కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • th అధ్యాయం 18 పేజీ 21
  • ప్రేక్షకుల గురించి ఆలోచించి, వాళ్లకు ఉపయోగపడేది చెప్పడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రేక్షకుల గురించి ఆలోచించి, వాళ్లకు ఉపయోగపడేది చెప్పడం
  • చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఉత్సాహం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • మీ ప్రేక్షకులకు సమాచారాన్ని అందించేది
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • హృదయాన్ని చేరుకోవడానికి కృషిచేయడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • సమాచారం ఎలా ఉపయోగపడుతుందో చెప్పడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
మరిన్ని
చక్కగా చదువుదాం, బోధిద్దాం
th అధ్యాయం 18 పేజీ 21

అధ్యాయం 18

ప్రేక్షకుల గురించి ఆలోచించి, వాళ్లకు ఉపయోగపడేది చెప్పడం

లేఖనం

1 కొరింథీయులు 9:19-23

ఏమి చేయాలి? ప్రేక్షకులను ఆలోచింపజేసి, పనికొచ్చే ఒక విషయం నేర్చుకున్నామని వాళ్లకు అనిపించేలా బోధించండి.

ఎలా చేయాలి?

  • మీ ప్రేక్షకులకు ఇప్పటికే ఏమి తెలుసో ఆలోచించండి. కేవలం వాళ్లకు తెలిసిందే మళ్లీ చెప్పకుండా, విషయాన్ని కొత్త కోణంలో చూడడానికి సహాయం చేయండి.

    సలహా

    వాళ్లకు తెలిసిన విషయాలు కాస్త త్వరగా చెప్పండి, కానీ కొత్త విషయాలు నిదానంగా చెప్పండి.

  • పరిశోధన చేసి, ధ్యానించండి. వీలైతే, ముఖ్యమైన విషయాలు వివరించడానికి ప్రేక్షకులు వినని వాస్తవాలను లేదా తాజా వార్తలను ఉపయోగించండి. అవి మీరు చెప్తున్న సమాచారానికి ఎలా సరిపోతాయో బాగా ఆలోచించండి.

    సలహా

    మీరు ఆ సమాచారాన్ని చదువుతున్నప్పుడు, ‘ఏమిటి, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా’ వంటి ప్రశ్నలు వేసుకుంటూ దాని గురించి మీరే ముందుగా ఆలోచించండి. మీ ప్రసంగం అంతట్లో అలాంటి కొన్ని ప్రశ్నలు వేస్తూ, వాటికి జవాబులు ఇస్తూ ప్రసంగానికి జీవం పోయండి.

  • మీ సమాచారం ఎలా ఉపయోగపడుతుందో చూపించండి. లేఖనంలోని విషయాలు రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడతాయో ప్రేక్షకులకు వివరించండి. ప్రత్యేకించి ఏ రంగంలో, ఏ పరిస్థితిలో అవి వాళ్లకు ఉపయోగపడతాయో చెప్పండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి