స్త్రీలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు కానీ మంచి జీవితమేమీ కాదు
ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు వయస్సు మీరిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుని, కొద్ది మంది పిల్లలతో దీర్ఘకాలం జీవిస్తున్నారు. “స్త్రీల జీవన విధానం మారుతోంది” అని యునెస్కో సోర్సెస్ పత్రిక నివేదిస్తుంది. స్త్రీల ఆయుష్కాలం 1970 మరియు 1990 మధ్యకాలంలో అభివృద్ధి చెందిన దేశాల్లో నాలుగు సంవత్సరాలు, వర్ధమాన దేశాల్లో 9 సంవత్సరాలు పెరిగింది. “నేడు, అభివృద్ధి చెందిన దేశాల్లో స్త్రీలు పురుషుల కన్నా సరాసరి 6.5 సంవత్సరాలు ఎక్కువ జీవిస్తారు అని దీనర్థం. వర్ధమాన దేశాల్లో, అంటే లాటిన్ అమెరికా మరియు కరీబియన్ దేశాల్లో 5 సంవత్సరాల తేడా ఉండగా, ఆఫ్రికాలో 3.5 సంవత్సరాలు ఆసియా మరియు పసిఫిక్లలో మూడు సంవత్సరాల తేడా ఉంది.”
అయినప్పటికీ, చాలా మంది స్త్రీలు ఎక్కువ కాలం జీవిస్తున్నంత మాత్రాన మంచి జీవితాన్ని గడుపుతున్నారని కాదు. ప్రాథమిక మానవ హక్కులు స్త్రీలలో అనేకులకు ఇప్పటికీ “రుచి చూడని కేకు మీది క్రీమ్లాంటిదే. వాళ్ళు సాదాగా ఉండే మామూలు బ్రెడ్డు కోసం నీళ్ళ కోసం ప్రయత్నిస్తారు” అని ఐక్యరాజ్య సమితి ప్రచురించే అవర్ ప్లానెట్ అనే పత్రిక పేర్కొంది. అయితే, ప్రపంచంలో నిరక్షరాస్యులు, శరణార్థులు మరియు బీద ప్రజలలో అధిక సంఖ్యాకులు ఇప్పటికీ స్త్రీలే అయినందువల్ల లక్షలాది మంది స్త్రీలకు ప్రాథమిక హక్కులు కూడా అందుకోలేనంత దూరంలో ఉన్నాయి అని ఐక్యరాజ్య సమితి చెబుతుంది. కొన్ని పురోభివృద్ధులు ఉన్నప్పటికీ, “స్త్రీల పూర్ణ చిత్రం . . . నిస్తేజంగా కనిపిస్తుంది” అనే నిర్ధారణకు యునెస్కో సోర్సెస్ వస్తుంది.