ప్రపంచ పరిశీలన
ప్రాణాంతకమైన శాంతి సమావేశాలు
ఇంతవరకు, ఐక్యరాజ్య సమితి చేపట్టిన శాంతిని కాపాడే చర్యల్లో ప్రజలు పాల్గొన్నప్పుడు వెయ్యికంటే ఎక్కువ మంది వ్యక్తులు మరణించారని జర్మన్ వార్తాపత్రికైన ప్రాంక్‌ఫర్టర్ అల్‌జిమీన్ జీటంగ్ చెబుతుంది. ఈ సంఖ్య, గల్ఫ్ యుద్ధంలాంటి ఐక్యరాజ్య సమితి యుద్ధ కార్యకలాపాల్లో తమ జీవాలను కోల్పోయినవారి సంఖ్యలో చేర్చబడలేదు. ఈ 1,000 మరణాల్లో 200 కంటే ఎక్కువ మరణాలు 1993లో సంభవించాయి. అన్ని ఎందుకు జరిగాయి? ఐక్యరాజ్య సమితి నేడు మరో విధమైన యుద్ధంలో భాగం వహించబోతోందని ఆ వార్తాపత్రిక వివరించింది. అయితే గతంలో దేశాల మధ్యనున్న వివాదాలను తీర్చడానికి ఓ పెద్దగా నిలబడేది మరియు వాటికి మధ్యవర్తిగా కూడా పనిచేసింది, ఈ సంస్థ ప్రస్తుతం “అంతర్యుద్ధాల్లో” జోక్యం చేసుకుంటోంది, “మరి వాటిలో ప్రభుత్వ అధికారం లేకుండా పోతుంది, అంతేకాకుండ యుద్ధంలో భాగం వహించినవారు ఐక్యరాజ్య సమితి సిబ్బందిని కాపాడలేరు.”
మతం మరియు స్వస్థపరచడం
రోగులెవరైతే “తమ మత దృక్కోణం నుండి బలాన్ని, ఊరటను కనుగొనగలిగేవారు మత విశ్వాసంలో ఉపశమనాన్ని పొందనివారికన్నా మూడు రెట్లు ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారు” అని హృదయ శస్త్ర చికిత్స చేయించుకున్న 232 పెద్దవారైన రోగులలో చేసిన అధ్యయనం చూపిస్తుందని చర్చి యొక్క ఇంటర్‌నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ అనే పత్రిక చెబుతుంది. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాన్ని, వారి మద్దతును కలిగి ఉండడం వల్ల కలిగే హితకరమైన ప్రయోజనాలను గత పరిశోధన సూచించినప్పటికీ, “బాగా జబ్బుపడ్డ రోగుల్లో మత విశ్వాసాన్ని కలిగించి దానివల్ల అలాంటి మంచి ఆరోగ్యకరమైన లాభాన్ని పొందడాన్ని చూపించడానికి” చేయబడిన మొదటి అధ్యయనమిది అని ట్రిబ్యూన్ చెప్పింది. “ఏదో శ్రేష్ఠమైన భావముంది అనే దానిలో లేదా శ్రేష్ఠమైన శక్తి పనిచేస్తుంది అనే దానిలో విశ్వాసం కలిగి ఉండడం అపాయకరమైన ప్రాణానికి హాని కలిగించే పరిస్థితిలో ప్రయోజనకరం కాగలదు—వైద్యశాస్త్రపరంగా అది చాలా సహాయకరమైనది” అని అధ్యయన నిర్దేశకుడు డా. థామస్ ఆక్స్‌మాన్ ఈ విధంగా అభిప్రాయపడ్డారు.
కనబడని సంబంధం అభూతకల్పనే
పరిణామ సిద్ధాంతవాదులు, మానవుడు కోతినుండి వచ్చాడని నిరూపించేందుకు రుజువుగా శిలాజాలను ఎంతో కాలంగా వాడుతున్నారు. అయినప్పటికీ, మానవ వయోజన రూప అస్థిపంజర అవశేషాలని శిలాజశాస్త్రజ్ఞులు నమ్ముతున్న దానికి ప్రాతినిధ్యం వహించే 90 అస్థికలను ఒకదాని తరువాత మరొకదాన్ని ఇతియోపియాలో కనుగొనడం వల్ల “మానవుని ఉద్భవాన్ని గూర్చిన సిద్ధాంతాలు కుదిపివేయబడ్డాయి” అని ఒక పారిస్ వార్తాపత్రిక లి మోండె చెబుతోంది. శిలాజశాస్త్రజ్ఞుల ప్రకారం, మానవునికి కోతికి సంబంధం ఉందని చూపేందుకు ప్రయత్నించే సిద్ధాంతాల్లో దేనికి క్రొత్త శిలాజాలు అనుగుణంగా లేవన్నదే సమస్య. ఈ శిలాజాలు జవాబులనందించే బదులు మరిన్ని ప్రశ్నలను లేవదీశాయి. మానవునికి కోతికి ఏదో సంబంధముందనడం “కల్పిత కథే తప్ప మరేమీ కాదు” అనే నిర్ధారణకు కొందరు పరిశోధకులు వచ్చారని లిమోండె చెబుతోంది.
ట్రాఫిక్ లైట్లను పట్టించుకోకపోవడం
బ్యూనోస్ ఎయిర్స్ వార్తాపత్రికైన క్లారిన్ ప్రకారం అర్జెంటీనాలో, 1994వ సంవత్సరంలో 7,700 ఘోరమైన వాహన ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల వల్ల 13,505 మంది ప్రజలకు తీవ్రంగా గాయాలు తగిలాయి, 9,120 మంది మరణించారు. వాహన ప్రమాదాల్లో 90 శాతం, డ్రైవర్లూ కాలినడకన ప్రయాణించేవారూ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం వల్ల జరుగుతుందని ఓ ప్రభుత్వ ఏజెన్సీ వారు నిర్వహించిన ఓ అధ్యయనం వెల్లడి చేసింది. పట్టణాల్లో మరీ తరచూ సంభవించే ప్రమాదాలు, ఎర్ర ట్రాఫిక్ లైట్లను పట్టించుకోకుండా వాహనాలను నడపి ప్రక్కనున్న వాటిని గుద్దుకోవడం వల్ల సంభవించేవే. ఇతర దేశాల్లో ఎర్ర ట్రాఫిక్ లైట్లను పట్టించుకోకపోవడమనేది ఊహించలేని విషయమైతే, అర్జెంటీనాలో “అది తరచూ జరిగే సంభవమే కాక అలా చేసి గర్వించేవారు కూడా ఉన్నారు” అని ఎడ్వార్డో బిర్టోటి అనే ఓ ప్రభుత్వాధికారి గమనించారు.
హాంకాంగ్‌నందు ఒత్తిడి
ప్రపంచంలోకెల్లా ఒత్తిళ్ళు అధికంగా ఉన్న పట్టణం హాంకాంగ్ అని 16 దేశాల్లోని 5,000 మంది ప్రజలతో చేసిన ఇటీవలి ఇంటర్య్వూ వెల్లడి చేసిందని ద మెడికల్ పోస్ట్ నివేదిస్తోంది. అనేకులకు కలిగే ఒత్తిడి ఉద్యోగ సంబంధమైంది. “ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 54 శాతం మందితో పోల్చి చూస్తే హాంకాంగ్‌లోని దాదాపు 70 శాతం మంది పురుషులు, 64 శాతంమంది స్త్రీలు ఉద్యోగ స్థలంలో ఒత్తిడికి గురవుతున్నారు” అని ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌లోని డాక్టర్ డేవిడ్ వార్బర్టన్ అనే పరిశోధకుడు పేర్కొంటున్నాడు. హాంకాంగ్‌లోని ఇంటర్వ్యూ చేయబడిన దాదాపు 41 శాతం మంది ఇతర దేశాల్లోని 14 శాతం మందికి భిన్నంగా తమ ఉద్యోగాలు విసుగెత్తించేవిగా ఉన్నాయని భావించారు. “తమ ఉద్యోగ స్థలంలో ఒత్తిడికి ముఖ్యమైన కారణం తమ యజమానంటే ఇష్టం లేకపోవడమేనని (ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఒకటి కంటే తక్కువ సంఖ్యను పోలిస్తే) హాంకాంగ్‌లోని ప్రతి ఐదుగురులో ఒకరు చెప్పారు” అని కూడా పోస్టు పత్రిక చెబుతుంది.
పురావస్తుశాస్త్రం కనుగొన్న విషయం
రాజైన టుటాన్‌కమెన్ యొక్క నిక్షేపంతో నిండిన సమాధిని 1922లో కనుగొన్న తర్వాత ఈజిప్టులోని రాజుల లోయలో ఇక పెద్దగా కనుగొనవలసినవి ఏమీ లేవని పురావస్తు శాస్త్రవేత్తలు ఎంతో కాలంగా భావిస్తూవచ్చారు. అయితే ఓ క్రొత్త సమాధి కనుగొనబడింది, ఆ లోయలో బహుశ అదే అతి పెద్దది మరియు అతి సంక్లిష్టమైనది అయ్యుండవచ్చు. కనీసం 67 గదులూ క్రింది అంతస్తూ ఉందని అనుమానించబడుతున్న దానితో సహా కలిపితే మొత్తం నూరు గదులుంటాయి, దాన్ని రామ్సెస్ II తన కుమారులకు సమాధి స్థలంగా నిర్మించాడన్నది స్పష్టం. సా.శ.పూ. 13వ శతాబ్దంలో రామ్సెస్ II 66 సంవత్సరాలు పరిపాలించాడు, 52 మంది కుమారులతో సహా 100 కంటే ఎక్కువమంది పిల్లలను కన్నాడు. ఇద్దరు కుమారుల సమాధి ముందే కనుగొనబడింది. క్రొత్తగా కనుగొన్న ఈ సమాధిలో మిగిలినవారిని పూడ్చడం జరిగిందని భావించబడుతోంది, మరి మొదటి కుమారుడు ఆమెన్ హర్ కాప్‌షెఫ్‌తో సహా నలుగురు కుమారుల పేర్లు దానిపై కనుగొనబడ్డాయి. ఇశ్రాయేలీయుల నిర్గమ సమయంలో ఈజిప్టును నిరంకుశ పాలకుడు రామ్సెస్ II అని కొందరు ఊహించారు కనుక ఇది అనేక మంది మత పండితుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే ఇతర విద్వాంసులు ఈ నిర్గమ సమయం సా.శ.పూ. 1513 అని చెబుతున్నారు.
అనుమానించబడిన విద్యుత్ పరికరాలు
అమెరికా ఆహార మరియు వైద్య నిర్వహణ వారి ఎఫ్.డి.ఎ కన్స్యూమర్ పత్రిక ప్రకారంగా, వైద్య పరికరం సమీపంలోని సెల్లూలార్ ఫోన్ వంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ కిరణాలకు గురైనప్పుడు అది పాడౌతుంది. “కొన్ని ఐరోపా దేశ ఆసుపత్రులు సెల్యులార్ ఫోన్లు తమ భవనాల్లో ఉండడాన్ని నిషేధించాయి మరియు అలాంటి అనుజ్ఞా పత్రం దొరికినట్లైతే అదే చర్యను గైకొనాలని అమెరికాలోని ఆసుపత్రులను ఎఫ్.డి.ఎ ప్రోత్సహించింది” అని ఆ పత్రిక చెప్పింది. పేస్‌మేకర్లు మరియు శ్వాసనిరోధకాన్ని పరిశీలించేటువంటి జీవరక్షక వైద్య పరికరాలు పనిచేయకపోవడం వల్ల సంభవించిన ప్రమాదాల్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ కిరణాల ప్రభావం ఉందని అనుమానించబడుతోంది. “సున్నితమైన వైద్య పరికరాలను తరచూ ఉపయోగించే రోగులూ డాక్టర్లు ఈ సమస్యను ఎరిగినవారై ఆ పనిముట్లనుండి సెల్యులార్ ఫోన్లను దూరంగా ఉంచాలి” అని ఎఫ్.డి.ఎ కన్స్యూమర్ ఇలా హెచ్చరిస్తోంది. వయర్‌లెస్ కంప్యూటర్ లింకుల ద్వారా, మైక్రోవేవ్ సంకేతాల ద్వారా, రేడియో దూరదర్శిని ట్రాన్స్‌మిటర్ల ద్వారా, బీపర్లు మరియు ఇతర విద్యుత్ పరికరాల ద్వారా ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రభావం కలుగవచ్చు. ఈ అపాయాన్ని తగ్గించేందుకు పరిశోధకులు వివిధ విధానాలను కనుగొంటున్నారు.
యుద్ధం మరియు అల్లకల్లోలాల యుగం
“20వ శతాబ్దం అసమానమైన భయంకరమైన కాలంగా ఉంటుందని కొందరు చరిత్రకారులు విశ్వసిస్తున్నారు. రెండు ప్రపంచ యుద్ధాలు మరియు ప్రచ్ఛన్న యుద్ధం జరిగిన 1914 నుండి 1989 వరకున్న 75 సంవత్సరాల కాలవ్యవధిని విలక్షణమైన ఏకైక యుగంగా, అనగా ప్రపంచంలోని అధిక భాగం యుద్ధాలు చేస్తూ, యుద్ధాలనుండి తేరుకుంటూ లేక యుద్ధానికి తయారౌతూ ఉండిన ప్రత్యేక కాలమని చరిత్రకారులు దృష్టిస్తున్నారు” అని ద న్యూయార్క్ టైమ్స్ పేర్కొంటోంది. ద వాషింగ్టన్ పోస్ట్ శీర్షిక ఏకభావాన్నిలా తెలిపింది: “మన 20వ శతాబ్దపు యుద్ధాలు యుద్ధవీరులకు మరియు సామాన్య ప్రజలకు వ్యతిరేకమైన ‘సంపూర్ణ యుద్ధంగా’ నిలిచాయి. యూదా జాతి నిర్మూలనతో సహా దుర్ఘటనలు కోట్ల లెక్కల్లో జరిగాయి. వీటిలోని తేడాను చూస్తే, గత శతాబ్దాల్లో జరిగిన క్రూరమైన యుద్ధాలు చాలా చిన్నవి, నిస్సారమైనవి.” ప్రజల తిరుగుబాటు కూడా రక్తపాతానికి కారణమైంది. ఎంతమంది మరణించారు? “1914 నుండి సంభవించిన ‘మరణరేటు’ జూబిగ్న్యూ, బ్రేజిన్‌స్కీ వేసిన అంచనా ప్రకారం 19 కోట్ల 70 లక్షలు, అంటే ‘1900వ సంవత్సరంలోని మొత్తం ప్రపంచ జనాబాలోని ప్రతి 10 మందిలో ఒకరు అనేదానికన్నా ఎక్కువ” అని పోస్ట్ చెబుతోంది. “తీవ్రవాదం మరియు ద్వేషపూరిత హత్యలు ఈ శతాబ్దపు సంస్కృతిలో ఎంతగానో ఇమిడిపోయాయన్నది నిర్వివాద వాస్తమని,” “ఏ రాజకీయ వ్యవస్థగానీ ఆర్థిక వ్యవస్థగానీ ఈ శతాబ్దంలోని లక్షలాది మంది ప్రజలను శాంతింపజేయలేదు లేక తృప్తిపర్చలేదు” అని కూడా అది చెప్పింది.
ప్రపంచ ఆరోగ్య పరిశోధన
ఏ సమయాన్ని తీసుకున్నప్పటికీ ప్రపంచ జనాబాలోని 40 శాతం మంది అంటే రెండువందల కోట్ల కన్నా ఎక్కువ మంది రోగులై ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ భూగోళవ్యాప్త ఆరోగ్యాన్ని గూర్చి అది జరిపిన మొదటి పరిశోధనలో నివేదించింది. ఈ రోగాల్లోనూ అస్వస్థల్లోనూ ఎక్కువవంతు అనవసరమైనదని, నివారించదగినదని వారంటారు. ప్రపంచ జనాబాలోని యాభై కంటే ఎక్కువ శాతం అంటే 560 కోట్ల మంది ప్రజలు అత్యవసరమైన మందులను కొనుక్కునే స్థోమతలో లేరు, వారిలోని మూడవవంతు మంది పిల్లలు కుపోషణకు గురవుతున్నారు మరియు ప్రపంచంలోని ఐదవ వంతు మంది ప్రజల వద్ద తమ అస్వస్థతలకు చికిత్స చేయించుకునేందుకు గానీ లేక నివారించేందుకుగానీ డబ్బు లేదు, అలా పేదరికం అతి ప్రాముఖ్యమైన కారణం. హృద్రోగం, గుండెపోటు, శ్వాసకోశ రోగం, క్షయ, మలేరియా మరియు శ్వాసావయవ వ్యాధి, అలాగే ఐదేళ్లలోపు పిల్లల్లో అతిసారవ్యాధి వంటి అతి ప్రాణాంతకమైన వ్యాధులు ప్రతి సంవత్సరం లక్షలాదిమందిని చంపుతున్నాయి. అయితే, గత 25 సంవత్సరాల్లో, జీవితాయుష్షు 61 నుండి 65కు పెరిగిందని నివేదిక పేర్కొంటుంది. “జీవించడమే ప్రతిదిన పోరాటమైన లక్షలాదిమంది ప్రజలకు, ఎక్కువకాలం జీవించే అవకాశం ఓ బహుమతిగా కాక ఓ శిక్షగా ఉంటుంది,” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్-జనరల్ డా. హీరోషి నకాజిమా చెప్పాడు.