కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 11/8 పేజీ 30
  • మా పాఠకుల నుండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మా పాఠకుల నుండి
  • తేజరిల్లు!—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1999
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—2000
  • నేను దూరంగా ఉన్నప్పటికీ నాకోర్ట్‌షిప్‌ను ఎలా కొనసాగించగలను?
    తేజరిల్లు!—1999
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1994
మరిన్ని
తేజరిల్లు!—1999
g99 11/8 పేజీ 30

మా పాఠకుల నుండి

మత స్వాతంత్ర్యం నేను చాలా దశాబ్దాల నుండి ఇప్పటి వరకూ తేజరిల్లు!ను చదువుతూ ఉన్నాను, “మీ మత స్వాతంత్ర్యం—బెదిరింపుకు గురైందా?” (ఫిబ్రవరి 8, 1999) అనే పరంపరకు మీకు నా మెప్పుదలను వ్యక్తం చేయాలని ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. అంధకార యుగాలని పిలువబడే యుగాల్లో ఐరోపాలో మత అసహిష్ణుత ఉండేదనీ, అధికారులు మనస్సాక్షి స్వాతంత్ర్యాన్ని, మత స్వాతంత్ర్యాన్ని ప్రజలు అనుభవించకుండా చేసేలా చేయడంలో క్యాథలిక్‌ చర్చి సఫలమైందనీ నాకు తెలుసు. నేడు, ఫ్రాన్స్‌లో జరుగుతున్న విషయాలను ఇప్పుడు తెలుసుకున్నాను, ‘హామీ ఇవ్వబడిన మత స్వాతంత్ర్యాన్ని ఖండించడం ద్వారా ఈ దేశం ఎందుకు తన కీర్తిని పాడుచేసుకుంటుంది?’ అని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. చివరికి ఏమి జరిగిందో మీ పత్రిక చదివే కోట్లాదిమంది చదువరులకు దయచేసి తెలియజేయండి. ఫ్రాన్స్‌ సహనం చూపించి, ఇతర దేశాలకు మంచి మాదిరిని ఉంచుతుందని నేను నమ్ముతున్నాను.

కే. కే., ప్యూర్టోరికో

ఏడుగురు కొడుకుల్ని పెంచడం ఫిబ్రవరి 8, 1999 సంచికలో బెర్ట్‌, మార్గరెట్‌ డిక్‌మాన్‌లు చెప్పిన అనుభవం కొరకై కృతజ్ఞతలు. ఒక మార్గంలో మా ముగ్గురు పిల్లలకు మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఇచ్చేలా వాళ్ళను పెంచేందుకు అది మమ్మల్ని నిజంగా ప్రోత్సాహపర్చింది. మా పిల్లలు కూడా ఆ శీర్షికను ఆస్వాదించారు. కేకుని కోల్పోయిన డగ్‌ను గురించిన పాఠాన్ని పిల్లలు ఒకరినొకరు గుర్తుచేసుకోవడం మేము వింటుంటాం ! అలాంటి ప్రోత్సాహకరమైన అనుభవాన్ని ప్రచురించినందుకు కృతజ్ఞతలు.

ఎస్‌. జే., ఇండియా

పరిశుద్ధాత్మ “బైబిలు ఉద్దేశము: దేవుని పరిశుద్ధాత్మ అంటే ఏమిటి?” (ఫిబ్రవరి 8,1999) అనే శీర్షిక కోసం కృతజ్ఞతలు తెల్పాలనుకుంటున్నాను. నేను కొన్ని సంవత్సరాలుగా యెహోవా సాక్షిగా ఉన్నప్పటికీ యెహోవా దేవుని గురించి ఎంతో తెలుసుకోవాలని ఎల్లప్పుడూ కోరుకుంటుంటాను. ఈ శీర్షిక అది లేవదీసిన ప్రశ్నకు చక్కగా సమాధానాన్నివ్వడమే కాక, సులభంగా అర్థం అవుతుంది కూడాను. యెహోవాను గూర్చి ఆయన కార్యాలను గూర్చి ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే, నా హృదయం ఆయన మీది ప్రేమతో అంత ఎక్కువగా నిండుతోంది.

వై. బీ., రష్యా

బంగారం “బంగారం—దాన్ని ఆవరించి ఉన్న నిగూఢత” (అక్టోబరు 8, 1998) అనే శీర్షికను చదివాను. 1945లో జర్మన్‌ ప్రభుత్వ షరతులను అనుసరిస్తూ, మిత్ర కూటాలు కైజెరోడా ఉప్పు గనుల్లో చాలా బంగారాన్ని కనుగొన్నాయి అని మీరు పేర్కొన్నారు. నిజానికి, మిత్రకూటాలు యుద్ధం ముగియడానికి మూడు వారాల ముందు ఆ గనిని స్వాధీనం చేసుకున్నారు.

జే. ఎస్‌., జర్మనీ

ఈ స్పష్టీకరణకు కృతజ్ఞతలు. జర్మన్‌ ప్రభుత్వం మే 8, 1945లో షరతులు విధించింది, దాని కంటే ఒక నెల ముందే ఏప్రిల్‌ 4, 1945లో కైజెరోడా గనులు స్వాధీనం చేసుకోబడ్డాయి.—ఎడిటర్‌.

దూరాల్లో ఉండి కోర్ట్‌షిప్‌ “యువత ఇలా అడుగుతోంది . . . నేను దూరంగా ఉన్నప్పటికీ నా కోర్ట్‌షిప్‌ను ఎలా కొనసాగించగలను?” (ఫిబ్రవరి 8, 1999) అన్న శీర్షిక రావడం నా విషయంలో చాలా ఆలస్యం అయ్యింది. నేను అమెరికాలో ఉంటున్నాను, లాటిన్‌ అమెరికాలోని యౌవనస్థునితో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించాను. నేను నా జీవితంలో మునుపెన్నడూ అంత క్లిష్టమైన సమస్యను అనుభవించలేదు. నిజాయితీగా ఉండేందుకు ఎంత కృషి చేసినా ఎవరి గురించైనా మెయిల్‌ ద్వారా పూర్తిగా తెలుసుకోలేం. ఇరువురూ దూరంగా ఉంటారు కాబట్టి ఊహాలోకాల్లో తేలుతూ ఉండడానికే మొగ్గు చూపుతారు. మా విషయానికొస్తే మా సంస్కృతులు పూర్తిగా పరస్పర విరుద్ధమైనవి. మా సంబంధం పూర్తిగా తెగిపోయే సరికి నేనిక జీవించి సాధించేదేముంది అని అనిపించింది. ప్రేమపూర్వకమైన నా కుటుంబం యొక్క ఆలంబన వల్లే ఈ చేదు అనుభవాన్ని దిగమ్రింగగల్గుతున్నాను.

ఎస్‌. హెచ్‌., అమెరికా

యెహోవాసాక్షుల అంతర్జాతీయ సమావేశంలో నేను కలిసిన ఒక అమ్మాయికి ఉత్తరాలు వ్రాస్తున్నాను. సంస్కృతీ, భాషా వేరైనప్పుడు ఒకరి ఆలోచనలను మరొకరికి వివరించడం చాలా కష్టం. కాబట్టి నేను ఆమె భాషను నేర్చుకోవడం మొదలెట్టాను. టేప్‌ రికార్డును ఉపయోగించమన్న సలహా చాలా బాగుంది. చాలా కృతజ్ఞతలు.

ఏ. ఎస్‌., జర్మనీ

అమెరికాలో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో ఒక ప్రాచ్య దేశపు సహోదరిని కలిశాను. కానీ ఆమెతో ఉత్తరప్రత్యుత్తరాలు ఎలా జరపాలి అన్న విషయం నాకు సరిగా తెలియదు. దాని గురించి నేను ప్రార్థించాను, కేవలం కొన్ని రోజుల తర్వాత ఈ అద్భుతమైన శీర్షిక అందింది. నేను చదివాను మరలా మరలా చదివాను. అది నా సందేహాలన్నింటికీ సమాధానాన్ని ఇచ్చింది.

జీ. ఆర్‌., ఇటలీ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి