కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 10/8 పేజీలు 21-23
  • మీ అవసరాలను తీర్చే పటములు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ అవసరాలను తీర్చే పటములు
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పటములు—ఎప్పటి నుండి, ఎందుకు?
  • ఒక పటాన్ని ఎలా చదవాలి
  • కొలబద్ద, ఎత్తు మరియు స్థానం
  • కంప్యూటర్‌ యుగంలో పటములు
  • ప్రశ్నాభాగం
    మన రాజ్య పరిచర్య—2000
  • ‘దేశములో సంచరించుము’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • బైబిలు ప్రాంతాలు
    ‘మంచి దేశమును చూడండి’
  • A7-A యేసు భూ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు–యేసు పరిచర్యకు ముందు జరిగిన సంఘటనలు
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 10/8 పేజీలు 21-23

మీ అవసరాలను తీర్చే పటములు

బ్రిటన్‌లో తేజరిల్లు! విలేఖరి

మీకు తెలియని దేశంలో లేదా నగరంలో దారి తెలుసుకోవడం ఒక సవాలే. మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో మొదట తెలుసుకోండి. తర్వాత, ఏది మంచి మార్గమో తీర్మానించుకోండి. మీరు ఎలా కనుగొనగలరు? మీకవసరమైనది పటమే!

పటములు—ఎప్పటి నుండి, ఎందుకు?

పటాలను తయారు చేయడం లేదా మానచిత్రణ అని పిలువబడుతున్నదానికి ఒడుదొడుకులు గల ఓ పెద్ద చరిత్ర ఉంది. బాబిలోనులో 4,300 సంవత్సరాల క్రితం రాతిపలకలపై పటాలు చెక్కడంతో పటాల తయారీ ప్రారంభమైనట్లు కొందరు అధికారులు కనుగొన్నారు. కాని ఆధునిక పటాలకు ఆధారం పూర్వమున్నవి ఆదిమ గ్రీకువారు తయారు చేసినవే. సా.శ. రెండవ శతాబ్దంలో క్లాడియస్‌ టోలెమీ గీసిన ప్రాచీన లోక పటం తరువాత మానచిత్రణ మధ్య యుగంలో తెరమరుగైపోయింది. తెలియని ప్రాంతాలు క్రూర మృగాలు మరియు అసాధారణ బలము గల వ్యక్తులు ఉంటున్న స్థలాలుగాను చూపించబడ్డాయి. మతం పటాలను ఎంతగా ప్రభావితం చేసిందంటే, ఎన్నో పటాలు లోకం ఏదెను తోట చేత పరిపాలించబడినట్లుగా చూపించాయి. జెరూసలేమ్‌ మరియు మధ్య ప్రాచ్య దేశాలు ఆ కాలంలో అందరికీ తెలిసిన ప్రపంచ పటానికి పై భాగాన కనిపించనారంభించాయి.

బ్రిటన్‌ యొక్క తొలి పటాలు కూడా చర్చి సంస్థల ప్రభావాన్ని ప్రతిబింబించాయి. అలాంటి ఒక పటం తీర్థయాత్రికులు ఇంగ్లాండులోని పుణ్య క్షేత్రాలకు వెళ్ళేదారిని చూపించింది. ఈ పటం “పిల్‌గ్రిమ్స్‌ గ్రేట్‌ నార్త్‌ రోడ్‌” గురించి తెలియజేస్తూ, దుర్హాం నగర ఉత్తర భాగం నుండి డవర్‌ యొక్క దక్షిణ తీరప్రాంతపు ఓడరేవుకు వెళ్ళే మార్గాన్ని చూపించింది.

గెరార్డెస్‌ మెర్కాటర్‌ (1512-94) ఆధునిక మానచిత్రణ పితామహుడు. ఆయన తయారు చేసిన పటం యొక్క పద్ధతి దాని కచ్చితత్వాన్ని బట్టి నావికుల మధ్య పేరెన్నికగన్నది. మరియు ఆధునిక అట్లాసుల్లో కనిపించే అనేక పటాలు మెర్కాటర్‌ పద్ధతి ప్రకారమే గీయబడ్డాయి.

పటం భూస్వాముల పాలిట వరమయ్యింది. వ్యక్తంగా గీయబడిన వారి సరిహద్దు రేఖలను పరిశీలించడం అనేక చట్టపరమైన తగాదాలను తీర్చడానికి సహాయపడింది. పన్ను లెక్కకట్టడం భూమి సరిహద్దును గూర్చిన కచ్చితమైన రికార్డుపై ఆధారపడుతుంది కనుక పటాల్లో ప్రభుత్వ ఆసక్తి పెరిగింది.

ఈ రోజుల్లో, పటాలు దైనందిన అవసరాలను తీరుస్తున్నాయి. పాఠశాల విద్యార్థులు భూగోళ శాస్త్రానికి సంబంధించిన ప్రాథమిక విషయాలను గ్రహించడానికి అట్లాసులు సహాయపడతాయి. వాతావరణ పరిస్థితుల్లో మనం ఏ మార్పులను ఎదురు చూడవచ్చో గ్రాఫిక్‌ ప్రకారం చూపించేందుకు వాతావరణ సూచకులకు చార్టులు సహాయపడుతున్నాయి. ప్రజా వాహనాలను చక్కగా ఉపయోగించుకునేందుకు పటం మనకు సహాయపడవచ్చు. కుటుంబమంతా కలిసి షికారుకు వెళ్ళేటప్పుడు, మరింత రమణీయమైన స్థలాల్లోకి వెళ్ళే మార్గాలను పటం చూపించగలదు.

నిపుణుల అవసరాలను నిర్లక్ష్యం చేయకూడదు. నగర ప్లానర్లకు జనసాంద్రతను చూపించే పటాలు కూడా ఉన్నాయి. పగిలిపోయిన ఓడలను, లేదా ఖనిజ సంపదను చూడాలనుకునే వారికి సముద్రం అడుగు భాగాన్ని చూపించే పటాలు సహాయపడతాయి. పురావస్తుశాస్త్ర సంబంధమైన పటాలు చరిత్ర పరిశోధకులకు సహాయకాలుగా ఉన్నాయి. అంతెందుకు, అంతరిక్ష పరిశోధకుల కొరకు చంద్రున్ని, కొన్ని గ్రహాలను చూపించే పటాలు కూడా ఉన్నాయి! పటాల్లో ఇలాంటి సమాచారం ఎంతో లభిస్తుంది గనుక, వాటిని చదివే మీ సామర్థ్యాన్ని అలవరచుకొని, మెరుగుపరచుకుంటే మీకే ప్రయోజనకరం.

ఒక పటాన్ని ఎలా చదవాలి

పటాలను బాగా చదవగల్గడం విదేశీ భాషను నేర్చుకోవడం వంటిదే. మీరు వేరే భాష నేర్చుకునేటప్పుడు, క్రొత్త మాటలను, విభిన్నమైన వ్యాకరణాన్ని తెలుసుకుంటారు. పటం భాషలో చిహ్నాలు మాటల్లాంటివి, అయితే, నమోన్నత రేఖలుగల కొలబద్ద మరియు గళ్ళు వ్యాకరణంలా పనిచేస్తాయి. దాదాపు అన్ని పటాల్లోను, పటంలో ఉపయోగించబడే చిహ్నాలను వివరించే డబ్బాలుంటాయి. ఇది చిహ్నాలను నిర్వచిస్తూ, నిఘంటువులా పనిచేస్తుంది.

అర్థాన్ని తెలియజేసే విధమైన చిహ్నాలు జాగ్రత్తగా ఎంపిక చేయబడతాయి. ఉదాహరణకు ఒక దీపస్తంభాన్ని కనుగొనేందుకు, దానిని పోలిన ఒక చిహ్నం కొరకు చూడండి. చర్చీలను, మసీదులను సూచించేందుకు చతురస్రాలు లేక వృత్తాలపై సిలువలు లేక అర్ధ చంద్రాకారాలు ఇవ్వబడతాయి.

అలాంటి చిహ్నాల అర్థాన్ని మీరెలా బాగా ఆకళింపు చేసుకోగలరు? ఫాలో ది మ్యాప్‌ అనే పత్రిక రచయితయైన జాన్‌ విల్సన్‌ “‘పటాన్ని పైపైన చదువుకుంటూ వెళ్ళడం’ ఆహ్లాదకరమైన కాలక్షేపం” అని సలహా ఇస్తున్నాడు. ఆయన ఇంకా ఇలా చెబుతున్నాడు: “మీరు పటాన్ని పైపైకి చూస్తూ, కనిపించే చిహ్నాల భావాన్ని గ్రహించండి.”

మీ ప్రాంతం పటం చూపించే దానికి ఎంతో భిన్నంగా కనిపిస్తుందని మీరు కనుగొంటున్నారా? ఎందుకలా? సరే, మామూలుగా మనం పరిసరాలను మన ఎత్తు నుండే అంటే నేల మీద నుండి 1.5 నుండి 1.8 మీటర్ల ఎత్తు నుండి చూస్తాము. పటాలు ఒక ప్రాంతంలోని ఒక్కో స్థానాన్ని దూరం నుండి ఎంతో ఎత్తు నుండి చూపిస్తాయి. మీరు ఈ విషయాన్ని గ్రహించేందుకు పటం వ్యాకరణాన్ని అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం.

కొలబద్ద, ఎత్తు మరియు స్థానం

సముద్ర మట్టం మీద నుండి ఉన్న ఎత్తులోని మార్పులను మరియు నేల మీద మానవుడు చేసిన ఏవైనా మార్పులను రికార్డు చెయ్యడం పటాన్ని తయారు చేసేవారికి ఒక సవాలు. ఇవన్నీ పట్టగల ఒక పత్రంలోనే వాటిని ముద్రించాలి. దీని కొరకు, పటాలు ప్రత్యేక కొలతలో తయారు చేయబడతాయి. ఒక ప్రసిద్ధమైన బ్రిటీష్‌ పటం యొక్క పరంపర ఆ దేశాన్ని 1:50,000 అనుపాతంలో చూపిస్తుంది, అంటే పటం మీది ఒక్కో సెంటీమీటరు భూమ్మీది 50,000 సెంటీమీటర్లను సూచిస్తుందన్నమాట.

అయినప్పటికీ, ఒక కాగితం ఎత్తులోని తేడాలను చూపించగలదా? మూడవ తేడాను చూపించేందుకు ఏటవాలుగా ఉండే గీతలను ఉపయోగించడం మరో మార్గం. సూర్యుడు పటం పైభాగాన ఎడమ ప్రక్క మూల నుండి ప్రకాశిస్తున్నట్లు కనిపిస్తాడు. తూర్పు, ఆగ్నేయం భాగాల్లోని ఏటవాలు ప్రాంతాల్లో ఎండ ఉండదు గనుక, మరింత ముదురు రంగులో గీయబడుతుంది. ఆధునిక పటాల్లో సముద్ర మట్టం మీదుగా సమాన ఎత్తులో కలిసే నమోన్నత రేఖలు తరచూ కనిపిస్తాయి. ఈ గుర్తులను తేలికైన రంగుల్లో ముద్రించడం పటంలోని ఇతర అంశాలపై అవధానాన్ని మళ్ళించకుండా చేస్తుంది.

మీరెక్కడున్నారో సరిగ్గా నిర్వచించడానికి మీకు సహాయపడే పరస్పరం ఖండించుకునే రేఖలు అనేక పటాల్లో ఉపయోగించబడ్డాయి. గడి అని పిలువబడేది అక్షరమాల క్రమంలోను, లేదా సంఖ్యా క్రమంలో సమన్వయించబడి, ఏ స్థలాన్నైనా ఆ గళ్ళలోని గీతల్లో సూచించేందుకు అనుమతిస్తుంది. ఉదాహరణకు, ఒక నగరం G-13 వద్ద సూచించబడవచ్చు, G అనేది రేఖాంశంపైన, 13 అనేది అక్షాంశంపైన ఉంటుంది. ఈ రెండు బిందువులు ఎక్కడ కలుస్తాయో అక్కడ మీరు ఆ పట్టణాన్ని కనుగొంటారు. అయినప్పటికీ, మీ పటం కచ్చితమైన సమాచారాన్నిస్తుందని మీరెలా నిశ్చయతను కలిగి ఉండగలరు?

కంప్యూటర్‌ యుగంలో పటములు

తరచూ సైనిక అవసరతల వల్ల మరీ కచ్చితమైన భూపటాలు ప్రచురించబడ్డాయి. గత 40 సంవత్సరాలుగా, ఎత్తు నుండి తీయబడిన ఫోటోలను పోల్చి చూసి తయారు చేసిన ఛాయాచిత్ర ద్వయమును ఉపయోగించి, కచ్చితమైన పటాలను తయారు చేసేటటువంటి పద్ధతిని అనేక దేశాలు అనుకరించడంతో ఇది వాస్తవమైంది.

ఇప్పుడే, కొన్ని వాహనాల్లో కదిలే కంప్యూటరైజ్డ్‌ పటాల ప్రదర్శనలు ఉన్నాయి అలాగే, ఇండ్లలోని కంప్యూటర్లలోను ప్రయాణానికవసరమైన విశదమైన పటాలున్నాయి. “కంప్యూటర్‌లు డ్రైవర్‌కు దారి చూపిస్తాయి” అని ది అబ్‌సర్వర్‌ అనే వార్తాపత్రికలోని ముఖ్యవార్తా శీర్షిక చెప్పింది. పటంలోని సమాచారాన్ని స్పీచ్‌ సింతసైసర్‌కు ముడిపెట్టిన కంప్యూటర్‌ డిస్క్‌లను ఉపయోగిస్తున్న ఒక ప్రయోగ పద్ధతిని గూర్చి ఆ నివేదిక వివరించింది. డ్రైవర్‌ తాను వెళ్ళవలసిన ప్రాంతాన్ని సూచించేందుకు, కేవలం కంప్యూటర్‌ స్క్రీన్‌కు కీ నొక్కుతాడంతే. చిక్కయిన రహదారి కూడళ్ళను గూర్చి బాధపడనవసరం లేదు! ఎందుకు? ఎందుకంటే కారు ఒక్కో కూడలి దగ్గరికొచ్చేకొలది, డ్రైవర్‌ ఏ దిశకు వెళ్ళాలన్నది ఒక శబ్దం చెబుతుంది. స్టీరింగ్‌ వీల్‌ సెన్సర్‌లు కారు ఎక్కడికి వెళ్తుందో రికార్డు చేసి పెడతాయి. ఇటీవలి వికాసాలు మరింత నమ్మదగినవి అలాగే సరళమైనవి.

పటాల భవిష్యత్తును గూర్చిన దీని భావమేమిటి? భూ పటాల కాగితాలు అత్యంత విలువైనవిగా మారుతాయా? సమయమే చెబుతుంది. ఏది ఏమైనా, మీ ప్రయాణ అవసరాలను తీర్చడానికి భూ పటం వివిధ ఉపయోగాలు గల ఒక ఉపకరణంగా ఉంటుంది.

[22వ పేజీలోని బాక్సు/చిత్రం]

అనేక పటాల్లో ఉపయోగించబడిన చిహ్నాలను నిర్వచించే వ్యాఖ్యానాలు వివరణలు ఉంటాయి

ఎత్తులో ఉండే తేడాలు నమోన్నత రేఖల ద్వారా సాధారణంగా, తేలికైన రంగుల్లో చూపించబడతాయి

గళ్ళ పద్ధతి పటంలో స్థలాన్ని సూచించడానికి సహాయపడుతుంది

సాధారణంగా పటములు ఒక అంగుళం లేదా ఒక సెంటీమీటరు భూమి ఉపరితలంపైని ఎంతకు సమానమో సూచిస్తాయి (ఇక్కడ చూపించబడలేదు)

మైళ్ళను, కిలోమీటర్లను సూచించే కొలబద్ద స్థలాల మధ్యనున్న దూరాన్ని కొలిచేందుకు తోడ్పడుతుంది

[క్రెడిట్‌ లైను]

Crown Copyright Reserved

[Picture Credit Line on page 21]

From the book Die Heiligkeit der Gesellschaft Jesu

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి