కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g00 4/8 పేజీ 31
  • అసాధారణ స్మశానం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అసాధారణ స్మశానం
  • తేజరిల్లు!—2000
  • ఇలాంటి మరితర సమాచారం
  • రాజ్య ప్రచారసేవకు కొందరెలా విరాళాలిస్తారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఈనాటి మన పరిచర్యలో కరపత్రములు ఎందుకంత విలువైనవి
    మన రాజ్య పరిచర్య—1993
  • యేసు ఇచ్చిన సలహాలు ఈరోజుల్లో పనికొస్తాయా?
    యేసు ఇచ్చిన సలహాలు ఈరోజుల్లో పనికొస్తాయా?
  • ఉదారంగా ‘ఇచ్చే’ చక్కని అవకాశాన్ని బట్టి సంతోషిస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
తేజరిల్లు!—2000
g00 4/8 పేజీ 31

అసాధారణ స్మశానం

ఈక్వడార్‌లోని తేజరిల్లు! విలేఖరి

ఈక్వడార్‌ రాజధాని నగరమైన క్విటోకు ఉత్తరాన ఉన్న ఇబారా పట్టణంలో ఒక అనుపమానమైన స్మశానముంది. దాని పేరు ఎల్‌ సెమంటరియో డీ లోస్‌ పోబ్రెస్‌ (పేదల స్మశానం). దాన్ని అసాధారణమైనదిగా చేస్తున్నదేమిటి? వాచ్‌టవర్‌ సొసైటీ ప్రచురణల నుండి నేరుగా తీసుకున్న చిత్రాలను ఆ స్మశానపు చుట్టూ ఉన్న గోడల మీద పెద్దగా పెయింట్‌ చేశారు.a మధ్యలో ఉన్న అపొస్తలుడైన యోహాను చిత్రం, ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే పుస్తకంలో 7వ పేజీలో నుండి తీసుకోబడింది. యోహాను చిత్రం పైన, “దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానము, ఆనందం అని అర్థం. రోమీయులు 14:17.” అని స్పానిష్‌ భాషలో వ్రాసి ఉంది. దానికి ఎడమవైపున, మత్తయి 11:28 లో నుండి తీసుకున్న, “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును” అన్న మాటలు కనిపిస్తాయి. వాళ్ళు స్పానిష్‌ భాషలోని నూతన లోక అనువాదములో నుండి కాపీ చేశారు. ఈ స్మశానం ప్రజల దృష్టిని దేవుని వాక్యం వైపుకు నడిపించడానికి సహాయపడుతుందనడంలో సందేహం లేదు.

[అధస్సూచి]

a వాచ్‌టవర్‌ సాహిత్యంలోని వ్యాసాలను గాని ఆర్ట్‌ వర్క్‌నిగానీ పునఃప్రచురించే ముందు చట్టబద్ధంగా వాచ్‌టవర్‌ నుండి తప్పకుండా అనుమతి తీసుకోవాలి. వాటిని వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాకు ఆపాదించాలి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి