కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 6/8 పేజీ 31
  • మా పాఠకుల నుండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మా పాఠకుల నుండి
  • తేజరిల్లు!—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • భూవ్యాప్తంగా అందుబాటులోవున్న ఇంటర్నెట్‌ను జ్ఞానయుక్తంగా ఎలా ఉపయోగించుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1998
  • ఇంటర్‌నెట్‌ ఎందుకు అప్రమత్తంగా ఉండాలి?
    తేజరిల్లు!—1997
  • ఇంటర్‌నెట్‌ అంటే ఏమిటి?
    తేజరిల్లు!—1997
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 6/8 పేజీ 31

మా పాఠకుల నుండి

మాట్లాడే డోళ్లు “ఆఫ్రికా డోళ్లు నిజంగా మాట్లాడతాయా?” (ఆగస్టు 8, 1997) అనే అద్భుతమైన శీర్షికను చదివిన తర్వాత, ఆ కథ యొక్క సత్యత్వాన్ని పరీక్షించేందుకు వందేళ్ళు పైబడిన మా తాతయ్య వద్దకు వెళ్లాను. ఆయన దాని వివరాలను అన్నింటినీ కూడా ఆమోదించారు, మరి నేను ఇంప్రెస్‌ అయ్యాను!

జి. ఎమ్‌. ఓ., నైజీరియా

ఇంటర్‌నెట్‌ నేను కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నాను, “ఇంటర్‌నెట్‌—అది మీకవసరమా?” (ఆగస్టు 8, 1997) అనే శీర్షికల విషయమై నేను మిమ్మల్ని మెచ్చుకోవాలని అనుకుంటున్నాను. ఆ శీర్షికలు క్లుప్తంగా, సమాచారాన్ని అందించేవిగా, మరియు వైజ్ఞానికంగా కచ్చితమైనవిగా ఉన్నాయి. ఇంటర్‌నెట్‌ చుట్టూ వ్యాపించి ఉన్న అర్థరహిత వివక్షనూ భయసూచననూ మీరు విపరీతంగా నొక్కి చెప్పలేదు. మరో వైపు, మీరు వాస్తవమైన ప్రమాదాలను దాచలేదు.

ఎల్‌. ఈ., ఇటలీ

నేను కంప్యూటర్‌ తరగతులు బోధిస్తాను, నేను సరిక్రొత్త సమాచారాన్ని తెలుసుకుని ఉండేందుకు కంప్యూటర్‌ సంబంధిత పత్రికలను తరచూ కొంటుంటాను. ఇంటర్‌నెట్‌ వలన కలిగే లాభాలనూ, నష్టాలనూ గురించి మీరు వ్రాసినంత నిర్మొహమాటంగా వ్రాయగల ధైర్యం ఒక పత్రికకు కూడా లేదు.

ఎ. ఎ. ఎస్‌., బ్రెజిల్‌

నేను ఇటీవల ఇంటర్‌నెట్‌ను గురించి చాలా విన్నాను, అయితే నేను దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోలేకపోయాను. మీ శీర్షికలు ఆ అంశాన్ని సరళమైన రీతిలో, సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించాయి.

ఎ. హెచ్‌., ఇండియా

వరల్డ్‌వైడ్‌ వెబ్‌ను గురించి కొంచెమే తెలిసిన లేక ఎంతమాత్రం తెలియని పాఠకులు కూడా దాన్ని సులభంగా అర్థం చేసుకోగల రీతిలో మీరు ఆ శీర్షికలను వ్రాశారు. ఈ సర్వీసును ఉపయోగించడంలోని మూల్యాన్ని ఆగి లెక్కించుకునేందుకు కూడా మీరు మాకు సహాయం చేశారు.

ఈ. కె., ఇథియోపియా

నిందించబడటం నాకు 15 సంవత్సరాల వయస్సు, “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . ప్రతీసారీ తప్పు నాదే ఎందుకు అవుతుంది?” (ఆగస్టు 8, 1997) అనే శీర్షిక నేను కన్నీళ్లు కార్చేలా చేసింది. నేను మా కుటుంబంలో చిన్నదాన్ని, ప్రతిసారీ తప్పు నాదే అంటారు. దాని గురించి వ్రాసినందుకు మీకు కృతజ్ఞతలు.

ఎన్‌. హెచ్‌., అమెరికా

వర్ధిల్లుతూ ఉండే పిల్లలు “వర్ధిల్లుతుండేలా మీ పిల్లలకు సహాయం చేయండి” (సెప్టెంబరు 8, 1997) అనే మహత్తరమైన శీర్షికల విషయమై నేను మీకు కృతజ్ఞతలు తెలపాలని అనుకుంటున్నాను. అవి చాలా ఉపయోగకరంగానూ, ప్రోత్సాహకరంగానూ ఉన్నాయని నేను కనుగొన్నాను. నాకు మూడేళ్ల కొడుకు ఉన్నాడు, మరి నేను వాడి ఆలోచనావిధానాన్ని అర్థం చేసుకుని నేను వాడికి క్రమశిక్షణనిచ్చే విషయంలో దిద్దుబాట్లు చేసుకునేందుకు ఈ పత్రిక నాకు సహాయం చేసింది. ఈ శీర్షికల విషయమై నా కచ్చితమైన కృతజ్ఞతలు యెహోవాకు చెందుతాయి.

పి. ఎస్‌., ఇటలీ

“కఠినమైన మాటలు, నలిగిన హృదయాలు” అనే శీర్షిక ద్వారా నేను తీవ్రంగా స్పృశించబడ్డాను. నా జీవితమంతా నన్ను నేను తీవ్రంగా తీర్పుతీర్చుకున్నాను. తీవ్రంగా తీర్పుతీర్చే బదులు అంత కష్టాలను అనుభవించిన వారికందరికీ సహాయం చేసేందుకు మీరు ప్రేమపూర్వకంగా ప్రయత్నించారని కనుగొనేందుకు నేను ఆనందిస్తున్నాను. యెహోవా మిమ్మల్ని దీవించడంలోనూ మరియు ఎంతో ప్రయోజనకరమైనవీ ఓదార్పునిచ్చేవీ అయిన శీర్షికలను వ్రాసేందుకు మిమ్మల్ని నడిపించడంలోనూ కొనసాగాలని నేను కోరుకుంటున్నాను.

ఎల్‌. డి., కెనడా

మనలో అనేకులు అనుభవించిన అంతరంగ క్షోభకుగల కారణాన్ని చూసేందుకు ఈ శీర్షికలు అనేకుల కళ్లు తెరుస్తాయని నేను నిరీక్షిస్తున్నాను. ఈ విషయాన్ని గురించి వ్రాసినందుకు మీకు అనేక వందనాలు.

ఎల్‌. బి., అమెరికా

నర్సరీ పాఠశాల టీచరుగా నేను నా పనిని మరింత చక్కగా చేసేందుకు ఇటువంటి శీర్షికలు నాకు సహాయకరంగా ఉంటాయి. మాకు సరిక్రొత్త సమాచారాన్ని ఇస్తున్నందుకూ, మేము మెరుగుపర్చుకునేందుకు మాకు సహాయం చేస్తున్నందుకూ మీకు వేలాది కృతజ్ఞతలు.

జి. ఆర్‌., మెక్సికో

ఈ శీర్షికలు నాకు కొంత నిరీక్షణనిచ్చాయి. నేను ఒక అస్తవ్యస్తమైన కుటుంబంనుండి వచ్చాను, మరి యెహోవాకు సేవ చేసేందుకూ, నా చిన్ని పాపను పెంచేందుకూ నేను యోగ్యురాలననే విషయాన్ని ఒప్పుకోవడం నాకు ఎంతో కష్టంగా ఉంటుంది. ఈ శీర్షికలోని సలహాలను అనుసరించేందుకు నేను నాకు వీలైనదంతా చేస్తాను. మీ శ్రద్ధకై కృతజ్ఞతలు.

ఎ. ఎ., అమెరికా

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి