కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 6/8 పేజీ 14
  • బైబిలు అసంగతమైనదా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిలు అసంగతమైనదా?
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అయినప్పటికీ, వాస్తవాలేమిటి?
  • ఈ గ్రంథం విజ్ఞానశాస్త్రంతో ఏకీభవిస్తోందా?
    సర్వమానవాళి కొరకైన గ్రంథం
  • ఉన్నత జ్ఞానానికి సర్వోన్నత మూలం
    జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?
  • లూయీ పాశ్చర్‌ అతని పరిశోధన రుజువు చేసిన విషయం
    తేజరిల్లు!—1997
  • “వారు నిరుత్తరులైయున్నారు” అని సృష్టి చెప్పుచున్నది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 6/8 పేజీ 14

బైబిలు అసంగతమైనదా?

అవును అంటూ అనేకులు యిలా చెబుతారు: “ఆది అశాస్త్రీయమైనది, పుక్కిటిపురాణము, కల్పిత కథ.” పాతకాలం నాటిది. ఆచరణయోగ్యం కాదు. దాన్ని నమ్మేవారు ఒక స్వప్న లోకంలో జీవిస్తున్నారు.”

అయినప్పటికీ, వాస్తవాలేమిటి?

• బైబిలు, జీవాన్ని దేవుడు సృష్టించాడని చెబుతుంది. రసాయనాలు మరియు శక్తి యాధృచ్ఛికంగా కలవడం వలన జీవం ఉద్భవించిందని విజ్ఞానశాస్త్రం చెబుతుంది. ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా యిలా చెబుతుంది: “జీవం దానంతటదే ఉద్భవించదని పాశ్చర్‌ చూపించాడు.” జీవశాస్త్రజ్ఞుడైన మైకిల్‌ డెంటన్‌ యొక్క పుస్తకమైన ఎవల్యూషన్‌: ఎ థియరీ యిన్‌ క్రైసిస్‌ యిలా చెబుతుంది: “జీవ కణానికి, అత్యున్నతంగా క్రమపర్చబడిన జీవశాస్త్ర సంబంధం లేని వ్యవస్థకు మధ్య . . . సులభంగా గ్రహించేంతటి పెద్ద అగాధముంది.” జీవం ఆకస్మికంగా ఉద్భవించగలదని ఏ పరిణామసిద్ధాంతవాది కూడా శాస్త్రీయంగా సరైన రీతిలో నిరూపించలేడు.

• భూమిపైని అన్ని రకాల జీవులుగా పరిణామం చెందడానికి యీ మూల కణమే కారణమని పరిణామసిద్ధాంతం చెబుతుంది. ఒక జాతికి చెందిన జీవులు మరొక జాతిగా మారిన పరిణామ దశలను శిలాజాలు చూపించడం లేదు. ది నెక్‌ ఆఫ్‌ ది జిరాఫీ అనే తన పుస్తకంలో శాస్త్రజ్ఞుడైన ఫ్రాన్సిస్‌ హిచ్చింగ్‌ యిలా అంటున్నారు: “ముఖ్య గుంపుల్లోని జంతువులకు మధ్య సంబంధాల కొరకు మీరు చూస్తే, అవి కనిపించవు.” ఈ మాటలు, ఓ జాతి ‘దాని జాతి ప్రకారము’ ఉత్పత్తి చేస్తుందని బైబిలు చెప్పేదానికి అనుగుణంగా ఉన్నాయి.—ఆదికాండము 1:12, 25.

• బైబిలులోని చారిత్రాత్మక వృత్తాంతాలు అనేక సందర్భాల్లో నిజమైనవేనని పురావస్తు శాస్త్రం ధృవపరుస్తుంది.

• శూన్యంలో అన్ని రకాల అద్భుతమైన విధానాలపై భూమి ఆధారపడి ఉందన్నది ప్రాచీన తలంపు. గురుత్వాకర్షణ, గమన నియమాల ద్వారా, భూమి శూన్యంలో స్వేచ్ఛగా కదులుతుందని ఐజక్‌ న్యూటన్‌ శాస్త్రీయంగా చూపించాడు. బైబిలు దాదాపు 3,200 సంవత్సరాల క్రితమే యోబు 26:7లో దేవుడు “శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను.” అని సూచించింది.

• ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా యిలా చెబుతుంది: “నూతన అభిప్రాయం ఉద్భవించక ముందు భూమి గోళాకారంలో ఉందన్న భావన అంత విస్తృతంగా అంగీకరించబడలేదు,” అయితే, సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో దేవుని గూర్చి బైబిలు యిలా చెప్పింది: “ఆయన గుండ్రని భూమిపై కూర్చున్నాడు.”—యెషయా 40:22, మొఫాట్‌.

• క్రిములకు, రోగానికి గల సంబంధాన్ని గూర్చి పాశ్చర్‌ చెప్పక ముందు వేల సంవత్సరాలకు పూర్వమే మోషే ధర్మశాస్త్రం, (సా.శ.పూ. 16వ శతాబ్దం) అంటు వ్యాధులను కలిగించే క్రిములను గూర్చిన జ్ఞానాన్ని ప్రతిబింబించింది.—లేవీయకాండము 13, 14 అధ్యాయాలు.

• క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల ముందు రక్త ప్రసరణను గూర్చి అలంకారిక భాషలో సొలొమోను వ్రాశాడు, అయితే సా.శ. 17వ శతాబ్దంలో విలియమ్‌ హార్వే దాన్ని వివరించే వరకు వైద్యశాస్త్రం దాని కొరకు వేచి ఉండవలసి వచ్చింది.—ప్రసంగి 12:6.

• భూమి అడుగు భాగాన గిడ్డంగులను కలిగి ఉండి, చలికాలం వరకు ధాన్యాలను అక్కడ సమకూర్చుకునే చీమలను గూర్చి సొలొమోను వ్రాశాడు. (సామెతలు 6:6-8) బైబిలు విమర్శకులు అలాంటి చీమలు లేనే లేవనేవారు. అయినప్పటికీ, 1871లో బ్రిటీషు జీవశాస్త్ర పరిశోధకుడు యిలాంటి చీమలను, వాటి గిడ్డంగులను కనుగొన్నాడు.

• “నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితములాయెను,” అని చెబుతూ కీర్తన 139:16 ప్రత్యుత్పాదన నియమావళిని గూర్చిన జ్ఞానాన్ని ప్రతిబింబించింది.

• సా.శ.పూ, ఏడవ శతాబ్దంలో, శాస్త్రజ్ఞులు పక్షుల వలసను గ్రహించకముందే యిర్మీయా 8:7నందు బైబిలు యిలా తెలియజేసింది; “ఆకాశములకెగురు సంకుబుడి కొంగయైనను తన వలస కాలమును ఎరుగును, తెల్ల గువ్వయు మంగలకత్తిపిట్టయు ఓదెకొరుకును తాము తిరిగి రావలసిన కాలమును ఎరుగును.”—ది న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌.

• సా.శ. తొలి శతాబ్దంలో బైబిలు “అంత్య దినాల్లో” మనుష్యులు భూమి పర్యావరణాన్ని నాశనం చేస్తారని, అందువల్లే, దేవుడు “భూమిని నశింపజేయువారిని నశింపజేస్తాడని” ప్రవచించింది.—2 తిమోతి 3:1; ప్రకటన 11:18.

• బైబిలు ఆచరణయోగ్యం కాదా? ఈ అపాయకరమైన దినములన్నింటిలోను అవసరమైన, అభ్యాసయోగ్యమైన జ్ఞానం దీంట్లోనే ఉంది. అయితే ప్రజలు ప్రయోజనం పొందాలంటే, దాన్ని అనుసరించే స్వతంత్ర చిత్తాన్ని ఉపయోగించాలి. ‘మీ ఖడ్గములను నాగటి నక్కులుగాను మీ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుడి.’ ‘మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో మీరు అలాగే చేయుడి.’ మిమ్మువలె మీ పొరుగువారిని ప్రేమించుడి. ఈ ఆజ్ఞలను పాటించేవారు యుద్ధాలు, నేరములు చేయరు. భూమిపై ప్రజలు యేసుక్రీస్తు అధీనంలోని దేవుని రాజ్య పరిపాలనకు విధేయులైనప్పుడు, బైబిలును విశ్వసించేవారి నిరీక్షణ నిజమైనదని, అది నెరవేరని కల కాదని, ప్రయోజనకరమైన వాస్తవమని నిరూపించబడుతుంది.—మీకా 4:2-4; మత్తయి 7:12; ప్రకటన 21:3-5. (g94 5/22)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి