కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 4/8 పేజీలు 25-27
  • దేవుని బహుమానమైన సంతులనం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని బహుమానమైన సంతులనం
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అదేమిటి? అదెలా పనిచేస్తుంది?
  • ఆళింద వ్యవస్థ పని లోపాలు
  • కారణాలు, చికిత్సలు
  • మీ వినికిడి శక్తి కాపాడుకోవాల్సిన ఓ బహుమానం
    తేజరిల్లు!—1997
తేజరిల్లు!—1996
g96 4/8 పేజీలు 25-27

దేవుని బహుమానమైన సంతులనం

“అది సీ లెగ్స్‌ మాత్రమే, అది కొద్ది రోజుల వరకు ఉంటుంది” అని నా స్నేహితులు నాతో చెప్పారు. అది 1990 అక్టోబరు, కరీబియన్‌కు చేసిన ఏడురోజుల ప్రయాణం తరువాత సముద్రయాన ఓడనుండి పొడినేలపై నేను అప్పుడే అడుగుపెట్టాను. కొద్ది రోజుల అనుభవమని నేను అనుకున్నాను, అయితే అది అనేక నెలలపాటు కొనసాగింది. అసలు నేను ఆ ఓడ దిగనే లేదన్నట్లుగా ఉంది. నా ఆళింద వ్యవస్థకు ఏదో జరిగింది. ఇది మెదడులో దాని కేంద్రీయ సంబంధాలతో లోచెవిలోవుండే సంక్లిష్టమైన సంతులన వ్యవస్థ.

అదేమిటి? అదెలా పనిచేస్తుంది?

మీ సంతుల్యానికి సమన్వయ కేంద్రం బ్రెయిన్‌ స్టెమ్‌ అని పిలువబడే మీ మెదడుయొక్క బేస్‌ (అడుగు ఉపరితలం) వద్ద కనుగొనబడుతుంది. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మీరు మీ సంతుల్యాన్ని కాపాడుకుంటారు ఎందుకంటే మీ కళ్ళనుండి, మీ కండరాలనుండి, మీ ఆళింద వ్యవస్థనుండి అసంఖ్యాక ప్రచోదనలు గ్రహించబడతాయి.

మీ కళ్ళు బ్రెయిన్‌ స్టెమ్‌కు మీ బాహ్య పరిసరాలగురించి నిర్విరామమైన ఇంద్రియ సంబంధమైన ఆదానము అందిస్తుంది. మీ కండరాలలో ప్రాప్రియోసెప్టార్లు అనబడే జ్ఞాన గ్రాహకాలు, మీ మెదడుకు మీరు నడుస్తున్న లేక స్పర్శిస్తున్న ఉపరితలాన్ని గూర్చిన సమాచారాన్ని అందిస్తాయి. కానీ అంతర్గత నడిపింపునిచ్చే వ్యవస్థగా పని చేసేది, భూమికి, దాని ఆకర్షణ శక్తికి సాపేక్షికంగా మీరు గాలిలో ఎక్కడ ఉన్నారో మీ మెదడుకు చెప్పేది మీ ఆళింద వ్యవస్థే.

సంతుల్యంతో వ్యవహరించే ఐదు భాగాలతో మీ ఆళింద వ్యవస్థ చేయబడింది: మూడు అర్ధవృత్తాకారపు కాలువలు, రెండు తిత్తులు. అర్ధవృత్తాకారపు కాలువలకు పూర్వ ఆయత కాలువ, అడ్డ (పార్శ్వ) కాలువ, పరాంత ఆయత (పృష్ఠ) కాలువ అని పేర్లు పెట్టబడ్డాయి. రెండు తిత్తులకు పెద్ద పేటిక, గోణిక అని పేర్లు పెట్టబడ్డాయి.

అర్ధవృత్తాకారపు కాలువలు, ఒక గది మూలవద్ద కలుస్తున్న గోడలు, నేల వలె ఒకదానికొకటి సమ కోణాలలో సమతలంలో ఉంటాయి. కాలువలు, కపాలంలోని కణత ఎముక అని పిలువబడే గట్టి ఎముకలో దాక్కొనివుండే ఒక సంవ్యూహంతో కూడిన మార్గాలుగా ఉంటాయి. ఈ జటిలమైన ఎముకలో, త్వచాగహనం అని పిలువబడే మరొక సంవ్యూహం ఉంటుంది. త్వచ సంబంధ అర్ధవృత్తాకారపు ఒక్కొక్క నాళం చివరన, ఒక బుడిపెలా కనుపించే కలశిక అని పిలువబడేది ఉంటుంది. త్వచాగహనం లోపల అంతర్లసిక అని పిలువబడే ప్రత్యేక ద్రవం ఉంటుంది. త్వచం బయట, పరిలసిక అని పిలువబడే విభిన్నమైన రసాయనిక మిశ్రమం కలిగివున్న మరొక ద్రవం ఉంటుంది.

కలశిక అని పిలువబడే నాళపు ఉబ్బివున్న ఈ భాగం, క్యుప్యులా అని పిలువబడే జిగురు వంటి ద్రవ్యరాశిలో పొదగబడి ఉన్న దొంతరులుగా ప్రత్యేకమైన రోమ కణాలను కలిగివుంటుంది. మీ తలను ఏదైనా ఒక దిక్కుకు కదిల్చినప్పుడు, అంతర్లసిక ద్రవం కాలువల కదలికతోపాటు మెల్లిగా కదులుతుంది; ఆ విధంగా ద్రవం, క్యుప్యులాను అది కలిగివున్న రోమముల దొంతరలను వంచుతుంది. రోమముల దొంతరల కదలిక రోమ కణం విద్యుత్తు ధర్మాలలో మార్పులను కలుగజేస్తుంది, తత్ఫలితంగా ఇది నాడీ కణాలగుండా మీ మెదడుకు వర్తమానాలను అందిస్తుంది. మెదడుకు వర్తమానాలు అభివాహి నరాలు అని పిలువబడే ఈ ఒక్కొక్క రోమ కణాలగుండా ప్రయాణించడమే కాకుండా, రోమ కణానికి అవసరమైనప్పుడు పరిహారాత్మక సమాచారాన్ని ఇవ్వడానికి మెదడునుండి అపవాహి నరాలగుండా అవి తిరిగి వెనక్కి ఒక్కొక్క రోమ కణానికి కూడా ప్రయాణిస్తాయి.

అర్ధవృత్తాకారపు కాలువలు, ముందుకు లేక వెనక్కి వంచడం, ఒక ప్రక్కకు లేక మరో ప్రక్కకు వాల్చడం, లేక ఎడమవైపుకు లేక కుడివైపుకు త్రిప్పడం వంటి ఏదైనా దిక్కుకు మీ తల కోణీయ లేదా భ్రమణాత్మక కదలికను పసిగడతాయి.

మరోవైపు పెద్ద పేటిక, గోణిక, రేఖీయ త్వరణాన్ని పసిగడతాయి; అందువలన అవి గురుత్వాకర్షక గ్రాహకాలు అని పిలువబడతాయి. అవి కూడా మాక్యులా అని పిలువబడే రోమ కణాలు కలిగి ఉంటాయి. ఉదాహరణకు, మీరొక లిఫ్టులో పైకి వెళ్తున్నప్పుడు మీకు పైకి త్వరణమయ్యే అనుభూతి కలిగించే సమాచారాన్ని గోణిక మీ మెదడుకు పంపిస్తుంది. మీరు కారులో వెళ్తూ అకస్మాత్తుగా వేగం పెరిగితే పసిగట్టి స్పందించే వాటిలో ప్రధానమైనది పెద్ద పేటిక. ముందుకి లేక వెనక్కి త్రోయబడే అనుభూతిని మీకు కలిగించడానికి మీ మెదడుకు సమాచారాన్ని అది పంపిస్తుంది. అప్పుడు మీ ప్రత్యక్ష చలనానికి ప్రతిక్రియ చూపడానికి మీ కళ్లను, అంగాలను ఎలా కదల్చాలి అనేటటువంటి నిర్ణయాలు తీసుకునేలా మీ మెదడు ఈ సమాచారాన్ని ఇతర ప్రచోదనలతో కలుపుతుంది. అది మీ అమరికను కాపాడుకునేందుకు సహాయం చేస్తుంది.

అది దాని రూపకర్త, యెహోవా దేవున్ని సన్మానించే ఒక అద్భుతమైన వ్యవస్థ. చివరికి పరిశోధక శాస్త్రజ్ఞులు దాని ఆకృతినిబట్టి ముగ్ధులవ్వడం తప్పించి ఏమీ చేయలేకపోతున్నారు. జీవశాస్త్ర, శరీర ధర్మశాస్త్ర ఆచార్యుడు ఏ.జె. హడ్స్‌పెత్‌, సైంటిఫిక్‌ అమెరికన్‌ అనే పత్రికలో ఇలా వ్రాశాడు: “అయితే, అదనపు పని, జీవశాస్త్ర పరికరమైన ఈ సూక్ష్మ ఖండం సూక్ష్మగ్రాహ్యత, సంక్లిష్టత ఎడల ఒక అద్భుత భావనను మరింత బలపరచడం మాత్రమే చేస్తుంది.”

ఆళింద వ్యవస్థ పని లోపాలు

నా విషయంలో నా లోచెవి సమస్య, ఓటోస్పాంజియోసిస్‌ లేక ఓటోస్ల్కీరోసిస్‌గా రోగ నిర్ధారణ చేయబడింది. ఆళింద వ్యవస్థ ఉండే ఎముక మెత్తగా లేత మృదువుగా తయారయ్యే స్థితి ఇది. మామూలుగా ఈ ఎముక చాలా గట్టిగా, మీ శరీరంలోని మిగతా ఎముక పదార్థం కంటే కూడా గట్టిగా ఉంటుంది. మెత్తగా అయ్యే ప్రక్రియలో లోచెవిలోని ద్రవంలోనికి కారే ఒక ఎన్‌జైమ్‌ ఉత్పత్తి అయి దానిని రసాయనికంగా భంగపరుస్తుందని లేక ద్రవాన్ని విషయుక్తంచేస్తుందని తలంచబడుతుంది. ఇది మీరు నిశ్చలంగా నిల్చున్నా లేక పడుకున్నా, ఎడతెగని కదలికయొక్క వికారమైన అనుభూతిని కలిగించగలదు.

అది నా క్రిందనున్న పేవ్‌మెంట్‌ ఒక తరంగంవలె, ఒకొక్కసారి దాదాపు ఒక మీటరులో మూడవ వంతు ఎత్తులో అల్లాడుతున్నట్లు భావించేలా చేసింది. పడుకున్నప్పుడు, ఒక మీటరు ఎత్తులోని మహాసముద్రపు అలల మధ్యనున్న తెడ్లు వేసి నడిపే పడవ అడుగున పడుకున్నట్లు నేను భావించాను. ఆ అనుభూతి, కొంత తల తిరిగినట్లుండే సమయాలవలె వచ్చిపోవడం కాదు గానీ, అది వచ్చినప్పుడు నెలల తరబడి రోజుకు 24 గంటల చొప్పున ఉండేది. ఉపశమనం కేవలం నేను స్పృహ లేకుండా నిద్రలో ఉన్నప్పుడు వచ్చేది.

కారణాలు, చికిత్సలు

వంశ పారంపర్య కారణంతో కొంత సంబంధం ఉన్ననూ, ఓటోస్పాంజియోసిస్‌/ఓటోస్ల్కీరోసిస్‌ రావడానికి కారణం ఇంకా తెలియలేదు. అది మానవులకు మాత్రమే వస్తుంది గనుక పరిస్థితిని అధ్యయనం చేయడం వైద్యశాస్త్రానికి కష్టమవుతుంది. అది అరుదుగా, అసలంటూ సంభవిస్తే, జంతువులకు సంభవిస్తుంది. ఓటోస్పాంజియోసిస్‌, టినిటస్‌ (చెవులలో హోరుమనే శబ్దం), భారంగా ఉండడం, సంతులితం లేదనే ఒక భావన, లేక వెర్టిగో (తలతిరగడం) యొక్క వివిధ రూపాలు కలిగించవచ్చు. అదే స్థితి, వాహకత్వ వినికిడి లోపం కలుగజేస్తూ మధ్య చెవిలో కర్ణాంతరాస్థి స్థాయీకరణాన్ని కలిగించగలదు. ఓటోస్పాంజియోసిస్‌, కర్ణావర్తాన్ని చేరుకుంటే, నాడీక్రియను ధ్వంసం చేస్తూ సెన్సారిన్యూరల్‌ వినికిడి లోపాన్ని కూడా కలుగజేయగలదు.

ఈ పరిస్థితికి చికిత్సలు కూడా ఉన్నాయి. కొన్నింటిలో శస్త్ర చికిత్సలు ఇమిడివున్నాయి (జూలై 8, 1988, [ఆంగ్లం] పేజీ 19 తేజరిల్లు! చూడండి); మరికొన్ని చికిత్సలు కాల్షియం, ఫ్లోరైడ్‌ల పూరకాలద్వారా ఎముక కృశించడాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాయి. చక్కెర లేని ఆహారాలు కొన్నిసార్లు సూచించబడతాయి, ఎందుకంటే లోచెవి బ్లడ్‌ షుగర్‌ కొరకు అత్యంత ఆకలిగా ఉంటుంది. నిజానికి, దాన్ని శక్తిమంతం చేయడానికి మెదడుకు కావలసినంత పరిమాణంలో మూడు రెట్లు ఎక్కువగా చక్కెర లోచెవికి కావలసి వస్తుంది. ఒక ఆరోగ్యవంతమైన చెవి బ్లడ్‌ షుగర్‌లోని మామూలు హెచ్చు తగ్గులతో చక్కగా వ్యవహరిస్తుంది; కానీ ఒక్కసారి చెవికి హాని జరిగితే, ఈ హెచ్చు తగ్గులు మీ తల తిరిగేలా చేయగలవు. ఒక్కసారి మీ చెవి సరిగా పని చేయనట్లయితే కెఫీన్‌, మద్యం కూడా నష్టకరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ శీర్షిక మొదట్లో ప్రస్తావించబడిన సముద్రయాన ఓడ ప్రయాణం, ఈ సమస్యని కలిగించకపోయినప్పటికీ, ఉష్ణోగ్రతలో మార్పులు, తేమ, ఆహారపుటలవాట్లు బహుశా అసమతాస్థితిని త్వరితం చేసి ఉండవచ్చు.

మీ లోచెవి మీ కొరకు కేవలం వినడం కంటే ఎక్కువే చేస్తుంది. ఒక ఆశ్చర్యకరమైన, అద్భుతమైన విధానంలో మీరు మీ సంతులనాన్ని కాపాడుకోవడానికి సహాయం చేస్తుంది. దాని ఆకృతి మనం మన కర్త చేతి పని ఎడల ఆశ్చర్యపడేలా చేయాలి, ఆయన సృష్టికర్తత్వం ఎడల మన మెప్పుదలను అధికం చేయాలి.—ఉచిత వ్యాసం.

[26వ పేజీలోని చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

మీ ఆశ్చర్యకరమైన ఆళింద వ్యవస్థ

వెలుపలి దృశ్యం

పూర్వ ఆయత నాళం

అండాకార గవాక్షం

కర్ణావర్తం

వలయాకార గవాక్షం

పరాంత ఆయత నాళం

అడ్డ నాళం

లోపలి దృశ్యం

కణత ఎముక

త్వచాగహనం

కలశిక

గోణిక

నిలువు కదలికను పసిగట్టేది

కర్ణావర్తం

వినికిడి అవయవం

మాక్యులా

పెద్ద పేటిక

శాబ్దిక శిఖ

శాబ్దిక శిఖ

సమతల కదలికను పసిగట్టేది

కొలతలు కోణీయ కదలిక

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి