కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 12/8 పేజీ 30
  • అందరికీ సరిపడేంత ఆహారం!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అందరికీ సరిపడేంత ఆహారం!
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అందరికీ సమృద్ధిగా ఆహారం
  • మీరు తగినంత ఆత్మీయ ఆహారాన్ని తీసుకుంటున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • మీ ఆహారం ఎంత పౌష్టికమైనది?
    తేజరిల్లు!—1995
  • విపత్తులకు వ్యతిరేకమైన పోరాటం జయించింది
    తేజరిల్లు!—1995
  • యెహోవా ఆయన ప్రజలను చూసుకుంటాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
తేజరిల్లు!—1995
g95 12/8 పేజీ 30

అందరికీ సరిపడేంత ఆహారం!

బ్రెజిల్‌లోని తేజరిల్లు! విలేఖరి ద్వారా

సమృద్ధిగా శ్రేష్ఠమైన ఆహారాన్ని భుజిస్తూ కూడా సంతోషం లేకుండా ఉండవచ్చు. నిజమైన శాశ్వత సంతోషాన్ని కలిగి ఉండేందుకు మరొకటైన ఆత్మీయ ఆహారం కూడా అవసరం. “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును” అని యేసు అన్నాడు.—మత్తయి 4:4.

మరొకవైపు, “రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్నపానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును” అని ఆమోసు 8:11 నందు ప్రవచించబడినట్లు దేవుని వాక్యాన్ని ఎదిరించడం ఆత్మీయ ఆకలికి దారితీస్తుంది. అయినప్పటికీ, ఆత్మీయ కుపోషణను నివారించవచ్చు. “ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు . . . నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు” అని యేసు ప్రకటించాడు. (మత్తయి 5:3, 6) అవసరమైన పరిమాణంలో తీసుకునే పోషకాహారం మన శరీరాన్ని తృప్తిపరస్తుంది గాని, ఆరోగ్యకరమైన ఆత్మీయాహారం మన విశ్వాసాన్ని, భవిష్యత్తు కొరకైన మన నిరీక్షణను బలపరుస్తుంది. మనమెలాంటి లోకం కొరకు నిరీక్షించగలం?

అందరికీ సమృద్ధిగా ఆహారం

రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం సమృద్ధిగానున్న లోకాన్ని ఊహించండి. ప్రజలను బలహీనం చేసే, కృంగదీసే పస్తుకు లేదా కుపోషణకు కారణమయ్యే యుద్ధాలు, విపత్తులు లేని, లేదా ఆపదలు లేని లోకం. ఉచితంగా లభించే పులుసు మీద లేదా భిక్షం మీద ఆధారపడే నిరాశ్రయులైన లేదా నిరుద్యోగులైన ప్రజలు ఉండరు, పెరిగే ఆహార పదార్థాల ధరలు కేవలం కడుపు నింపుకోవడానికి ఏదో ఒకటి తినడానికి ప్రజలను బలవంతం చేయవు. “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును.” (కీర్తన 72:16) కాని ఇవన్నీ ఎలా సంభవిస్తాయి? కుపోషణ అనే సమస్యను ఎవరు పరిష్కరిస్తారు?

మానవుని అవసరాలకు కావలసినంత ఆహారం ఇచ్చేందుకు మన సృష్టికర్త ప్రేమపూర్వకమైన శ్రద్ధనిస్తాడు. భూమిపై వాతావరణం కూడా అదుపులో ఉంటుంది, తద్వారా ఇక ఏ మాత్రం పంట నష్టాలు ఉండవని అది నిశ్చయపరుస్తుంది. “యెహోవా ఉత్తమమైనదాని ననుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును.” (కీర్తన 85:12) అంతేకాక, భూమి కావలసినన్ని ఆహార పదార్థాలను పండించే సారం గలిగినదైనప్పటికీ అవసరమైనంత సరఫరా లేకపోవడానికి, కుపోషణకు, దుఃఖానికి దారితీసే పేరాశను, అణచివేతను దేవుని రాజ్యం మాత్రమే అంతమొందించగలదు.

ఏవైన లభ్యమయ్యే వ్యవసాయక, రవాణా పద్ధతులు అవసరమున్న చోట ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇచ్చేలా యెహోవా పరలోక ప్రభుత్వం చూస్తుంది. రాజ్య పరిపాలన కొందరిని మరింత ఐశ్వర్యవంతులనుగా చేస్తూ, మరి కొందరిని దుఃఖంలోనికి ఈడ్వదు. నిరాశానిస్పృహలకు బదులుగా, రాజ్య ఆశీర్వాదాలు యెషయా 25:6 నందు ప్రవచించబడిన గొప్పవిందులో కనబడే సంతోషాన్ని తెస్తాయి: “ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును.”

ఇప్పుడు, నేటి పోటితో, ఒత్తిడితో, నిర్దయతోకూడిన జీవిత విధానం శాశ్వతంగా గతించిపోవడాన్ని ఊహించండి. ఎవరూ కుపోషణతో ఉండరు, లేదా రోగగ్రస్తులు కారు. కనుక, ఆ క్రొత్త లోకంలో మీరు నిజంగా జీవితాన్ని ఆస్వాదించాలంటే, యేసు మాటలను అనుసరించండి: “క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి.”—యెహాను 6:27.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి