయి 24:45-47) ఈ బాధ్యతలో సంఘం వెలుపల, లోపల ప్రకటించు సత్యముతో సంబంధం కలిగివున్న పరిచర్య ఇమిడి యున్నది. (2 తిమోతి 4:1-5) ఆత్మాభిషేకంనొందిన పెద్దలతో సహా రాజ్యప్రచారకులందరు ఈ బాధ్యతను ఎంతో విలువైనదిగా పరిగణించాలి.

2. పెద్దలకు ఇంకా ఏ బాధ్యత ఉన్నది, దాన్నిగూర్చి పేతురు ఏమన్నాడు?

2 క్రైస్తవ పెద్దల ఈ బాధ్యతలో మరొకటి తోడైవున్నది—అదేమనగా దేవుని మందనుకాయు బాధ్యత. ఈ విషయంలో, అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాసాడు: “తోటి పెద్దను, క్రీస్తు శ్రమలనుగూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మపిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమిచేతకాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతోకాక సిద్ధమనస్సుతోను, మీమధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానికాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా వుండుడి. ప్రధానకాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమాకిరీటము పొందుదురు.”—1 పేతురు 5:1-4.

3. క్రైస్తవ పెద్దలు దేనికి నెలవులుగా ఉండాలి?

3 క్రైస్తవపెద్దలు “గాలికి మరుగైన చోటువలెను గాలివానకు చాటైన చోటువలెను, ఎండినచోట నీళ్లకాలువలవలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండనీడవలెను ఉండును. (యెషయా 32:1, 2) దీని భావమేమనగా, పెద్దలు దేవుని గొర్రెలాంటి సేవకులైన మందకు రక్షణకరంగాను, సమాధాన స్థిరతలకు నెలవుగాను వుండాలి. పెద్దలు లేక మంద కాపరులు “ఎక్కువ బాధ్యత వహించాలి,” ఏలయనగా వారికి “ఎక్కువ పని అప్పగించబడినది.” (లూకా 12:48) మరి నిశ్చయంగా కాపాడుకొనవలసిన ప్రశస్తమైన బాధ్యత వారికి ఇవ్వబడింది.

మీకెందుకు అప్పగింపబడినది?

4. ఎందుకు చాలామంది పెద్దలు అవసరం?

4 ప్రపంచమంతటా 63,000 యెహోవా సాక్షుల సంఘాలున్నందువల్ల దేవుని మందునుకాయుటకు వేవేలకొలది ఆత్మీయారక్షతలుగల పురుషులు అవసరమే. ప్రతి దేశములోను చాలామంది పెద్దలున్నారు, ఇది సంతోషంచదగినదే. ప్రపంచమంతటా ప్రతి సంఘములోను సరాసరి 60 మంది రాజ్యప్రచారకులున్నారు. అందుచేత, పెద్దలు చేయుటకు చాలా పనివున్నది.—1 కొరింథీయులు 15:58.

5. పెద్దగా సేవచేసే ఆధిక్యత దేనిమీద ఆధారపడి ఒక పురుషునికి ఇవ్వబడుతుంది?

5 నీవు పెద్దవైతే, ఈ దీవెనకరమగు ఆధిక్యత నీకెందుకు ఇవ్వబడింది? ఎందుకంటే నీవు కొన్ని పనులు చేశావు, మరియు నీకు ఆత్మీయారక్షతలున్నవి. ఉదాహరణకు, దేవుని వాక్యాన్ని నీవు క్షుణ్ణంగా పఠించియుంటావు. (యెహోషువ 1:7, 8) నీవు ప్రాంతీయ పరిచర్యలో ఎంత ఆసక్తిగా పాల్గొని వుంటావు, మరియు ఇతరులు రాజ్యప్రచారకులగునట్లు వారికి సహాయంచేసి వుంటావు. “మొదట పరీక్షింపబడిన తర్వాత” నీవు నమ్మకంగా పరిచారకునిగా సేవచేశావు. పై విచారణకర్తగా వుండుట అంటే “శ్రేష్ఠమైనపని” యని నీవు ప్రశంసిస్తూ దానిని అపేక్షించావు” లేదా అర్హత పొందుటకు యత్నించావు. (1 తిమోతి 3:1, 10) తిమోతివలె “సహోదరులవలన మంచి పొందితివి.” (అపొ.కార్యములు 16:2) పెద్దగా నిన్ను సిఫారసుచేసే సమయానికి నీకు దాదాపు 30 సంవత్సరములు అంతకంటే ఎక్కువ ఉండివుండవచ్చును. మరియు జీవితంలో అనుభవం గడించివుంటివి. సంఘం నిన్నొక ఆత్మీయ పరిపక్వతగల వ్యక్తిగాను, లేఖనానుసారమైన మంచి సలహాలిచ్చే సమర్థుడవైన సమీపించదగిన సహోదరుడవని, గుట్టుదాచేవాడివని గౌరవమిస్తూవుంది.—సామెతలు 25:9, 10.

నీ బాధ్యతను ఎలా కాపాడుకోవాలి

6, 7 పెద్దగా ఒకడు తన బాధ్యతను కాపాడుకొనుటకు మొదటి తిమోతి 4:13-15 నందు ఎట్టి సలహా ఇవ్వబడింది?

6 అవును, నీవు పెద్దవైనచో, మంచి కారణములుండబట్టియే క్రైస్తవ పైవిచారణ బాధ్యత నీకప్పగించబడింది. దీన్ని ఎంతటి ఆధిక్యతగా భావించావో! అయితే నీ బాధ్యతను నీవెట్లు కాపాడుకోగలవు?

7 పెద్దగా నీ బాధ్యతను కాపాడుకొనుటకు ఒక మార్గమేదనగా నీ విధులను నీవు సక్రమంగా సరిగ్గా నిర్వర్తించుటే. యెహోవా సంస్థలో మనందరికి వివిధ బాధ్యతలున్న పనులున్నవి. గనుక, నీ స్థానములోనే వుంటూ ‘ఇతరులకంటే తక్కువ వాడివేనను భావనతో’ సంతృప్తిపడుము. (లూకా 9:46-48; న్యాయాధిపతులు 7:21 పోల్చుము) నీ ఆధిక్యతలలో ఆనందించుము, ఎన్నటికీ ‘బద్దకంగా పనిచెయ్యవద్దు.’ (సామెతలు 10:4) ఉన్నచోటనే ఆగిపోవద్దు, కాని యెహోవా సహాయముతో పరిచర్యలోని అన్నిరంగాల్లో అభివృద్ధిని సాధించుము. పౌలు తిమోతికిచ్చిన ఈ సలహాను తప్పక పాటించుము: “చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలోవున్న వరమును అలక్ష్యము చేయకుము. నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటియందే సాధకము చేసికొనుము.”—1 తిమోతి 4:13-15.

8. కూటములలో మంచి సలహానిచ్చుటకును, ఆత్మీయంగా బలపరచువిధంగా బోధించుటకును ఒకపెద్దకు ఏది సహాయపడును?

8 వ్యక్తిగత పఠనము కొరకు మంచి ఫలభరితమైన కార్యక్రమ పట్టికను వేసికొని దాన్ని ఆచరణలో పెట్టుము. పెద్దగా నీవు నిశ్చయంగా లేఖానానుసారమైన మంచి హెచ్చరిక చేయువాడవై ఉండాలి. ఈ బాధ్యత నెరవేర్చుటకు నీవు బైబిలును సంపూర్తిగా ధ్యానముతో బహుశా అనేకసార్లు చదివితివా? (సామెతలు 15:28) నీ ప్రసంగాల విషయమేమి? ప్రార్థనాపూర్వకంగా యెహోవా సహాయాన్ని కోరి, మన కూటములకు హాజరయ్యేవారికి ఆత్మీయబలమునిచ్చేవిగా వుండునట్లు వాటిని బాగుగా సిద్ధపడుము. ప్రత్యేకంగా పెద్దలు ‘వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమగు అనుకూలవచనములను పలుకవలెను.’—ఎఫెసీయులు 4:29; రోమీయులు 1:11.

9. రెండవ తిమోతి 4:2 ప్రకారము ఒక సంఘపెద్ద ఏంచేయాలి?

9 పెద్దగా, పౌలు హెచ్చరికను లక్ష్యపెట్టుము: “వాక్యమును ప్రకటించుము, సమయమందును, అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధిచెప్పుము.” (2 తిమోతి 4:2) పౌలు మతభ్రష్టత్వంయెడల జాగ్రత్తవహించాడు ఏలయనగా సంఘములో కొందరు ‘మాటలనుగూర్చి వాదము పెట్టుకొన్నారు,’ ‘మూఢులవలె వితర్కము’లాడారు, ‘సత్యమునకు చెవియొగ్గుట’ లేదు. (2 తిమోతి 2:14-18, 23-25; 3:8-13; 4:3, 4) సంఘము అనుకూల పరిస్థితులనెదుర్కొన్ననూ లేకపోయిననూ తిమోతి “వాక్యాన్ని ప్రకటించ” వలసియుండెను. ఇది మతభ్రష్టతను ఎదిరించుటకు తోటి విశ్వాసులను బలపరచింది. ఆలాగే ఈనాడును, పెద్దలు దేవుని వాక్యాన్ని, సమాచారాన్ని ప్రకటించాలి, అప్పుడది వారి హృదయాల్లో నాటుకుపోతుంది, యెహోవా నియమాలకు హత్తుకొని యుండుటకు పురికొల్పుతుంది.—హెబ్రీయులు 4:12.

10. పెద్ద తన కుటుంబముతోను, ఇతరులతోను క్రమంగా ప్రాంతీయ పరిచర్యలో ఎందుకు పాల్గొనవలెను?

10 పెద్ద అధికారంతో మాట్లాడాలంటే, తాను దేవుని వాక్యానుసారంగా జీవించాలి. అయితే తాను సంఘములో వేదికమీదనుండి మాత్రమే ‘వాక్యాన్ని ప్రకటిస్తే’ తన బాధ్యతను పూర్తిగా కాపాడుకొనుటలేదు. దీన్ని దృష్టిలో వుంచుకొని పౌలు తిమోతికి ఇట్లు ఉపదేశించెను: “సువార్తికుని పనిచేయుము.” పెద్దగా ‘నీపరిచర్యను సంపూర్ణము చేయుటకు’ నీవు దేవుని వాక్యాన్ని “బహిరంగముగాను ఇంటింటను ప్రకటించాలి.” (2 తిమోతి 4:5; అపొ.కార్యములు 20:20, 21) గనుక, నీ కుటుంబ సభ్యులతో పాటు ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనుము. ఇది నీకును నీ భార్యకును మధ్య ఆత్మీయబంధాన్ని పెంచుతుంది. నీ పిల్లలకెంతో ప్రయోజనాన్ని చేకూర్చుతుంది. సంఘములోని ఇతర సభ్యులతో కూడ కలిసి సువార్తపనిలో భాగం వహిస్తు సమయాన్ని గడుపుము. ఇది ఆత్మీయ బంధాన్ని పఠిష్టపరచి సహోదర ప్రేమను పెంపొందిస్తుంది. (యోహాను 13:34, 35) అవును, ఒక పెద్ద తన కుటుంబానికి సంఘానికి మధ్య వ్యయపరచే సమయాన్ని సమతూకపరచుకొనుటకు ప్రయత్నించాలి. వివేచనతో ఈ పనిచేస్తే, ఒకదానికి అధిక సమయాన్నిచ్చి, మరొకదాన్ని నిర్లక్ష్యముతో నిలిపివేసే పరిస్థితి కలుగకుండ వుంటుంది.

11. బోధకునిగా తన సామర్థ్యమును పెంచుకొనుటకు ఒక పెద్ద ఎందుకు శ్రమించాలి?

11 పెద్దగా నీ బాధ్యతను కాపాడుకోవాలంటే, బోధకునిగా నీ సామర్థ్యాన్ని పెంచుకొనుటకు కూడ శ్రమించుము. “బోధించువాడు బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను” పని కలిగియుండవలెనని పౌలు అన్నాడు. (రోమీయులు 12:7, 8) బోధకుడు ఇతరుల ఎదుట ఉపదేశించువాడివలె వుండును గనుక వారు అతనిని ఎంతో ఎదురుచూస్తారు. ఒక పెద్ద తీవ్రమైన తప్పుచేసి అది సహవిశ్వాసులలో సంచలనం సృష్టిస్తే, దేవుని తీర్పుకుగురి అవుతారు. అవును, బోధకులు “కఠినమైన తీర్పు పొందుందురు.” (యాకోబు 3:1, 2; మత్తయి 12:36, 37) గనుక పెద్దలు దేవుని వాక్యాన్ని గంభీరంగా తీసుకునే విద్యార్థులై దానిని జీవితాల్లో అమలు పెట్టేవారై యుండాలి. అప్పుడు స్వయంగా అమలుపరచుచున్నారు గనుక వారి లేఖనానుసారమైన బోధను తోటి విశ్వాసులు ఎంతో ప్రశంసిస్తారు. అది సంఘాన్ని మత భ్రష్టత్వముతోపాటు చెడు ప్రభావంనుండి కూడ కాపాడుతుంది.

ప్రమాదములను తప్పించుకొనుము

12. ఈ పత్రికలో ఒకనాడు ప్రచురించిన ఏ సలహా ఒక పెద్ద తన నాలుకను దుర్వినియోగం చేయకుండ సహాయపడుతుంది?

12 పెద్దగా నీవు ప్రమాదములలో చిక్కుకొనకుండా తప్పించుకొనుటద్వారా కూడ నీ బాధత్యను కాపాడుకొనుము. వీటిలో ఒకటేమనగా బోధకునిగా నాలుకను దుర్వినియోగంచేయుట. ఈ విషయంలో జాగ్రత్తపడు అవసరాన్నిగూర్చి యెహోవా సంస్థ చాలాకాలము నుండియే తెలియజేస్తు వచ్చింది. ఉదాహరణకు, ఈ పత్రిక (ఆంగ్లమందు) మే 15 1897 సంచికలో యాకోబు 3:1-13 ను గూర్చి చర్చించి ప్రత్యేకంగా పెద్దలనుగూర్చి ఇలా అన్నది: “వారికి వాక్చాతుర్యము వున్నట్లయితే గొప్ప దీవెనలకు మార్గమేర్పరచి, అనేకులను ప్రభువునొద్దకు, సత్యమువైపు, నీతిమార్గంవైపు రప్పించును గాని తప్పుతో మలినమైతే నాలుక చెప్పజాలని ముప్పు తెస్తుంది—విశ్వాసం, నీతి సత్క్రియలకు హాని కలిగిస్తుంది. ఇది నిజమే బోధించే వరంగల వ్యక్తి దేవుడు మరియు మనుష్యుల దృష్టిలో ఎక్కువ బాధ్యతగలవానిగా కనబడతాడు . . . దీవెన, ఊరట, బలమును కలిగించే రీతిగా వాక్యం ఊటగా ఎవరి నోటనుండి బయలు వెళ్తుందో వారు చేదు నీరును, శాపగ్రస్తమగు తప్పుడు సిద్ధాంతములను—దేవుని అగౌరపరచి ఆయన వాక్యాన్ని వక్రీకరించునటువంటి హానిని వారినోటనుండి రాకుండునట్లు చూచుకోవాలి. కూటముల కొరకు నాయకులను ఎన్నుకొనుటలో ఇచ్చట నిర్దేశించబడిన ‘నాలుకను’ గూర్చి అరక్షతవిషయం మరువకూడదు. నిప్పులుకక్కే నాలుక గలవారిని ఎన్నుకోకూడదు, తమ నాలుకలను ‘అదుపులో పెట్టుకొని’ ‘దేవుని ప్రామాణికులుగా మాట్లాడుటకు’ జాగ్రత్తవహించు, నమ్రత, వినయముగలవారిని మాత్రమే ఎన్నుకోవాలి.” గనుక ఒక పెద్ద తన నాలుకను సరిగ్గా ఉపయోగించుట ఎంత ప్రాముఖ్యము!

13. పెద్దలు వినోదం విషయంలో ఎట్టి జాగ్రత్త వహించాలి?

13 అతి వినోదం కూడా తప్పించుకోవలసిన మరొక ప్రమాదం. వినోదం ఊరటకలిగించి, బలపరచునదిగా వుండాలిగాని క్రైస్తవున్ని క్షీణింపజేసి ప్రక్కదారిపట్టించేదిగా వుండకూడదు. అదియునుగాక, పైవిచారణకర్తలు “మితానుభవులై వుండాలి.” (1 తిమోతి 3:2) వినోదము విషయంలో మితంగావుంటే ఇది నిన్నును నీకుటుంబాన్ని పరిరక్షించి, సంఘానికి మంచి మాదిరికరంగా వుంటుంది. ఇతరులు ప్రాంతీయ పరిచర్యలో పట్టుదలతో పాల్గొంటూవుంటే నీవుమాత్రం మాటిమాటికి వారాంత వినోదంలోనే గడుపుతుంటే నీవు మంచి మాదిరిని చూపుటే లేదు. సువార్త ప్రకటింపబడాలి, మరియు పెద్దలు ఆసక్తిగల రాజ్యప్రచారకులుగా ఈ పనిలో నాయకత్వం వహించాలి.—మార్కు 13:10; తీతు 2:14.

14. (ఎ) పెద్దలు లైంగిక అవినీతి విషయంలో జాగ్రత్త కలిగివుండు అవసరతను గూర్చి ఏ లేఖనానుసారమైన మాదిరులు విశదపరచుచున్నవి? (బి) ఆత్మీయ సహోదరీలకు సహాయపడు విషయంలో పెద్దలు పలుమారులిచ్చిన ఏ హెచ్చరికను అలక్ష్యపెట్టకూడదు?

14 లైంగిక అవినీతినికూడ తప్పించుకోవలసిన మరొక ప్రమాదము. దేవుని ప్రజల యథార్థతను పోగొట్టుటకై సాతానుచేసే ప్రయత్నములకు సంబంధించిన శోధనలను అతడు ఎదిరించకపోతే దిగజారిపోతున్న లోక నైతిక ప్రభావం పెద్దపైకూడ పడుతుంది. (మత్తయి 4:1-11; 6:9,13 పోల్చుము) ప్రవక్తయైన బిలామును జ్ఞాపకము చేసుకొనుము. తాను ఇశ్రాయేలీయులను శపింపలేక, వారు లైంగిక ఆరాధనలో పాల్గొనునట్లు వారు మోసగింపబడితే యెహోవాయే వారిని శపించుననుకున్నాడు. గనుకనే బిలాము మోయాబు రాజైన బాలాకునకు “ఇశ్రాయేలీయుల ఎదుట అడ్డుబండ వేయుము, వారు విగ్రహార్పిత వస్తువులను తినునట్లును, వ్యభిచరించునట్లును చేయుమని” ఉపదేశించాడు. వారా ప్రమాదములో పడకుండ పోయారా? లేదు, యెహోవా తెగులు రప్పించగా ఇశ్రాయేలీయులలో 24,000 మంది మరణించారు, ఏలయనగా వారు మోయాబు స్త్రీలతో వ్యభిచరించారు, వారి దేవతలను ఆరాధించారు. (ప్రకటన 2:14; సంఖ్యాకాండము 25:1-9) జ్ఞాపకముంచుకొనండి, ‘దేవుని హృదయానికి ఇష్టుడైన’ దావీదు సహితం లైంగిక అవినీతిలో కూరుకు పోయాడు. (1 సమూయేలు 13:14; 2 సమూయేలు 11:2-4) గనుక పెద్దగా, “నమ్మకమైన గృహనిర్వాహకుడు” పలుమారులిచ్చిన సలహాను లక్ష్యపెట్టి, ఈ బాధ్యత నిర్వహించేటప్పుడు మరో పెద్ద వెంటవుంటేనే తప్ప ఒంటరిగా వున్నప్పుడు ఏ ఆత్మీయ సహోదరికైనా సహాయం చెయ్యవద్దు.—లూకా 12:42.

15. ఒక పెద్ద ధనాపేక్ష అనే ప్రమాదములో పడకుండ తన కుటుంబం ఎలా అతనికి సహాయపడగలదు?

15 ధనాపేక్ష, పెద్ద తప్పించుకోవలసిన వాటిలో మరొక ప్రమాదము. యెహోవా సమృద్ధిగా దయచేస్తాడని ఎరిగి ఉన్నవాటితో తృప్తిపడుము. (మత్తయి 6:25-33; హెబ్రీయులు 13:5) నీ కుటుంబము మిత వ్యయం చేయునట్లు తర్ఫీదునివ్వండి, ఎందుకంటే, కుటుంబానికి, ప్రాంతీయసేవచేయుటకు సంఘాన్ని బలపరచుటకు, రాజ్యాసక్తులను వృద్ధిపరచుటకు ఉపయోగపడు ధనాన్ని, కాలాన్ని వృధాచేసేదే అమిత వ్యయం. ఈ విషయంలో తన కుటుంబ సహకారం పెద్దకు ప్రయోజనం, నిజానికి అవసరంలేని వాటికొరకు వత్తిడి చేయనందుకు ఆయన కృతజ్ఞుడైయుండును. నిజానికి, “నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుటకంటే, యెహోవా యందలి భయభక్తులతో కూడ కొంచెం కలిగియుండుట మేలు.”—సామెతలు 15:16.

“మిమ్మునుగూర్చి జాగ్రత్తపడుడి”

16. పౌలు ఎఫెసు సంఘ పెద్దలకు ఏ సలహానిచ్చాడు?

16 పెద్దలువారి బాధ్యతను కాపాడుకోవాలంటే పౌలు ఎఫెసుసంఘ పైవిచారణకర్తలకు ఇచ్చిన సలహాను తప్పక పాటించాలి. ఆయన వారితో ఇట్లన్నాడు: “దేవుడు తన స్వకూమరుని రక్తమిచ్చిసంపాదించి తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా వుంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీమట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తపడుడి. నేను వెళ్లిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును. వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొనిపోవలెనని ప్రతికూల వచనములు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను మూడు సంవత్సరములు దివారాత్రులు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధిచెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెలకువగా ఉండుడి.”—అపొ.కార్యములు 20:28-31 NW.

17, 18. ఎనబై రెండు సంవత్సరముల క్రితం ఈ పత్రికలో (ఆంగ్లమందు) ప్రచురింపబడిన ఏ సలహా ఇప్పటికీ క్రైస్తవ పెద్దలకు వర్తిస్తుంది?

17 పౌలు తోటి పెద్దలకిచ్చిన సలహాను ఎత్తి తెలుపుచు, 82 సంవత్సరముల క్రితం ది వాచ్‌టవర్‌ (మార్చి 1, 1909) ఇలా వ్యాఖ్యానించినది: “ప్రతిచోట పెద్దలు ప్రత్యేక శ్రద్ధచూపు అవసరము కలదు, ఏలయనగా అత్యంత పేరు ప్రతిష్ఠలు గలవారే కఠినమైన శ్రమలకు శోధనకు గురౌతారు. అందుకే [యాకోబు] ఇలా గట్టిగా హెచ్చరిస్తున్నాడు, ‘మీలో అనేకులు బోధకులే గనుక సహోదరులారా, అట్టివారికే కఠిన శ్రమలు కలుగునని తెలిసికొనుడి.’ ఆలాగే మేముకూడ, మానవులందరి యెడల ప్రేమ, క్షేమాభివృద్ధి తప్ప ఏదియు వుండకూడదనియు, పరిశుద్ధాత్మ ఫలములతో, దయాదాక్షిణ్యములతో అంతకంతకు నిండినవారై ఉండవలెననియు, మందను కూడ లక్ష్యపెట్టువారై వుండవలెననియు నిర్మలులును, నిస్వార్థపరులైన పెద్దలందరుకు గట్టిగా హెచ్చరిస్తున్నాము. జ్ఞాపకముంచుకొనండి, మంద ప్రభువుది, మరిమీరు ప్రభువునకును మందకును బాధ్యులై వున్నారు. జ్ఞాపకముంచుకొనుడి, మీరు మహా ముఖ్యకాపరికి లెక్క ఒప్ప చెప్పవలసివారియున్న వారైయుండి, వారి ఆత్మలను(అభీష్టములను) కాయువారై యున్నారు. జ్ఞాపకముంచుకొనండి, అన్నింటికంటే ముఖ్యం ప్రేమ; మరి సిద్ధాంతాలను అలక్ష్యపరచక, ఆయన శరీరమునకు సంబంధించిన వివిధ సభ్యులలో ప్రభువు ఆత్మ విస్తరించునట్లు ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆలాగున ‘వెలుగునందున్న పరిశుద్ధుల స్వాస్థ్యమును పొందవచ్చును. మరియు, దైవచిత్తానుసారముగా ఈ చెడు చెడుదినములలో అభ్యంతరపడకుడి, గాని క్రీస్తు ఎదుటను ఆయన శరీరము ఆయన సభ్యులు, ఆయన త్యాగపరులును, ఆయన వారసుల ఎదుట పూర్ణులుగా నిలువబడుటకు సమస్తమును నెరవేర్చుడి.”

18 ఆ తొలిదశలో యెహోవా సంస్థలోనున్న పరిస్థితులకు, అవగాహనకు అనుగుణ్యముగా ఆ మాటలు ఆత్మాభిషేకమునొందిన పెద్దలకు తోటి విశ్వాసులకు చెప్పబడినవి. అయిననూ ఆ సలహా ఈనాడును ఎంతబాగా వర్తిస్తుంది! క్రైస్తవ పెద్దల నిరీక్షణ పరలోకసంబంధమైనను భూసంబంధమైనను వారు వారి విషయంలో జాగ్రత్తవహిస్తూ, వారి ఆస్తిని కాపాడుకుంటూ, దేవుని మంద అభీష్టములను ప్రేమపూర్వకంగా నెరవేర్చువారైయుండాలి.

మీ బాధ్యతను కాపాడుకొనుట వలన ఆనందము వచ్చును

19, 20. పెద్దలు వారి బాధ్యతను కాపాడుకొంటే ఆనందము కలుగుతుందని ఎందుకు చెప్పవచ్చును?

19 క్రైస్తవ పెద్దగా నీవు నీ బాధ్యతను కాపాడుకొనుటలో మరియు బాగుగా నిర్వర్తించుటలో సంతోషముంది. గనుక జాగ్రత్తగా, ప్రార్థనాపూర్వకముగా, పట్టుదల కలిగివుండుము. పెద్దగా నీ బాధ్యతను కాపాడుకుంటూ, సిరాబుడ్డి కట్టుకొనిన లేఖికుడు నిర్వాహకుడు చెప్పినట్లుగా, “నీవు నాకాజ్ఞాపించినట్లు నేను చేసితిని,” అని నీవును చెప్పు సమయం కొరకు నిరీక్షించుము.—యెహెజ్కేలు 9:3, 4, 11.

20 అవును ఒక పెద్దగా యథార్థంగా పనిచేయుము అప్పుడు “అతని కాజ్ఞాపించిన ప్రకారం యావత్తుచేసెను,” అని నోవహునుగూర్చి చెప్పినట్లే నిన్నుగూర్చియు చెప్పబడవచ్చును. (ఆదికాండము 6:22) అట్టి పట్టుదలతో కూడిన సేవవలన సంఘం పలువిధాలుగా ప్రయోజనం పొందుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా, వారి బాధ్యతను కాపాడుకొను నమ్మకమైన పెద్దలవలన నడిపించబడు బలమైన, చురుకైన సంఘములద్వారా యెహోవాకు మహిమ కలుగుతుంది. “భళా, మంచిదాసుడా!” అని నిన్నుగూర్చి చెప్పాలంటే నీవింకను చేయవలసినదెంతో వున్నది. (లూకా 19:17) ఒక పెద్దగా, నీవు దేవుని మందనుకూడ ఎంతో మృదువుగా కాయవలెను. (w89 9/15)

మీరేమి చెబుతారు?

◻ క్రైస్తవులకు ఇంకా ఏ బాధ్యత వున్నది?

◻ ఒక పెద్ద తన బాధ్యతను కాపాడుకొనుటకు ఎటువంటి ఖచ్ఛితమైన పనులు చేయాలి?

◻ తన బాధ్యతను కాపాడుకొనుటకు ఒక పెద్ద ఎటువంటి ప్రమాదములలో పడకుండ చూసుకోవాలి?

◻ పెద్దలు వారి బాధ్యతను కాపాడుకొంటే ఎందుకు ఆనందం కలుగుతుంది?

[12వ పేజీలోని చిత్రాలు]

క్రైస్తవ పెద్దలు తప్పక “గాలివానకు చాటైన చోటువలె” ఉండాలి

[14వ పేజీలోని చిత్రాలు]

పెద్దగా నీవు నీ కుటుంబముతోను ఇతరులతోను క్రమంగా ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనుము

[15వ పేజీలోని చిత్రాలు]

పెద్దగా నీ బాధ్యతను నీవు కాపాడుకొంటే, సంఘము పలువిధాలుగా ప్రయోజనం పొందుతుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి