కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 3/8 పేజీలు 11-13
  • జట్టు క్రీడలు అవి నాకు సరైనవేనా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జట్టు క్రీడలు అవి నాకు సరైనవేనా?
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రీడలు—ప్రయోజనాలు
  • ఖ్యాతి, భాగ్యం మరియు ప్రజాదరణ
  • విడిచిపెట్టేవారు
  • నేను క్రీడల జట్టులో చేరాలా?
    తేజరిల్లు!—1996
  • క్రీడలతో ఈనాడున్న సమస్యలు
    తేజరిల్లు!—1992
  • క్రీడలను వాటి స్థానంలోనే ఉంచుట
    తేజరిల్లు!—1992
  • దైవభక్తికి, శారీరక శిక్షణకు తేడా
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 3/8 పేజీలు 11-13

యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .

జట్టు క్రీడలు అవి నాకు సరైనవేనా?

“నేను క్రీడలను ఇష్టపడతాను. నేను ఎంతో మంచి అనుభూతిని పొందుతాను. మరి నేను నా స్నేహితులతో ఉండడాన్ని ఆనందిస్తాను.”—14 సంవత్సరాల సాండీ.

“సరదా!” “ఉత్తేజం!” “గెలుపు!” అమెరికా, కెనడాల్లోని యౌవనస్థులు తాము సంఘటిత క్రీడల్లో ఎందుకు పాల్గొంటారనేదాని గురించి వారు సర్వే చేయబడినప్పుడు వారిచ్చిన కారణాలలో ఇవి కొన్ని. స్పష్టంగా, అనేకమంది యౌవనస్థులు వారి ఉత్సాహాన్ని పంచుకొంటారు.

ఉదాహరణకు అమెరికానే తీసుకోండి. లారెన్స్‌ గాల్టన్‌ వ్రాసిన క్రీడలలో మీ బిడ్డ అనే పుస్తకం ప్రకారం, “ప్రతి సంవత్సరం, ఆరు లేక అంతకంటే ఎక్కువ వయస్సుగల 2 కోట్లమంది అమెరికా పిల్లలు, సంఘటిత క్రీడల జట్టుల్లో ఆడతారు, లేక ఆడడానికి ప్రయత్నిస్తారు.” కేవలం కొద్ది సంవత్సరాల క్రితం, సంఘటిత క్రీడల జట్లు దాదాపు మగవారికే పరిమితమై ఉండేవి కానీ ఇప్పుడు బాలికలు రికార్డు సంఖ్యల్లో బేస్‌బాల్‌లను విసురుతున్నారు, బాస్కెట్‌బాల్‌ ఆడుతున్నారు, ఫుట్‌బాల్‌ మైదానంపై ఒకరితో ఒకరు పోటీకి దిగుతున్నారు.

బహుశ మీరు అథ్లెటిక్‌ తరహా వ్యక్తి అయ్యుండవచ్చు మరి ఒక జట్టులో కలవడం సరదాగా ఉంటుందని భావించవచ్చు. లేక అలా చేయడానికి మీకు తలిదండ్రులనుండి, ఉపాధ్యాయులనుండి, లేక క్రీడాశిక్షకులనుండి ఎంతో ప్రోత్సాహం—బహుశ ఒత్తిడి కూడా—వస్తుండవచ్చు. పరిస్థితి ఏదైనప్పటికీ, జట్టు క్రీడల్లో చేరడానికి పెద్దమొత్తంలో సమయాన్ని మరియు శక్తిని వెచ్చించడం అవసరమౌతుంది. అందువలన, లాభ నష్టాలను గురించి కొంత తెలుసుకొనివుండడం అర్థవంతంగా ఉంటుంది. ముందు మనం కొన్ని లాభాలను పరిశీలిద్దాం.

క్రీడలు—ప్రయోజనాలు

“శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును” అని బైబిలు చెబుతుంది. (1 తిమోతి 4:8) మరి యౌవనస్థులు శారీరక కార్యకలాపాల నుండి తప్పకుండా ప్రయోజనం పొందగలరు. అమెరికాలో భయం పుట్టించే సంఖ్యల్లో యౌవనస్థులు స్థూలత్వం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌లతో బాధపడ్తున్నారు. క్రమమైన వ్యాయామం అటువంటి సమస్యలను అదుపులోనికి తేవడానికి ఎంతో సహాయం చేయగలదు. అమెరికన్‌ హెల్త్‌ అనే పత్రికలోని ఒక శీర్షిక ప్రకారం, క్రమంగా వ్యాయామం చేసే యౌవనస్థులు, “ఎక్కువగా కూర్చుని ఉండే [నిష్క్రియులైన] పిల్లల్లో కన్నా ఎక్కువ ఎరోబిక్‌ సామర్థ్యాన్ని సాధిస్తారు. తరచూ వ్యాయామం చేసేవారు క్రీడల్లో కూడా బాగా పాల్గొంటారు మరియు బరువును చక్కగా అదుపులో ఉంచుకుంటారు.” వ్యాయామం ఒత్తిడినుండి ఉపశమనం కలుగజేయగలదని, అలుపును తగ్గించగలదని, మీ నిద్రను కూడా మెరుగుపర్చగలదని పరిశోధకులు చెబుతున్నారు.

ఆసక్తికరంగా, క్రీడల్లో మీ బిడ్డ అనే పుస్తకం ఇలా తెలియజేస్తుంది: “అనేకమైన వయోజన ఆరోగ్య సమస్యల మూలం జీవితపు యౌవనదశలో ఉందని స్పష్టమైంది.” కావున క్రమమైన వ్యాయామం యొక్క ప్రయోజనాలు వయోజన దశలోకి పొడిగించబడగలవని అనేకమంది వైద్యులు భావిస్తున్నారు. రచయిత్రి మేరీ సి. హికీ ఇలా నివేదిస్తుంది: “క్రీడలు ఆడే పిల్లలు వయోజనులయ్యాక శారీరకంగా ఎక్కువ చురుకుగా ఉండగలరని పరిశోధనలో తేలింది.”

జట్టు క్రీడల వల్ల ఇతర ప్రాముఖ్యమైన ప్రయోజనాలున్నాయని అనేకమంది భావిస్తారు. తన కుమారుడు ఫుట్‌బాల్‌ ఆడడాన్ని గురించి ఒక తండ్రి ఇలా అన్నాడు: ‘అది ఆయన్ని వీధుల్లో సమయం వ్యర్థం చేయకుండా ఆపుతుంది. అది ఆయనకు క్రమశిక్షణ నేర్పిస్తుంది.’ ఒక జట్టులో ఆడడం, ఒక యౌవనస్థునికి ఇతరులతో కలిసి పనిచేయడాన్ని—జీవిత పర్యంత ప్రయోజనాలను కలిగివుండగలిగే నైపుణ్యతను నేర్పిస్తుందని ఇతరులు భావిస్తారు. నియమాలను పాటించడాన్ని, స్వయం-క్రమశిక్షణతో ఉండడాన్ని, నాయకత్వం వహించడాన్ని, జయాపజయాలతో సాదరంగా వ్యవహరించడాన్ని కూడా జట్టు క్రీడలు యౌవనస్థులకు నేర్పిస్తాయి. “క్రీడలు యౌవనస్థులకు ఒక గొప్ప పరిశోధనశాలగా పనిచేస్తాయి” అని డా. జార్జ్‌ షీహన్‌ అన్నాడు. “అవి విద్యార్థులకు ఉపాధ్యాయులనుండి వారు తరచు వినే విషయాలైన వీటి గురించి ప్రత్యక్ష అనుభవాన్ని ఇస్తాయి: ధైర్యం, ప్రావీణ్యత, సమర్పణ.”—కరెంట్‌ హెల్త్‌, సెప్టెంబరు 1985.

కనీసం, గెలుపొందిన జట్టులో ఉండడం ఒకరి స్వాభిమానాన్ని పెంచగలదు. “నేనొకవేళ ఒక టచ్‌డౌన్‌ చేస్తే లేక ఒక షాట్‌ కొడితే, నా గురించి నేను చాలా గర్వపడతాను” అని యౌవనస్థుడైన ఎడ్డీ అన్నాడు.

ఖ్యాతి, భాగ్యం మరియు ప్రజాదరణ

అయితే మరితర యౌవనస్థులకు, వారి సహవాసుల ఆమోదం మరియు గుర్తింపులే జట్టు క్రీడలలోని నిజమైన ఆకర్షణ. “మీరేదైనా మంచిపని చేసిన ప్రతీసారీ ప్రతిఒక్కరు ఎప్పుడూ మీ భుజం తడుతుంటారు” అని 13 సంవత్సరాల గోర్డన్‌ వివరిస్తున్నాడు.

సూజన్‌ మరియు డేనియల్‌ కోహన్‌ రచించిన యౌవనదశలోని ఒత్తిడి అనే పుస్తకం ఇలా గుర్తిస్తుంది: “ప్రజాదరణకు ఏదైనా కచ్చితమైన మార్గమున్నట్లు అనిపిస్తే, ప్రత్యేకంగా బాలురకు, అవి వ్యాయామక్రీడలే. . . . గుర్తింపు కొరవడిన ఫుట్‌బాల్‌ లేక బాస్కెట్‌బాల్‌ జట్టు తారను మీరు అరుదుగా కనుగొంటారు.” క్రీడాకారులు ఎంత ఎక్కువ ఆదరణీయులో ఒక సర్వే బయల్పరచింది. విద్యార్థులు తాము ఏవిధంగా జ్ఞాపకముంచుకోబడాలని ఎక్కువగా ఇష్టపడుతున్నారు, క్రీడా తారగానా తెలివితేటలుగల విద్యార్థిగానా లేక అత్యంత ప్రముఖ వ్యక్తిగానా అని వారిని అడగడం జరిగింది. “క్రీడా తార”గా ఉండడం బాలుర మొట్టమొదటి ఎంపికయై ఉంది.

వార్తామాధ్యమాలు వృత్తిపరమైన క్రీడాకారులపై ఆరాధనా పూర్వక అవధానాన్ని కుమ్మరించడాన్ని మీరు పరిగణలోకి తీసుకున్నప్పుడు, ఒక పండితుని కంటె ఒక ఫుట్‌బాల్‌ లేక బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు ఎక్కువ గౌరవాన్ని పొందడం అంత ఆశ్చర్యం కల్గించదు. ప్రచారంలో చాలా భాగం, ఆకాశాన్నంటే వారి జీతాలు మరియు దుబారా జీవన-రీతులపై కేంద్రీకరిస్తుంది. అనేకమంది యౌవనస్థులు, ప్రాముఖ్యంగా పట్టణం మధ్య భాగంలో నివసించే వారు, పాఠశాల క్రీడలను సౌభాగ్యానికి సోపానాలుగా—బీదరికం నుండి విముక్తికి టికెట్టుగా దృష్టించడంలో ఆశ్చర్యం లేదు!

దుఃఖకరంగా, అటువంటి నిరీక్షణలను చేరుకోవడంలో వాస్తవం ఘోరంగా విఫలమౌతుంది. కరెంట్‌ హెల్త్‌ పత్రికలో, “వృత్తిపర క్రీడాకారులవ్వడంలో ఎంతమంది క్రీడాకారులు సఫలమౌతున్నారు?” అనే పేరుతో ఒక శీర్షిక కొన్ని గంభీరమైన గణాంకాలిచ్చింది. అదిలా నివేదించింది: “[అమెరికాలో] పది లక్షలకంటె ఎక్కువ మంది బాలురు వారు ఉన్నత పాఠశాలలో ఉండగా ఫుట్‌బాల్‌ ఆడతారు; దాదాపుగా 5,00,000 మంది బాస్కెట్‌బాల్‌ ఆడతారు; దాదాపు 4,00,000 మంది బేస్‌బాల్‌లో పాల్గొంటారు. ఉన్నత పాఠశాల నుండి కళాశాలకు చేరేసరికి, పాల్గొనేవారి సంఖ్య తీవ్రంగా పడిపోతుంది. మొత్తం మీద దాదాపు 11,000 మంది క్రీడాకారులు మాత్రమే కళాశాల ఫుట్‌బాల్‌ బాస్కెట్‌బాల్‌ మరియు బేస్‌బాల్‌ ఆడతారు.” అక్కడినుండి గణాంకాలు ఇంకా తగ్గిపోతాయి. “[కళాశాల క్రీడాకారులలో] కేవలం 8 శాతం మంది వృత్తిపర జట్లలో చేర్చుకోబడతారు, మరి కేవలం 2 శాతం మంది వృత్తిపరమైన ఒప్పందంపై సంతకం చేస్తారు.” ఆ శీర్షిక ఈ జ్ఞాపికనిస్తుంది: “అది కూడా, ఒప్పందంపై సంతకం చేసినంతమాత్రానే ఒక క్రీడాకారుడు జట్టులో స్థానం పొందుతాడని అర్థం కాదు.”

అయితే, మొత్తంమీద, “12,000 మంది ఉన్నత పాఠశాల క్రీడాకారులలో కేవలం ఒకరే వృత్తిపర క్రీడాకారులౌతారు.” లాటరీలో మొదటి బహుమతిని గెలుచుకునే అవకాశాలకంటే ఎక్కువ మెరుగ్గావుండకపోవచ్చు! కానీ, మీరిలా ఆశ్చర్యపోవచ్చు, తన శ్రమంతటికీ ఒక క్రీడాకారుడు కనీసం ఉచిత కళాశాల విద్యనైనా పొందలేడా? మళ్లీ, అవకాశాలు అంత చక్కగా లేవు. రిచర్డ్‌ ఇ. లాప్‌చిక్‌ మరియు రాబర్ట్‌ మల్‌కోఫ్‌లు రచించిన, ఆన్‌ ద మార్క్‌ అనే పుస్తకం ప్రకారం, “లక్షలాది ఉన్నత పాఠశాల క్రీడాకారులలో . . . , ప్రతి 50 మందిలో కేవలం ఒకరే కళాశాలలో ఆడేందుకు విద్యార్థి వేతనం పొందుతారు.” మరో నిరాశాజనక గణాంకం ఏమంటే: “ఫుట్‌బాల్‌ మరియు బాస్కెట్‌బాల్‌ వంటి పెద్ద ఆదాయాన్నిచ్చే క్రీడలలో విద్యార్థి వేతనం పొందుతున్న అత్యుత్తమ ఆటగాళ్ళలో 30 శాతం కంటె తక్కువ మంది నాలుగు సంవత్సరాల తరువాత కళాశాలనుండి పట్టభద్రులౌతారు.”

ఆటగాళ్ళలో అధికసంఖ్యాకులకు, ధనిక మరియు ప్రఖ్యాత క్రీడాకారులవ్వాలనే కల కేవలం కల్పనగానే—గాలిమేడగానే ఉంటుంది.

విడిచిపెట్టేవారు

మెరుగయ్యే ఆరోగ్యం, ప్రవర్తనాభివృద్ధి, పెరిగే ప్రజాదరణల ఉత్తరాపేక్షలను మీరు పరిగణనలోకి తీసుకొన్నప్పుడు, సంఘటిత క్రీడల జట్టులో చేరడం చతురతతో కూడినదని ఇప్పటికీ అనిపించవచ్చు. కానీ పరీక్షించబడడానికి హాజరయ్యేందుకు త్వరగా వెళ్ళేముందు లేడీస్‌ హోమ్‌ జర్నల్‌లో చెప్పబడింది పరిశీలించండి: “నేడు అనేకమంది పిల్లలు మునుపటి ఏ తరం కంటే కూడా ఎక్కువగా సంఘటిత క్రీడలను ఆడడానికి చేరుతున్నారు. దుర్వార్త ఏమంటే: “రికార్డు సంఖ్యల్లో ఈ క్రీడా కార్యక్రమాలను విడిచిపెడుతున్నారు.” ఈ విషయంలో నిపుణుడైన, డా. వర్న్‌ సేఫెల్ట్‌ ఇలా చెప్పినట్లు ఉదాహరించబడింది: “వారు పదిహేను సంవత్సరాల వయస్సుకి వచ్చేసరికి, మునుపు క్రీడలు ఆడుతుండిన పిల్లల్లో డెబ్భై ఐదు శాతం మంది వాటిని విడిచిపెట్టారు.”

ఐస్‌ హాకీ క్రీడ అత్యధిక ప్రజాదరణ పొందుతున్న కెనడాను పరిశీలించండి. ఒక అమెచ్యూర్‌ హాకీ సమాఖ్యలో, దాని 6,00,000 కంటె ఎక్కువ ఆటగాళ్ళలో 53 శాతం మంది 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సుగల వారు. అయితే, కేవలం 11 శాతం 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సుగలవారు. కారణం? ఆ వయస్సుకే అనేకమంది యౌవనస్థులు విడిచిపెట్టారు. అంతమంది ఎందుకు విడిచిపెట్టారు?

అలా విడిచిపెట్టేవారు సాధారణంగా తాము విడిచిపెట్టడానికి ఆశ్చర్యకరంగా సరళమైన ఈ కారణాన్ని ఇస్తారని పరిశోధకులు అంటున్నారు: ఆటలు ఇక ఎంతమాత్రం సరదాగా లేవు. నిజానికి జట్టులో ఆడడం అలసట కలిగించేదిగా సమయాన్ని వెచ్చించవలసివచ్చే యోజనగా ఉండగలదు. సెవెంటీన్‌ అనే పత్రిక ఒక జట్టులో చేరడానికి కేవలం పరీక్షించబడడానికి, “రోజుకి మూడు గంటలు, వారానికి ఐదు రోజులు . . . దాదాపు ఒకటి లేక రెండు వారాలు” పనిచేయడం ఇమిడివుండగలదని దాని పాఠకులకు చెప్పింది. ఒకవేళ మీరా సవాలును ఎదుర్కొని జట్టులో చేరడానికి అనుమతించబడితే, భవిష్యత్తులో ఇంకా ఎన్నో గంటల వర్కౌట్లు మరియు కవాతు అభ్యాసాలు చేయవలసివుంటుంది. తన ఆట కొరకు రోజుకి మూడు గంటల కంటె ఎక్కువ సమయాన్ని గడిపే మహిళల బాస్కెట్‌బాల్‌ జట్టు సభ్యురాలు దానికొక ఉదాహరణ. ఆ సమయాన్ని ఇంకా యోగ్యమైనదేదైనా చేయడానికి ఉపయోగించవచ్చు.

నిజమే, అనేకమంది యౌవనస్థులు కఠినమైన దినచర్య కలిగివుండడానికి అభ్యంతరం చెప్పరు. వారు తమ క్రీడా నిపుణతలను పరిపూర్ణం చేసుకొనే సరదాను మరియు సవాలును ఆనందిస్తారు. కానీ సంఘటిత క్రీడలను అనేకమంది యౌవనస్థులు ఎందుకు వదులుకొంటున్నారన్నదానికి ఇతర కారణాలున్నాయి. ఒక జట్టులో చేరాలా వద్దా అనేది నిర్ణయించుకోవడానికి వాటిని గురించి మీరు తెలుసుకోవలసిన అవసరం ఉంది. సామెతలు 13:16 చెబుతున్నట్లు, “వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు.” అందువల్ల రాబోయే శీర్షిక ఈ చర్చను కొనసాగిస్తుంది.

[12వ పేజీలోని చిత్రం]

క్రీడాకారుల ప్రజాదరణ అనేకమంది యౌవనస్థులను సంఘటిత క్రీడలవైపు ఆకర్షిస్తుంది

[13వ పేజీలోని చిత్రం]

‘క్రీడా విద్యార్థి వేతనాలు పొందే అత్యుత్తమ విశ్వవిద్యాలయ ఆటగాళ్ళు పట్టభద్రులవ్వడంలో విఫలమౌతున్నారు’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి