జీవన విధానాన్ని నేర్పించే విద్యాభ్యాస సహాయకం
ఆఫ్రికానందలి జింబాబ్వేలో తను బోధిస్తున్న న్యాట్సీమ్ కాలెజ్లో “జీవన విధానాన్ని నేర్పించే విద్యాభ్యాసం” అనే సబ్జెక్ట్ బోధించబడుతుందని ఒక ఉపాధ్యాయుడు పేర్కొన్నాడు. తాను అనుభవించిన కుటుంబ సమస్యలను ఆయన వివరించాడు, వాటిని పరిష్కరించుకునేందుకు తనకు సహాయమవసరం ఉండిందని ఆయన తెలియజేశాడు.
తన వివాహం జరిగిన తర్వాత జరిగిన విషయాలను వివరిస్తూ, “చాలా త్వరగానే సమస్యలు మొదలయ్యాయి, మేము నవంబరు 1989లో విడిపోవాలనే నిర్ణయానికి వచ్చేందుకు అవి కారణమయ్యాయి” అని ఆయన చెప్పాడు. వేరే సమస్యలు కూడా ఉండేవి. “నేను మా అమ్మకు పెద్ద కొడుకును, అమ్మ మా నాన్నకు మొదటి భార్య. నేను టీచర్ ట్రెయినింగ్ చేస్తున్న రెండవ సంవత్సరంలో మా నాన్నగారు చనిపోయారు. దానితో 16 మంది తమ్ముళ్ళను, చెల్లెళ్ళను చూసుకునే బాధ్యత నా మీద పడింది” అని ఆయన వ్రాశాడు.
యెహోవాసాక్షులతో బైబిలును పఠించడం తన కుటుంబ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ ఉపాధ్యాయునికి సహాయపడింది. ఆయన, ఆయన భార్య తిరిగి ఏకమై సంతోషంగా ఉన్నారు. “దేవునిని ఆశ్రయించకుండా మానవుడు తన సమస్యలను పరిష్కరించుకునేందుకు చేసే ప్రయత్నాలు వ్యర్థమేనని నేను నా భార్య వేదనాభరితమైన అనుభవం ద్వారా తెలుసుకున్నాము” అని ఆయన వ్రాశాడు. అయితే తన విద్యార్థులకు వారి సమస్యల్లో సహాయపడే విషయమేమిటి?
“యౌవనస్థులు అడిగే ప్రశ్నలు—ఆచరణయోగ్యమైన సమాధానాలు” (ఆంగ్లం) అనే పుస్తకం తగిన పాఠ్యపుస్తకమని నేను మా పాఠశాల ప్రధానోపాధ్యాయునికి, ఇతర ఉపాధ్యాయులకు సిఫారసు చేశాను. వాళ్ళందరూ దానికి అంగీకరించారు. పాఠశాల నాకు 56 పుస్తకాల కొరకు ఆర్డరిచ్చింది. నేను అన్ని పుస్తకాలను పాఠశాలలో ఇచ్చేశాను” అని ఆయన వ్రాశాడు.
ఆకర్షణీయమైన చిత్రాలున్న 320 పేజీల ఈ విద్యాభ్యాస సహాయకం నుండి మీరు కూడా చాలా గొప్ప ప్రయోజనాన్ని పొందుతారని మేము నమ్ముతున్నాం. దాని ప్రతి కావాలని మీరనుకుంటే, లేదా ఉచిత గృహ బైబిలు పఠనం కావాలనుకుంటే దయచేసి Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., India, అనే చిరునామాకు లేదా 5వ పేజీలో ఉన్న మరో సముచితమైన చిరునామాకు వ్రాయండి.