యేసుయొక్క జీవితము పరిచర్య
యేసు అద్భుతరీతిగా వేలమందికి ఆహారము పెట్టుట
గలిలయ అంతటా చేసినప్రచార యాత్రయందు 12 మంది అపొస్తలులు ఆనందించారు. యోహాను సంహారమైన వెంటనే యిప్పుడు, వారు యేసుయొద్దకు తిరిగివచ్చి తమ అద్భుతమైన అనుభవాలను వివరించిరి. వారు అలసియున్నారని ఎరిగి మరియు అనేకప్రజలు వచ్చుచు పోవుచు ఉన్నందున వారికితినుటకు కూడా సమయము లేక పోవుటచూచి యేసు: ‘మనము ఏకాంత ప్రదేశమునకు వెళ్లుదమురండి, మీరచ్చట కొంచెముసేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను.’
బహుశా వారు కపెర్నెహూమువద్ద పడవఎక్కి, స్పష్టమగురీతిగా బెత్సయిదాను దాటి, యోర్దాను తూర్పు ప్రాంతానికి ఎవరికి కనబడకుండా వెళ్తున్నారు. అయితే వారు బయలుదేరినప్పుడు అనేకులు చూచారు. యితరులు దానిని తెల్సుకున్నారు. వీళ్లంతా తీరంవెంబడి వారి కంటెముందుగా పరుగెత్తి పడవ ఆగగానే వారిని కల్సుకొనడాన్కి వారచ్చటకు చేరుకున్నారు.
పడవ దిగిన తరువాత జనసమూహమును చూచి, వారుకాపరిలేని గొఱ్ఱెలవలె ఉండుట చూచి యేసు జాలిపడెను. కనుక వారిలో రోగులైన వారిని ఆయన స్వస్థపరచి వారికి అనేక సంగతులను బోధించ మొదలుపెట్టెను
సమయం త్వరగా గతించిపోయెను, యేసుశిష్యులు ఆయన యొద్దకు వచ్చి, యిలా అన్నారు: “ఇది అరణ్యప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది. చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్లి భోజనమునకేమైన కొనుక్కొనుటకు వారిని పంపివేయుము”
అయితే దానికి ప్రత్యుత్తరముగా యేసు యిట్లనెను: “మీరు వారికి భోజనము పెట్టండి.” పిమ్మట తానుచేయనైయున్నదానిని యేసు ఎరిగి యుండి ఫిలిప్పును యిలా అడిగి అతనిని పరీక్షించెను: “వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పించెదము?”
ఫిలిప్పు దృష్టియందు అది అసాధ్యమైన స్థితియైయున్నది. ఎందుకనగా, పురుషులే 5,000 మంది ఉన్నారు. స్త్రీలను, పిల్లలను లెక్కపెడితే 10,000 కంటె ఎక్కువమంది ఉండవచ్చు! “వారిలోప్రతి వాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల (దేనారము ఆకాలమందు ఒక దినముకూలి) రొట్టెలుచాలవు,” అని ఫిలిప్పు చెప్పెను.
అంతమందికి ఆహారము పెట్టడం సాధ్యంకాదని చూపడాన్కి కాబోలు అంద్రెయ స్వచ్ఛందంగా ముందుకువచ్చి: “ఇక్కడ ఉన్న యొక చిన్నవానియొద్ద అయిదు యవలరొట్టెలు, రెండు చిన్నచేపలు ఉన్నవిగాని ఇంతమందికి యివి ఏమాత్రము?”
సా.శ. 32 పస్కాపండుగకు కొంచెము ముందు, అది వసంత ఋతువు గనుక, పచ్చిక ఏపుగా పెరిగియున్నది కనుక జనసమూహమును 50 మంది మరియు 100 మంది చొప్పున కూర్చొనమని చెప్పండని యేసు తన శిష్యులతో అనెను. ఆయన ఆ అయిదు రొట్టెలు మరియు ఆరెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కనులెత్తి ఆశీర్వదించెను. పిమ్మట ఆయన రొట్టెలను విరుచుచు, చేపలను విడదీయచుండెను. ఆయన వాటిని తన శిష్యులకు యిచ్చుచుండగా వారు వాటిని ప్రజలకు పంచుచుండిరి. సమృద్ధిగా మిగిలేంతవరకు ప్రజలంతా విస్మయంగా భుజించిరి!
అటుతరువాత యేసు తన శిష్యులకు యిట్లు చెప్పెను: “ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయండి.” వారు అలాచేసినప్పుడు, వారంతా తినగా మిగిలినవన్నీ 12 గంపలు అయినవి. మత్తయి 14:13-21; మార్కు 6:30-44; లూకా 9:10-17; యోహాను 6:1-13.
◆ తన అపొస్తలుల కొరకు యేసు ఒక ఏకాంత ప్రదేశాన్ని ఎందుకు వెదకెను?
◆ యేసు తన శిష్యులను ఎచ్చటికి తీసికొనివెళ్లెను, విశ్రాంతి పొందగోరిన వారి అవసరత ఎందుకు నెరవేరలేదు?
◆ ప్రొద్దుగ్రుంకినప్పుడు శిష్యులేమని వేడుకున్నారు, అయితే యేసు ప్రజలయెడల ఎలా శ్రద్ధను చూపెను? (W87 9/1)