కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 12/8 పేజీలు 25-27
  • మన చుట్టూ ఉన్న అందాన్నెలా చూడాలి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మన చుట్టూ ఉన్న అందాన్నెలా చూడాలి
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అందానికున్న స్వభావాలను గుర్తించడం
  • చిన్న వాటిని పెద్ద వాటినీ గమనించడం
  • చూడటాన్ని నేర్చుకున్న మనుష్యులు
  • మన కాలంలో ఎంతో అనాదరణకు గురైన చిత్రకారుడు
    తేజరిల్లు!—1995
  • రంగులు చూపించే ప్రభావం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • కళ అంటే ఏమిటి?
    తేజరిల్లు!—1995
  • అందము బాహ్యమైనదే కావచ్చును
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 12/8 పేజీలు 25-27

మన చుట్టూ ఉన్న అందాన్నెలా చూడాలి

“అన్ని భాషల్లోనూ మన తొలి పలుకుల్లోని మాటలు ‘ఏదీ నన్ను చూడనీ!’”—విలియమ్‌ వైట్‌, జూ.

రెపరెపలాడే సీతాకోక చిలుక వైపు చూసే చిన్నపాప, ఒక మహత్తరమైన సూర్యాస్తమయంవైపు చూస్తున్న పెద్దవయస్కులైన దంపతులు, గులాబీలను తాను అమర్చిన విధానాన్ని చూసి మురిసిపోయే ఓ ఇల్లాలు—వీరంతా క్షణకాలంపాటు తమ అవధానాన్ని సౌందర్యంపై కేంద్రీకరించారు.

దేవుని సృష్టి యొక్క అందం అన్నిచోట్లా ఉంది గనుక, దాన్ని వీక్షించేందుకు వందల మైళ్లు ప్రయాణించాల్సిన ఆవశ్యకత లేదు. సంభ్రమాశ్చర్యాలను కలిగించే దృశ్యాలు దూరాన ఉండవచ్చు, అయితే ప్రభావితం చేసే కళ మాత్రం, మీరు దానికొరకు చూస్తే—అత్యంత ప్రాముఖ్యంగా—దాన్నెలా చూడాలో మీకు గనుక తెలిసి ఉంటే, అది మీ ప్రక్కనే ఉండవచ్చు.

“అందమనేది చూపరి కళ్లలోనే ఉంది” అని తరచూ చెప్పబడుతుంది. అయితే, అందం అక్కడ ఉన్నా, ప్రతి ఒక్కరూ దాన్ని గమనించలేరు. మనం దానిపట్ల ఆసక్తి చూపేందుకు మనకు ఒక పెయింటింగో లేక ఒక ఫోటోగ్రాఫో కావాల్సి వస్తుంది. వాస్తవానికి, వారి విజయం వారి గీసే ప్రతిభపై కాక చూసే ప్రతిభపైనే ఆధారపడి ఉంటుందని అనేకమంది చిత్రకారులు విశ్వసిస్తారు. మోరిస్‌ గ్రోసర్‌ రచించిన చిత్రకారుని దృక్కోణం అనే పుస్తకం వివరించేదేమంటే “ఒక చిత్రకారుడు తన చేతులతో కాదుగానీ తన కళ్లతో గీస్తాడు. అతనేమి చూసినా, ఒకవేళ దాన్ని స్పష్టంగా చూస్తే, అతను దాన్ని గీయగలడు. . . . స్పష్టంగా చూడటం ముఖ్యమైన విషయం.”

మనం కళాకారులమైనా కాకపోయినా, మన చుట్టూ ఉన్న అందాన్ని గమనించడానికి, మనం స్పష్టంగా చూసేందుకు నేర్చుకోగలం. వేరే మాటల్లో చెప్పాలంటే, మనం బయటకు వెళ్లి విషయాలను ఒక క్రొత్త వెలుగులో చూడాల్సిన అవసరం ఉంది.

ఈ విషయంలో, ప్రకృతి శాస్త్రంలో ఒక రచయితైన జాన్‌ బారెట్ట్‌ వ్యక్తిగతంగా ఇమిడివుండటం యొక్క విలువను నొక్కి చెప్పాడు. “ప్రకృతి శక్తులన్నీ వాటిపై పని చేస్తుండగా జీవించే జంతువులను మరియు మొక్కలను స్వయంగా చూడటానికి, స్పర్శించడానికి, వాసన పీల్చడానికి మరియు వినటానికి ఏదీ ప్రత్యామ్నాయం కాలేదు. అందాన్ని లోతుగా ఇంకిపోనివ్వండి . . . ఒకరు ఎక్కడున్నా, మొదట చూసి, ఆనందించి మళ్లీ చూడాలని” అతను చెబుతున్నాడు.

అయితే మనం దేనికొరకు చూడాలి? సౌందర్యానికిగల నాలుగు మూల స్వభావాలను గమనించడం ద్వారా మనం ఆరంభించవచ్చు. ఈ స్వభావాలను యెహోవా సృష్టిలోని దాదాపు ప్రతి అంశంలోనూ చూడవచ్చు. వీటిని గమనించడానికి మనం ఎంత తరచుగా నిదానిస్తామో, ఆయన కళను మనం అంత ఎక్కువగా ఆనందించవచ్చు.

అందానికున్న స్వభావాలను గుర్తించడం

ఆకృతులు మరియు నమూనాలు. అనేక ఆకృతులుగల ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. కొన్ని దబ్బ కర్ర ముక్కలా పొడవు గీతల్లా లేక సాలీడువలె క్షేత్రగణిత ఆకారంలో ఉండగా మరికొన్ని మేఘాల్లా నిరాకారంగా ఉండి తదేకంగా మారుతూ ఉంటాయి. అవి అందమైన ఆర్కిడ్‌ అయినా, గవ్వల్లోని సుడివంటి రేఖలైనా లేక చివరికి ఆకులు రాలి మోడువారిన వృక్షం కొమ్మలైనా, అనేక ఆకృతులు ఆకర్షణీయమైనవి.

అదే ఆకారాన్ని మళ్లీ చూస్తే, చూసేందుకు చక్కగా కనిపించే నమూనాను అది సృష్టించగలదు. ఉదాహరణకు, ఒక అడవిలో గుంపుగా ఉన్న చెట్టు బోదెలను ఊహించుకోండి. వాటి ఆకృతులు—ప్రతిదీ భిన్నంగా ఉన్నా, ఒకేలా ఉంటూ—నచ్చే నమూనాను సృష్టిస్తాయి. అయితే అవి సృష్టించే ఆకృతులను మరియు నమూనాను తెలుసుకోడానికి వెలుగు ఉండాలి.

వెలుగు. మనకు ఆకర్షణీయంగా అనిపించే ఆకృతులపై వెలుగు ప్రసరణ ప్రత్యేక నాణ్యతనిస్తుంది. వివరాలు స్పష్టంగా కనబడతాయి, దాని నాణ్యత రంగరించబడుతుంది, ఒక స్వాభావికత సృష్టింపబడుతుంది. దినంలోని సమయాన్ని బట్టి, సంవత్సరంలోని ఋతువునుబట్టి, వాతావరణం మరి మనం నివసించే ప్రాంతాన్నిబట్టి వెలుగు భిన్నంగా ఉంటుంది. శరత్కాల ఆకుల లేక పిచ్చిపూల మంత్రించే రంగులను మెచ్చుకునేందుకు మేఘావృతమైన దినాన పల్చగా అలుముకున్న వెలుతురు చాలా నప్పుతుంది, అయితే కొండచరియ యొక్క ఎత్తు పల్లాలు మాత్రం ఉదయిస్తున్న లేక అస్తమిస్తున్న సూర్యుని ప్రకాశంలో తమ మహత్తరమైన ఆకృతులను చూపుతాయి. ఉత్తరార్థ గోళంలో ఉండే మెత్తని, శీతాకాలపు సూర్యరశ్మి పచ్చిక బయళ్లకు వలపును రంగరిస్తుంది. మరో వైపు, ప్రకాశవంతుడైన ఉష్ణమండల సూర్యుడు లోతైన సముద్రాన్ని స్నోర్కెలర్‌ల కొరకు పారదర్శకమైన అద్భుత ప్రపంచంలా మార్చుతాడు.

అయితే ఇంకా ఒక ప్రాముఖ్యమైన స్వభావం లోపిస్తుంది.

రంగు. మనం చుట్టూ చూసే విభిన్న వస్తువులకు అది జీవాన్ని పోస్తుంది. వాటి ఆకృతి భిన్నంగా ఉన్నా, వాటి రంగు వాటి ప్రత్యేకతను స్పష్టంగా చూపుతుంది. అంతేకాకుండా, సమాంతరమైన నమూనాల్లో రంగును ప్రసరింపజేయడం తనదైన స్వంత సౌందర్యాన్ని సృష్టిస్తుంది. ధగధగలాడే ఎరుపు లేక చెంగావి రంగు, లేక నీలం, ఆకుపచ్చవంటి సేదదీర్చే రంగులు మన అవధానాన్ని కోరుతాయి.

వృక్షాలమధ్యన పసుపు వన్నెగల పూలమొక్కల సముదాయాన్ని ఊహించుకోండి. పసుపువన్నె పూలకు వెలుగు తగులుతుంటే ఆ ఉదయకాలపు పిల్లగాలిలో అవి మెరుస్తున్నట్లు కనిపిస్తుండగా, ఉషోదయభానునితో అలంకరింపబడిన చెట్టు యొక్క ముదురు రంగు కాండాలు పరిపూర్ణమైన పూర్వరంగాన్ని అందిస్తాయి. ఇప్పుడు మనకో చిత్రం ఉంది. మనకు కావలసిందల్లా ఒక “ఫ్రేమ్‌” మాత్రమే, మరి ఇక్కడే సంయోజనం కావాలి.

సంయోజనం. ఈ మూడు మూల స్వభావాలైన ఆకృతి, వెలుగు మరియు రంగు కలిసే పద్ధతే సంయోజనాన్ని నిర్ధారిస్తుంది. వీక్షకులుగా ఇక్కడే మనం క్లిష్టమైన పాత్ర వహించాల్సి ఉంటుంది. కేవలం కాస్త ముందుకు, వెనక్కి, ఒక వైపుకు, పైకి లేక క్రిందకు జరగడం ద్వారా, మన చిత్రంలోని స్వభావాలను లేక వెలుగు ప్రసరణను నియంత్రించవచ్చు. అలా మనకు నచ్చిన స్వభావాలను మాత్రమే చిత్రంలో ఉంచుకునేలా మనం చేసుకోవచ్చు.

తరచూ, మనం మనకు నచ్చిన దృశ్యం కనిపించగానే దాని చుట్టూవున్న వృక్షాలు లేక మొక్కలతో యాంత్రికంగానే సంయోజనం చేసుకుంటాం. అయితే అనేక అద్భుతమైన చిన్నపాటి చిత్రాలు, మన కాళ్ల క్రిందే ఉండవచ్చు.

చిన్న వాటిని పెద్ద వాటినీ గమనించడం

దేవుని చేతిపనిలో చిన్నవి పెద్దివీ కూడా అందమైనవే మరి నప్పేలా కలిసే ఈ వివరాలను కూడా చూడటాన్ని మనం నేర్చుకుంటే మన ఆనందం ఎక్కువవుతుంది. ప్రకృతి యొక్క పెద్ద క్యాన్‌వాస్‌పై అక్కడక్కడా విస్తరించి ఉన్న చిన్ని పెయింటింగ్‌లుగా అవి రూపొందుతాయి. వాటిని మెచ్చుకోడానికి, మనం చేయాల్సిందల్లా వంగి క్రిందకు చూడటమే.

ఒక చిత్రంలో ఉండే ఈ చిత్రాలు, క్లోసప్స్‌ ఇన్‌ నేచర్‌ అనే తన పుస్తకంలో ఛాయాచిత్రగ్రాహకుడైన జాన్‌ షా చేత ఇలా వర్ణించబడ్డాయి: “ప్రకృతి వివరాలను నిశితంగా పరిశీలించడం, మనం దాన్ని మరీ నిశితంగా పరిశీలించేందుకు ఆహ్వానిస్తుందనే విషయాన్నిబట్టి నేను ఆశ్చర్యపడుతుంటాను. . . . మొదట మనం పెద్దదాన్ని చూస్తాం, తర్వాత ఆ ఫ్రేమ్‌లో ఒక మూలన రంగులను చూస్తాం. నిశితంగా చూడటం పూలను చూపుతుంది, ఒక పువ్వుపై ఓ సీతాకోక చిలుకను చూపుతుంది. దాని రెక్కలు ఒక విశిష్టమైన నమూనాను చూపుతాయి, రెక్కలోని ఈకల సరైన ఏర్పాటు ద్వారా ఆ నమూనా ఉత్పన్నమౌతుంది, మరి ప్రతి ఈక తనదైన పరిపూర్ణతను కలిగి ఉంది. ఆ సీతాకోక చిలుక రెక్కలోని ఈక యొక్క పరిపూర్ణతను మనం నిజంగా అర్థం చేసుకోగల్గితే, ప్రకృతి రూపకల్పన యొక్క పరిపూర్ణతను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాం.”

ఒక అందమైన అనుభూతిని మనకు ఇవ్వడమే కాకుండా, పెద్దదీ మరియు చిన్నదీ అయిన ప్రకృతి కళ మనల్ని మన సృష్టికర్త వద్దకు తీసుకెళ్తుంది. “మీకన్నులు పైకెత్తి చూడుడి” అని యెహోవా పురికొల్పాడు. చూసి, పరికించి, ఆశ్చర్యపోయేందుకు ఆగడం ద్వారా, మనం మన చూపును చుక్కలున్న ఆకాశం వైపుకు, లేక దేవుని ఇతర సృష్టి వైపుకు మళ్లించినా, ‘వీటిని ఎవరు సృజించెనో’ ఆయనను గూర్చి మనకు జ్ఞాపకం చేయబడుతుంది.—యెషయా 40:26.

చూడటాన్ని నేర్చుకున్న మనుష్యులు

బైబిలు కాలాల్లో దేవుని సేవకులు సృష్టి విషయాల్లో ప్రత్యేక ఆసక్తి తీసుకున్నారు. 1 రాజులు 4:30, 33 ప్రకారం, “సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పుదేశస్థుల జ్ఞానము కంటెను . . . అధికమైయుండెను. లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలోనుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను; మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అనువాటి నన్నిటిని గూర్చియు అతడు వ్రాసెను.”

సృష్టి ఘనతల్లో ప్రకృతియందు సొలొమోనుకు గల ఆసక్తి బహుశా కొంతమేరకు ఆయన తండ్రి ఉదాహరణను బట్టి కూడా ఉండి ఉండవచ్చు. గొర్రెల కాపరిగా దావీదు తన తొలి రూపకల్పన సంవత్సరాలలో అధిక కాలాన్ని, తరచూ దేవుని పనితనాన్ని గురించి ఆలోచిస్తూ గడిపాడు. ప్రాముఖ్యంగా పరలోకాల సౌందర్యం ఆయనను ప్రభావితం చేసింది. కీర్తన 19:1నందు ఆయనిలా వ్రాశాడు: “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.” (కీర్తన 139:14, పోల్చండి.) సృష్టితో ఆయనకుగల సంబంధం ఆయన దేవునికి దగ్గరయ్యేందుకు సహాయం చేసిందనడంలో సందేహం లేదు. అది మనకు కూడా అలాగే చేయగలదు.a

ఈ దైవీక పురుషులకు తెలిసినట్లుగా, దేవుని పనితనాన్ని గుర్తించి, గుణగ్రహించడం ఆత్మను పురికొల్పి, మన జీవితాలను సంతోషంతో నింపుతుంది. తరచూ నీచంగా ఉండి, ముందే రూపించబడిన వినోదం చేత పీడింపబడుతున్న మన ఆధునిక ప్రపంచంలో, యెహోవా సృష్టిని గమనించడం మనకు మన కుటుంబాలకు చక్కని కాలక్షేపాన్ని అందివ్వగలదు. దేవుడు వాగ్దానం చేసిన నూతన ప్రపంచం కొరకు ఎదురుచూసేవారికి అది భవిష్యత్తులో ఆనందించేదిగా ఉంటుంది.—యెషయా 35:1, 2.

మనం మనచుట్టూ ఉన్న కళను చూడటమే కాకుండా, దాన్నంతటినీ చేసిన అత్యుత్తమ చిత్రకారుని లక్షణాలను గమనించగల్గి, మనం నిస్సందేహంగా దావీదు మాటలను ప్రతిబింబించడానికి కదిలింపబడతాం: “ప్రభువా, [“యెహోవా,” NW] నీవంటివాడు లేడు నీ కార్యములకు సాటియైన కార్యములు లేవు.”—కీర్తన 86:9.

[అధస్సూచీలు]

a ఆగూరు మరియు యిర్మీయా వంటి ఇతర బైబిలు రచయితలు కూడా ప్రాకృతిక చరిత్రను నిశితంగా గమనించారు.—సామెతలు 30:24-28; యిర్మీయా 8:7.

[25వ పేజీలోని చిత్రాలు]

నమూనా మరియు ఆకృతి, వెలుగు, రంగు మరియు సంయోజనాల ఉదాహరణలు

[క్రెడిట్‌ లైను]

Godo-Foto

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి