ప్రకటనలకున్న శక్తి
చాలా కాలం క్రితం, ఒక టెలివిజన్ వాణిజ్య ప్రసారం మధ్యలో “ఇప్పుడు మన స్పాన్సర్ కొన్ని మాటలు చెబుతారు” అనే మాటలతో ప్రకటన ప్రారంభమయ్యేది. తమ ఉత్పత్తుల ప్రకటనలకు డబ్బు చెల్లించే కంపెనీలే స్పాన్సర్‌లు. “స్పాన్సర్ చెప్పే కొన్ని మాటలు” చివరకు, కట్టలు తెంచుకుని పెద్ద వాక్ప్రవాహమౌతుంది. స్పాన్సర్‌లు వార్తలకు ఎంటర్‌టైన్‌మెంట్ మీడియాకు—టెలివిజన్‌కు, పత్రికలకు, వార్తాపత్రికలకు, మరియు రేడియోకు మరింత మద్దతునిస్తున్నారు. ఆ విధంగా, మీడియాలో ఏవి రావాలి ఏవి రాకూడదు అనే విషయంలో పెత్తనం చూపించేందుకు స్పాన్సర్‌లు ప్రయత్నిస్తారు.
ఉదాహరణ: 1993లో జర్మన్ లగ్జరీ కారును తయారు చేసే ఒక కంపెనీ తమ కారును చూపించే ప్రకటనను “సరైన ఎడిటోరియల్ ఎన్విరాన్మెంట్”లో ఉంచాలి అని ఆదేశిస్తూ 30 పత్రికలకు వ్రాసింది. తమ కారు ప్రకటన ఉన్న ఆ పత్రికల సంచికల్లో తమ కారును గురించిన, జర్మనీ ఉత్పత్తులను గురించిన, జర్మనీ గురించిన విమర్శలు ఉండకూడదని కూడా ఆ లేఖ వివరించింది. పత్రికల్లో ప్రకటనల కోసం 150 లక్షల డాలర్లను వెచ్చించే ఆ కంపెనీ “సరైన ఎడిటోరియల్ ఎన్విరాన్మెంట్” ఉండాలని ఎదురుచూడడం ఆశ్చర్యమేమీ కాదు.
పత్రికలు క్రొత్తరకం పెళ్ళి డ్రస్సులను ప్రకటిస్తున్నట్లయితే, ఉపయోగించిన పెళ్ళి డ్రస్సుల ప్రకటనలకు అవి ఒప్పుకోకపోవడం గానీ, రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ల లిస్టును చూపించే వార్తాపత్రికలు బ్రోకరు లేకుండా ఒక ఇంటిని ఎలా కొనాలో చెప్పకపోవడంలోగానీ ఆశ్చర్యం లేదు. అలాగే, సిగరెట్లను లేదా లాటరీలను ప్రకటించే పత్రికలు పొగత్రాగడానికి వ్యతిరేకంగా లేదా జూదానికి వ్యతిరేకంగా విమర్శించవు.
వినియోగదారు సంస్కృతి
కనుక, ప్రకటనకున్న శక్తి వస్తువుల అమ్మకాన్ని కూడా మించిపోతుంది. అది వినియోగదారుని జీవనశైలినీ, భౌతిక వస్తువులే కేంద్ర బిందువుగా ఉన్న భూగోళ సంస్కృతినీ పెంపొందిస్తాయి.
దాంట్లో తప్పేమైనా ఉందా? అది మీరెవరిని అడుగుతారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రజలు వస్తువులను కొనడానికి, వాటిని సొంతంగా కలిగివుండడానికి మక్కువ చూపుతారనీ; ప్రకటనలు వారి ఆసక్తులకు దోహదపడతాయనీ ప్రకటనలు చేసేవారు వాదిస్తారు. అంతేకాక, ప్రకటనలు ఉద్యోగాలకు తావిస్తాయనీ, క్రీడలను, కళలను స్పాన్సర్ చేస్తాయని, మాధ్యమాలు అందుబాటులో ఉండేందుకు సహాయపడతాయని, పోటీని ప్రోత్సహిస్తాయని, ఉత్పత్తులను మెరుగుపరుస్తాయని, ధరలను తగ్గించి ఉంచుతాయని, కొనుగోలులో ఎంపికా అవకాశం ఉండేలా ప్రజలు అన్నీ తెలుసుకుని ఉండగల్గేలా చేస్తుందని వాళ్ళు చెబుతారు.
ప్రకటనలు ప్రజలకు నెమ్మదినివ్వవని, తమకున్నవాటితో తృప్తిగా ఉండనివ్వవనీ, అంతం లేని కోరికలను కలిగించి పెంపొందిస్తాయనీ ఇతరులు చెబుతారు. “ప్రకటనలు మన కాలంలాగే, ఎప్పుడైనా మారవచ్చు, అవి సుఖమే జీవిత పరమార్థమంటాయి, వాటి నిండా ఇమేజ్‌లే, అవి ప్రస్తుత ఫ్యాషన్‌లను ప్రేరేపిస్తాయి; అవి వ్యక్తులను కీర్తిస్తాయి, వ్యక్తిగత సంతృప్తికి వస్తువుల వినియోగమే ఆదర్శ మార్గమన్నట్లు చేస్తాయి. ఒకరి అదృష్టానికి సాంకేతిక అభివృద్ధి ప్రేరేపక శక్తి అవుతుందని నొక్కి చెబుతాయి” అని పరిశోధకుడు అలన్ డూరిన్ వ్రాశాడు.
మీపై దానికున్న పట్టు
మన వ్యక్తిత్వానికీ, మన కోరికలకూ వాణిజ్య ప్రకటనలు రూపాన్ని కల్పిస్తున్నాయా? అది సంభవమే. అయినప్పటికీ, దాని స్వాధీనం అధికమా అల్పమా అన్నది ఇతర ప్రభావాలపై ఆధారపడి ఉంటుంది.
మనలను బైబిలు సూత్రాలూ, విలువలూ నడిపిస్తున్నట్లయితే, భౌతిక వస్తువులను కలిగి ఉండడంలో తప్పేమీ లేదని మనం గ్రహిస్తాం. అంతెందుకు, దేవుడు అబ్రాహామును, యోబును, ఇతరులను సిరిసంపదలతో ఆశీర్వదించాడు కూడా.
మరో వైపు, మనం బైబిలు సూత్రాలను ఆచరణలో పెడితే, భౌతిక వస్తువుల కొరకై ఎన్నడూ ముగియని అన్వేషణలో సంతుష్టినీ, సంతోషాన్ని వెదికేవారికుండేటువంటి అసంతృప్తి మనకుండదు. “జేబు ఖాళీ అయ్యేదాక కొనమన్నది” బైబిలు సందేశం కాదు. బదులుగా అది మనకిలా చెబుతుంది:
దేవునిలో నమ్మకముంచండి. “ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.”—1 తిమోతి 6:17.
సంతృప్తులై ఉండండి. “మనమీ లోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.”—1 తిమోతి 6:7, 8.
అణుకువగలవారై ఉండండి. “స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్‌క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.”—1 తిమోతి 2:9, 10.
దైవిక బుద్ధి సంపదకన్నా మిన్నయని తెలుసుకోండి. “జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుటకంటె జ్ఞానలాభము నొందుట మేలు. పగడములకంటె అది ప్రియమైనది నీ యష్టవస్తువులన్నియు దానితో సమానములు కావు. దాని కుడిచేతిలో దీర్ఘాయువును దాని యెడమచేతిలో ధనఘనతలును ఉన్నవి. దాని మార్గములు రమ్యమార్గములు దాని త్రోవలన్నియు క్షేమకరములు దాని నవలంబించువారికి అది జీవవృక్షము దాని పట్టుకొనువారందరు ధన్యులు.”—సామెతలు 3:13-18.
ఇస్తూ ఉండండి. “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.”—అపొస్తలుల కార్యములు 20:35.
ఈ శీర్షిక పరంపర కూడా ఒక రకమైన ప్రకటనే అని, భౌతిక విలువలను దృష్టిలో పెట్టుకుని ఆధ్యాత్మిక విలువలను ప్రక్కకు నెట్టేయకూడదన్న తలంపును “ఒప్పిస్తుందని” ఒకరు వాదించవచ్చు. నిస్సంశయంగా మీరూ ఆ అభిప్రాయంతో ఏకీభవిస్తారు.
[9వ పేజీలోని బాక్సు]
దేవుని రాజ్యాన్ని ప్రకటించడం
ఒప్పించే సందేశంతో ప్రజలను చేరుకునే శ్రేష్ఠమైన మార్గాల్లో ఒకటి ఏమిటి? అడ్వర్టైజింగ్: ప్రిన్సిపిల్స్ అండ్ ప్రాక్టీస్ అనే పుస్తకం ఇలా చెబుతుంది: “ఒక ఆదర్శవంతమైన లోకంలో ప్రతి ఉత్పత్తిదారుడూ అమ్మకానికి ప్రతిపాదించే ఉత్పత్తిని లేదా సేవలను గురించి ప్రతి వినియోగదారునితో నేరుగా మాట్లాడగలుగుతాడు.” దాదాపు 2,000 సంవత్సరాలుగా నిజ క్రైస్తవులు ఈ పద్ధతిలోనే దేవుని రాజ్యాన్ని స్వచ్ఛందంగా ప్రచురం చేస్తున్నారు. (మత్తయి 24:14; అపొస్తలుల కార్యములు 20:20) అనేక వ్యాపారాలు ప్రజలను చేరుకునేందుకు ఈ పద్ధతిని ఎందుకు అభ్యసించవు? ఆ పుస్తకం ఇలా వివరిస్తుంది: “అది చాలా ఖర్చైన పని. అమ్మకందారులు అలాంటి దర్శనాలు చేస్తే, అలాంటి ప్రతి దర్శనానికి 150 డాలర్ల కన్నా ఎక్కువ ఖర్చే అవుతుంది.” అవును, క్రైస్తవులు దేవుని రాజ్యాన్ని స్వచ్ఛందంగా “ప్రకటిస్తున్నారు.” అది వాళ్ళ ఆరాధనలో భాగం.
[8వ పేజీలోని చిత్రాలు]
బైబిలు సందేశం “జేబు ఖాళీ అయ్యేదాకా కొనమని” కాదు