కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 4/8 పేజీలు 28-29
  • ప్రపంచ పరిశీలన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ పరిశీలన
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • చన్నీటిలో మునిగినా బ్రతకడం
  • సత్యం చెప్పాలన్న బాధ్యతేమీ లేదు
  • మొసలి వార్త
  • పెరుగుతున్న ఒత్తిడి
  • ఆరోగ్య అంతరం
  • పరిపూర్ణమైన చలి కోటు
  • స్పృహ తప్పుతున్న అభిమానులు
  • సమయమెక్కడికి పోతుంది?
  • ఉచిత బేబీ-సిట్టింగా?
  • నూతన విలువలు
  • ‘నదీ నేత్రాల’ విషయంలో జాగ్రత్తగా ఉండండి!
    తేజరిల్లు!—1996
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • మొసలిని నిశితంగా పరిశీలించడం
    తేజరిల్లు!—1995
  • మొసలిని చూసి మీరు చిరునవ్వు చిందించగలరా?
    తేజరిల్లు!—2005
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 4/8 పేజీలు 28-29

ప్రపంచ పరిశీలన

చన్నీటిలో మునిగినా బ్రతకడం

శీతల నీటిలో పడేవారు ఎందుకు అంత త్వరగా చనిపోతారన్న విషయంపై పరిశోధన చేసే శాస్త్రజ్ఞలు, చలి షాక్‌కు శరీరం సహజ ప్రతిస్పందన హైపర్‌వెంటిలేట్‌ అవ్వడమని కనుగొన్నారు. “అకస్మాత్తుగా ఊపిరి లోపలికి తీసుకోవడం ఆ వెంటనే నీరు లోపలికి వెళ్లడం—మునిగిపోవడం జరుగుతుంది” అని న్యూ సైంటిస్ట్‌ పత్రిక చెబుతుంది. హైపర్‌వెంటిలేషన్‌ నివారింపశక్యం కానిది. అందువలన బ్రతికివుండడం, గాలిని మ్రింగాలనే ప్రతిస్పందన తగ్గేంతవరకు, అంటే సాధారణంగా రెండు లేక మూడు నిమిషాల వరకు, తలను నీటికి పైగా ఉంచడంపై ఆధారపడుతుంది.

సత్యం చెప్పాలన్న బాధ్యతేమీ లేదు

ఇటీవలి అమెరికా న్యాయస్థాన విచారణలు ప్రపంచవ్యాప్త ప్రజల దృష్టినాకర్షించాయి, ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేశాయి. “ప్రాసిక్యూటర్లకు సత్యాన్ని ముందుంచవలసిన బాధ్యత ఉండగా, డిఫెన్సు న్యాయవాదులు భిన్నమైన లక్ష్యాలను వెంబడిస్తారు” అని ద న్యూయార్క్‌ టైమ్స్‌ అంటుంది. “కక్షిదారునికి విడుదల, (కనీసం ఒక్క జూరీ సభ్యుని మనస్సులోనైనా సహేతుకమైన సందేహాన్ని నాటడం ద్వారా) హంగ్‌ జూరీ లేక అతి తక్కువ తీవ్రతగల నిందారోపణలపై నేర నిర్ణయాన్ని గానీ సంపాదించిపెట్టడం ఒక డిఫెన్సు న్యాయవాది పని.” “నిర్దోషి అనే తీర్పు సరియైనదని హామీనిచ్చే బాధ్యత వారికి లేదు” అని న్యూయార్క్‌ విశ్వవిద్యాలయ లా స్కూలులోని శాసనిక నీతిశాస్త్ర అధ్యాపకుడు, స్టీఫెన్‌ గిలర్స్‌ అన్నాడు. “విచారణ, సత్యం కొరకైన అన్వేషణ అని మేము జూరీకి చెబుతాము, మరి డిఫెన్సు న్యాయవాదులు వారిని మోసగించబద్ధులై ఉన్నారని వారికి మేమెప్పుడూ చెప్పము.” ఒకవేళ “కక్షిదారుడు స్పష్టంగా ఇరుక్కునే వాస్తవాలను ఎదుర్కొంటే, ఆ వాస్తవాలను ఉపేక్షించేలా, విడుదల పొందడానికి ఓటు వేసేలా, వాస్తవాలకన్నా ఇతరములను పరిగణించడానికి న్యాయవాదులు తరచూ జూరీ కొరకు కథలను సృష్టించాలి” అని టైమ్స్‌ చెబుతుంది. తమ కక్షిదారుడు దోషి అని న్యాయవాదులకు తెలుసు కానీ కక్షిదారుడు ఇంకా జూరీతో తనకుగల అవకాశాలను పరీక్షించుకోవాలని పట్టుబట్టితే అప్పుడేమవుతుంది? “అప్పుడు న్యాయవాదులు యురయ్యా హీప్‌ వలె న్యాయస్థానానికి వెళ్తారు, అది 100 శాతం అసత్యమని తెలిసినా పూర్తి దొంగ వినయంతో, తమ కక్షిదారుల కథ యథార్థతపై ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తారు” అని గిలర్స్‌ అంటున్నాడు.

మొసలి వార్త

ఇటీవలనే వెలికితీయబడిన శిలాజమైన ప్రాచీన మొసలి దవడలు, మొసలి కుటుంబంలోని “తెలిసిన వాటిలో మొట్టమొదటి శాకాహార మొసళ్ళకు ప్రాతినిధ్యం వహిస్తుండవచ్చని” ప్రకృతి అనే పత్రిక నివేదిస్తుంది. ఈనాడు మానవులు అత్యంత భయపడే, ఆధునిక మొసలికి ఉన్న పొడవైన సూదైన పళ్ళు కాకుండా ఈ ప్రాచీన పూర్విక జంతువుకు గడ్డిని నమలడానికి చక్కగా సరిపోతుందని నివేదించబడినట్లుగా సమతలమైన పళ్ళున్నాయి. చైనాలోని హూబే రాష్ట్రంలో, యాంగ్‌ట్సీ నది దక్షిణ ఒడ్డు దగ్గర ఒక గుట్టపై, చైనా, కెనడా దేశాల పరిశోధకులు కనుగొన్న ఈ ప్రాణి నేలపై జీవించేది కూడా, ఉభయచర జీవి కాదు. దాని పరిమాణం? అది పొడవులో మూడు మీటర్లుంది.

పెరుగుతున్న ఒత్తిడి

బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరుపబడిన ఇటీవలి అధ్యయనం, వైద్య అవధానాన్ని కోరుతున్న 35 శాతంపైగా ప్రజలు వివిధ రకాలైన మానసిక వికలత వలన బాధపడుతున్నారని కనుగొన్నట్లు వేజా నివేదిస్తుంది. ఆ పత్రిక, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్‌.ఓ.) మానసిక-ఆరోగ్య డైరెక్టరు అయిన డా. జోర్జ ఆల్బర్టూ కోస్ట ఈ సీల్వను ఇలా అడిగింది: “ఈ సంఖ్యలను ఎలా వివరించవచ్చు? ప్రపంచం మరింత చెడుగా మారిందా లేక ప్రజలు మానసికంగా దుర్బలులయ్యారా?” ఆయన ప్రతిస్పందన: “మనం చాలా త్వరితంగా మార్పు చెందుతున్న కాలంలో జీవిస్తున్నాము చివరికిది, మానవజాతి చరిత్రలో మునుపెన్నడూ కనిపించనటువంటి మోతాదుల్లో చింతలను, ఒత్తిళ్లను కలుగజేస్తుంది.” ఒత్తిడికి ఒక సాధారణ మూలం, రియో డి జనీరోలో ప్రబలివున్న హింస అని ఆయన చెబుతున్నాడు. ఇది, తరచూ “ఏదోవిధంగా జీవితం ప్రమాదంలో ఉండే పరిస్థితిలో ఉన్న ప్రజలను ప్రభావితం చేసే” పోస్ట్‌ట్రామాటిక్‌ ఒత్తిడికి నడిపిస్తుందని, “పగటి సమయంలో ప్రతీదాని ఎడల వారు అభద్రతను చూపిస్తారు. వారి జీవితాల్ని ప్రమాదంలో పడవేసిన సంఘటన రాత్రి పూట పీడకలలో పునరావృత్తమౌతుంది” అని ఆయన వివరిస్తున్నాడు.

ఆరోగ్య అంతరం

ధనిక, పేద దేశాల మధ్య ఆరోగ్య అంతరం ఎక్కువవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్‌.ఓ.) అభివృద్ధి చెందిన దేశాల్లో పుట్టి, అక్కడే జీవిస్తున్న ప్రజల సగటు ఆయుష్కాలం, తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లోని 54 సంవత్సరాలకు పోల్చినప్పుడు, అది 76 సంవత్సరాలు అని అంచనా వేస్తుంది. 1950లో, ధనిక దేశాల్లో కంటే పేద దేశాల్లో శిశు మరణానుపాతం, మూడు రెట్లు ఎక్కువుంది; ఇప్పుడు అది 15 రెట్లు ఎక్కువగా ఉంది. 1980ల చివరికి వచ్చేసరికి, పేద దేశాల్లో ప్రసూతి మరణాల రేటు ధనిక దేశాలలోకన్నా 100 రెట్లు ఎక్కువగా ఉంది. సమస్యకు దోహదపడేది, పేద దేశాల్లో నివసించే ప్రజల్లో సగం కంటే తక్కువ మందికి పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం అందుబాటులో ఉంటుందన్న వాస్తవమేనని డబ్ల్యు.హెచ్‌.ఓ. తెలుపుతుంది. ఐక్య రాజ్య సమితి ప్రకారం, “అత్యంత తక్కువ అభివృద్ధి చెందిన దేశాల” సంఖ్య, 1975లోని 27 నుండి 1995లోని 48కి పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్లమంది పేద ప్రజలు ఉన్నారు, మరి వారి సంఖ్య పెరుగుతుంది.

పరిపూర్ణమైన చలి కోటు

విమానాలనుండి ధ్రువప్రాంత ఎలుగుబంటిని గుర్తుపట్టడానికి ప్రయత్నించే శాస్త్రజ్ఞులు చాలా కష్టాన్ని ఎదుర్కొంటున్నారు—మరి అది కేవలం ఎలుగుబంటులు తెల్లనివి అవి మంచుతో కప్పబడివున్న ప్రాంతాలలో జీవిస్తాయన్న స్పష్టమైన కారణం వలన కాదు. పాప్యులర్‌ సైన్స్‌ ప్రకారం, ఆ సమస్యకు ఒక తెలివైన పరిష్కారమన్నట్లుగా కనిపించేది శాస్త్రజ్ఞుల వద్ద ఉంది: ఈ భారీ ప్రాణులనుండి వెలువడే శరీర వేడిని సులభంగా పసికట్టగలదని తర్కిస్తూ వారు సున్నితమైన పరారుణ ఫిలిమ్‌ను ఉపయోగించారు. కానీ ఫిలిమ్‌ ఖాళీగా వెనక్కి వచ్చింది! ధ్రువప్రాంత ఎలుగుబంటి కోటు ఎంత ప్రభావవంతమైన బంధనముగా ఉన్నట్లుందంటే ఈ జంతువునుండి చాలా కొద్ది మొత్తంలో ఉష్ణం బయటికి తప్పించుకుంటుంది. ఏదోవిధంగా సూర్యకాంతిని ఉష్ణంగా మార్చుకోగలిగే “సోలార్‌ సెల్స్‌” వంటి వాటిలోనికి సూర్యుని అతినీలలోహిత కిరణాలను ఆకర్షిస్తూ, కోటు వెంట్రుకలు వాటి ఉత్తమ వాహకాలుగా పని చేస్తున్నట్లుగా ఉందని కూడా ఆ పత్రిక తెలియజేస్తుంది.

స్పృహ తప్పుతున్న అభిమానులు

రాక్‌ ప్రదర్శనలలో అంతమంది అభిమానులు ఎందుకు స్పృహ తప్పుతారు? జర్మనీ, బెర్లిన్‌లోని విశ్వవిద్యాలయ ఆసుపత్రిలో ఒక నాడీమండలశాస్త్ర నిపుణుడు ఇటీవల ఆ విలక్షణమైన సంఘటనను పరిశోధించాడు. ప్రముఖంగా యువతులు హాజరైన ఒక బెర్లిన్‌ రాక్‌ ప్రదర్శన వద్ద, ప్రదర్శన జరుగుతుండగా దాదాపు 400 మంది స్పృహ తప్పారు. డిస్కవర్‌ పత్రిక ప్రకారం, స్పృహ తప్పిన వారిలో 90 శాతం మంది ముందు వరుసల్లో నిలబడివున్నట్లు నాడీమండలశాస్త్ర నిపుణుడు కనుగొన్నాడు. ఈ ఎంపిక చేసుకున్న కుర్చీలను పొందడానికి అమ్మాయిలు పొడవైన క్యూలలో గంటల తరబడి నిల్చున్నారు, అనేకమంది భోజనం చేసి చాలా సమయమైంది లేక ముందు రాత్రి నిద్రపోలేదు. ఇతర కారణాలు—తమ స్వంత అరుపులు, వెనుకనుండి గుంపులు నొక్కివేయడం—రక్తపోటును తగ్గించి, ఛాతీపై ఒత్తిడి తెచ్చాయి. తత్ఫలితంగా ఇది మెదడుకు రక్త సరఫరాను తగ్గించింది. స్పృహ తప్పడం సంభవించింది. నాడీమండలశాస్త్ర నిపుణుడు రాక్‌ అభిమానులు ముందే భోజనం చేసి నిద్రపోవాలని, కూర్చుని ఉండాలని, ప్రదర్శన జరుగుతుండగా నిశ్శబ్దంగా గుంపుకి దూరంగా ఉండాలని సిఫారసు చేయగా, చాలా కొద్దిమంది యౌవన అభిమానులు మాత్రమే పాటించడానికి ఇష్టపడతారని గుర్తించాడు.

సమయమెక్కడికి పోతుంది?

దినం ఎక్కడికి పోయింది? అనేకమంది ఆ ప్రశ్నను చమత్కారంగా అడుగుతారు, కానీ ఒక ఇటీవలి అధ్యయనం దానికి వైజ్ఞానికంగా జవాబివ్వడానికి ప్రయత్నించింది. అమెరికా, ఇల్లినోయిస్‌లోని ఒక పరిశోధన సంస్థ దాదాపు 3,000 మంది ప్రజలపై ఒక మూడు సంవత్సరాల అధ్యయనం జరిపింది, అందులో వారు తమ సమయాన్ని ఎలా గడుపుతున్నారనేదాని గురించి రికార్డులు వ్రాయడం కొనసాగించమని అడుగబడ్డారు. ఆ గుంపులో 18 సంవత్సరాల నుండి 90 సంవత్సరాల మధ్యనున్న ఒక విస్తారమైన పరిధిలోని పూర్వరంగాల నుండి వచ్చిన వారున్నారు. అత్యధిక సమయం నిద్రకు వినియోగించబడింది. దీని తరువాత, సగటున రోజుకు 184 నిమిషాల సమయాన్ని పని తీసుకుంది. ఆ తరువాత 154 నిమిషాలు తీసుకున్న దూరదర్శిని, వీడియోలు చూడడం ఉంది. ఇంటిపనులు 66 నిమిషాలు తీసుకున్నాయి, ప్రయాణానికి, ఎగువ, దిగువ ప్రయాణాలకు 51 నిమిషాలు, తయారవ్వడానికి 49 నిమిషాలు, పిల్లలను పెంపుడు జంతువులను చూసుకోవడానికి 25 నిమిషాలు. పట్టికలో అన్నింటికీ క్రింద, సగటున రోజుకి 15 నిమిషాలు తీసుకున్న ఆరాధన ఉంది.

ఉచిత బేబీ-సిట్టింగా?

కొంత షాపింగ్‌ చేయడానికి వీలుగా ఉండేందుకు విసిగిపోయిన తలిదండ్రులు ఇతరులు తమ పిల్లలను కావలికాసేలా ఒక క్రొత్త మార్గాన్ని కనుగొన్నారు. వారు తమ పిల్లలను బొమ్మల స్టోర్‌లో లేక మల్టీమీడియా కంప్యూటర్‌ స్టోర్‌లో విడిచిపెడతారు. పిల్లలు, హై-టెక్‌ యంత్రాలయెడల సమ్మోహితులై తలిదండ్రులు తిరిగివచ్చేంతవరకు ప్రదర్శన నమూనాలతో ఆడుకోవడం మొదలు పెడతారు. అయితే, ఆశ్చర్యం కలిగించని రీతిలోనే, విక్రయదారులు ఈ ధోరణి వలన ప్రసన్నం కాలేదు అని న్యూస్‌ వీక్‌ పత్రిక నివేదిస్తుంది. పిల్లలు చేసే శ్రేష్ఠమైన పని ఏమిటంటే, అసలు కొనుగోలుదారులు ప్రదర్శన నమూనాలు ఉపయోగించడాన్నుండి నిరోధిస్తారు; అతి చెడ్డపనేమిటంటే వాటిని విరగగొట్టడం. ఎవ్వరూ తమ పిల్లలను చూసుకోకపోతే లేక వారిని బాత్రూముకు తీసుకెళ్ళకపోతే కొంతమంది తలిదండ్రులు తిరిగివచ్చి ఫిర్యాదులు చేస్తున్నట్లు ఇతరులు కనుగొన్నారు! అందువలన, కొన్ని స్టోర్లు ఈ ధోరణికి విరుద్ధంగా పోరాడుతున్నాయి—ప్రదర్శన కంప్యూటర్లను అందుబాటులో లేకుండా చేయడం లేక వారు ఒంటరి పిల్లలను కనుగొంటే భద్రతా సిబ్బందిని పిలవడం చేస్తున్నారు.

నూతన విలువలు

రష్యా సమాజంతోపాటు రష్యా యౌవనస్థులు, సాధారణంగా, విలువల విషయంలో సంక్షోభం అనుభవిస్తున్నారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో ఇటీవల జరిపిన ఒక సర్వేక్షణ, యౌవనస్థుల వైఖరి “ఆరోగ్యం, జీవితం, కుటుంబం, మరియు ప్రేమ వంటి మానవాళికి సామాన్యమైన విలువలను అంతేగాక వ్యక్తిగత విలువలైన సఫలత, జీవనగతి, సౌఖ్యం, మరియు భౌతిక భద్రతల వంటివాటిని” నొక్కి తెలుపుతున్నట్లు కనుగొన్నట్లు రష్యా వార్తాపత్రిక సాక్ట్‌-పీటర్‌బర్గ్సీ నివేదించింది. ఇతర ముఖ్యమైన విలువలు తలిదండ్రులు, డబ్బు, సంక్షేమం, సంతోషం, స్నేహం, జ్ఞానంపై కేంద్రీకృతమై ఉన్నాయి. ఆసక్తికరంగా, మంచి కీర్తి కలిగివుండడం, వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని అనుభవించడం యౌవనస్థుల మనస్సుల్లోని ఆఖరి స్థానాల్లో రెండింటిని ఆక్రమిస్తాయి. ఆఖరి స్థానంలో ఉన్నదేమిటి? నిజాయితీ. ఆ నివేదిక ఇలా ముగిస్తుంది: “ఒకవేళ అబద్ధాలాడడం చాలా సాధారణమైతే, అప్పుడు పెరుగుతున్న తరం మనస్సుల్లో [నిజాయితీ] విలువలేనిదౌతుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి