రండి, బహిరంగ ప్రసంగాన్ని ఉచితంగా వినండి “నిత్యజీవానికి నడిపించే ఏకైక మార్గం”
దాదాపు 20 సంవత్సరాల క్రితం, కాంక్వెస్ట్ ఆఫ్ డెత్ అనే తన పుస్తకంలో డా. ఆల్విన్ సిల్వర్స్టైన్ ఇలా వ్రాశాడు: “మనం జీవిత సారాన్ని తెలుసుకుంటాం. మనిషి ఎలా వృద్ధుడౌతాడో . . . మనం అర్థం చేసుకుంటాం.” ఆయన ఇంకా ఇలా జోస్యం చెప్పాడు: “‘వృద్ధ’ ప్రజలనేవారే ఇక ఉండరు, ఎందుకంటే మరణంపై విజయాన్ని సాధ్యపర్చే జ్ఞానం నిత్యయౌవ్వనాన్ని కూడా తెస్తుంది.”
ఇటీవలి కాలంలో, 1997 సెప్టెంబరు 28 నాటి ది న్యూయార్క్ టైమ్స్ మ్యాగజిన్లోని ఒక శీర్షిక, నేటి సాంకేతిక పరిజ్ఞాన శక్తిని గురించి ఎంతో ఉత్సాహంతో ఉన్న, “జీవితం పొడిగించబడే” విషయంలో అనుకూల అభిప్రాయాలున్న, ఆరోగ్యంపై శ్రద్ధవున్న అనేకమంది ప్రజలను గురించి నివేదించింది. “మన తరమే నిత్యమూ జీవిస్తూ ఉండే తరాల్లో మొదటిదై ఉంటుందని నేను వాస్తవంగా నమ్ముతున్నానని” ఆసక్తిగల ఒక వ్యక్తి చెప్పాడు. మరొక వ్యక్తి “వృద్ధులవ్వడాన్ని ఆపగల లేక దాన్ని మరల్చగల జెనెటిక్ ఆగ్మెంటేషన్ సాంకేతికతలు సరైన సమయంలో లభ్యమౌతాయని . . . తాను పూర్తి నమ్మకాన్ని కలిగి ఉన్నానని” ఆసక్తిగల మరొక వ్యక్తి చెప్పినట్లు చెప్పబడుతోంది. అటువంటి ఆశావాదం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందా?
మానవుడు తన సాంకేతికత మూలంగా మరణంపై విజయాన్ని సాధించగలడని మీరు విశ్వసిస్తున్నారా? లేక నిరంతరం జీవించేందుకు మరేదైనా మార్గం ఉందా? నిత్య జీవం వాస్తవంగా సాధ్యమౌతుందని లక్షలాదిమంది ప్రపంచవ్యాప్తంగా ఒప్పించబడి ఉన్నారు. “దైవిక జీవిత మార్గము” అనే యెహోవాసాక్షుల జిల్లా సమావేశంలో ఇవ్వబడే “నిత్యజీవానికి నడిపించే ఏకైక మార్గం” అనే ఉత్తేజకరమైన ప్రసంగానికి హాజరవ్వమనే ఆహ్వానాన్ని అంగీకరించి అదెలాగో తెలుసుకోండి. మీకు దగ్గర్లోని ఒక ప్రాంతంలో దాన్ని వినవచ్చు, ఎందుకంటే ఈ నెల నుండి ప్రపంచవ్యాప్తంగా వందలాది సమావేశాలు జరుగుతాయి.
మీకు సమీపంలోని సమావేశం యొక్క స్థలాన్ని కనుగొనేందుకు మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులను లేక ఈ పత్రిక ప్రచురణకర్తలను సంప్రదించండి.