కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 5/8 పేజీలు 9-11
  • త్వరలో—అతి శ్రేష్ఠమైన కాలం!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • త్వరలో—అతి శ్రేష్ఠమైన కాలం!
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని రాజ్యం క్రింద ఆశీర్వాదాలు
  • మీరేమి చేయవలసిన అవసరం ఉంది
  • మన భవిష్యత్తు ఎలా ఉంటుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • భూపరదైసులో నిత్యము జీవించుము
    జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?
  • ఒక మేలైన జీవితం వాగ్దానం చేయబడింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • మానవులందరూ ఒకరినొకరు ప్రేమించినప్పుడు
    తేజరిల్లు!—1999
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 5/8 పేజీలు 9-11

త్వరలో—అతి శ్రేష్ఠమైన కాలం!

బైబిలు ప్రకారం, మానవుడు భూవ్యాపిత పరదైసులో నిరంతరం జీవించాలని దేవుడు సంకల్పించాడు. (ఆదికాండము 1:28; 2:8, 9) దేవుని ఆది సంకల్పం నుండి మనం దూరంగా వైదొలిగామన్నది స్పష్టం. అసలు ఏమి జరిగింది?

మొదటి మానవ దంపతులు దేవునికి అవిధేయత చూపించారు, అది వారికి వారి సంతతివారికి అపరిపూర్ణతను, మరణాన్ని తెచ్చిపెట్టింది. (ఆదికాండము 2:16, 17; 3:6, 7, 17-19; రోమీయులు 6:23) బైబిలు ఈ విధంగా వివరిస్తుంది: “ఒక మనుష్యుని ద్వారా పాపము లోకములో ప్రవేశించింది, అతని పాపము దానితోపాటు మరణాన్ని తెచ్చింది. ప్రతి ఒక్కరు పాపం చేశారు గనుక, దాని ఫలితంగా మరణం మానవజాతికంతటికీ సంప్రాప్తమైంది.”—రోమీయులు 5:12, టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌.

పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ, దేవుని సంకల్పం మారలేదు. “వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును. . . . నేను పంపిన కార్యమును సఫలముచేయును.” (యెషయా 55:10, 11, టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌.) దేవుడు మన కొరకు ఏమి చేస్తానని వాగ్దానం చేశాడు?

దేవుని రాజ్యం క్రింద ఆశీర్వాదాలు

నిత్యజీవం

“నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్తన 37:29.

“మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.”—ప్రకటన 21:4.

భద్రత

“ఇంక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు.”—కీర్తన 37:10.

సంతృప్తికరమైన పని

“జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకొన్న వాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు.”—యెషయా 65:21, 22, టి.ఇ.వి.

ఆరోగ్యం

“నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.”—యెషయా 33:24.

అంగవైకల్యాలు లేవు

“గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును.”—యెషయా 35:5, 6.

ఆహార సమృద్ధి

“దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును.”—కీర్తన 72:16.

శాంతి

“యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమిమీద నాశనములు కలుగజేయువాడు. ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు.”—కీర్తన 46:8, 9.

మీరేమి చేయవలసిన అవసరం ఉంది

దేవుడు వాగ్దానం చేసిన ఈ ఆశీర్వాదాలను అనుభవించడానికి మీరేమి చేయాలి? యోహాను 17:3నందు బైబిలు ఈ విధంగా చెబుతుంది: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” అవును, దేవుని నామాన్ని, ఆయన సంకల్పాన్ని, ఆయన నియమాలను గూర్చి నేర్చుకోవడం ద్వారా మనం నడిపింపును పొందుతున్నామని గ్రహిస్తాము. అంతేకాక, యేసును గూర్చి—ఆయన భూజీవితమును గూర్చి, మన పాపముల కొరకైన ఆయన విమోచన క్రయధన బలిని గూర్చి, దేవుని రాజ్య పరిపాలకునిగా ఆయన హోదాను గూర్చి నేర్చుకోవడం ద్వారా దేవుని సంకల్పం నెరవేరుతుందనే నమ్మకాన్ని కలిగి ఉండగలము.

పరిచయంలేని ప్రాంతంలో ప్రయాణికుని వలె ఉన్న మానవుడు తన అడుగులను తన వశములో ఉంచుకోలేడని ఏ మాత్రం సందేహాన్ని మిగిల్చకుండా చూపించేందుకు దుష్టత్వం ఎడల దేవుని సహనం పని చేసింది. (యిర్మీయా 10:23) నిజంగా, నిరంకుశ పరిపాలన నుండి ప్రజాస్వామ్య పరిపాలనల వరకు అనేక ప్రభుత్వాల ద్వారా ఊహించగల అన్ని మార్గాల్లోను మానవుడు ప్రయత్నం చేశాడు. అయితే, అనుకూల పరిస్థితిల్లోను అతని విజయం పరిమితంగానే ఉంది.

“నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని లక్షలాదిమంది చేస్తున్న ప్రార్థనలకు దేవుని రాజ్యం జవాబిస్తుంది గనుక మనమెంత కృతజ్ఞులముగా ఉండగలం. (మత్తయి 6:10) త్వరలో మానవ ప్రభుత్వాలన్నింటి స్థానంలో దేవుని రాజ్యం వచ్చినప్పుడు, దాని ఆశీర్వాదాలను భూమిమీద అనుభవించవచ్చు. బైబిలు ఈ విధంగా వాగ్దానం చేస్తుంది: “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”—దానియేలు 2:44.

అది ఎంత మహత్తరమైన సమయమై ఉంటుందో! బైబిలు జ్ఞానము మనకు నిజంగా నిరీక్షణనిస్తుంది. అవును, ఇవి క్లిష్టమైన సమయాలు—ఇవి మరింత చెడుగా మారుతున్నాయి. కాని మనం దుష్ట విధానం యొక్క అంత్య దినాల్లో జీవిస్తున్నామని అదే నిరూపిస్తుంది. త్వరలోనే ఈ చెడుకాలాలకు బదులుగా దేవుని రాజ్యం క్రింద అతి శ్రేష్ఠమైన కాలం వస్తుంది!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి